ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్ | ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు andhrajyothy ప్రత్యక్ష ప్రసార నవీకరణలు 30 జనవరి 2026 సూరి


  • Jan 30, 2026 13:43 IST

    చదువు అనేది గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు

    • మనం మాత్రమే కాదు.. సమాజం కూడా బాగుండాలనేది మన సంస్కృతి: సీఎం చంద్రబాబు

    • చైతన్యం పెరిగి సేవా కార్యక్రమాలకు చాలా మంది సహాయం చేస్తున్నారు: చంద్రబాబు

    • ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుంది: సీఎం చంద్రబాబు

    • సరైన సమయంలో నిర్ణయాలు ఉండాలి: చంద్రబాబు

  • Jan 30, 2026 13:18 IST

    అమరావతి: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: మంత్రి లోకేష్‌

    • పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేయండి: మంత్రి నారా లోకేష్‌

    • నేతల మధ్య సఖ్యత కూటమి.. కలిసికట్టుగా పనిచేయండి: లోకేష్‌

    • దుష్ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టండి: మంత్రి నారా లోకేష్‌

  • Jan 30, 2026 12:48 IST

    కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS న్యాయవాది మోహిత్‌రావు

    • రాజకీయ కక్షసాధింపులో భాగంగానే సిట్ నోటీసులు: మోహిత్‌రావు

    • గతంలో ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది: న్యాయవాది మోహిత్‌రావు

    • అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం: BRS న్యాయవాది మోహిత్‌రావు

  • Jan 30, 2026 12:47 IST

    విచారణకు అడ్వకేట్‌ను పంపిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

    • క్రాస్ ఎగ్జామినేషన్‌కు వ్యక్తిగతంగా హాజరుకావడానికి..

    • ఫిబ్రవరి 20 వరకు గడువు కోరిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

    • సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసిన మహేశ్వర్‌రెడ్డి

  • Jan 30, 2026 12:45 IST

    కేసీఆర్‌కు మరోసారి నోటీసులు అందించిన సిట్ నిర్ణయం

    • నోటీసులు ఇచ్చే అంశంపై సిట్ అధికారుల భేటీ

    • కేసీఆర్‌ను హైదరాబాద్‌లోనే విచారించాలని సిట్ యోచన

    • ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ప్రశ్నించే అవకాశాలు లేవంటున్న సిట్

  • Jan 30, 2026 12:44 IST

    దానంపై అనర్హత వేటు వేయాలని కోరా: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

    • స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చా: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

    • నాపై ఓవరాక్షన్ చేసిన అధికారులపై చర్యలు కోరా: కౌశిక్‌రెడ్డి

    • న్యాయం జరిగే వరకు అధికారులను వదిలిపెట్టను: కౌశిక్‌రెడ్డి

  • Jan 30, 2026 12:24 IST

    ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ స్వాత్‌ కమాండో కాజల్ చౌదరి దారుణ హత్య

    • భర్త అంకుర్ చౌదరి చేతిలో దారుణ హత్యకు గురైన కాజల్ చౌదరి

    • భార్యను హత్య చేస్తూ ఆమె సోదరుడికి ఫోన్ చేసిన నిందితుడు

    • హత్య అనంతరం శవాన్ని తీసుకెళ్లాలంటూ ఆమె సోదరుడికి చెప్పిన అంకుర్

    • అదనపు కట్నం కోసం వేధిస్తూ హత్య చేసిన భర్త అంకుర్ చౌదరి

    పూర్తి కథనం

  • Jan 30, 2026 12:17 IST

    కరీంనగర్: వీణవంక మినీ మేడారం జాతరపై క్లారిటీ ఇచ్చిన నిర్వాహకులు

    • 1976లో మా తాత పాడి సుధాకర్‌రెడ్డి మినీ మేడారం రూపం: ఉదయనందన్‌రెడ్డి

    • 50 ఏళ్లుగా మా కుటుంబమే జాతర చేస్తుంది: ఉదయనందన్‌రెడ్డి

    • ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కావాలనే గొడవ చేశారు: ఉదయనందన్‌రెడ్డి

    • జాతరతో ఎండోమెంట్‌కు సంబంధం లేదు: ఉదయనందన్‌రెడ్డి

  • Jan 30, 2026 12:15 IST

    అహ్మదాబాద్‌లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా అరెస్ట్

    • హైదరాబాద్‌ రోషన్ అగర్వాల్ సహా నలుగురి అరెస్ట్

    • అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు శిశువును తరలిస్తున్న ముఠా

    • వాహన తనిఖీల్లో బయటపడ్డ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా బాగోతం

    • శిశువును రూ.3.60లక్షలకు కొనుగోలు చేసిన ఏజెంట్ రోషన్

  • Jan 30, 2026 12:15 IST

    ములుగు: మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు

    • రాత్రి పలుచోట్ల కరెంట్ పోవడంతో భక్తుల ఆగ్రహం

    • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కారు అద్దాలు, పలు దుకాణాలు ధ్వంసం

  • Jan 30, 2026 12:14 IST

    సస్పెండ్ చేస్తారని ఆశిస్తున్నాం: కౌశిక్‌రెడ్డి

    • దానం నాగేందర్‌ను స్పీకర్ సస్పెండ్ చేస్తారని ఆశిస్తున్నాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

    • దానం BRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు: కౌశిక్ రెడ్డి

    • దానం పోటీ చేసిన దాని కంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుంది?: కౌశిక్‌రెడ్డి

  • Jan 30, 2026 12:11 IST

    దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఛాంబర్‌లో విచారణ

    • దానంపై అనర్హత కోరుతూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు

    • కౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన స్పీకర్

    • ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ

    • కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న దానం అడ్వకేట్లు

    • తాను BRSలోనే ఉన్నానని ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన దానం

    పూర్తి కథనం

  • Jan 30, 2026 12:09 IST

    జనవరి 30న భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

    • మహాత్మా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు

    • మహాత్ముని త్యాగాలు, ఆశయాలను స్మరించుకుంటూ ట్వీట్ చేసిన సీఎం

    • అహింసా విధానంతో కోట్లమందిని ఒక్కతాటిపైకి తెచ్చిన మహాత్ముడు గాంధీ: సీఎం చంద్రబాబు

    • ఆయన బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలు అందరూ పాటించాలి: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం

  • Jan 30, 2026 11:55 IST

    మహాత్మకు నివాళి

    • జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

    • మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్న ముఖ్యమంత్రి రేవంత్

    • ఎక్స్ వేదికగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

    పూర్తి కథనం

  • Jan 30, 2026 11:48 IST

    ఢిల్లీ: నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

    • గాంధీజీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ

    • 1948 జనవరి 30 న ఢిల్లీ బిర్లా భవన్ వద్ద నాథూరాం గాడ్సే చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన గాంధీ

    • జాతిపిత మహాత్మా గాంధీకి హృదయపూర్వక నివాళులు: మోదీ

    • పూజ్య బాపు ఎల్లప్పుడూ స్వదేశీని కోరుతున్నారు: ప్రధాని

    • గాంధీజీ వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ విధి మార్గాన్ని అనుసరించడానికి సిద్ధం: ప్రధాని మోదీ

    పూర్తి కథనం

  • Jan 30, 2026 10:49 IST

    నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

    • అమరావతి: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ సర్కార్

    • జాబ్ క్యాలెండర్‌పై కసరత్తు ముమ్మరం చేసిన కూటమి ప్రభుత్వం

    • వివిధ శాఖల వారిగా ఖాళీల వివరాలను సేకరిస్తున్న చంద్రబాబు సర్కార్

    • పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

    పూర్తి కథనం

  • Jan 30, 2026 10:21 IST

    గుడ్ న్యూస్.. తగ్గుముఖం పట్టిన బంగారం ధర

    • కొన్ని రోజులుగా అంచనాలకు మించి పెరిగిన బంగారం ధర

    • నేడు ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే యూటర్న్ తీసుకున్న గోల్డ్ ధర

    పూర్తి కథనం

  • Jan 30, 2026 08:51 IST

    స్నేహితుడిని అవమానించిన యువతి..

    • చిన్ననాటి స్నేహితుడు డెలివరీ బాయ్‌గా మారాడని అవమానించిన యువతి

    • దారుణంగా అవమానిస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌

    • అప్పట్లో అందరూ బాగా చదువుకోవాలని చెప్పి ఇప్పుడు అతనే డెలివరీ బాయ్‌ అయ్యాడంటూ విమర్శ

    • వీడియో తీసి నెట్టింట పోస్టు చేసిన యువతి.. ఆమెపై ఫైర్ అవుతున్న నెటిజన్లు

    పూర్తి కథనం

  • Jan 30, 2026 08:22 IST

    కేసీఆర్‌కు మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైన సిట్

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేడు మినహాయింపు

    • రేపు విచారణ కోసం మరో నోటీస్ సిద్ధం చేసిన సిట్

    • నోటీస్ ఎక్కడిస్తారనే దానిపై సందిగ్ధత

  • Jan 30, 2026 08:06 IST

    పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

    • కరీంనగర్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

    • కరీంనగర్‌ సీపీని మతం పేరుతో దూషించారని కౌశిక్‌రెడ్డిపై కేసు

    • వీణవంకలో సమ్మక్క జాతరకు వెళ్తుండగా కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

    • సమ్మక్క జాతర దగ్గర పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కౌశిక్‌రెడ్డి

    • పోలీసులను నెట్టేసి.. సీపీపై అనుచిత వ్యాఖ్యలు

    పూర్తి కథనం

  • Jan 30, 2026 08:05 IST

    పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

    • ప్రకాశం: అమ్మనబ్రోలు దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

    • పట్టాలు తప్పిన పక్క లైన్లపై పడ్డ గూడ్స్ వ్యాగన్లు

    • ఘటనాస్థలిలో కొనసాగుతున్న నిర్మాణాలు

    • నాగులుప్పలపాడు మం. అమ్మనబ్రోలు దగ్గర ఘటన

    పూర్తి కథనం

  • Jan 30, 2026 07:35 IST

    దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు

    • హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 6.00 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,886

    • 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి రేటు రూ.1,63,960

    • విజయవాడ, విశాఖపట్నంలోనూ దాదాపు ఇదే రేటు

    • చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,83,290

    • 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,68,010

    పూర్తి కథనం

  • Jan 30, 2026 07:30 IST

    హైదరాబాద్: ఫిరాయింపుల కేసులో నేడు దానం నాగేందర్ విచారణ

    • దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని రెండు పిటిషన్లు

    • పిటిషన్లు దాఖలు చేసిన కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వరరెడ్డి

    • కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న దానం అడ్వొకేట్లు

    • తాను BRSలోనే ఉన్నానని ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన దానం

  • Jan 30, 2026 07:28 IST

    నేడే తుదిగడువు

    • మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు నేడు తుదిగడువు

    • సాయంత్రం 5గంటలకు ముగియనున్న నామినేషన్ల గడువు

    • రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన

  • Jan 30, 2026 07:28 IST

    వెనెజువేలా గ్రీన్ సిగ్నల్..

    • చమురు రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు వెనెజువేల ఆమోదం

    • ప్రభుత్వానికి స్వస్తి, ఫలించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి

    • తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ సంతకంతో చట్టంగా మారిన బిల్లు

  • Jan 30, 2026 07:27 IST

    మహాత్ముడి వర్ధంతి నేడే..

    • నేడు మహాత్మాగాంధీ ౭౮వ వర్ధన్తి

    • రాజ్‌ఘాట్‌లో నివాళులర్పనున్న రాష్ట్రపతి, ప్రధాని

  • Jan 30, 2026 07:24 IST

    మేడారానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు

    • వనదేవతల దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

    • అమ్మవార్ల దర్శనానికి 4గంటలకు పైగా సమయం

  • Jan 30, 2026 07:23 IST

    నేడు తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు

    • సుప్రీం ఏర్పాటు కమిటీ ముందస్తు ఎన్నికలు

    • బరిలో 203 మంది న్యాయవాదులు, అందులో 55 మంది మహిళలు

    • తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లు 35,316 మంది న్యాయవాదులు

  • Jan 30, 2026 07:23 IST

    చెన్నై: టీవీకే మేనిపెస్టో కమిటీ పర్యటన ఖరారు

    • ఫిబ్రవరి 1న మధురై నుంచి కమిటీ పర్యటన ప్రారంభం

    • ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక కార్యకర్తలతో భేటీ

    • ప్రజల అభిప్రాయాలను తీసుకోనున్న టీవీకే కమిటీ

    • ఫిబ్రవరి 2న టీవీకే మూడో వార్షికోత్సవం

  • Jan 30, 2026 07:22 IST

    అనంతపురం: యాడికిలో గంజాయి బ్యాచ్ వికృత చేష్టలు

    • లిక్కర్ షాప్ దగ్గరకు అర్ధనగ్నంగా వచ్చిన గుత్తికి చెందిన రౌడీషీటర్ అజయ్ గ్యాంగ్

    • లిక్కర్ షాప్‌లో మద్యం కొని అక్కడే మద్యం సేవించిన రౌడీషీటర్ అజయ్ రాజు

    • యాడికిలో రౌడీషీటర్ అజయ్ వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సీరియస్

    • రౌడీషీటర్ అజయ్‌కు టీడీపీతో సంబంధం లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే జయరాం

    • రౌడీషీటర్ అజయ్ గ్యాంగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే జయరాం



  • Source link

    Spread the love