ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్.. (17/01/2026) | latest andhra pradesh telangana national international live news updates of 18th Jan 2026 in telugu siva


  • జనవరి 17, 2026 5:18 PM IST

    మహబూబ్‌నగర్: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌

    • మీరు మంజూరుచేసిన ప్రాజెక్ట్ ఒక్కటైనా పాలమూరులో ఉందా?: సీఎం రేవంత్‌

    • మీరు పూర్తిచేసిన ఒక్క ప్రాజెక్టు అయినా పాలమూరులో ఉందా?: సీఎం రేవంత్‌

    • BRS పాలనలో పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదు: సీఎం రేవంత్‌

  • జనవరి 17, 2026 5:09 PM IST

    గణతంత్ర దినోత్సవం వేళ హై అలర్ట్.. ఉగ్ర ముప్పుపై నిఘావర్గాల హెచ్చరిక

    గణతంత్ర దినోత్సవం-2026 సందర్భంగా అన్నీ రాష్ట్రాలకు భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • జనవరి 17, 2026 5:08 PM IST

    ప్రపంచ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. 14 ఏళ్లకే అండర్ 19 ప్రపంచ కప్ ఆడుతున్న వైభవ్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • జనవరి 17, 2026 5:03 PM IST

    కాకినాడ గురించి భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటారు: చంద్రబాబు

    • పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులన్నీ ఇక్కడ ఉన్నాయి: చంద్రబాబు

    • ప్రజలకు మేలుచేసే ఆలోచనలు సత్వరమే అమలుచేస్తాం: సీఎం చంద్రబాబు

    • 2047 నాటికి మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా తయారవుతుంది: చంద్రబాబు

    • గ్రీన్ అమోనియాతో వ్యవసాయ రంగానికి మేలు: సీఎం చంద్రబాబు

    • ఎరువులు, పురుగుల మందుల వినియోగం బాగా తగ్గించాలి: చంద్రబాబు

  • జనవరి 17, 2026 5:02 PM IST

    సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌లో 20 పోర్టులు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు

    • గ్రీన్ హైడ్రోజన్‌, గ్రీన్ అమోనియా ఉత్పత్తికి ఏపీ అనుకూలం: సీఎం చంద్రబాబు

    • గ్రీన్ అమోనియా పరిశ్రమ మన రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ కానుంది: చంద్రబాబు

    • సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజీ.. మన రాష్ట్రానికి వరం: సీఎం చంద్రబాబు

  • జనవరి 17, 2026 5:02 PM IST

    గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారు: చంద్రబాబు

    • 2014లో మా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికింది: చంద్రబాబు

    • గ్రీన్ హైడ్రోజన్‌, గ్రీన్ అమోనియాకు నాంది పలికాం: సీఎం చంద్రబాబు

    • గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారుచేస్తాం: సీఎం చంద్రబాబు

    • ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ ఇది: చంద్రబాబు

  • జనవరి 17, 2026 5:01 PM IST

    ఆనాడు ఎన్టీఆర్ చొరవతో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ వచ్చింది: చంద్రబాబు

    • గ్రీన్ అమోనియా భవిష్యత్‌లో పెను మార్పునకు నాంది: చంద్రబాబు

    • బొగ్గు వినియోగంతో పర్యావరణం దెబ్బతింటోంది: సీఎం చంద్రబాబు

    • కాలుష్యంతో సముద్రంలో పెనుమార్పులు వస్తున్నాయి: చంద్రబాబు

  • జనవరి 17, 2026 5:01 PM IST

    ఎంత ఎత్తుకు ఎదిగినా స్వగ్రామాన్ని మరిచిపోకూడదు: సీఎం చంద్రబాబు

    • ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ: చంద్రబాబు

    • మన సంస్కృతిని కాపాడుకుంటూనే టెక్నాలజీని వాడుకోవాలి: చంద్రబాబు

    • 2027 జూన్ నాటికి మొదటి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది: చంద్రబాబు

  • జనవరి 17, 2026 3:38 PM IST

    గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం: డిప్యూటీ సీఎం పవన్‌

    • కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయి: పవన్‌

    • రాష్ట్ర సుస్థిరాభివృద్ధిలో గేమ్‌ ఛేంజర్ కానుంది: పవన్‌కల్యాణ్‌

    • వివిధ రంగాల్లో కాలుష్యనియంత్రణ పెద్దస్థాయిలో తగ్గిస్తోంది: పవన్‌

  • జనవరి 17, 2026 3:38 PM IST

    అనేక కష్టనష్టాలను తట్టుకుని AM గ్రీన్ కంపెనీ పెట్టారు: డిప్యూటీ సీఎం పవన్‌

    • బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం: పవన్‌

    • పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్తున్నాం: పవన్‌

    • గ్రీన్ హైడ్రోజన్ దిశగా మనం వేసే అడుగులు చాలా కీలకం: పవన్‌

  • జనవరి 17, 2026 3:24 PM IST

    కృష్ణా: కంకిపాడు ఉప్పులూరు కోడిపందేల బరి దగ్గర అమానుషం

    • బరి దగ్గర డబ్బులు దొంగతనం చేశారనే నెపంతో కొంతమందిని బంధించి తాళ్లతో కట్టేసిన నిర్వాహకులు

    • పందెం బరి దగ్గర తోట్లవల్లూరుకి చెందిన కొందరిని.. కూలి కోసం తెచ్చిన నిర్వాహకులు

    • ఆటలో నగదు విషయంలో తేడా రావడంతో నిర్వాహకుల దుశ్చర్య.. తాళ్లతో కట్టేసి దాడి, వీడియో తీసిన నిర్వాహకులు

    • నిర్వాహకులపై ఎస్పీ సీరియస్‌, కొంతమందిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • జనవరి 17, 2026 1:38 PM IST

    తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభించిన ప్రధాని

    • పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.

    • హౌరా-గౌహతి మధ్య తొలి వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ ప్రారంభం.

    • బెంగాల్‌ను ఇతర రాష్ట్రాలతో అనుసంధానించేలా 7 వందేభారత్‌ రైళ్లు ప్రారంభం.

    • పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • జనవరి 17, 2026 1:37 PM IST

    హైదరాబాద్: కృష్ణానగర్‌లో వాషింగ్‌ మెషిన్ పేలుడు

  • జనవరి 17, 2026 1:36 PM IST

    కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు

  • జనవరి 17, 2026 1:32 PM IST

    అప్పుడే పోరాటం ముగిసినట్టు కాదు..

    శివసేన (UBT), BMC నష్టం

  • జనవరి 17, 2026 1:27 PM IST

    ములుగు: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.

    • చైర్మన్‌గా ఇర్ప సుకన్య సునీల్ నియామకం

    • డైరెక్టర్లుగా 15 మంది.

    • బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించిన ఎండోమెంట్ అధికారి వీరస్వామి.

  • జనవరి 17, 2026 1:18 PM IST

    త్వరలో బీఆర్ఎస్ ముక్కలవుతుంది: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

    • బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయింది.

    • సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిరావడం తప్ప.. చేసిందేమీ లేదు.

    • గ్రామాల్లో అభివృద్ధి చేయాలంటే ఢిల్లీకి వెళ్లాల్సిన పనిలేదు.

    • కేంద్రం ఇచ్చిన నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చు.

    bjp-ramachandra-rao.jpg

  • Jan 17, 2026 12:40 IST

    ఖమ్మం: మిట్టపల్లిలో విషాదం

    • పిల్లల మృతి తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య

    • కొన్ని రోజుల క్రితం గ్యాస్ పేలి ఇద్దరు పిల్లలు మృతి

    విద్యార్థి ఆత్మహత్య

  • Jan 17, 2026 12:39 IST

    హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్..

    • చైతన్యపురి, నాగోల్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుసగా చైన్ స్నాచింగ్స్.

    • భయాందోళనలో స్థానికులు.

    • దొంగల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు.

  • Jan 17, 2026 12:35 IST

    పొలిటికల్ పండగెప్పుడు..

    • నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల ఎదురుచూపు.

    • మౌనముద్రలో కూటమి నేతలు.. జనసేనలోనూ అసంతృప్తులు.

    • నిరాశలో మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.

    • పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • Jan 17, 2026 12:32 IST

    మార్కాపురం : పామూరు మండలం బొట్లగూడూరులో దారుణం చోటు చేసుకుంది.

    • ఆటో తగిలిందని డ్రైవర్ మహర్షిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొంత మంది యువకులు.

    • ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాలు.. చికిత్స కోసం కనిగిరి ఏరియా వైద్య శాలకు తరలింపు.

    • దాడికి పాల్పడిన ఆరుగురిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగతా వారికోసం గాలింపు.





  • Source link

    Spread the love