ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్ | ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు andhrajyothy ప్రత్యక్ష ప్రసార నవీకరణలు 31 జనవరి 2026 సూరి


  • Jan 31, 2026 16:43 IST

    ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు.

    • కాచిగూడ రైల్వేస్టేషన్‌ వరకు ఆటోలో వెళ్లిన నిందితులు.

    • ఆటో డ్రైవర్‌ను విచారించిన పోలీసులు.

    • నిందితుల మాటలు ఢిల్లీ వాసులుగా ఉన్నాయన్న డ్రైవర్‌.

    • కాల్పులకు ముందు బస్టాప్‌లో ఫోన్‌లో మాట్లాడిన నిందితులు.

    • నెట్‌వర్క్ డంప్ నుంచి సమాచారం సేకరిస్తున్న పోలీసులు.

  • Jan 31, 2026 15:59 IST

    ఆదివారం నాడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు.

    • కేసీఆర్‌కు సిట్ నోటీసులు వ్యతిరేకిస్తూ నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు.

    • కక్షసాధింపులో భాగంగానే కేసీఆర్‌ను రేవంత్ సర్కార్ వేధిస్తోందని బీఆర్ఎస్ నేతల ఆరోపణ.

  • Jan 31, 2026 15:41 IST

    శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత.

    • డీఆర్ఐ హైదరాబాద్ – చెన్నై జోనల్ యూనిట్ల సంయుక్త ఆపరేషన్.

    • 9.5 కోట్లు విలువైన 27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్.

    • ఏడుగురు నిందితుల అరెస్ట్.

    • బ్యాంకాక్ నుంచి వచ్చిన థాయ్ ఎయిర్‌వేస్ విమానంలోని ట్రాలీ బ్యాగుల్లో గంజాయి దాచినట్లు గుర్తింపు.

  • Jan 31, 2026 15:27 IST

    ఖమ్మం: ఏదులాపురం మున్సిపాలిటీలో పొంగులేటి ప్రచారం

    • బీఆర్ఎస్ పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు: పొంగులేటి

    • పేదల కోసం గత పాలకలు ఏ ఒక్క పని చేయలేదు: పొంగులేటి

    • గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు కూడా ఇవ్వలేదు: పొంగులేటి

    • అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి

    పూర్తికథనం..

  • Jan 31, 2026 15:21 IST

    నల్లగొండ: నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణ హత్య.

    • ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ.

    • ప్రియుడు నగేష్‌ యాదవ్‌ భార్య మమత(25)పై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సుజాత.

    • అరునెల బాబుకు కూడా నిప్పంటుకోవడంతో తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు.

    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మమత మృతి.

    పూర్తికథనం

  • Jan 31, 2026 15:14 IST

    2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టిన జీహెచ్‌సీ.

    • రూ. 11,460 కోట్లతో జీహెచ్‌సి బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కౌన్సిల్.

    • జీహెచ్‌కి వివిధ మార్గాల్లో వచ్చిన ఆదాయం. 6,441కోట్లు.

    • జీహెచ్‌సీ ఖర్చు రూ.4,057కోట్లు, మిగులు రూ. 2,384కోట్లు.

    • జీహెచ్ వైద్య గ్రాంట్స్ రూ. 400కోట్లు.

    • కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల కోసం రూ. 2,260కోట్లు కేటాయింపు.

    • విలీనమైన 27 మున్సిపాలిటీల నుంచి వచ్చిన తదుపరి రూ.1,860కోట్లు.

  • Jan 31, 2026 12:54 IST

    గతంలో ఫాంహౌస్ నుంచే పాలన జరిగింది: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

    • ఇప్పుడు సిట్ విచారణ కూడా కేసీఆర్ ఫాంహౌస్‌లోనే జరుగుతుంది: రాంచందర్‌రావు

    • కేసీఆర్‌పై రేవంత్‌కు ఎందుకంత ప్రేమ?: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

  • Jan 31, 2026 12:53 IST

    మేడారంలో బస్సుల ఆలస్యంతో భక్తుల ఆగ్రహం

    • తాత్కాలిక బస్టాండ్ దగ్గర భక్తుల ఆందోళన

    • బస్టాండ్ వద్ద బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

    • రిటర్న్ జర్నీపై చేతులెత్తేసిన ప్రభుత్వ నిర్వహణ

    • వేలాదిమంది భక్తులతో కిక్కిరిసిపోయిన ఆర్టీసీ బస్టాండ్

    • మేడారంలో ఇంకా కంట్రోల్‌కు రాని ట్రాఫిక్

  • Jan 31, 2026 12:50 IST

    వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఫైర్‌

    • జగన్ రెడ్డి అవినీతి మూలాల్లోంచి పుట్టిన పార్టీ వైసీపీ: మంత్రి రవికుమార్

    • వైసీపీ అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి రవి

    • తిరుమలకి ఉన్న గౌరవాన్ని వైసీపీ భ్రష్టుపట్టించింది: మంత్రి గొట్టిపాటి

    • టీటీడీకి డిక్లరేషన్ సమర్పించిన జగన్ తుంగలో తొక్కారు: మంత్రి గొట్టిపాటి

    పూర్తి కథనం

  • Jan 31, 2026 11:13 IST

    తీవ్ర విషాదం

    • హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

    • చర్లపల్లి- ఘట్కేసర్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఆత్మహత్య

    • మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, విశాల్ రెడ్డి, చైతన్య రెడ్డిగా గుర్తింపు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 10:56 IST

    ఎన్నికల మున్సిపల్‌పై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

    • తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్

    • పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పలువురు మంత్రులు

    • ఎన్నికల మున్సిపల్ సర్వే నివేదికలను సీఎంకు వివరించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

    • కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టిన సీఎం రేవంత్

    పూర్తి కథనం

  • Jan 31, 2026 10:20 IST

    రూ.54 లక్షల మోసం

    • హైదరాబాద్: మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ పరిచయంతో రూ.54 లక్షల మోసం

    • రైల్వే ఇంజనీర్‌ను పెళ్లి పేరుతో నమ్మించిన ముషీరాబాద్‌ యువతి

    • క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాల పేరుతో 29 విడతల్లో రూ.54 లక్షల వసూలు

    • లాభాలు విత్డ్రా చేయాలంటే అదనపు ఫీజు కోరడంతో పోలీసులకు బాధితుల ఫిర్యాదు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 10:18 IST

    ఏలూరు: జిల్లాలో మళ్లీ పులి కలకలం

    • పోలవరం మండలం ఇటుకల కోట దగ్గర పులి సంచారం

    • రెండు లేగ దూడలపై దాడి చేసి చంపిన పులి

    • పులి పాదముద్రలను సేకరిస్తున్న ఫారెస్ట్ అధికారులు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 09:15 IST

    బెంగళూరు HSR లేఅవుట్‌ టీచర్స్ కాలనీలో దారుణం

    • మహిళపై తీవ్రంగా దాడి చేసిన ఎదురింటి వారి కుక్క

    • తీవ్రంగా గాయపడిన మహిళ శరీరానికి 50కుట్లు వేసిన వైద్యులు

    • నెట్టింట వైరల్‌గా మారిన మహిళపై దాడి ఘటన వీడియో

    పూర్తి కథనం

  • Jan 31, 2026 08:57 IST

    ఘోర ప్రమాదం

    • కాంగో: రుబయా ప్రాంతంలోని కోల్టన్ గనిలో ఘోర ప్రమాదం

    • కార్మికులు పని చేసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిన గని

    • ఈ ప్రమాదంలో మట్టి కింద కూరుకుపోయి 200మంది మృతి

    పూర్తి కథనం

  • Jan 31, 2026 08:22 IST

    భారత్‌లో తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

    • ఇవాళ ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,190

    • నిన్నటితో ప్రస్తుత రూ.9,650 మేర తగ్గిన గోల్డ్ రేటు

    • 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,55,100

    • నిన్నటితో తాజా రూ.8,850 మేర తగ్గిన బంగారం రేటు

    • ప్రస్తుతం రూ.4,05,000 వద్ద ట్రేడవుతున్న కిలో వెండి

    పూర్తి కథనం

  • Jan 31, 2026 08:17 IST

    అమెరికా ఆర్థిక శాఖకు షాక్ ఇచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

    • అంతర్గత సేవలను, ఆర్థిక శాఖపై అమెరికా ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో దావా

    • తన వ్యాపారం, వ్యక్తిగత పన్ను రిటర్న్‌ల సమాచారం లీక్ కావడంతో పిటిషన్

    • 10 బిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేసిన ట్రంప్ తరఫు న్యాయవాది

    పూర్తి కథనం

  • Jan 31, 2026 08:14 IST

    హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

    • కోఠి SBI ఏటీఎం సెంటర్ దగ్గర దుండగుల కాల్పులు

    • రిన్షద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6లక్షలు దోపిడీ

    • డిపాజిట్ చేయడానికి వచ్చిన రిన్షద్‌పై తుపాకీతో కాల్పులు

    • రిన్షద్ కాలికి గాయం, ఆసుపత్రికి తరలింపు

    • సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న సుల్తాన్‌బజార్ పోలీసులు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 07:27 IST

    కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

    • కడపల్లిలోని నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం చంద్రబాబు

    • గుడిపల్లె మండలం బెగ్గిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

    • శాంతిపురం మండలం తుమ్మిసిలో ఈ-సైకిల్ పంపిణీ కార్యక్రమం

    • తుమ్మిసి బహిరంగసభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 07:26 IST

    యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రతినిధి మాయం కేసు

    • బంగారం, వెండి ప్రత్యక్ష మాయం ఘటనలో ఈఓ భవానీశంకర్ చర్యలు

    • జూనియర్ అసిస్టెంట్ రామచంద్రశేఖర్, రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మి సస్పెషన్

    • విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులకు మెమోలు, షోకాజ్ నోటీసులు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 07:25 IST

    నంద్యాల డెయిరీ వ్యవహారం.. కమిటీ విచారణ..

    • నంద్యాల విజయ పాల డెయిరీలో నలుగురు సభ్యుల కమిటీ విచారణ

    • కార్మికుల చట్ట నిబంధనలు పాటించలేదని నిర్ధారణ

    • ఈపీఎఫ్, ఈఎస్‌ఐలో లోపాలు గుర్తించిన నలుగురు సభ్యుల కమిటీ

    • త్వరలో కలెక్టర్‌కు సమగ్ర నివేదిక ఇవ్వనున్న కమిటీ

    • నెల కిందట జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఫిర్యాదు చేసిన కార్మికులు

  • Jan 31, 2026 07:22 IST

    ముంబై: నేడు NCP శాసనసభాపక్ష సమావేశం

    • శాసనసభాపక్ష నేతగా సునేత్రను ఎన్నుకోనున్న సభ్యులు

    • మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్

    • నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న అజిత్‌ పవార్‌ సతీమణి

    • సునేత్ర పవార్‌కు క్రీడలు, ఎక్సైజ్‌ శాఖలు కేటాయింపు



  • Source link

    Spread the love