అమెరికా వర్సెస్ ఇండియా ట్రేడ్ డీల్ నరేంద్ర మోడీ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ ఎవరు విజేత అనే పూర్తి వివరాలు టా | అమెరికా


Amercia Vs India Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రకటించండి ట్రంప్ ప్రకటన చేయడమేంటని దేశమంతటా చర్చనీయాంశమైంది. మిత్రుడు భారత ప్రధాని నరేంద్ర మోడీతో స్వయంగా మాట్లాడి ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నమని ప్రకటించారు. అంతేకాదు ఆ తర్వాత కాసేపటికి భారత ప్రధాని నరేంద్ర మోడీకూడా సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్రేడ్ డీల్ పై పోస్టు చేశారు.

జీ న్యూస్‌ని ప్రాధాన్య మూలంగా జోడించండి

అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ తో భారత్ పై అధనంగా విధించిన పన్నులు తొలగిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. అంతేకాదు భారతదేశానికి నరేంద్ర మోడీ ఒక శక్తివంతమైన నాయకుడని, గౌరవప్రదమైన వ్యక్తి అని డొనాల్డ్ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. మోడీతో ఫోన్లో మాట్లాడటం ఆనందంగా ఉందని. మోడీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారు. 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తులు కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు ఆ దేశం సిద్ధంగా ఉందన్న విషయం ఎంతో సంతృప్తినిచ్చిందని డొనాల్డ్ ట్రంప్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికా – భారతదేశానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్తతో డొనాల్డ్ ట్రంప్ ముందుకు సాగుతామన్నారు. ఇబ్బందికర పరిస్థితులన్నీ ఇద్దరూ కలిసి చక్కబెడుతామని చెప్పారు.

కొత్తగా కుదిరిన అమెరికా- భారత్ ట్రేడ్ డీల్ తో ట్రంప్ టారిఫ్ లు ఎత్తేశారని అమెరికా వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ విధించిన అధనపు భారం లేకుండా… పాత పద్దతిలోనే దిగుమతులు చేసుకుంటామని వైట్ హౌస్ హౌస్ సందేశం సారాంశం. దీనితో భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాకు 140 కోట్ల భారతదేశ ప్రజల కృతజ్ఞతలు.

భారత్‌పై సుంకాల్ని 18 శాతం తగ్గిస్తున్నాం, మాపై సుంకాలకు, రష్యా చమురు నిలిపివేతకు ఆ దేశం అంగీకరించింది మోదీ నాకు గొప్ప ప్రధానితో ఫోన్‌లో చర్చల అనంతరం ట్రంప్ ప్రకటన 25 శాతం అదనపు సుంకాలు ఉండబోవన్న శ్వేతసౌధం ట్రంప్‌నకు 140 కోట్ల మంది కృతజ్ఞతలు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ట్రేడ్ డీల్తోపాటు ప్రపంచానికి సంబంధించిన కీలక విషయాలు ప్రస్తానవనకు వచ్చాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా, వెనెజువెలా నుంచి భారత్‌ మరింత చమురు కొనుగోలు వంటి వాటి గురించి మాట్లాడినట్లు సమాచారం.

అమెరికా- భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ తో … స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ తో షేర్లు రాకెట్ల తరహాలో దూసుకుపోయాయి. నాలుగు నెలలుగా ఒడిదుడుకులతో సతమతమవుతున్న ఇన్వెస్టర్లు లాభపడ్డారు. ఈ మధ్య ఆవిరైన సంపద… లాభపడిన షేర్లతో ఒకే రోజు 12లక్షల కోట్ల సంపద చేరింది. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన క్షణం నుంచి ముగిసేదాకా షేర్లు ఊహించని విధంగా పరుగులు తీశాయి.

సెన్సెక్స్‌ 2వేల 72 పాయింట్లు లాభంతో 83,739 వద్ద ముగిసింది. నిఫ్టీ 639 పాయింట్లు పుంజుకొని 25,727 వద్ద స్థిరపడింది. ప్రీ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 3,600 పాయింట్ల వరకు పెరగగా.. నిఫ్టీ 26,300 మార్క్‌ను దాటడంతో ఇన్వెస్టర్లు ఫుల్ ఖుషీ అయ్యారు. నిఫ్టీ సూచీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, జియో ఫైనాన్షియల్, బజాజ్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల బాట పట్టాయి. రియాటీ, ఆటో, ఐటీ, ఐటీ షేర్లు పరుగులు తీశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎలాంటి భయం లేకుండా ట్రేడింగ్ చేయడంతో లాభాలతో సంపదతో దోహదమైందని ఆర్థిక నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేశారు.

అమెరికా – భారతదేశం మధ్య ట్రేడ్ డీల్ కుదరకముందు బంగారం , వెండి ధరలు అమాంతంగా పడిపోవడంతో ఇన్వెస్టర్లలో భయాందోళన సంఖ్య. ఒకే రోజు ధరలు పతనం కావడంతో… మరింత పతనమవుతుందని భావించారు. ట్రేడ్ డీల్ ప్రకటన తర్వాత బంగారం, వెండి ధరలు స్థిరంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4887 డాలర్లతో ట్రేడవుతోంది. వెండి ధర 85.98 డాలర్లతో అమ్ముడవుతోంది. భారతదేశంలో పది గ్రామాల అపరంజి బంగారం ధర ఒక లక్ష 56వేల రూపాయలతో అమ్ముడైంది. వెండి కిలో ధర రెండు లక్షల 74 వేల రూపాయలతో విక్రయాలు జరిగాయి.

ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అమెరికా – భారత దేశాలమధ్య ట్రేడ్ డీల్ చారిత్రకమని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. ఈ వాణిజ్య ఒప్పందం భారత్ ఉజ్వల భవిష్యత్తుకు శుభసూచికమన్నారు.అమెరికాతో కొత్తగా కుదిరిన వాణిజ్య ఒప్పందంతో భారత్ ఒడిదుడుకులను ఎదుర్కొని బలమైన ఆర్థిక వ్యవస్థతో రాణించాలని ఆర్థిక నిపుణులు ఆశిస్తున్నారు.

(జీనస్ డెస్క్ సౌజన్యంతో)

మరింత చదవండి: టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్: మన దేశంలో అత్యంత ధనవంతులైన హీరోలు వీళ్లే.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే.

మరింత చదవండి: Chiranjeevi Sankranthi Hits:’మన శంకర వరప్రసాద్ గారు’ సహా సంక్రాంతి బరిలో హిట్టైన చిరంజీవి మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U

లింక్ – https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ క్లిక్ చేయండిట్విట్టర్, ఫేస్బుక్.



Source link

Spread the love