అజిత్ పవార్ ప్రమాదం: రాజకీయ పదవుల్లో ఉన్నవారు విమానాల్లో ప్రయాణాలు చేయడం.. రోజువారి కార్యక్రమాల్లో పాల్గొనడం.. తక్కువ సమయంలో వివిధ రాష్ట్రాల్లో పాల్గొనడం అవసరం. ఆ అవసరాలే ఆయు: ప్రమాణాలను అర్థాంతరంగా దెబ్బ తీస్తున్నాయి. భారత దేశ వ్యాప్తంగా ఎందరో రాజకీయ ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. తాజాగా జనవరి 28న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలడంతో ఆయన దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత హఠాన్మరణంతో ప్రజల్లో ఆవేదన వ్యక్తమైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు.. ముంబైనుంచి విమానంలో బయలుదేరి పూణె సమీపంలోని భారమతి వద్ద కుప్పకూలిపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
లోక్‌సభ స్పీకర్, తెలుగు దేశంపార్టీ సీనియర్ నాయకులు జీఈసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో తనువు చాలించారు. 2002 మార్చి 3న హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. భీమవరం నుంచి తిరుగు ప్రయాణంలో ప్రైవేటు హెలికాప్టర్లో బయలు దేరారు. విజయవాడ చేరుకునే నేపథ్యంలో కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఓ చెరువు వద్ద కొబ్బరి చెట్టును ఢీకొని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బాలయోగి కానరాని తీరాలకు చేరిపోయారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కనుమరుగైపోయారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమం రచ్చబండ ద్వారా ప్రజలతో మమేకం కావాలని హెలికాప్టర్లో బయలు దేరారు. 2009 సెప్టెంబరు 2న బెల్ 430 హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలు దేరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు జిల్లా వెళ్తూ.. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. హెలికాప్టర్లో నిద్రించిన వారంతా చనిపోయారు. మరుసటి రోజు వైమానిక ప్రదర్శన హెలికాప్టర్ సాయంతో గాలించారు. హెలికాప్టర్ శకలాలను గుర్తించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినట్లు గుర్తించారు.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి 2025లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ పరిసరాల్లో విమానం కుప్పకూలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విజయ్ రూపాణి ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి. విజయ్ రూపాణి 2016 నుంచి 2021 వరకు రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే ఆ విమానం ఒక హాస్టల్‌పై కూలడంతో మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
విశ్వవిఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త. హోమీ జహంగీర్ బాబా భారత అణు కార్యక్రమ పితామహుడు. 1966 జనవరి 24న హోమీ బాబా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా 101 విమానం స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉన్న మౌంట్ బ్లాంక్ శిఖరంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో విమాన పైలట్లు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలోనే చనిపోయారు. సంజయ్ గాంధీకి 1976లో పైలట్ లైసెన్స్ వచ్చింది. 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం సమీపంలోని ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన విమానంలో సంజయ్ ఏరోబాటిక్స్ చేస్తున్న అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయింది. ఫలితంగా విమానం కూలడంతో సంజయ్ గాంధీ చనిపోయారు.
కేంద్ర విమానయానశాఖ మంత్రిగా సేవలు అందించిన కాంగ్రెస్ నాయకులు మాధవరావు సింధియా విమాన ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయారు. వాతావరణం అనుకూలించక కూలిన సింధియా విమానం కుప్పకూలిపోయింది. 2001 సెప్టెంబరు 30న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు మాధవ్‌రావ్ బయలుదేరారు. విమానం మార్గమధ్యంలో ఉండగా వాతావరణం ప్రతికూలంగా మారింది. దీనితో 10 సీటర్లు ప్రైవేట్ విమానం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి సమీపంలో కూలిపోవడంతో ఆయన మరణించారు.
మేఘాలయ రాష్ట్ర మంత్రి సంగ్మా హెలికాప్టర్ ప్రమాదంలో కనుమరుగైపోయారు. గౌహతినుంచి మేఘాలయలోని షిల్లాకు హెలికాప్టర్లో బయలుదేరారు. షిల్లాంగ్ శివార్లలోని బారాపానీ సరస్సు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. షిల్లాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో 2004 సెప్టెంబరు 22న ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మేఘాలయ రాష్ట్ర మంత్రి సాయిప్రియన్ సంగ్మా, మరో 9 మంది పవన్ హాన్స్ హెలికాప్టర్లో తనువు చాలించారు.
సినీనటి సౌందర్య బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తూ విమాన ప్రమాదంలో కనుమరుగయ్యారు. 2004 ఏప్రిల్ 17న జరిగిన ప్రమాదంలో మంటల్లో కాలిపోయిన సౌందర్య గుర్తుపట్టని విధంగా మారిపోయింది. ఆ సమయానికి సౌందర్య వయసు 32 ఏళ్లు. ఆమె గర్భిణిగా ఉన్నారు. సింగిల్ ఇంజిన్ కలిగిన సెస్నా-180 విమానంలో బెంగళూరులోని జకూర్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి తెలంగాణలోని కరీంనగర్‌కు సౌందర్య బయలుదేరారు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఇందులోని సౌందర్య సహా నలుగురు ప్రయాణికులు చనిపోయారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్ విమాన ప్రమాదంలో మరణించారు. హరియాణా రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన, 2005 మార్చి 31న మరో మంత్రి సురీందర్ సింగ్‌తో కలిసి హెలికాప్టర్లో ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు బయలుదేరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్పూర్ సమీపంలో ఈ హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో ఓం ప్రకాశ్ జిందాల్, సురీందర్ సింగ్ చనిపోయారు.
ఇది కూడా చదవండి: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
ఇది కూడా చదవండి: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..
అరుణాచల్‌ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. 2011 ఏప్రిల్ 30న అప్పటి అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు, మరో నలుగురు హెలికాప్టర్లో తవాంగ్ నుంచి ఈటానగర్‌కు బయలుదేరారు. రాష్ట్రంలోని వెస్ట్ కామెంగ్ జిల్లాలోకి ప్రవేశించగానే హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
భారత ఆర్మీ ఛీఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో భౌతికంగా దూరమైపోయారు. 2021 డిసెంబరు 8న హెలికాప్టర్ ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది హెలికాప్టర్లో తమిళనాడులోని సూలూర్ నుంచి వెల్లింగ్టన్కు బయలుదేరారు. తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నవారంతా ప్రాణాలు కోల్పోయారు.
గుర్నామ్ సింగ్ -1973పంజాబ్ ఎక్స్ సీఎం గుర్నామ్ సింగ్ 1973 మే 31న ఢిల్లీలో ఓ విమాన ప్రమాదంలో కన్నుమూసారు.
1965 గుజరాత్ మాజీ ముఖ్యంత్రి బల్వంత్ రాయ్ మెహతా 1965 భారత్ – పాకిస్థాన యుద్ధ సమయంలో అనూహ్యంగా మరణించారు. ఈయన ప్రయాణిస్తోన్న విమానాన్ని పాకిస్థాన విమానం యుద్ద విమానంగా భావించి పేల్చేయడంతో ఈయనతోపాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మరణించారు. వీరితో పాటు సౌందర్య కూడా 2004లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం కోసం వెళుతుండగా ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది.
(రచయత.. మునిరాజ్ జీన్యూస్ డెస్క్)
మరింత చదవండి: Chiranjeevi Sankranthi Hits:’మన శంకర వరప్రసాద్ గారు’ సహా సంక్రాంతి బరిలో హిట్టైన చిరంజీవి మూవీస్ ఇవే..
మరింత చదవండి: టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్: మన దేశంలో అత్యంత ధనవంతులైన హీరోలు వీళ్లే.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U
లింక్ – https://apple.co/3loQYe
.ట్విట్టర్, ఫేస్బుక్సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ క్లిక్ చేయండి.