ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్.. | Andhra pradesh telangana national and international live telugu news updates of 27th Jan 2026 Suri



  • Jan 27, 2026 20:44 IST

    టీడీపీ పార్లమెంట్ కమిటీ వర్క్‌షాప్‌లో పాల్గొన్న చంద్రబాబు

    • టీడీపీని మరింత బలోపేతం చేయాలి: సీఎం చంద్రబాబు

    • టీడీపీలో యువరక్తానికి ప్రాధాన్యం ఇచ్చాం: చంద్రబాబు

    • దేశంలోనే యంగ్ పార్లమెంట్‌గా టీడీపీ ఉంది: చంద్రబాబు

    • 2024 సార్వత్రిక ఎన్నికల్లో 80% మంది కొత్తవారికి, విద్యావంతులకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశం: చంద్రబాబు

    • సమర్థులకు పెద్దపీట.. అన్ని వర్గాలకు సముచిత స్థానం: సీఎం

    • పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలను పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు సమన్వయం చేసుకోవాలి: చంద్రబాబు


  • Jan 27, 2026 20:38 IST

    హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో డ్రగ్స్ దందా

    • డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న విద్యార్థి శ్రీవాత్సవ్‌ అరెస్ట్‌.

    • MDMA డ్రగ్స్, ఓజీ కుష్ గంజాయి విద్యార్థులకు సరఫరా.

    • 36.54 గ్రాముల MDMA, 6.46 ఓజీ కుష్‌ డ్రగ్స్ స్వాధీనం.


  • Jan 27, 2026 20:37 IST

    ప్రజలకు మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    • భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్‌కు సూచన

    • సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలి: సీఎం

    • అమ్మవార్ల దర్శనం అనంతరం అందరూ క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి: సీఎం


  • Jan 27, 2026 19:27 IST

    కృష్ణా: వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు

    • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు.

    • పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పీఎస్‌లో BNS 196(1), 353(2), 351(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు.

    • ఏలూరు జిల్లా చాట్రాయిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు.

    పూర్తికథనం


  • Jan 27, 2026 18:14 IST

    బంగ్లాదేశ్ భాగర్ హాట్ జైల్ నుంచి విడుదలైన 23 మంది భారతీయ మత్స్యకారులు.

    • ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మంది మత్స్యకారులు.

    • బంగ్లాదేశ్ డిప్యూటీ సెక్రటరీ, భారత ప్రభుత్వం తరఫున డిప్యూటీ హై కమిషన్ శ్రీ చంద్రజీత్ సమక్షంలో విడుదల.

    • ఏపీ నుండి ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ హాజరు.

    • మోంగ్లా పోర్టులో పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లు తీసుకొని ఇండియాకు రానున్న మత్స్యకారులు.

    • బందీగా ఉన్న మత్స్యకారుల కోసం గతంలోనే కేంద్రస్థాయిలో చర్చలు జరిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.


  • Jan 27, 2026 17:51 IST

    ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీతో ముగిసిన ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల భేటీ

    • ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చ.

    • బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది: షర్మిల

    • ఉపాధిహామీ స్కీమ్‌ పునరుద్ధరణకు ఏపీలో భారీ ఉద్యమం: షర్మిల

    • ఉద్యమంలో పాల్గొనాలని రాహుల్‌ గాంధీని ఏపీకి ఆహ్వానించాం: షర్మిల


  • Jan 27, 2026 17:43 IST

    డిప్యూటీ సీఎం భట్టితో భేటీపై మంత్రి శ్రీధర్‌బాబు వివరణ

    • బహిరంగంగా వెళ్తే అది రహస్యం ఎలా అవుతుంది?

    • కేబినెట్‌ ఒక యూనిట్‌.. పాలన సమన్వయం మా బాధ్యత.

    • భట్టి నివాసంలో పాలనాపరమైన చర్చలే జరిగాయి.

    • మున్సిపల్‌ ఎన్నికల సన్నద్ధతపై చర్చించాం.

    • రాజకీయ లబ్ధి కోసమే కొందరు తప్పుడు ప్రచారం.


  • Jan 27, 2026 16:55 IST

    తెలంగాణ గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మతో బీఆర్ఎస్‌ నేతల సమావేశం.

    • సింగరేణి టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని ఫిర్యాదు.

    • సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులపై ఫిర్యాదు.

    • స్కామ్‌కి సంబంధించి నివేదికను గవర్నర్‌కు అందజేసిన బీఆర్ఎస్ నేతలు.

    • సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి.


  • Jan 27, 2026 15:54 IST

    మున్సిపల్‌ ఎన్నికల ముఖ్య తేదీలు..

    • జనవరి 28 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.

    • జనవరి 30 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.

    • జనవరి 31న నామినేషన్లు పరిశీలిస్తారు.

    • ఫిబ్రవరి 3 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.

    • ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్‌ నిర్వహణ.

    • ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.

    • ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక చేపడతారు.

    • ఫిబ్రవరి 16వ తేదీన కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక.

    • మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 52,43,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

    ELECTIONS.jpg

    పూర్తికథనం..


  • Jan 27, 2026 15:41 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 320 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్.

    • 127 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ.

    పూర్తికథనం


  • Jan 27, 2026 15:02 IST

    అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యప్ప స్వామి దేవాలయంలో కనిపించకుండా పోయిన విగ్రహం.

    • ఈ విగ్రహం చాలా ఖరీదైనదని చెబుతున్న అధికారులు.

    • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.

    • విగ్రహం కనిపించకుండా పోయినా పోలీసులకు ఫిర్యాదు చేయని ఆలయ కమిటీ.

    • విగ్రహం కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు.


  • Jan 27, 2026 14:46 IST

    ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కల్యాణ్‌ కుమారుడు అకీరానందన్‌

    • AI ద్వారా తన వ్యక్తిత్వం, గోప్యత హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ పిటిషన్‌.

    • AI సినిమాతో పాటు యూట్యూబ్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లో నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలిగించాలని కోరుతూ అకీరానందన్‌ పిటిషన్‌.

    • ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు.

    • ఏఐ సినిమాపై నిషేధం.

    పూర్తికథనం


  • Jan 27, 2026 14:38 IST

    అధిక ఫీజులతో కార్పొరేట్ స్కూల్స్ దోచుకుంటున్నాయి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

    • సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తీరుతాయి.

    • నేను విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూల్స్ మూసివేయిస్తా.

    • ఉత్సాహం ఉంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. లేకుంటే స్కూల్‌లో విద్యార్థులను చదివిస్తా.

    • కేంద్రం నుంచి నిధులు తెచ్చి నల్లగొండ రూపురేఖలు మారుస్తా.

    పూర్తికథనం


  • Jan 27, 2026 14:36 IST

    హైదరాబాద్‌: నందినగర్‌ నివాసంలో కేటీఆర్‌తో సంతోష్‌రావు భేటీ

    • కాసేపట్లో సిట్‌ విచారణకు హాజరవనున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌రావు.

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంతోష్‌రావును ప్రశ్నించనున్న సిట్‌.


  • Jan 27, 2026 14:35 IST

    ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన టీడీపీ ఎంపీ బాలశౌరి

    • అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరాం: ఎంపీ

    • సోషల్‌ మీడియా వినియోగంపై చర్చ జరగాలి.

    • US పన్నుల ప్రభావం ఆక్వా కల్చర్‌పై తీవ్రప్రభావం చూపుతోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం.


  • Jan 27, 2026 14:34 IST

    ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం


  • Jan 27, 2026 13:42 IST

    భోగాపురానికి శుభవార్త

    • అదానీ, బ్రెజిల్‌ సంస్థ ఎంబ్రాయర్‌ మధ్య కీలక ఒప్పందం

    • ఇకపై భారత్‌లోనే విమానాలు తయారుచేయనున్న బ్రెజిల్‌ సంస్థ

    • చిన్న, మధ్యస్థ ప్యాసింజర్‌ విమానాలతో పాటు.. సైనిక, ట్రాన్స్‌పోర్టు విమానాలు తయారు చేయనున్న బ్రెజిల్‌ సంస్థ.

    • ఏపీ, గుజరాత్‌లో తయారీ యూనిట్లు పెట్టనున్న ఎంబ్రాయర్‌.

    • భోగాపురంలో ఎంబ్రాయర్‌ ఫ్యాక్టరీ పెట్టాలని ఏపీ ప్రయత్నం.

    • భూమి, మౌలిక వసతులు కల్పిస్తామని ఎంబ్రాయర్‌కు ఏపీ ప్రభుత్వం హామీ.

    • భోగాపురంలో ఏరోస్పేస్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసే అవకాశం.


  • Jan 27, 2026 13:41 IST

    కుదిరిన ఒప్పందం..

    • అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్, బ్రెజిల్‌ సంస్థ ఎంబ్రాయర్‌ మధ్య MoU.

    • ఒప్పందం కుదిరినట్లు ప్రకటించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు.

    • పెరుగుతున్న అవసరాల మేరకు ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ: రామ్మోహన్‌

    • చిన్న, డొమెస్టిక్‌ ఎయిర్‌క్రాప్ట్‌లకు డిమాండ్‌ ఉంది: రామ్మోహన్


  • Jan 27, 2026 13:40 IST

    డ్రగ్స్‌పై దండయాత్ర

    • హైదరాబాద్‌: సా.4 గంటలకు డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమం.

    • ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి 510 కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర.

    • చీఫ్‌ గెస్ట్‌లుగా హాజరుకానున్న మంత్రులు అనిత, సత్యకుమార్‌, డీజీపీ.


  • Jan 27, 2026 13:03 IST

    BRSలో అన్ని దుర్మార్గాలకు కారణం సంతోష్‌రావే: కవిత

    • సంతోష్‌రావు లాంటి వ్యక్తికి అనుకూలంగా కేటీఆర్‌, హరీష్‌రావు.. ట్వీట్‌లు పెట్టడాన్ని BRS శ్రేణులు గమనించుకోవాలి: కవిత

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నుంచి తన గూఢచారిని రేవంత్‌ కాపాడుకుంటారు: కవిత

    • సిట్‌ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: కవిత


  • Jan 27, 2026 13:03 IST

    BRSలో ఎందరో నేతల కన్నీళ్లకు కారణం సంతోష్‌రావే: కవిత

    • ప్రగతి భవన్‌ గేటు బయట గద్దర్‌ను నిలబెట్టింది ఆయనే: కవిత

    • BRS నుంచి ఈటల సస్పెన్షన్‌కు కారణం సంతోష్‌రావే: కవిత

    • కేసీఆర్‌ను ఉద్యమకారులు, ప్రజలకు దూరం చేసింది సంతోషే: కవిత


  • Jan 27, 2026 13:03 IST

    మాజీ ఎంపీ సంతోష్‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు

    • కేసీఆర్‌ దగ్గరున్న మొదటి దెయ్యం సంతోష్‌రావే: కవిత

    • రేవంత్‌రెడ్డికి ప్రధాన గూఢచారి సంతోష్‌రావు: కవిత

    • ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ ఫుల్‌ ఇడ్లీ తిన్నారా? సగం ఇడ్లీ తిన్నారా? అనే సమాచారం రేవంత్‌కు చేరవేసేది సంతోష్‌రావే: కవిత


  • Jan 27, 2026 12:57 IST

    పార్టీలో కార్యకర్తలే అధినేతలు: మంత్రి లోకేశ్

    • యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

    • మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలి: మంత్రి లోకేశ్

    • అన్ని పదవుల్లో సామాజిక న్యాయం: మంత్రి లోకేశ్

    • పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం కృషి: లోకేశ్


  • Jan 27, 2026 12:57 IST

    సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకుంటున్నాం: మంత్రి లోకేశ్

    • వైసీపీ ఎన్ని కేసులు పెట్టినా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చాం: మంత్రి లోకేశ్

    • గుంతలు పూడ్చేందుకు రూ.2వేల కోట్లు ఖర్చు అయ్యాయి: మంత్రి లోకేశ్

    • సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉండాలి: మంత్రి లోకేశ్

    • పార్టీలో యువతకు అవకాశాలు ఇస్తాం: మంత్రి లోకేశ్


  • Jan 27, 2026 12:57 IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

    • ఇవాళ సాయంత్రం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్న SEC.

    • ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక.

    • ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ పూర్తి.

    • 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు.


  • Jan 27, 2026 12:53 IST

    ట్రేడ్‌ను మరింత పెంచాల్సి ఉంది: కెనడా మంత్రి

    • భారత్‌తో ఎనర్జీ ట్రేడ్‌ను మరింత పెంచాల్సి ఉంది: కెనడా మంత్రి

    • ఇంధన రంగంలో కెనడా సూపర్ పవర్ కావాలంటే..

    • భారత్‌తో వ్యాపారం అవసరం: కెనడా మంత్రి టిమ్ హడ్గ్‌సన్


  • Jan 27, 2026 12:52 IST

    నల్లగొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

    • నేను విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూల్స్ మూసివేయిస్తా: కోమటిరెడ్డి

    • అధిక ఫీజులతో దోచుకుంటున్నారు.. అంతా దొంగలే: కోమటిరెడ్డి

    • సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తీరుతాయి: మంత్రి కోమటిరెడ్డి

    • ఉత్సాహం ఉంటే మళ్లీ పోటీ చేస్తా.. లేకుంటే స్కూల్‌లో విద్యార్థులను చదివిస్తా: కోమటిరెడ్డి

    • కేంద్రం నుంచి నిధులు తెచ్చి నల్లగొండ రూపురేఖలు మారుస్తా: కోమటిరెడ్డి

    • నేను మోదీని కలిస్తే.. రూ.వెయ్యి, రూ.2 వేల కోట్ల నిధులైనా ఇస్తారు: కోమటిరెడ్డి

    • నిధుల మంజూరులో కొడంగల్‌తో పోటీ పడుతూ..

    • నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా మారుస్తా: మంత్రి కోమటిరెడ్డి


  • Jan 27, 2026 12:44 IST

    తెలంగాణ హైకోర్టుకు ‘మన శంకరవరప్రసాద్’ చిత్ర నిర్మాత

    • టికెట్ ధరల అంశంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన నిర్మాత

    • టికెట్ ధరలకు సంబంధించి చిత్రం విడుదలకు 90రోజుల ముందే..

    • హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల సింగిల్ బెంచ్ ఉత్తర్వులు

    • సింగిల్ బెంచ్ దగ్గర పిటిషన్ విచారణలో ఉన్నందున..

    • అక్కడే తెల్చుకోవాలని పిటిషనర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశం


  • Jan 27, 2026 12:37 IST

    సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: డిప్యూటీ సీఎం భట్టి

    • అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ వేశాం: డిప్యూటీ సీఎం భట్టి

    • సింగరేణి ఉద్యోగుల పేరు మార్పు సమస్యకు త్వరలో పరిష్కారం: భట్టి

    • సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు కమిటీ: భట్టి

    • సింగరేణి ఉద్యోగులకు రూ.1.25కోట్ల ప్రమాద బీమా: భట్టి

    • 30వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.40లక్షల ఉచిత ప్రమాద బీమా

    • ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో 2,539పోస్టులు భర్తీ చేశాం: భట్టి

    • 2024-25లో సింగరేణి చరిత్రలోనే అత్యధిక లాభాలు: భట్టి విక్రమార్క

    • రూ.6,394కోట్ల లాభాలు సాధించిన సింగరేణి: డిప్యూటీ సీఎం భట్టి


  • Jan 27, 2026 12:23 IST

    ప్లాట్ల కేటాయింపు

    • రాజధాని అమరావతి రైతులకు ఈనెల 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు

    • ఈనెల 28కి బదులు 29న లాటరీ నిర్వహించాలని CRDA నిర్ణయం

    • సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్లు

    • నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్న అధికారులు


  • Jan 27, 2026 12:22 IST

    ఢిల్లీ: కిరణ్‌ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం

    • హాజరైన ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు

    • బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కోరిన కేంద్రం

    • ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం


  • Jan 27, 2026 11:32 IST

    ఆ విషయంలో జగ్గారెడ్డి ఫైర్..

    • సంగారెడ్డి: రిజిస్ట్రార్ ఆఫీస్‌ను మరో చోటికి తరలిస్తే ఊరుకోం: జగ్గారెడ్డి

    • ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుతో పటాన్‌చెరులోని కర్దనూర్‌కు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా: జగ్గారెడ్డి

    • మంత్రులు దామోదర, పొంగులేటితో మాట్లాడేవరకు..

    • అధికారులు ఎలాంటి తరలింపు ఆలోచన చేయొద్దు: జగ్గారెడ్డి

    పూర్తి కథనం


  • Jan 27, 2026 11:30 IST

    శిక్షణ తరగతులు ప్రారంభం

    • అమరావతి: పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు ప్రారంభం

    • ప్రారంభించిన నారా లోకేష్‌, పల్లా శ్రీనివాసరావు

    • టీడీపీ సీనియర్ నేతలతో పార్లమెంట్ కమిటీలకు శిక్షణ

    • సాయంత్రం ముగింపు సమావేశంలో కమిటీలకు చంద్రబాబు దిశానిర్దేశం

    పూర్తి కథనం


  • Jan 27, 2026 11:29 IST

    ఆ ప్రశంసాపత్రంపై విమర్శలు

    • కృష్ణా: రిపబ్లిక్ డే వేడుకల్లో సీఐ కనకారావు ప్రశంసాపత్రంపై విమర్శలు

    • గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో..

    • వైసీపీ నేతలను వదిలి.. టీడీపీ నాయకులపై కేసు పెట్టిన సీఐ కనకారావు

    • కనకారావుకు ప్రశంసాపత్రం ఇవ్వడంపై వెల్లువెత్తున్న విమర్శలు


  • Jan 27, 2026 11:28 IST

    చిరంజీవి వ్యాఖ్యలను ఖండించిన సింగర్ చిన్మయి

    • సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి

    • క్యాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య: చిన్మయి

    • కమిట్‌మెంట్‌కు నో చెబితే రోల్స్ ఇవ్వరు: చిన్మయి

    • చిరంజీవి జనరేషన్‌లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు: చిన్మయి

    • ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు: సింగర్ చిన్మయి

    పూర్తి కథనం


  • Jan 27, 2026 11:23 IST

    ఇండియా ఎనర్జీ వీక్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

    • 2029 నాటికి చమురు, గ్యాస్‌ రంగంలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి లక్ష్యం: మోదీ

    • చమురు శుద్ధి సామర్థ్యం 260 మిలియన్‌ టన్నుల నుంచి 300 టన్నులకు పెంచుతాం: మోదీ

    • భారత్ ను ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా తయారు చేస్తాం: మోదీ

    • భారత్‌-ఈయూ వాణిజ్య ఒప్పందంతో తయారీ రంగలో వృద్ధి సాధిస్తాం: ప్రధాని మోదీ


  • Jan 27, 2026 11:20 IST

    ప్రాక్టీస్ మెుదలెట్టిన ధోనీ..

    • రాంచీలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ మెుదలుపెట్టిన ధోనీ

    • ఐపీఎల్ 2026 కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్న మాజీ కెప్టెన్ ధోనీ

    • మార్చి 26 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం.. రెండు నెలల ముందుగానే ప్రాక్టీస్


  • Jan 27, 2026 11:16 IST

    తమిళనాడు: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

    • జననాయగన్ సినిమా వివాదంలో సింగిల్ బెంచ్ తీర్పు రద్దు

    • U/A సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు

    • సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన సెన్సార్ బోర్డు

    • సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు


  • Jan 27, 2026 10:47 IST

    నేడే అఖిలపక్ష భేటీ..

    • ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

    • మంగళవారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో అఖిలపక్ష భేటీ

    • పార్లమెంట్‌ హౌస్‌ అనెక్స్‌‌లోని ప్రధాన కమిటీ హాల్‌లో సమావేశం

    • సమావేశానికి హాజరుకానున్న లోక్‌సభ, రాజ్యసభల్లోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు

    పూర్తి కథనం


  • Jan 27, 2026 10:42 IST

    చిన్నారి మృతి.. కేసు నమోదు..

    • హైదరాబాద్: కూకట్‌పల్లి చైనా మాంజా ఘటనలో కేసు నమోదు

    • BNS 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

    • చైనా మాంజా తగిలి ఐదేళ్ల నిష్విక నిన్న మృతి

    • ఎవరి మాంజా అనేది గుర్తించడం కష్టమన్న పోలీసులు

    • గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు

    పూర్తి కథనం


  • Jan 27, 2026 10:08 IST

    మెక్సికోలో గ్యాంగ్‌ వార్

    • ఫుట్‌బాల్ మ్యాచ్‌లో డ్రగ్స్ ముఠాల మధ్య కాల్పులు

    • 11 మంది మృతి, 12 మందికి గాయాలు

    • లోకల్ కార్టెల్, న్యూ జెన్ కార్టెల్ మధ్య గొడవ


  • Jan 27, 2026 10:08 IST

    యువగళానికి మూడేళ్లు..

    • అమరావతి: లోకేశ్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తి

    • మంత్రి లోకేశ్ కు అభినందనలు తెలిపిన టీడీపీ నేతలు

    • 11 ఉమ్మడి జిల్లాల్లో 226 రోజులపాటు..

    • 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నారా లోకేశ్

    పూర్తి కథనం


  • Jan 27, 2026 10:07 IST

    ఉత్తర భారతంలో హిమపాతం, వర్షాలు

    • జమ్మూకశ్మీర్, లేహ్, లడఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్,..

    • శ్రీనగర్, మనాలి, సిమ్లాలో భారీగా కురుస్తున్న మంచు

    • మంచు కారణంగా జమ్ము-శ్రీనగర్ హైవే మూసివేత

    • హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్‌లో వర్షాలు

    • ఢిల్లీకి భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్


  • Jan 27, 2026 10:06 IST

    రికార్డులు సృష్టిస్తోన్న బంగారం ధరలు

    • అంతర్జాతీయ మార్కెట్‌లో ఆల్‌టైమ్ హైకి బంగారం ధరలు

    • 5వేల డాలర్ల మార్క్ దాటిన ట్రాయ్ ఔన్సు బంగారం ధర

    • రూ.లక్షా 61 వేలు దాటిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,61,950

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,450

    • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,87,000


  • Jan 27, 2026 09:31 IST

    హైదరాబాద్: అత్తాపూర్ సాయినగర్‌లో వ్యక్తి ఆత్మహత్య

    • ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆదిత్య రెడ్డి

    • పైన గదిలో పడుకుంటానని వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం

    • తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు

    పూర్తి కథనం


  • Jan 27, 2026 09:06 IST

    కర్ణాటక: విజయపుర జిల్లాలో రిపబ్లిక్ డే రోజే భారీ దోపిడీ

    • సోమవారం సాయంత్రం 4 గంటలకు గోల్డ్ షాప్ లూటీ

    • మంకీ క్యాప్, హెల్మెట్ ధరించి బంగారం షాపులోకి వెళ్లిన దొంగలు

    • తుపాకీతో షాపు యజమానిని, కస్టమర్లను బెదిరించిన కేటుగాళ్లు

    • బంగారం నగలు తీసుకుని అక్కడ్నుంచి పరారైన దొంగలు


  • Jan 27, 2026 08:12 IST

    ఢిల్లీ: ఉ.11 గంటలకు అఖిలపక్ష సమావేశం

    • రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

    • హాజరుకానున్న వివిధ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు


  • Jan 27, 2026 08:12 IST

    మున్సిపల్ పోరుకు షెడ్యూల్..!

    • నేడు తెలంగాణలో మున్సిపల్ పోరుకు షెడ్యూల్

    • ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సీఎస్‌తో ఈసీ సమావేశం

    • సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం


  • Jan 27, 2026 08:08 IST

    రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు

    • పెరగడమే తప్ప తగ్గడం అనేది లేకుండా దూసుకెళ్తున్న రేట్లు

    • హైదరాబాద్‌లో మంగళవారం ఉదయానికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,960

    • అలాగే రూ.1,48,460కి చేరిన 22 క్యారెట్ల పసిడి రేటు

    • హైదరాబాద్‌లో రూ.3,75,100కి ఎగబాకిన కిలో వెండి ధర

    పూర్తి కథనం


  • Jan 27, 2026 07:58 IST

    టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు, లోకేష్‌

    • అమరావతి: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌

    • సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్టానం దృష్టి

    • పార్టీ బలోపేతంపై నూతన కమిటీలకు సీనియర్ నేతలు దిశానిర్దేశం

    • 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,..

    • కమిటీ సభ్యులందరూ హాజరుకావాలని ఆదేశాలు

    • సాయంత్రం వరకు టీడీపీ ఆఫీస్‌లోనే చంద్రబాబు, లోకేష్


  • Jan 27, 2026 07:57 IST

    అమెరికాలో మంచు తుఫాన్

    • అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో మంచు తుఫాన్

    • విద్యుత్ తీగలు తెగి 7.5లక్షలకు పైగా నివాసాలకు కరెంట్ నిలిపివేత

    • వివిధ కారణాలతో 25 మంది మృతి



  • Source link

    Spread the love