Jan 29, 2026 10:45 IST
భారత్‌లో భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
నేడు ట్రేడింగ్ ఆరంభంలో దాదాపు రూ.12వేలు పెరిగిన మేలిమి బంగారం ధర
రూ.30 వేల మేర ఎగబాకిన వెండి ధరట
Jan 29, 2026 10:40 IST
స్పీకర్ నోటీసులు అందలేదు: ABNతో ఎమ్మెల్యే దానం నాగేందర్
పిటిషనర్‌కి నోటీసులు ఉండవచ్చు: దానం నాగేందర్
నోటీసులపై న్యాయపరమైన అంశాలు కనిపిస్తున్నాయి: MLA దానం
స్పీకర్ ఏం అడుగుతారో సమాధానం చెప్తా: దానం నాగేందర్
స్పీకర్ ప్రశ్నలను బట్టి నా సమాధానాలు: MLA దానం నాగేందర్
Jan 29, 2026 10:39 IST
పదవుల కోసం నేను ఎక్కడికీ వెళ్లలేదు: ABNతో ఎమ్మెల్యే దానం
ప్రజల నియోజకవర్గం బాగు కోసం నిర్ణయాలు: దానం నాగేందర్
సేవ చేయాలనే ఉద్దేశం తప్ప పదవుల కోసం పాకులాడలేదు: దానం
ఎంతవరకు అయితే అంతవరకు పోరాడుతా: ABNతో MLA దానం
Jan 29, 2026 10:35 IST
మేడారం: నేడు గద్దెనెక్కనున్న సమ్మక్క
బుధవారమే గద్దెపైకి చేరుకున్న సారలమ్మ
చిలకలగుట్ట నుంచి గద్దెపైకి రానున్న సమ్మక్క
సమ్మక్క రాకతో పరిపూర్ణం కానున్న జాతర
మరోవైపు మేడారానికి చేరుకున్న మంత్రులు
Jan 29, 2026 09:22 IST
కాకినాడ: కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం
గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొని ఒకరి మృతి
16వ నంబర్ జాతీయ రహదారిపై లారీ యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా ఢీకొట్టిన మరో లారీ
ఒక్కసారిగా లారీలో చెలరేగిన మంటలు.. లారీ డ్రైవర్ సజీవ దహనం
Jan 29, 2026 09:15 IST
ఏపీలో పలుచోట్ల ఏసీబీ అధికారుల దాడులు
విజయనగరం, రేణిగుంటలో ఏసీబీ సోదాలు
విజయనగరంలో హోంగార్డ్ శ్రీనివాసరావు నివాసం, బంధువుల ఇళ్లపై ఏసీబీ దాడులు
విజయనగరం, విశాఖలో ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ సోదాలు
రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉద్యోగి తిరుమలేష్ నివాసాలపైనా దాడులు
రేణిగుంట, తిరుపతి, నెల్లూరులోని 5 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు
Jan 29, 2026 09:14 IST
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
భారతీయ విద్యార్థుల ఆహ్వానంతో HBS క్యాంపస్‌లో సీఎం రేవంత్ పర్యటన
HBS విద్యార్థుల కెరీర్, సవాళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చ
తన విజయమంత్రాన్ని విద్యార్థులతో పంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ విజన్‌ను వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి
భారత అభివృద్ధిలో యువత పాత్ర కీలకం: రేవంత్‌రెడ్డి
తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా విద్యార్థులు వ్యవహరించాలని రేవంత్ పిలుపు
Jan 29, 2026 08:56 IST
పాత పన్ను విధానం రద్దు చేస్తారా, లేదా?..
ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
ఇప్పటికే బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజలు
తమకు ఊరటనిచ్చేలా కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నారు సామాన్యులు
పన్నుల తగ్గింపు ద్వారా వేతన జీవులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేంద్రం
ఈ ఏడాది పాత పన్ను పూర్తిగా రద్దు చేస్తారా, లేదా? అని జోరుగా చర్చ
Jan 29, 2026 08:47 IST
అజిత్ పవార్ అంత్యక్రియలు.. అప్డేట్..
ఇవాళ ఉదయం 11:00 గంటలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సిఫార్సు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
పుణే జిల్లా బారామతి సమీపంలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
అజిత్ పవార్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్..
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తదితులు హాజరయ్యారు
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించిన సీఎం ఫడ్నవీస్
Jan 29, 2026 07:48 IST
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు
విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
అజిత్ పవార్ అంత్యక్రియలకు ప్రధాని హాజరుకానున్న, అమిత్ షా
హాజరుకానున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం షిండే
3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం
Jan 29, 2026 07:47 IST
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇరాన్ వైపు మరో యుద్ధ నౌక దూసుకొస్తున్న అమెరికా
అమెరికా బెదిరింపులకు భయపడేది లేదు: ఇరాన్
అమెరికా దాడులు చేస్తే ఊరుకోం: ఇరాన్
అమెరికా చర్చలకు వస్తే అంగీకరిస్తాం: ఇరాన్
మిలటరీ చర్యలకు పాల్పడితే సహించేది లేదు: ఇరాన్
Jan 29, 2026 07:46 IST
రెండో రోజు వింగ్స్ ఇండియా-2026 ప్రదర్శన
ప్రత్యేక ఆకర్షణగా పలు విమానాలు
రేపు, ఎల్లుండి సాధారణ ప్రజలకు అనుమతి
Jan 29, 2026 07:45 IST
ఆల్ టైం రికార్డ్ ధరలు నమోదు చేస్తున్న బంగారం, వెండి
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో రోజుకో కొత్త రికార్డ్ నమోదు
ఇవాళ ఉదయం 6.00 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,67,090
22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి రేటు రూ.1,53,160
తొలిసారిగా రూ.4 లక్షల మార్క్ దాటిన కిలో వెండి
Jan 29, 2026 07:08 IST
UGC కొత్త నిబంధనలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
జనరల్ కేటగిరిపై వివక్ష చూపు వినీత్ జిందాల్ పిటిషన్
3(సి) నిబంధన అమలును నిలిపివేయాలని పిటిషన్
Jan 29, 2026 07:08 IST
విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సెంట్రల్ పార్క్‌లో ఫ్లవర్ షో
నేటి నుంచి మూడురోజులపాటు ఫ్లవర్ షో నిర్వహణ
సందర్శకులను ఆకట్టుకునేలా పుష్పాల అలంకరణలు
Jan 29, 2026 07:07 IST
నేడు బహుళ ముందుకు ఆర్థిక సర్వే
2025-26 సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
ప్రశ్నోత్తరాల తర్వాత ఆర్థిక సర్వే టేబుల్ చేయనున్న ఆర్థికమంత్రి