ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్ | AP Telangana National International news ABN Andhrajyothy Live Updates of 18th February 2026 Suri



  • Feb 18, 2026 21:16 IST

    ఢిల్లీ బాటపట్టిన తెలంగాణ మంత్రులు

    • ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

    • ఢిల్లీ బయల్దేరిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు

    • వాకిటి, వివేక్‌, అడ్లూరి, సీతక్క, పొన్నం పొంగులేటి, తుమ్మల

    • రేపు ఉదయం ఢిల్లీ బయల్దేరనున్న మంత్రి కోమటిరెడ్డి

    • ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్న సీఎం, మంత్రులు


  • Feb 18, 2026 21:15 IST

    కాంగ్రెస్‌ అగ్రనేతలకు హరీష్‌రావు బహిరంగ లేఖ

    • ఖర్గే, రాహుల్‌, ప్రియాంక సహా పలువురు అగ్రనేతలకు లేఖ.

    • తెలంగాణ కేబినెట్‌ను ఢిల్లీకి పిలిపించి మీరు సమీక్షలు చేయడమేంటి?

    • ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోంది.

    • మీ ఢిల్లీ దర్బార్‌లో మోకరిల్లడం.. మా నేల ఆత్మగౌరవాన్ని భంగపరచడమే.


  • Feb 18, 2026 21:10 IST

    బాల్క సుమన్‌ అరెస్టును ఖండించిన కేటీఆర్‌, హరీష్‌రావు


  • Feb 18, 2026 21:06 IST

    టీ20 వరల్డ్‌ కప్‌: నెదర్లాండ్స్‌ టార్గెట్‌ 194 పరుగులు

    • భారత్‌ స్కోర్‌- 193/6

    • శివం దూబె 66, సూర్యకుమార్ 34, తిలక్‌ వర్మ 31 పరుగులు

    • హార్దిక్ పాండ్య 30, ఇషాన్‌ కిషన్‌ 18 పరుగులు


  • Feb 18, 2026 20:00 IST

    పౌర సమస్యల పరిష్కారానికి GHMC ‘మైక్యూర్‌’ యాప్‌ ప్రారంభం

    • అన్ని పౌర ఫిర్యాదుల కోసం ఏకీకృత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌

    • శానిటేషన్‌ నుంచి టౌన్‌ప్లానింగ్‌ వరకు అందుబాటులో సేవలు

    • రియల్‌టైమ్‌ ట్రాకింగ్‌తో ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం

    • పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనకు కొత్త అడుగు


  • Feb 18, 2026 19:36 IST

    చంచల్‌గూడ జైలు నుండి విడుదలైన ఐ బొమ్మ రవి

    • హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఐబొమ్మ రవి విడుదల

    • ఐబొమ్మ రవిపై ఐదు సైబర్ క్రైమ్ కేసులు

    • సుమారు 90 రోజులపాటు జైలులో ఉన్న రవి


  • Feb 18, 2026 19:34 IST

    మంచిర్యాల: బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్‌

    • మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో రిమాండ్‌

    • ఆదిలాబాద్‌ జైలుకు బాల్క సుమన్‌ తరలింపు

    • రిమాండ్‌ విధించిన మంచిర్యాల ప్రిన్సిపల్‌ జడ్జి


  • Feb 18, 2026 19:27 IST

    ఢిల్లీ: AI సమ్మిట్‌ అతిథులకు ప్రధాని మోదీ విందు

    • ప్రధాని మోదీ విందుకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌

    • విందుకు హాజరైన వివిధ దేశాధినేతలు, పారిశ్రామికవేత్తలు

    • AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌ సందర్భంగా మోదీ విందు ఏర్పాటు


  • Feb 18, 2026 18:30 IST

    హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై రివ్యూ

    • అధికారులతో మంత్రులు పొన్నం, అజారుద్దీన్‌ సమీక్ష

    • హైదరాబాద్‌లో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు: పొన్నం

    • L1 కింద 4,800 మందికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు: పొన్నం

    • L2 కింద హైదరాబాద్‌లో 4.22 లక్షలమంది దరఖాస్తులు: పొన్నం

    • పెండింగ్‌లో ఉన్న 2BHK ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలు

    • నగరంలో G+5 నుంచి G+10 వరకు ఇళ్ల నిర్మాణానికి ప్లాన్: పొన్నం


  • Feb 18, 2026 18:09 IST

    ఢిల్లీ: AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌ ఎక్స్‌పోలో చైనా తయారీ రోబో డాగ్‌ ప్రదర్శన వివాదం

    • స్పందించిన గల్గొటియాస్‌ వర్సిటీ

    • క్షమాపణలు చెప్పిన వర్సిటీ ప్రతినిథులు


  • Feb 18, 2026 18:07 IST

    బాల్క సుమన్‌ అరెస్టుకు నిరసనగా గురువారం మంచిర్యాల జిల్లా బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు


  • Feb 18, 2026 18:04 IST

    ఢిల్లీ: రేపు ఉ.9.40 గంటలకు AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌ ప్రారంభం

    • ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌ను ప్రారభించనున్న ప్రధాని మోదీ

    • ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌


  • Feb 18, 2026 18:03 IST

    నేను ఏనాడూ తప్పు చేయలేదు: అంబటి రాంబాబు

    • నాపై పెట్టినవన్నీ బెయిలబుల్‌ కేసులే

    • అక్రమ కేసుల్లో 18 రోజులు జైలులో పెట్టారు

    • నాపై కేసులు పెడితే భయపడతానని అనుకున్నారు

    • ఎన్ని కేసులు పెట్టినా భయపడేదిలేదు

    • రాజమండ్రి జైలు నాలో మరింత పట్టుదల పెంచింది

    • చంద్రబాబు అరాచక పాలనను కూల్చేవరకు పోరాడతాం

    • అన్నింటికీ దేవుడే సమాధానం చెబుతాడు


  • Feb 18, 2026 18:02 IST

    నేను బయటరాకుండా అడ్డుకోవాలని చూశారు: అంబటి

    • ఎన్ని రోజులైనా జైలులోనే ఉందామనే వెళ్లా

    • బాధితులను లోపల వేశారు.. క్రిమినల్స్‌ను వదిలేశారు

    • నా కుటుంబ సభ్యులను వేధించారు

    • నా ఇంటిపై దాడి చేశారు.. నన్ను చంపాలని చూశారు


  • Feb 18, 2026 18:01 IST

    ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక తప్పదు: పాడి కౌశిక్‌రెడ్డి

    • రాజ్యాంగాన్ని కాపాడాలని స్పీకర్‌ను కోరా

    • అడిగిన ప్రశ్నలే మళ్లీమళ్లీ అడిగారు

    • నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు ఇచ్చా

    • దానంపై అనర్హత వేటు వేయాలని కోరా


  • Feb 18, 2026 18:00 IST

    కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లపై ముగిసిన స్పీకర్‌ విచారణ

    • నేడు దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌పై ముగిసిన విచారణ

    • రేపు కడియం శ్రీహరి పిటిషన్‌పై స్పీకర్‌ విచారణ


  • Feb 18, 2026 18:00 IST

    మున్సిపల్‌ ఎన్నికల్లో కోవర్టుల వల్లే కొన్నిచోట్ల ఓడిపోయాం: ఎంపీ చామల

    • గెలవాల్సిన స్థానాల్లోనూ ఓడిపోయాం.

    • కోవర్టులపై అధిష్టానం దృష్టిపెట్టాలి.

    • తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరగాలి.

    • గెలిచేవారికే టికెట్లు ఇవ్వాల్సింది.

    • అభ్యర్థుల ఎంపికలో లోపాలున్నాయి.


  • Feb 18, 2026 17:59 IST

    బాల్క సుమన్‌పై పెట్టిన కేసులు ఇవే..

    • BNS 189(3)- చట్టవిరుద్ధంగా గుమికూడడం

    • 191(2)- అల్లర్లు

    • 191(3)- మారణాయుధాలతో అల్లర్లు

    • 118(1)- ఆయుధాలతో గాయపరచడం

    • 324(5)- ఉద్దేశపూర్వకంగా ప్రజా ఆస్తులు ధ్వంసం చేయడం

    • 223 r/w 190- ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేయడం సెక్షన్ల కింద కేసులు


  • Feb 18, 2026 17:58 IST

    మంచిర్యాల: క్యాతనపల్లిలో బాల్క సుమన్‌ అరెస్ట్‌

    • మంత్రి వివేక్‌ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్ట్‌

    • తీవ్ర ఉద్రిక్తతల మధ్య బాల్క సుమన్‌ అరెస్ట్‌

    • రామకృష్ణాపురం పీఎస్‌లో 6 సెక్షన్ల కింద కేసులు


  • Feb 18, 2026 17:29 IST

    ప.గో: మొగల్తూరు కొండావారిపాలెంలో తప్పిన పెను ప్రమాదం

    • ఓ ఇంట్లో అకస్మాత్తుగా పేలిన ఫ్రిడ్జ్

    • ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలడంతో భయంతో పరుగులు తీసిన కుటుంబ సభ్యులు

    • ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు


  • Feb 18, 2026 16:56 IST

    టీ20 ప్రపంచ కప్‌: ఫర్హాన్ సూపర్ సెంచరీ

    • నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసిన పాక్

    • 57 బంతుల్లో శతకం పూర్తి చేసిన పాక్ బ్యాటర్ ఫర్హాన్(100*)

    • ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తేనే సూపర్ 8కు అవకాశం

    • నమీబియా టార్గెట్ 200

    పూర్తికథనం


  • Feb 18, 2026 16:54 IST

    రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల

    పూర్తికథనం


  • Feb 18, 2026 16:31 IST

    మంచిర్యాల : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు

    • అడ్డుకున్న కార్యకర్తలపై పోలీసుల లాఠి ఛార్జ్

    • ఆందోళనకు దిగిన కార్యకర్తలు

    పూర్తికథనం


  • Feb 18, 2026 16:31 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలో నేడు SIPB భేటీ

    • వివిధ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులపై భేటీలో చర్చ

    • మొత్తం 37,899 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం

    • పెట్టుబడులతో 56,692 మందికి ఉపాధి అవకాశాలు


  • Feb 18, 2026 16:16 IST

    ఢిల్లీ: అసోంలో ఎన్నికల సన్నద్ధతపై సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ సమీక్ష

    • అభ్యర్థుల కలర్ ఫోటోలు ఈవీఎంలలో ప్రదర్శించాలని నిర్ణయం

    • అభ్యర్థుల పేర్లు, సీరియల్ నంబర్లు కనిపించేలా ఏర్పాట్లు

    • ప్రతి పోలింగ్ కేంద్రానికి 1,200 మంది ఓటర్ల పరిమితి


  • Feb 18, 2026 16:13 IST

    బాల్క సుమన్‌ ఆరోపణలు అవాస్తవం: మంత్రి వివేక్‌

    • బాల్క సుమన్‌ డ్రామా క్రియేట్‌ చేశారు.

    • క్యాతనపల్లి పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు.

    • దురుద్దేశంతోనే బీఆర్ఎస్ శ్రేణులు గొడవ చేస్తున్నారు.

    • గత బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారో ప్రజలకు తెలుసు.


  • Feb 18, 2026 16:12 IST

    మంచిర్యాల: క్యాతనపల్లిలో ఉద్రిక్తత

    • బాల్క సుమన్‌ నివాసం దగ్గర ఉద్రిక్తత.

    • బాల్క సుమన్‌ అరెస్టుకు వెళ్లిన పోలీసులు.

    • పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.

    • పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం.


  • Feb 18, 2026 15:38 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 283 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 94 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ


  • Feb 18, 2026 15:18 IST

    జీవన్‌రెడ్డి అంశంపై స్పందించిన టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌

    • సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయించాం.

    • కౌన్సిలర్ల అభిప్రాయం మేరకే చైర్మన్‌ ఎన్నిక.

    • ఈ అంశాన్ని జీవన్‌రెడ్డి అర్థంచేసుకోవాలి.

    • రాజగోపాల్‌రెడ్డి అంశం పరిశీలనలో ఉంది.


  • Feb 18, 2026 15:18 IST

    మంచిర్యాల: క్యాతనపల్లిలో మాకు స్పష్టమైన మెజార్టీ ఉంది: బాల్క సుమన్

    • మా కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు.

    • కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేదు.

    • మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది.

    • పోలీసులు మాపై లాఠీచార్జ్‌ చేశారు.

    • మా కాన్వాయ్‌పైనే దాడి జరిగింది.

    • నన్ను జైలుకు పంపాలనుకుంటే పంపండి.


  • Feb 18, 2026 15:16 IST

    టీ20 వరల్డ్‌ కప్‌: రాత్రి 7 గంటలకు భారత్‌ Vs నెదర్లాండ్స్‌ మ్యాచ్‌


  • Feb 18, 2026 15:16 IST

    టీ20 వరల్డ్‌ కప్‌: యూఏఈపై 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం

    • స్కోర్లు: UAE 122/6, సౌతాఫ్రికా 123/4

    • 13.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా


  • Feb 18, 2026 14:35 IST

    విశాఖలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంట్నేషనల్ ఫ్లీట్ రివ్యూ


  • Feb 18, 2026 14:34 IST

    హైదరాబాద్: వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణం

    • ఓ మహిళను దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి.

    • మృతురాలితో తనకు గతంలోనే వివాహం జరిగిందని.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుందని ఆరోపించిన మహేష్.

    • నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.


  • Feb 18, 2026 14:28 IST

    నిర్మల్: ఖానాపూర్‌ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్టు బీజేపీ ప్రకటన


  • Feb 18, 2026 14:27 IST

    యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

    • స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం పూజలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టిన అర్చకులు.

    • తొలిరోజు ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్ హనుమంతరావు.

    • ఈ నెల 18 నుండి 28 వరకు 11 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలు.

    • ఈ నెల 24న ఎదుర్కోలు, 25న కల్యాణం, 26న రథోత్సవం.

    • 28న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకం పూజలతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి.

    • బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 28 వరకు ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు.


  • Feb 18, 2026 14:24 IST

    మంచిర్యాల: చెన్నూరులో బీఆర్ఎస్ నేత మూల రాజిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • రామగుండం సీపీ కార్యాలయానికి రాజిరెడ్డి తరలింపు.

    • క్యాతనపల్లిలో జరిగిన గొడవల్లో ఏ2గా రాజిరెడ్డిపై కేసు నమోదు.


  • Feb 18, 2026 14:23 IST

    హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లో మహిళపై హత్యాయత్నం

    • ఆస్తి వివాదంతో మరదలు సరితపై కత్తితో దాడి చేసిన బావ.

    • బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.


  • Feb 18, 2026 13:56 IST

    సీఎం రేవంత్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు: ఎమ్మెల్యే వివేకానంద

    • మూసీ పేరిట త్రీడీ సినిమా చూపించడం తప్ప.. చేసిందేమీ లేదు: ఎమ్మెల్యే వివేకానంద

    • వీధి దీపాలు పెట్టనివారు.. విజన్-2047 అంటున్నారు: వివేకానంద

    • ఎన్నికల కోసమే సీఎం కొత్త డ్రామాలకు తెరలేపారు: వివేకానంద

    • మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యకాండ కొనసాగించారు: ఎమ్మెల్యే వివేకానంద


  • Feb 18, 2026 13:33 IST

    తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు

    • హైదరాబాద్‌లోని నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం..

    • అనంతపురం కోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్

    • ఆయా కోర్టుల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ముమ్మర తనిఖీలు

    పూర్తి కథనం


  • Feb 18, 2026 13:18 IST

    ఢిల్లీ: AI ఇంపాక్ట్ సమ్మిట్ గడువు పొడిగింపు

    • ప్రజల విజ్ఞప్తులతో సమ్మిట్ గడువు ఒకరోజు పొడిగింపు

    • ఫిబ్రవరి 21 వరకూ కొనసాగనున్న AI ఇంపాక్ట్ సదస్సు


  • Feb 18, 2026 13:17 IST

    విశాఖ: IFR కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • దేశ తీరప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర: రాష్ట్రపతి

    • సముద్ర వాణిజ్యంలో కూడా నేవీ సుస్థిరత తీసుకొచ్చింది: రాష్ట్రపతి ముర్ము


  • Feb 18, 2026 13:16 IST

    AI ఇంపాక్ట్ సదస్సుతో సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

    • విదేశీ ప్రతినిధుల రాకతో ఢిల్లీలోని పలు కీలక రోడ్లు మూసివేత

    • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, ఉద్యోగులు

    • ఈనెల 21 వరకు కొనసాగనున్న AI ఇంపాక్ట్ సదస్సు


  • Feb 18, 2026 11:58 IST

    పవన్ కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం

    • విశాఖ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం

    • ఇవాళ ఉదయం సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా ప్రమాదం

    • త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒకదానికి మరొకటి ఢీకొన్న పవన్ కాన్వాయ్‌ వాహనాలు

    పూర్తి కథనం


  • Feb 18, 2026 11:46 IST

    ఢిల్లీ: AI సదస్సు అధ్వానంగా నిర్వహిస్తున్నారు: ఎక్స్‌లో ఎంపీ రాహుల్ గాంధీ

    • భారత ప్రతిభను ప్రపంచానికి చూపకుండా పీఆర్ స్టంట్ చేస్తున్నారు: రాహుల్

    • భారతీయుల డేటాను సేల్‌కు పెట్టి చైనా ఉత్పత్తులను షో చేస్తున్నారు: రాహుల్

    • చైనా రోబోలను భారత్‌విగా చూపి అవమానానికి గురిచేశారు: రాహుల్


  • Feb 18, 2026 11:44 IST

    ఢిల్లీ: AI ఇంపాక్ట్ సమ్మిట్

    • గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో ప్రధాని మోదీ భేటీ

    • రేపు ఉ.9:30కు AI సమ్మిట్‌లో ప్రసంగించనున్న మోదీ

    • రేపు, ఎల్లుండి AI సమ్మిట్‌లో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్

    • ఎల్లుండి AI సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు


  • Feb 18, 2026 10:56 IST

    రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    • తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు

    • ఏప్రిల్ 9న ముగియనున్న కేఆర్ సురేష్‌రెడ్డి, అభిషేక్ సింఘ్వీ పదవీకాలం

    • ఈనెల 26న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు మార్చి 5 గడువు

    • 6న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు మార్చి 9 వరకూ గడువు

    • మార్చి 16న పోలింగ్, అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు

    పూర్తి కథనం


  • Feb 18, 2026 10:55 IST

    రెండు వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఏపీ మండలి చైర్మన్

    • వాయిదా తీర్మానాల తిరస్కరణతో సభలో గందరగోళం

    • ఒకసారి తిరస్కరించిన వాయిదా తీర్మానాన్ని మరోసారి..

    • ఇచ్చేందుకు వీలులేదని చెప్పిన మండలి చైర్మన్

    • రెండు తీర్మానాలను తిరస్కరిస్తున్నామని చెప్పిన చైర్మన్

    • సభను వాయిదా వేసిన చైర్మన్


  • Feb 18, 2026 10:17 IST

    విశాఖ: IFR కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి

    • కాసేపట్లో INS సుమేధ నౌకపై ప్రయాణించనున్న రాష్ట్రపతి

    • విశాఖ తీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష


  • Feb 18, 2026 10:16 IST

    అమరావతి: అయోమయంలో వైసీపీ సభ్యులు

    • మండలిలో రెండు వాయిదా తీర్మానాలు ఇచ్చిన వైసీపీ సభ్యులు

    • వాయిదా తీర్మానాలు ఇవ్వడంపై శాసనమండలిలో చర్చ

    • తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం

    • ఇందాపూర్ డెయిరీ అంశంపై మరో వాయిదా తీర్మానం ఇచ్చిన వైసీపీ

    • ఒకే పార్టీ నుంచి రెండు వాయిదా తీర్మానాలు ఇవ్వడంపై కౌన్సిల్ సభ్యుల్లో చర్చ


  • Feb 18, 2026 09:48 IST

    అన్నమయ్య: కనసానివారిపల్లి చెరువులో కులవర్ధన్ డెడ్‌బాడీ

    • మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడు కులవర్ధన్ డెడ్‌బాడీగా నిర్ధారణ

    • మృతదేహం మదనపల్లికి తరలింపు

    • కులవర్ధన్ ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు

    • బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కులవర్ధన్

    • కడప జిల్లా రాగిమానిదిన్నెపల్లెలో బాలికకు అంత్యక్రియులు

    పూర్తి కథనం


  • Feb 18, 2026 08:52 IST

    మృతదేహం కలకలం

    • అన్నమయ్య: ముదివేడు కనసానిపల్లి చెరువులో మృతదేహం కలకలం

    • మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడిగా అనుమానం

    • మృతదేహాన్ని మదనపల్లికి తరలిస్తున్న పోలీసులు


  • Feb 18, 2026 08:46 IST

    5వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    • అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

    • నేడు పంచాయతీరాజ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం పవన్‌

    • అలోపతి ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి సత్యకుమార్

    • దేవదాయ శాఖ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

    • వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి ఆనం


  • Feb 18, 2026 08:31 IST

    డౌన్‌ట్రెండ్‌ కొనసాగిస్తోన్న పుత్తడి

    • 2 వారాలుగా క్రమక్రమంగా దిగివస్తోన్న బంగారం ధర

    • నిన్నటితో పోలిస్తే నేడు గ్రాముకు రూ.10 మేర తగ్గుదల

    • హైదరాబాద్‌: 24 క్యారెట్ల బంగారం – రూ.1,54,190, 22 క్యారెట్ల గోల్డ్ – రూ.1,41,134

    • విజయవాడ: 24 క్యారెట్ల బంగారం – రూ.1,54,190, 22 క్యారెట్ల గోల్డ్ – రూ.1,41,340

    • చెన్నై: 24 క్యారెట్ల బంగారం – రూ.1,56,210, 22 క్యారెట్ల గోల్డ్ – రూ.1,43,190

    పూర్తి కథనం


  • Feb 18, 2026 08:28 IST

    మంచిర్యాల: బాల్క సుమన్ ఇంటి దగ్గర పోలీసుల మోహరింపు

    • అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో భారీగా చేరుకుంటున్న BRS శ్రేణులు

    • మంత్రి వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా నినాదాలు

    • నిన్నటి ఘర్షణలు, బంద్ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు

    పూర్తి కథనం


  • Feb 18, 2026 08:00 IST

    చిత్తూరు: మదనపల్లెలో బాలిక హత్య కేసు అప్డేట్

    • కడప జిల్లా రాగిమానిదిన్నెపల్లెకు బాలిక మృతదేహం

    • నేడు రాగిమానిదిన్నెపల్లెలో అంత్యక్రియలు


  • Feb 18, 2026 07:59 IST

    మంచిర్యాల: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు

    • క్యాతనపల్లిలో పోలీసుల విధులకు ఆటంకం, రాళ్ల దాడి చేశారని..

    • SHO గంగారాం ఫిర్యాదుతో సుమన్‌ సహా పలువురు BRS నేతలపై కేసులు

    • పోలీసుల అదుపులో చెన్నూరు BRS మాజీ కౌన్సిలర్‌ అనిల్‌

    • మిగిలిన నాయకులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు


  • Feb 18, 2026 07:58 IST

    నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రుల పర్యటన

    • నల్లగొండ, మేళ్లచెరువులో పర్యటించనున్న మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్

    • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు


  • Feb 18, 2026 07:47 IST

    నేడు భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్

    • లీగ్‌ను గెలుపుతో ముగించాలనే పట్టుదలతో భారత్

    • నెదర్లాండ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కుల్దీప్‌కు దక్కని చోటు

    • కుల్దీప్ స్థానంలో అర్షదీప్ సింగ్

    • జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం

    • బుమ్రా స్థానంలో సిరాజ్


  • Feb 18, 2026 07:45 IST

    శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం..

    • ఎంపీల పెన్షన్లను రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం

    • దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించిన పార్లమెంట్‌

    • 225మంది సభ్యులున్న సభలో 154మంది అనుకూలంగా ఓటు

    • ఇద్దరు వ్యతిరేకించగా.. మిగిలిన సభ్యులు ఓటింగ్‌కు దూరం

    పూర్తి కథనం


  • Feb 18, 2026 07:22 IST

    నేడు విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

    • ఉ.9:30 గంటలకు యుద్ధ నౌకలను పరిశీలించనున్న రాష్ట్రపతి

    • పాల్గొననున్న గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్


  • Feb 18, 2026 07:22 IST

    క్యాతనపల్లి బంద్‌కు పిలుపు

    • మంచిర్యాల: క్యాతనపల్లి బంద్‌కు బీఆర్ఎస్-సీపీఐ కూటమి పిలుపు

    • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తీరుకు నిరసనగా బంద్‌కు పిలుపు


  • Feb 18, 2026 07:21 IST

    చివరి దశకు చేరిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు

    • నేడు ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసుపై విచారణ

    • ఎమ్మెల్యే దానంపై రెండు అనర్హత పిటిషన్లు

    • పిటిషన్ దాఖలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి

    • రెండు పిటిషన్లపై నేడు స్పీకర్ విచారణ

    • పిటిషనర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న దానం అడ్వొకేట్లు

    • రేపు కడియం శ్రీహరి కేసు విచారించనున్న స్పీకర్

    • ఇప్పటికే 8మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి

    • ఎనిమిది మందికి క్లీన్‌చిట్‌ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్


  • Feb 18, 2026 07:19 IST

    ముగియనున్న బ్రహ్మోత్సవాలు

    • శ్రీశైలంలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

    • అశ్వ వాహనంపై పూజలు అందుకోనున్న ఆది దంపతులు


  • Feb 18, 2026 07:14 IST

    బీజేపీ ధర్నా..

    • నేడు హైదరాబాద్ కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ ధర్నా

    • రూ.4 వేల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్‌



  • Source link

    Spread the love