ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్ | Andhra pradesh telangana national and international live telugu news updates of 28th Jan 2026 BSB


  • Jan 28, 2026 09:01 IST

    హైదరాబాద్‌: మేడిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి

    • మేడిపల్లి పీఎస్ పరిధిలో అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు

    • ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

    • మరో ముగ్గురికి గాయాలు.. పరిస్థితి విషమం

    • ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు

    పూర్తి కథనం

  • Jan 28, 2026 08:45 IST

    అమరావతి: నేడు ఏపీ క్యాబినేట్ సమావేశం

    • సుమారు 35 అంశాలు ఎజెండాగా ఏపీ క్యాబినెట్ భేటీ

    • ఉదయం గం.10:30కు సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమావేశం కానున్న మంత్రిమండలి

    • అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, పలు సంస్థలకు భూ కేటాయింపులు వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

  • Jan 28, 2026 08:38 IST

    నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జి.చెర్లోపల్లిలో విషాదం

    • సోలార్ ఫెన్సింగ్ విద్యుత్ షాక్‌తో ఆర్టీసీ కండక్టర్ మృతి

    • మృతుడు ఉదయగిరి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కుర్ర మధుసూదన్‌గా గుర్తింపు

    • తన‌ పొలంలో నువ్వు పంటకు నీళ్లు కట్టే సమయంలో సోలార్ కంచెపై పడటంతో ప్రమాదం

    • ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు

  • Jan 28, 2026 08:37 IST

    నెల్లూరు జిల్లాలో వైన్ షాప్ వద్ద చెలరేగిన వివాదంలో వ్యక్తిపై దాడి.. మృతి

    • కొండాపురం మండలం వెలిగండ్లలో వ్యక్తి ప్రాణం తీసిన వైన్ షాప్ వద్ద వివాదం

    • రెండు రోజుల క్రితం తూర్పు యర్రబల్లి వైన్ షాప్ వద్ద ఇరువురి మధ్య చెలరేగిన వివాదం

    • కొండయ్య అనే వ్యక్తిపై కర్రతో దాడి.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు బంధువుల ఆరోపణ

    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jan 28, 2026 08:33 IST

    అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ వివరాలివే..

    • ఉదయం 10:15 గంటలకు సచివాలయానికి వెళ్తారు

    • 10:30 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు

    • మధ్యాహ్నం 03:00 గంటలకు గ్రీన్ కవర్‌పై సమీక్ష చేస్తారు

    • 04.00 గంటలకు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తారు

    • సాయంత్రం 06:45 గంటలకు నివాసానికి చేరుకుంటారు

  • Jan 28, 2026 08:27 IST

    బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిర్వాకం

    • ఏఎస్ఎల్ఐ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పర్సనల్ డేటాను దొంగిలించిన సీనియర్ ఉద్యోగి

    • రూ.87 కోట్ల విలువైన కంపెనీ సోర్స్ కోడ్‌ను తస్కరించిన అశుతోష్ నిగమ్

    • విధుల నుంచి తొలగించిన కంపెనీ యాజమాన్యం

    • ఐటీ యాక్ట్ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

    పూర్తి కథనం

  • Jan 28, 2026 08:05 IST

    భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం

    • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణికి సంబంధించిన కేటీకే-5 గనిలో అగ్నిప్రమాదం

    • కార్మికులకు సంబంధించిన ల్యాంప్ రూమ్‌లో చెలరేగిన మంటలు

    • సుమారు రూ.50లక్షల విలువైన 1500 ల్యాంపుల దగ్ధం

    పూర్తి కథనం

  • Jan 28, 2026 07:01 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి రేటు

    • హైదరాబాద్‌లో బుధవారం ఉదయానికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,940

    • రూ.1,48,440కి తగ్గిన 22 క్యారెట్ల పసిడి రేటు

    • కిలోకు వంద రూపాయలు పెరిగిన వెండి రేటు

    • హైదరాబాద్‌లో కిలోకు రూ.3,87,100కి చేరిన వెండి

    పూర్తి కథనం



  • Source link

    Spread the love