ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు మంత్రి నారా లోకేష్. పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ఆంధ్రప్రదేశ్లోని కోట్ల మంది ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినట్లు ట్వీట్ చేశారు. “అమరావతి కలను సజీవంగా ఉంచడం కోసం, తమ భూములను సమీకరించి, సంవత్సరాల తరబడి నెలకొన్న అనిశ్చితిలో దృఢంగా నిలబడి, అపారమైన త్యాగాలు చేసిన మన రైతుల అసాధారణ గాథను కూడా వారితో పంచుకున్నాను. అమరావతిని నిజమైన ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్ది, వారి త్యాగాన్ని గౌరవించేందుకు ఆయన నిరంతర మార్గదర్శకత్వాన్ని కోరాను” అని ట్వీట్లో తెలిపారు నారా లోకేష్
#చరిత్రాత్మక అమరావతి తీర్మానం
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీని కలవడం ఒక విశేషం. కోట్లాది ప్రజల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను #AndhraPradesh కోసం #అమరావతి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. మన రైతుల అసాధారణ కథను కూడా పంచుకున్నాను… pic.twitter.com/hujHKYli7K– లోకేష్ నారా (@naralokesh) ఏప్రిల్ 2, 2026