LIVE FEED
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వెనక్కి తగ్గని ట్రంప్
- అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వెనక్కి తగ్గని ట్రంప్
- వివిధ దేశాలపై విధించిన సుంకాలను 10 నుంచి 15 శాతానికి పెంచిన ట్రంప్
- పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్న డొనాల్డ్ ట్రంప్
- అమెరికాను గొప్పగా నిలిపేందుకు ఈ సుంకాలు దోహదం చేస్తాయన్న ట్రంప్
- న్యాయపరమైన చిక్కులు లేకుండా సుంకాలు పెంచామన్న ట్రంప్
టీ20 ప్రపంచకప్: కొలంబోలో వర్షం వల్ల సూపర్-8 తొలి మ్యాచ్ రద్దు
- టీ20 ప్రపంచకప్: పాకిస్థాన్- న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు
- టీ20 ప్రపంచకప్: కొలంబోలో వర్షం వల్ల సూపర్-8 తొలి మ్యాచ్ రద్దు
- ఒక్క బంతి కూడా పడకుండానే పాకిస్థాన్- న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు
- నిబంధనల ప్రకారం పాకిస్థాన్- న్యూజిలాండ్‌కు చెరో పాయింట్ కేటాయింపు
- రేపు భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 తొలి మ్యాచ్‌కు వర్షం అంతరాయం
- టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 తొలి మ్యాచ్‌కు వర్షం అంతరాయం
- కొలంబోలో వర్షం వల్ల పాకిస్థాన్- న్యూజిలాండ్ మ్యాచ్ ఆలస్యం
- మేడ్చల్: ఈటల రాజేందర్‌ను గృహనిర్బంధం చేసిన పోలీసులు
- కామారెడ్డి పర్యటనకు వెళ్లకుండా ఈటలను అడ్డుకున్న పోలీసులు
- ఏసీపీతో సహా ఈటల రాజేందర్ నివాసానికి చేరుకున్న పోలీసులు
- కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిమీద దాడి జరిగిందని ఆరోపణ
- వెంకటరమణారెడ్డి పరామర్శకు కామారెడ్డికి వెళ్లేందుకు సిద్ధమైన ఈటల
- శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఈటలను అడ్డుకున్న పోలీసులు
రామాయంపేటలో ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత
- మెదక్: రామాయంపేటలో ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత
- జడ్పీహెచ్‌ఎస్‌లో రాగి జావా తాగిన ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత
విద్యార్థులకు రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స - విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందన్న రామాయంపేట ఆస్పత్రి వైద్యులు
- రాగి జావాలో పురుగులు వస్తున్నాయని విద్యార్థుల ఆరోపణ
బండ్లగూడ జాగీర్‌లోని క్రేయాన్స్ ఆస్పత్రిలో 6 నెలల శిశువు మృతి
- రంగారెడ్డి: బండ్లగూడ జాగీర్‌లోని క్రేయాన్స్ ఆస్పత్రిలో 6 నెలల శిశువు మృతి
- కాలం చెల్లిన ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లే బాలుడు చనిపోయాడని ఆందోళన
- బాలుడికి జ్వరం వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
అమీన్‌పూర్‌లో ఓపీఎం మత్తుమందు విక్రయిస్తున్న నలుగురిలో ముగ్గురు అరెస్టు
- సంగారెడ్డి: అమీన్‌పూర్‌లో ఓపీఎం మత్తుమందు విక్రయిస్తున్న నలుగురిలో ముగ్గురు అరెస్టు
- ముగ్గురి నుంచి 2.7 కిలోల ఓపీఎం స్వాధీనం చేసుకున్న ఎస్‌వోటీ పోలీసులు
- సంగారెడ్డి: నిందితుల నుంచి రెండు సెల్‌పోన్లు, రూ. 50 వేలు స్వాధీనం
- కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించిన అమీన్‌పూర్ పోలీసులు
ప్రచార సమయం ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రచారం చేశారు: హరీశ్‌రావు
హరీశ్‌రావు లైవ్
- ప్రచార సమయం ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రచారం చేశారు: హరీశ్‌రావు
- కాంగ్రెస్ నేతలు డబ్బు పంపిణీ చేసేందుకు డీఎస్పీ దగ్గరుండి సహకరించారు: హరీశ్‌రావు
- అర్ధరాత్రి డబ్బులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు, పోలీసులపై కేసులు ఎందుకు పెట్టలేదు: హరీశ్‌రావు
- ప్రశ్నించిన ఎస్సీల మీదనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు: హరీశ్‌రావు
అంతర్జాతీయ టీ20లో భారత మహిళా జట్టు అద్భుత విజయం
అద్భుత విజయం
- అంతర్జాతీయ టీ20లో భారత మహిళా జట్టు అద్భుత విజయం
- ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళా జట్టు
- ఆస్ట్రేలియా జట్టును ఆస్ట్రేలియాలో ఓడించి టీ20 సిరీస్ కైవసం
- 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన భారత మహిళా జట్టు
- సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు 2017 తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి సిరీస్ ఓటమి
- అడిలైడ్ టీ20 స్కోర్లు: భారత్- 176/6; ఆస్ట్రేలియా- 159/9
హైదరాబాద్ పోలీసుల వినూత్న నిర్ణయం
- హైదరాబాద్ పోలీసుల వినూత్న నిర్ణయం
- విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించాలని నిర్ణయం
- సిటీ పోలీసు విభాగంలో 25 ఏళ్లలోపు డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం
- ఆధునిక పోలీసింగ్‌లో విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్న పోలీసులు
- డేటా అనాలిసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో విద్యార్థులకు భాగస్వామ్యం
- ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికెట్ ఇవ్వనున్న పోలీసులు
- ఎస్‌ఎంఐటీ సెల్ పర్యవేక్షణలో అమలు చేయనున్న పోలీసులు
- ప్రొఫెషనల్ నిపుణులు వాలంటీర్లుగా సేవ చేసే అవకాశం ఉంటుందన్న పోలీసులు
- ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి
సీఎం 3
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా: సీఎం
- ఆర్నెళ్ల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగింది
- రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 12 శాతం: సీఎం
- కార్యకర్తల కృషి, ప్రజల నమ్మకం వల్లే కాంగ్రెస్ ఓటు శాతం పెరుగుతోంది: సీఎం
- రాహుల్‌గాంధీ కుటుంబంలో 3 తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించారు: సీఎం
- ఇప్పుడు రాహుల్‌గాంధీకి సొంత ఇళ్లు కూడా లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
- దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాహుల్‌గాంధీ కుటుంబంపై ఇవాళ నిందలు వేస్తున్నారు: సీఎం
- దేశాన్ని ఐక్యంగా ఉంచే కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీని కనుమరుగు చేయాలని కుట్ర జరుగుతోంది
నేను పీసీసీ అధ్యక్షుడిని అయ్యే నాటికి పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉండేది: సీఎం
- నేను పీసీసీ అధ్యక్షుడిని అయ్యే నాటికి పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉండేది: సీఎం
- పార్టీలోనూ కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాను: సీఎం రేవంత్‌రెడ్డి
- నేతలందరినీ కలిసి నా ఆలోచనలు చెప్పి.. అందరినీ ఒప్పించాను: సీఎం
- అందరం కృషి చేయడంతో పార్టీ ఓటింగ్ 2.5 శాతం నుంచి 40 శాతానికి చేరింది: సీఎం
- డీసీసీ అధ్యక్షులుగా బాగా పని చేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం: సీఎం
- ఎమ్మెల్యే టికెట్లు పొందలేని వారికి ఎమ్మెల్సీలు ఇచ్చాం: సీఎం
మోతీలాల్ నెహ్రూ వేల కోట్లు ఆస్తులను దేశం కోసం త్యాగం చేశారు: సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి
- మోతీలాల్ నెహ్రూ వేల కోట్లు ఆస్తులను దేశం కోసం త్యాగం చేశారు: సీఎం
- జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం ఎన్నో ఏళ్లు జైలులో ఉన్నారు: సీఎం
- ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు: సీఎం
- స్వాతంత్ర్యం వచ్చిన కొన్నాళ్లకే గాంధీజీని కోల్పోయాం: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు
- ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల మధ్య రోజుల తరబడి ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి భిన్నాభిప్రాయాలు వెలువరించే సంస్కృతి, స్వేచ్ఛ ఉంది
- భిన్నాభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వారిని వేధించే సంస్కృతి పార్టీలో లేదు: సీఎం
- మనలో మనం కొట్లాడుకుంటే పార్టీ కోసం కష్టపడే లక్షలాది కార్యకర్తలకు అన్యాయం చేసినవాళ్లం అవుతాం
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం
- వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం
- డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- ఏఐసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ జిల్లా అధ్యక్షులకు శిక్షణ తరగతులు
- ఇవాళ్టి నుంచి మార్చి 2 వరకు డీసీసీలకు శిక్షణ తరగతులు
- శిక్షణ తరగతుల కార్యక్రమాలకు హాజరుకానున్న ఖర్గే, కేసీ వేణుగోపాల్
- శిక్షణ తరగతుల కార్యక్రమాలకు రాహుల్‌గాంధీ హాజరయ్యే అవకాశం
ఎన్టీఆర్ మైదానంలో రైతుబడి అగ్రి షో
- హైదరాబాద్: ఎన్టీఆర్ మైదానంలో రైతుబడి అగ్రి షో
- హైదరాబాద్: రైతుబడి అగ్రిషోను సందర్శించిన హరీశ్‌రావు
- రైతులకు అగ్రి షో ఎన్నోరకాలుగా దోహదపడుతుంది: హరీశ్‌రావు
- అగ్రిషో వంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తే రైతులకు మేలు: హరీశ్‌రావు
- రాష్ట్రంలో యూరియా కొరతను నివారించాలి: హరీశ్‌రావు
- రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలి: హరీశ్‌రావు
- సాగు పనిముట్లకు రాయితీపై రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చిస్తా: హరీశ్‌రావు
వికారాబాద్ జిల్లా అనంతగిరి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- వికారాబాద్ జిల్లా అనంతగిరి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- అనంతగిరి చేరుకున్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- సీఎం, మంత్రులకు స్వాగతం పలికిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు
- కాసేపట్లో హరిత రిసార్ట్‌లో తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతలకు శిక్షణ తరగతులు
- తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ స్నేహపై అనర్హత వేటు
- ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ స్నేహపై అనర్హత వేటు
- విప్ ధిక్కరించి బీఆర్‌ఎస్‌కు ఓటేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ స్నేహపై అనర్హత వేటు
- ఈ నెల 16న పురఎన్నికలో స్నేహ ఓటుతో ఛైర్మన్ సీటు కైవసం మెంగ్రె ఆకాష్ (బీఆర్‌ఎస్)
- ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థి అబ్దుల్లా
- స్నేహ తిరుగుబాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులను ఆశ్రయించిన కాంగ్రెస్
- విప్‌ను ధిక్కరించి ఓటేసిన స్నేహ సభ్యత్వాన్ని రద్దు చేసిన అధికారులు
- శంషాబాద్ విమానాశ్రయం నుంచి వికారాబాద్ పర్యటనకు బయల్దేరిన సీఎం
- అనంతగిరి హిల్స్‌లో టీజీ, ఏపీ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా సమావేశాలు
- కాసేపట్లో కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
- జోగులాంబ గద్వాల జిల్లా: అయిజలో అగ్నిప్రమాదం
- అయిజలోని డ్రిప్పు ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు
- అయిజ: షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
- అయిజ: మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
బైకును ఢీకొట్టిన కారు – అక్కడికక్కడే ఇద్దరు మృతి
- కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద ప్రమాదం
- కరీంనగర్ జిల్లా: బైకును ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే ఇద్దరు మృతి
ఐటీసీ కాకతీయ హోటల్‌లో సెంట్రల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్
- ఐటీసీ కాకతీయ హోటల్‌లో సెంట్రల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్
- హైదరాబాద్: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వరంలో సదస్సు
- కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి శివరాజ్‌చౌహన్, మంత్రి సీతక్క
- కార్యక్రమానికి హాజరైన పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్
కాసేపట్లో కామారెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- కాసేపట్లో కామారెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- మీడియాతో మాట్లాడనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
హైదరాబాద్: రామంతాపూర్‌లో వ్యక్తి కిడ్నాప్
- హైదరాబాద్: రామంతాపూర్‌లో వ్యక్తి కిడ్నాప్
- పూర్ణచందర్‌రావును ఇంటి నుంచి తీసుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి
- ఇంటి నుంచి కొంతదూరం తీసుకెళ్లాక కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసిన దుండగులు
- హైదరాబాద్: బాధితుడి భార్య ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు
గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు
- గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు
- గాంధీభవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపుతో భారీగా మోహరించిన పోలీసులు
- గాంధీభవన్ వద్ద నిరసనకు యత్నించిన బీజేవైఎం నేతలు
- హైదరాబాద్: బీజేవైఎం నేతలను అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,75,000
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,280
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,000
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,75,000
న్యాల్‌కల్ మం. చాల్కి వద్ద మంజీరానదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
- సంగారెడ్డి : న్యాల్‌కల్ మం. చాల్కి వద్ద మంజీరానదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
- ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుమార్తెకు పాపయ్య వీడియో కాల్
- మృతుడు నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపయ్య
- కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల అనుమానం
- సంగారెడ్డి జిల్లా: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తుంగతుర్తి, నేరేడుచర్లలో ఏసీబీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం
- సూర్యాపేట: గరిడేపల్లి మం. పొనుగోడులో ఐటీ, ఏసీబీ అధికారులు దాడులు
- ప్రస్తుతం అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సుందరి కిరణ్ ఇంట్లో సోదాలు
- ప్రస్తుతం జడ్చర్లలో అగ్రికల్చర్ జేడీగా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్
- ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు
- హైదరాబాద్, సూర్యాపేటలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం
- తుంగతుర్తి, నేరేడుచర్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం
రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగనున్న పత్తి కొనుగోళ్లు
- రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగనున్న పత్తి కొనుగోళ్లు
- మంత్రి తుమ్మల విజ్ఞప్తితో ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించిన సీసీఐ
- నిన్న జాయింట్ సెక్రటరీ, కేంద్ర జౌళిశాఖకి లేఖ రాసిన వ్యవసాయశాఖ కార్యదర్శి
- రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలని ఇప్పటికే కిషన్‌రెడ్డిని కోరిన తుమ్మల
- కేంద్ర ప్రభుత్వం, సీసీఐ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల
- పొడిగించిన గడువును వినియోగించుకోవాలని పత్తి రైతులకు మంత్రి విజ్ఞప్తి
సూర్యాపేట జిల్లా పొనుగోడులో ఏసీబీ అధికారుల సోదాలు
- సూర్యాపేట: గరిడేపల్లి మం. పొనుగోడులో ఐటీ, ఏసీబీ అధికారులు దాడులు
- ప్రస్తుతం అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సుందరి కిరణ్ ఇంట్లో సోదాలు
- ప్రస్తుతం జడ్చర్లలో అగ్రికల్చర్ జేడీగా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్
- ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు
- హైదరాబాద్, సూర్యాపేటలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం
- తుంగతుర్తి, నేరేడుచర్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- వెంకటరమణారెడ్డి ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేత మహేందర్‌రెడ్డి అరెస్టు
- కాంగ్రెస్ నేత మహేందర్‌రెడ్డి కారును ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు
- కామారెడ్డి: పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం
దిల్లీలో ఉగ్రముప్పుపై నిఘావర్గాల హెచ్చరికలు
- దిల్లీలో ఉగ్రముప్పుపై నిఘావర్గాల హెచ్చరికలు
- ఎర్రకోట సహా పలు ఆలయాల వద్ద ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిక
- దేశ రాజధానిలో దాడులకు ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా ప్లాన్ చేసినట్లు సమాచారం
- నిఘావర్గాల హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేసినట్లు అధికారుల వెల్లడి
- ముందుజాగ్రత్తగా సున్నితమైన, మతపరమైన ప్రదేశాల్లో భద్రత పెంపు
- దిల్లీ: రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో భద్రత పెంపు
- అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్న పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఆళ్లపల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి కదలికలు స్థానికుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలోని చింతల గుంపు అటవీ పరిధిలో పెద్ద వెంకటాపురం ప్రధాన రహదారిపై పెద్దపులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. వాటిని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో అటవీశాఖ సిబ్బంది ఆ గ్రామానికి చేరుకొని పాదముద్రలు సేకరించారు. ఈ సందర్భంగా ఆళ్లపల్లి రేంజర్ కిరణ్ ఆధ్వర్యంలో పాదముద్రలను గుర్తించి పులి పాద ముద్రలుగా ధ్రువీకరించారు. అనంతోగు వైపు పెద్దపులి వెళ్లినట్లుగా తెలిపారు. పులి పాదముద్రలు కనిపించడంతో, సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లరాదని అటవీశాఖ అధికారులు సూచించారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే సమాచారం అందించాలని తెలిపారు. పులి మణుగూరు పరిధిలోని బయ్యారం ప్రాంతం నుంచి వచ్చి అల్లపల్లి మండలం పరిధిలో సంచరిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నాలుగో రోజు కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నాలుగో రోజు కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- యాదాద్రి: రాత్రి హంసవాహన సేవపై భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు
Donald Trump : ప్రపంచ దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తూ ట్రూత్‌లో ట్రంప్ పోస్టు
- సుంకాల విషయంలో వెనక్కితగ్గని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (White House On India Tariff)
- ప్రపంచ దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తూ ట్రూత్‌లో ట్రంప్ పోస్టు
- ప్రస్తుత సుంకం 10 శాతం తక్షణమే అమలులోకి వస్తుందన్న ట్రంప్ (Donald Trump)
- ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని నిన్న తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
- సుంకాలు, ప్రతీకార సుంకాలపై సుప్రీం నిర్ణయం అమెరికాకు అవమానకరం: ట్రంప్
- సుంకాలపై జడ్జీలు ఇచ్చిన తీర్పును చూసి సిగ్గుపడుతున్నా: ట్రంప్
- వివిధ దేశాలపై టారిఫ్ విధింపులో వెనక్కి తగ్గేదే లేదు: ట్రంప్
- భారత్‌తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదు: ట్రంప్
Fire Accident in Hyderabad : షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలు
కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధి పద్మావతి ప్లాజా సెంటర్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాపులో అకస్మాత్తుగా మంటలు(Fire Accident in KPHB) చెలరేగాయి. ప్రాథమిక దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దుకాణంలోని మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం
- నేడు వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం
- మ.2 గం.కు శిక్షణ తరగతులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)
- తెలంగాణ, ఏపీ జిల్లా అధ్యక్షులకు ఏఐసీసీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు
- అనంతగిరి, వికారాబాద్‌లోని హరిత హోటల్‌లో శిక్షణ తరగతులు
- ఇవాళ్టి నుంచి మార్చి 2 వరకు శిక్షణ తరగతులు నిర్వహణ
- శిక్షణ తరగతుల కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం
హెచ్‌ఎండీఏ పూర్వ డైరెక్టర్ శివబాలకృష్ణపై మరో అవినీతి కేసు
- హెచ్‌ఎండీఏ పూర్వ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna)పై మరో అవినీతి కేసు
- అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేసు నమోదు చేసిన ఏసీబీ
- రెండేళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్టు
ప్రస్తుతం పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్
- ప్రస్తుతం పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్
- సిరాజ్, సమీర్‌కు పేలుడు పదార్థాలు తయారుచేసేందుకు సాయం చేసినట్లు గుర్తింపు
- పేలుడు సామగ్రి కొనేందుకు ఇమ్రాన్ ఫండింగ్ చేసినట్లు గుర్తించిన ఎన్‌ఐఏ
- విదేశాలకు పారిపోతున్న ఆరిఫ్‌ను గతేడాది దిల్లీలో పట్టుకున్న ఎన్ఐఏ
- సిరాజ్‌తో కలిసి ఆయుధాలు సరఫరా చేసేందుకు కుట్ర పన్నినట్లు గుర్తింపు
- సరిహద్దుల మీదుగా అక్రమంగా ఆయుధాలు రవాణా చేసినట్లు గుర్తించిన ఎన్‌ఐఏ
- సోషల్ మీడియా ద్వారా జిహాదీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసినట్లు గుర్తించిన ఎన్‌ఐఏ
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- ఆరిఫ్ హుస్సేన్, ఇమ్రాన్ అక్రమ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ
- విజయనగరంలో పేలుళ్ల కుట్ర ఘటనపై సిరాజ్, సయ్యద్ సమీర్‌పై కేసు
- విజయనగరం పోలీసులు పెట్టిన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
- సిరాజ్, సయ్యద్ సమీర్‌పై నవంబర్‌లో తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
- అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
- ట్రంప్ విధించిన సుంకాలను కొట్టివేసిన అమెరికా సుప్రీంకోర్టు
- ట్రంప్ ఏకపక్షంగా సుంకాలు విధించడాన్ని తప్పుబట్టిన అమెరికా సుప్రీంకోర్టు
- సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం చట్టవిరుద్ధమన్న కోర్టు
- అమెరికా వాణిజ్య భాగస్వాములపై సుంకాల విధింపు చట్టవిరుద్ధమన్న కోర్టు
- సుంకాలు విధించేందుకు అధికార వినియోగాన్ని తప్పుబట్టిన అమెరికా సుప్రీంకోర్టు
- ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఆరుగురు, అనుకూలంగా ముగ్గురు జడ్జిల తీర్పు
సుంకాలు విధించే అధికారం పార్లమెంటుకే ఉంటుందన్న సుప్రీంకోర్టు
- సుంకాలు విధించే అధికారం పార్లమెంటుకే ఉంటుందన్న సుప్రీంకోర్టు (Donald Trump)
- అధ్యక్షుడు తనకు తానుగా అపరిమితమైన సుంకాలు విధించలేరన్న కోర్టు
- ఇప్పటివరకు వసూలు చేసిన రూ.11 లక్షల కోట్లపై స్పష్టత ఇవ్వని సుప్రీంకోర్టు
- ఆయా సుంకాలు తిరిగి చెల్లించాలా వద్దా అనే అంశంపై స్పష్టత ఇవ్వని కోర్టు
- తిరిగి చెల్లించాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న దిగువ కోర్టులు
- ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక పలు దేశాలపై సుంకాల దాడి
- చైనా, మెక్సికో, కెనడా, భారత్, బ్రెజిల్‌పై ట్రంప్ సుంకాల దాడి
- దిగుమతులపై 10 నుంచి 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్
- కొన్ని సందర్భాల్లో 145 శాతం వరకు సుంకాలు విధించిన ట్రంప్
- ఈ సుంకాలతో సామాన్యులపై పెనుభారం పడుతుందని కోర్టుకెళ్లిన చిరువ్యాపారులు
- కోర్టు తీర్పు.. ట్రంప్ ఆర్థిక అజెండాకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్న నిపుణులు
ప్రతీకార సుంకాల రద్దుతో భారత్‌పై తొలగనున్న 18 శాతం అదనపు భారం
- (Donald Trump)ప్రతీకార సుంకాల రద్దుతో భారత్‌పై తొలగనున్న 18 శాతం అదనపు భారం
- అత్యధిక ప్రాధాన్య దేశాలపై విధించే ప్రామాణిక సుంకాలు భారత్‌కు వర్తించే అవకాశం
- ఉక్కు, అల్యూమినియంలపై 50శాతం సుంకం వర్తింపు
- కొన్ని ఆటోమెుబైల్ పరికరాలపై 25శాతం సుంకం వర్తింపు
- ఎగుమతుల్లో ఫోన్లు, పెట్రోలియం, ఔషధాల నుంచి సుంకాలు మినహాయింపు
- సుప్రీం తీర్పు నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించేందుకు భారత్‌కు వీలు
అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్
- అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)
- సుంకాలు, ప్రతీకార సుంకాలపై సుప్రీం నిర్ణయం అమెరికాకు అవమానకరం: ట్రంప్
- సుంకాలపై జడ్జీలు ఇచ్చిన తీర్పును చూసి సిగ్గుపడుతున్నాను: ట్రంప్
- వివిధ దేశాలపై టారిఫ్ విధింపులో వెనక్కి తగ్గేదే లేదు: ట్రంప్
- అంతర్జాతీయ ఆర్థిక చట్టంలోని సెక్షన్-122ని ఉపయోగిస్తూ 10శాతం సుంకం విధిస్తా: ట్రంప్
- భారత్‌తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదు: ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఇరాన్‌పై దాడులకు అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలిపిన ట్రంప్
- ఇరుదేశాల అణు ఒప్పందంపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
- ఇరాన్ తమతో కలిస్తే మంచిదని లేకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని ట్రంప్ హెచ్చరిక
- రేపటి నుంచే ఇరాన్‌పై యుద్ధం మొదలుకావచ్చన్న పెంటగాన్
- అమెరికా దాడులను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న టెహ్రాన్
- యుద్ధానికి ఇరు దేశాలు సన్నాహాలు దాదాపు పూర్తి చేసుకున్నట్లు సమాచారం
ఇవాళ్టి నుంచి టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 సమరాలకు రంగం సిద్ధం
- ఇవాళ్టి నుంచి టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 సమరాలకు రంగం సిద్ధం (T20 World Cup)
- నేడు సూపర్-8 తొలి పోరులో పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్
- కొలంబో: ప్రేమదాసలో రాత్రి 7 గంటల నుంచి పాక్, న్యూజిలాండ్ మ్యాచ్