Feb 21, 2026 21:31 IST
నిజామాబాద్: రేపు బాన్సువాడ, కామారెడ్డిలో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు పర్యటన
Feb 21, 2026 21:29 IST
టీ20 వరల్డ్ కప్: సూపర్-8లో తొలి మ్యాచ్ రద్దు
న్యూజిలాండ్ – పాకిస్థాన్ మ్యాచ్ రద్దు
కొలంబోలో భారీ వర్షంతో మ్యాచ్ రద్దు
ఒక్క బాల్ కూడా పడకుండా మ్యాచ్ రద్దు
న్యూజిలాండ్, పాకిస్థాన్‌కు చెరో పాయింట్
Feb 21, 2026 20:53 IST
ట్రంప్ టారిఫ్‌ల రద్దుపై భారత్ స్పందన
యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు, ట్రంప్ స్పందనను పరిశీలిస్తున్నాం
పర్యవసనాలను విశ్లేషిస్తున్నామని చెప్పిన వాణిజ్య శాఖ
Feb 21, 2026 20:15 IST
నల్లగొండ: జిల్లా ఆస్పత్రిలో విషాదం
ప్రసవం కోసం వెళ్లి గర్భిణి మృతి
నార్మల్ డెలివరీ చేస్తుండగా గర్భిణి మృతి
వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని బాధితుల ఆందోళన
Feb 21, 2026 19:44 IST
విజయవాడ ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డి రిమాండ్‌పై ముగిసిన వాదనలు
లిక్కర్ స్కాం కేసులో వాసుదేవరెడ్డి పాత్ర కీలకం: ప్రాసిక్యూషన్ లాయర్
వాసుదేవరెడ్డికి తెలిసే అక్రమాలు జరిగాయి
అప్రూవర్‌గా మారినంతమాత్రాన నిర్దోషిగా చూడలేం
వాసుదేవరెడ్డిని కస్టడీకి తీసుకుని మరింత సమాచారంసేకరించాల్సి ఉంది
Feb 21, 2026 19:40 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితుడు వాసుదేవరెడ్డిని అరెస్టు చేసిన సిట్
ఏపీ లిక్కర్ స్కాం కేసులో A2గా ఉన్న వాసుదేవరెడ్డి
లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు వాసుదేవరెడ్డి
రూ.3,500 కోట్ల స్కాంలో వాసుదేవరెడ్డి కీలక నిందితుడని సిట్ నివేదిక
వైసీపీ ప్రభుత్వంలో బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి
Feb 21, 2026 19:36 IST
6 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పూర్తి
గణనీయంగా ఓటర్ల తొలగింపు
గుజరాత్లో అత్యధికంగా 68 లక్షల ఓటర్ల తొలగింపు
మధ్యప్రదేశ్‌లో 34 లక్షల ఓటర్ల తొలగింపు
Feb 21, 2026 19:10 IST
రంగారెడ్డి: బండ్లగూడ జాగీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 6 నెలల శిశువు మృతి
ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట శిశువు తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన
కాలంతీరిన మందులే శిశువు మృతికి కారణమంటూ బంధువుల ఆరోపణ
వైద్యులపై దాడి చేసి ఫార్మసీ ధ్వంసం చేసిన శిశువు బంధువులు
ఆస్పత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
Feb 21, 2026 18:53 IST
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్
ఆది, సోమవారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ప్రకటించిన ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
Feb 21, 2026 18:46 IST
టీ20 ప్రపంచ కప్ 2026: తొలి సూపర్ 8 మ్యాచ్.. టాస్ నెగ్గిన పాకిస్థాన్
ప్రేమదాస స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
తొలుత ఫీల్డింగ్ చేయనున్న న్యూజిలాండ్
Feb 21, 2026 17:21 IST
మూడో టీ20లో ఆసీస్ చిత్తు.. సిరీస్ టీమిండియాదే
ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత మహిళల ఘన విజయం
2-1 తేడాతో సిరీస్‌ను దక్కించుకున్న టీమిండియా
Feb 21, 2026 17:10 IST
షబ్బీర్ అలీ వల్లే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చా: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
నాకు వస్తున్న బెదిరింపులపై ఎస్పీకి ఫిర్యాదు చేశా
రేపటి నుంచి గ్రామాలకు వస్తా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా
రేపటి నుంచి యుద్ధమే.. దొంగలెవరో ప్రజలకు బాగా తెలుసు
నాకేమి జరిగినా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత
Feb 21, 2026 17:00 IST
మైక్రోసాఫ్ట్ గేమింగ్ నూతన సీఈఓగా ఆశా శర్మ
మైక్రోసాఫ్ట్‌లో భారత సంతతి టెకీకి ఉన్నత పదవి
ఫిల్ స్పెన్సర్ పదవీ విరమణ చేయడంతో ఆశా శర్మకు బాధ్యతలు
పలు అంతర్జాతీయ టెక్ కంపెనీలలో విధులు నిర్వర్తించిన ఆశా శర్మ
Feb 21, 2026 16:56 IST
నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు: అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్
ఏది జరిగినా బ్యాటింగ్‌లో మార్పు ఉండదు: అభిషేక్ శర్మ
Feb 21, 2026 16:48 IST
నల్లగొండ: నకిరేకల్‌లో ఓ ఆటోమొబైల్ షాప్‌లో అగ్ని ప్రమాదం
షార్ట్ సర్క్యూట్‌తో షాపులో చెలరేగిన మంటలు
రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
Feb 21, 2026 16:46 IST
శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గం: ప్రత్తిపాటి పుల్లారావు
వేంకటేశ్వరునితో వైసీపీ పొలిటికల్ గేమ్ ఆడుతోంది
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలన్నదే వైసీపీ లక్ష్యం
తప్పు చేస్తే శ్రీనివాసుడు కచ్చితంగా శిక్షిస్తారనేది చరిత్ర ఎరిగిన సత్యం
Feb 21, 2026 16:44 IST
అనకాపల్లి జిల్లాలో విషాదం..

బత్తివానిపాలెం గ్రామ సమీపంలో ప్రమాదం
చెట్టును ఢీకొన్న నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు
ప్రమాదంలో వరుడి చెల్లి మృతి
వధూవరులకు తీవ్ర గాయాలు
Feb 21, 2026 16:41 IST
యూపీలో దారుణం: భార్యను కాల్చి చంపిన భర్త
సంగీత(30) అనే మహిళపై కాల్పులు జరిపిన ఆమె భర్త
రెండు బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే సంగీత మృతి
కోర్టులో పెడింగ్‌లో ఉన్న ఈ జంట విడాకుల కేసు
మృతురాలికి ఇద్దరు పిల్లలు
Feb 21, 2026 16:40 IST
డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
ఈ శిక్షణ డీసీసీలకు ఎంతో ఉపయోగపడుతుంది: సీఎం
పార్టీలో భిన్నాభిప్రాయాలు చెప్పే వారు ఉంటారు: రేవంత్ రెడ్డి
అందరం కలిసి పనిచేస్తేనే అనుకున్నది సాధించవచ్చు: సీఎం రేవంత్
Feb 21, 2026 16:33 IST
టీ20 వరల్డ్ కప్: నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు
రాత్రి 7 గంటల నుంచి న్యూజిలాండ్ Vs పాకిస్థాన్
రేపు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఇంగ్లండ్ Vs శ్రీలంక
రేపు రాత్రి 7 గంటల నుంచి భారత్ Vs సౌతాఫ్రికా
Feb 21, 2026 15:46 IST
వివేకా హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు: సీఎం చంద్రబాబు
నారాసుర రక్త చరిత్ర అంటూ నాపై నెపం నెట్టారు
వివేకా హత్య చుట్టూ నాటకాల రాయుడు నాటకాలు ఆడారు
నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి
ఇప్పుడు మళ్లీ ప్రతిచోటా ప్రజలను రెచ్చగొడుతున్నారు
Feb 21, 2026 15:44 IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం
ట్రైన్ ఎక్కుతూ కింద పడి వ్యక్తి మృతి
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు వెళ్లాల్సిన నాగరాజు
సింహపురి ఎక్స్ ప్రెస్ అని భావించి మరో ట్రైన్ ఎక్కబోయిన నాగరాజు
ప్రమాదవశాత్తు కాలు జారి ట్రైన్ కింద పడిపోయిన నాగరాజు
తీవ్ర గాయాలతో మృతి చెందిన నాగరాజు
Feb 21, 2026 15:42 IST
డ్రగ్స్ మత్తుతో ఆడబిడ్డల జోలికొస్తే వారికదే చివరిరోజు: సీఎం చంద్రబాబు
Feb 21, 2026 15:41 IST
కొందరు బూతులు మాట్లాడుతున్నారు: సీఎం చంద్రబాబు
రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు
అసెంబ్లీలో నా సతీమణిని కూడా అవమానించారు
23 క్లెమోర్ మైన్స్ ప్రయోగించినా నేను భయపడలేదు
వేంకటేశ్వస్వామి స్వయంగా నన్ను కాపాడారు
వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోను
Feb 21, 2026 15:38 IST
నా ప్రాణం పోయినా తప్పు చేయను: సీఎం చంద్రబాబు
నేనుకూడా జైలుకు వెళ్తానని ఊహించలేదు
నోటీసు ఇస్తే సమాధానం చెప్పేవాడిని
రాష్ట్రం కోసం పోరాడాను
చాలామంది నేను జైల్లోనుంచి ప్రాణాలతో బయటకురానని అనుకున్నారు
Feb 21, 2026 15:38 IST
పల్నాడు: వినుకొండలో సీఎం చంద్రబాబు కామెంట్స్
తిరుమల లడ్డూని అపవిత్రం చేశారని చెబితే హెరిటేజ్‌ని తెరపైకి తీసుకొచ్చారు
అలాంటి కరుడుగట్టిన నేరస్థుడితో రాజకీయం చెయ్యాలా
చెప్పులు వేసుకుని వేంకటేశ్వరస్వామి ఫొటోలు విసిరేశారు
వేంకటేశ్వర స్వామి విషయం బయట మాట్లాడకూడదని రెండు రోజులు ఆగాను
దొంగే దొంగ అంటూ నాపై ప్రచారం చేశారు
Feb 21, 2026 15:34 IST
Ai సదస్సులో కాంగ్రెస్ తీరు ఆవేదన కలిగించింది: సీఎం చంద్రబాబు
కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదు
దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలి
దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలి
Feb 21, 2026 15:33 IST
ప్రజలకు స్వచ్చమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే మా ఉద్దేశం: సీఎం చంద్రబాబు
అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్రలో పాల్గొంటా
మార్చి 31కల్లా ఇంటినుంచి చెత్త వందశాతం సేకరించేలా చేస్తాం
చెత్త ద్వారా మళ్లీ వస్తువులు ఉత్పత్తి చేస్తాం
విశాఖలో చెత్తనుంచి కరెంటు తయారు చేస్తున్నారు
మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేస్తాం
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాష్ట్రంలో బ్యాన్ చేశాం
Feb 21, 2026 15:33 IST
పల్నాడు అంటే పౌరుషాల గడ్డ: సీఎం చంద్రబాబు
పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి
శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకం
Feb 21, 2026 15:31 IST
టెక్నాలజీ వినియోగంలో ఏపీనే నెంబర్ వన్: సీఎం చంద్రబాబు
వ్యవసాయంలోనూ Ai సేవలు అందుబాటులోకి తెస్తున్నాం
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా చేస్తాం
స్త్రీశక్తి, దీపం పథకం అమలు చేస్తున్నాం
పేదల ఆదాయం పెంచేందుకు P4 పథకం
టెక్నాలజీ వినియోగాన్ని బిల్‌గేట్స్ మెచ్చుకున్నారు
Feb 21, 2026 15:31 IST
పల్నాడు: వినుకొండలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కామెంట్స్..
మండలానికి ఒక స్వచ్ఛ రథం
వారానికి ఒకసారి గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుంది
పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారు
పరిసరాల పరిశుభ్రతతో పాటు మీకు ఆదాయం వస్తుంది
NDA కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురాబోతోంది
సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం
ఇప్పటివరకు 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది
Feb 21, 2026 15:25 IST
భారత్ – బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు
Ai సమ్మిట్ రెండు దేశాలకు కొత్త శక్తిని ఇచ్చింది: ప్రధాని మోదీ
వ్యూహాత్మక వాణిజ్యంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం: ప్రధాని మోదీ
Feb 21, 2026 15:23 IST
ఢిల్లీ: నలుగురు యూత్ కాంగ్రెస్ నేతలకు 5 రోజుల పోలీస్ కస్టడీ
Ai సదస్సులో నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నేతలు
యూత్ కాంగ్రెస్ నేతల బెయిల్ పటిషన్లు తిరస్కరించిన కోర్టు
Feb 21, 2026 15:22 IST
ఢిల్లీ: అజిత్ పవార్ విమాన ప్రమాదంపై అనుమానం ఉంది: రోహిత్ పవార్
అజిత్ పవార్ మరణం వెనుక కుట్రకోణం ఉంది
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టి సారించాలి
మోదీ, అమిత్ షా మాత్రమే అజిత్ పవార్‌కు న్యాయం చేస్తారు
పైలెట్‌ను బ్లాక్మెయిల్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నా
Feb 21, 2026 15:21 IST
గన్నవరం-షార్జా ఎయిరిండియా విమానం నిలిపివేత
గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
ప్రయాణికులు, ఎయిరిండియా సిబ్బంది వాగ్వాదం
షార్జాలో వాతావరణం అనుకూలించక నిలిపివేశామన్న అధికారులు
షార్జా వెళ్లాల్సిన 163 మంది ప్రయాణికులు
Feb 21, 2026 15:01 IST
డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
హాజరైన రెండు తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, షర్మిల
రెండు తెలుగు రాష్ట్రాల నుండి హాజరైన 70 మంది డీసీసీ అధ్యక్షులు
Feb 21, 2026 15:00 IST
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..

సీఎం చంద్రబాబు నేర్పించిన విజన్‌తో బతుకుతున్నాం
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలను ఈ ప్రభుత్వం కడుతుంది
పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యంగా వదిలేశారు
Feb 21, 2026 14:59 IST
వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
భవిష్యత్‌లో వినుకొండకు అన్నీ మంచి రోజులే: సీఎం చంద్రబాబు
పల్నాడుకు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి: ముఖ్యమంత్రి
ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే నా ఉద్దేశం: సీఎం చంద్రబాబు
Feb 21, 2026 14:55 IST
గ్రూపింగ్ అంశంపై ఆకాశ్ చోప్రా ఆగ్రహం
టీ20 ప్రపంచ కప్: సూపర్ 8 గ్రూపింగ్ అంశంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
టీమిండియాకు అనుకూలంగా గ్రూప్ 1కి మార్చుకున్నట్టు వార్తలు
వీటిని ఖండించిన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా
Feb 21, 2026 14:51 IST
టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌కు బిగ్ షాక్
ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన మహ్మద్ సిరాజ్
హార్ధిక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా సిరాజ్ మోకాలికి తగిలిన బంతి
నొప్పితో విలవిల్లాడిన సిరాజ్
ఆందోళనలో టీమిండియా అభిమానులు
Feb 21, 2026 14:45 IST
చిలీ: రోడ్డుపై పేలిన ట్రక్
లిక్విడ్ గ్యాస్ లోడ్ తీసుకెళ్తున్న ట్రక్
ఘటనలో నలుగురు మృతి, 17 మందికి గాయాలు
సోషల్ మీడియాలో వైరల్ అయిన పేలుడు ఘటన వీడియో
Feb 21, 2026 14:27 IST
వైసీపీ నేతల తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
వైసీపీ నేతల ప్రవర్తన చాలా దుర్మార్గం
దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారు
అసెంబ్లీకి జగన్ రారు, శాసనమండలిలో సభ జరగనివ్వరు
మంత్రి లోకేశ్ ప్రభుత్వ ధనాన్ని ఎక్కడా వృధా చేయలేదు
Feb 21, 2026 14:26 IST
నాగర్ కర్నూల్: కుమ్మెర గ్రామం మల్లన్న జాతరలో విషాదం
మల్లన్న దర్శనం కోసం వెళ్లిన భక్తులను డబ్బులు అడిగిన నిర్వాహకులు
డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన భక్తులపై దాడి చేసిన నిర్వాహకులు
దాడిలో ఓ మూడు నెలల పాపకు సైతం తీవ్ర గాయాలు
ఆస్పత్రిలో పాప మృతి
Feb 21, 2026 14:26 IST
విశాఖ: భీమిలోని లాడ్జిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్యామ్ ఆత్మహత్య
ప్రియురాలు పావనితో శ్యామ్‌కు గొడవ
గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకున్న పావని
పావని ఆత్మహత్య నేపథ్యంలో ప్రాణాలు తీసుకున్న శ్యామ్
Feb 21, 2026 14:03 IST
హైదరాబాద్: గాంధీభవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపు
గాంధీభవన్, బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
గాంధీభవన్ దగ్గర నిరసనకు బీజేవైఎం నేతల యత్నం
ఆందోళనకారులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
నిన్న ఢిల్లీలో జరిగిన AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన
ఇండియా పరువు తీశారని విమర్శిస్తున్న బీజేపీ
Feb 21, 2026 13:12 IST
స్కూల్లో కాల్పులు..! చాట్‌జీపీటీతో హంతకురాలి చాటింగ్
కెనడా పాఠశాలలో ఫిబ్రవరి 10న కాల్పుల కలకలం
విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డ 18 ఏళ్ల జెస్సీ వాన్ రూట్సెల్లర్
ఘటనా స్థలంలోనే నిందితురాలి మృతి
ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల అంచనా
చాట్‌జీపీటీతో జెస్సీ అనుమానాస్పద చాట్స్‌ను గతేడాదే గుర్తించామన్న ఓపెన్ ఏఐ సంస్థ
జెస్సీతో ప్రమాదం ఉండకపోవచ్చని భావించి పోలీసులను అప్రమత్తం చేయలేదని వెల్లడి
Feb 21, 2026 13:11 IST
మరోసారి భారత్, పాక్ మ్యాచ్ జరిగే అవకాశం
జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలు-2026లో భారత్, పాక్ మ్యాచ్
ఈ టోర్నీకి భారత్ పురుషుల, మహిళల జట్లు పంపేందుకు సిద్ధమైన బీసీసీఐ
Feb 21, 2026 13:10 IST
చిలీలో పేలిన లిక్విడ్ గ్యాస్ ట్రక్
నలుగురి మృతి, 17మందికి తీవ్రగాయాలు
గురువారం రెంగా ప్రాంతంలోని హైవేపై ప్రమాదం
సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు
Feb 21, 2026 12:45 IST
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్ళు
2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు
ఈ ఘటనలో 18మంది మృతి, 130మందికి గాయాలు
టిఫిన్ బాక్సుల్లో ఉగ్రవాదులు బాంబులు పెట్టి పేలుళ్లు
ప్రధాన నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ కీలక నేత యాసిన్ భత్కల్
2013లో నేపాల్ సరిహద్దులో యాసిన్ బత్కల్, అబ్దుల్లా అక్తర్‌ను అరెస్ట్
నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు
Feb 21, 2026 12:31 IST
ఎస్ఎల్బీసీ దుర్ఘటనకు ఏడాది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..
ఎస్ఎల్బీసీ దుర్ఘటన రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట: ఎమ్మెల్యే కేటీఆర్
కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే కేటీఆర్
కాంగ్రెస్ నేతలు కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారు: ఎమ్మెల్యే కేటీఆర్
Feb 21, 2026 12:04 IST
విశాఖ కేజీహెచ్‌లో నవజాత శిశువు మృతి కలకలం
సూపరింటెండెంట్ ఆఫీసు దగ్గర గోనెసంచిలో డెడ్‌బాడీ గుర్తింపు
పోలీసులకు సమాచారం ఇచ్చిన కేజీహెచ్ అధికారులు
Feb 21, 2026 12:03 IST
గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత
వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజ్ పేరు మార్పుపై వైసీపీ నేతల ఆగ్రహం
వీసీకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన వైసీపీ నేతలను అడ్డుకున్న TNSF నేతలు
వర్సిటీలో రాజకీయాలు వద్దంటున్న TNSF నేతలు
Feb 21, 2026 12:02 IST
కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
కోడిగుడ్లు, టమాటాలతో కాంగ్రెస్ ఆఫీసుపై బీజేవైఎం దాడులు
కార్యాలయం గేటు ధ్వంసం, ఫ్లెక్సీలు చించివేసిన బీజేవైఎం శ్రేణులు
ఏఐ సమ్మిట్‌లో రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ దాడులు
Feb 21, 2026 11:44 IST
విజయవాడ: ఈగల్ వార్షిక నివేదిక వెల్లడించిన ఐజీ రవికృష్ణ
ఈగల్ టీమ్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది: ఐజీ రవికృష్ణ
ఏపీలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించాం: ఐజీ
ఆపరేషన్‌ను చైతన్యవంతంగా ప్రజల్లోకి తీసుకువచ్చాం: ఐజీ రవికృష్ణ
Feb 21, 2026 11:43 IST
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్ర
నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు నిఘావర్గాల అనుమానం
ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడుల గురించి మాట్లాడినట్టు సమాచారం
జైలు నుంచే ప్రణాళికలు సాగినట్టు అనుమానిస్తున్న నిఘావర్గాలు
ముసారంబాగ్, సైదాబాద్, మలక్‌పేట ప్రాంతాలపై పోలీసుల నిఘా
లష్కర్ ఏ తోయిబాకు చెందిన ఉగ్రవాది కుట్రలు చేసినట్టు సమాచారం
Feb 21, 2026 11:32 IST
అతివేగంతో స్కూటీని ఢీకొన్న కారు.. డెలివరీ బాయ్ మృతి
ఢిల్లీలో విషాదం.. యువకుడి ప్రాణం తీసిన అతివేగం
ఢిల్లీలోని సుభాష్ నగర్లో కారు, బైక్ ఢీకొని డెలివరీ బాయ్ మృతి
కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Feb 21, 2026 11:20 IST
కామారెడ్డి: శిశుమందిర్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
శిశుమందిర్ దగ్గరకు చేరుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు
ఇరువర్గాలను అడ్డుకుని అరెస్ట్ చేస్తున్న పోలీసులు
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల కబ్జాపై ఇరు పార్టీల ఆరోపణలు
నిజాలు తేల్చేందుకు సిద్ధమని MLA వెంకటరమణారెడ్డి సవాల్
చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ నేతలు ప్రతిసవాల్
Feb 21, 2026 11:18 IST
కామారెడ్డి: MLA క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
MLA క్యాంప్ ఆఫీస్‌కు భారీగా వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ, తోపులాట
కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు
ఇరువర్గాలను అడ్డుకుని చెదరగొట్టిన పోలీసులు
తోపులాటలో పలువురు పోలీసులకు గాయాలు
Feb 21, 2026 11:17 IST
కామారెడ్డి: బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కీలక ప్రకటన
శిశుమందిర్ దగ్గరకు ఎవరూ రావొద్దు: వెంకటరమణారెడ్డి
ఇది పార్టీ సమస్య కాదు.. ఎక్కడివారు అక్కడే ఉండండి: వెంకటరమణారెడ్డి
ఇది నా కుటుంబంపై వచ్చిన ఆరోపణ.. నిరూపించుకోవాల్సింది నేను: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
Feb 21, 2026 11:16 IST
పాక్, కివీస్ మ్యాచ్‌కి వాన గండం
కివీస్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ బిగ్ షాక్
వర్షం కారణంగా రద్దైన పాకిస్థాన్ నెట్ ప్రాక్టీస్
Feb 21, 2026 11:08 IST
టీ-20 ప్రపంచ కప్-2026 అప్డేట్స్
నేటి నుంచి సూపర్-8 ప్రారంభం
సూపర్-8లో భాగంగా ఇవాళ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్
శ్రీలంక కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్న కివీస్, పాక్
Feb 21, 2026 11:03 IST
మాజీ ఎమ్మెల్యేకు షాక్..
ఏలూరు: మాజీ ఎమ్మెల్యే వెంకట్రావ్, మరో 12 మంది వైసీపీ నేతలకు నోటీసులు
మార్చి 16న 13 మందీ కోర్టుకు హాజరుకావాలని భీమడోలు కోర్టు నోటీసులు
2017లో గురజాల ఆదిలక్ష్మి అనే మహిళను గాయపరిచినట్లు ఆరోపణలపై కేసు
Feb 21, 2026 11:01 IST
ఎర్రకోట సహా పలు ఆలయాలపై ఉగ్రదాడులకు ప్రణాళికలు: నిఘావర్గాలు
దేశవ్యాప్తంగా దేవాలయాల సమీపంలో పేలుళ్లకు కూడా కుట్రలు: నిఘావర్గాలు
ఇస్లామాబాద్ మసీద్‌లో పేలుళ్లకు ప్రతీకార దాడులకు ప్రణాళికలు: నిఘావర్గాలు
Feb 21, 2026 11:01 IST
భివాండి కోర్టుకు రాహుల్ గాంధీ
మహారాష్ట్ర: భివాండి కోర్టుకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
RSSకు సంబంధించిన పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరు
Feb 21, 2026 10:44 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
సీఎం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను పరిశీలించాం: రామ్మోహన్
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతం: రామ్మోహన్
పౌరవిమానయాన శాఖలోనూ ఈ తరహా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: రామ్మోహన్
Feb 21, 2026 10:42 IST
ఢిల్లీలో హైఅలర్ట్… ఉగ్రముప్పు ఉందని నిఘావర్గాల హెచ్చరికలు
ఢిల్లీలో దాడులకు లష్కరే తోయిబా ప్లాన్ చేసినట్లు సమాచారం
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులకు కుట్ర
ఎర్రకోట, చాందినీచౌక్‌లోని ఆలయం దగ్గర IMD పేలుళ్లకు ప్రణాళికలు
ఢిల్లీలో వీవీఐపీ ప్రాంతాల వద్ద భద్రత కట్టుదిట్టం
Feb 21, 2026 10:01 IST
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు: వెంకయ్యనాయుడు
మన అస్తిత్వానికి సుస్థిర కోట నిర్మించేది మన మాతృభాషే: వెంకయ్య
మనకంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఉంది మన భాష, సంస్కృతులే: వెంకయ్య
Feb 21, 2026 09:09 IST
హైదరాబాద్: FSL అగ్నిప్రమాదం కేసులో కీలక మలుపు
దగ్ధమైన ఫైళ్లు రిట్రీవ్ చేయలేమని తేల్చిన నాగపూర్ బృందం
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో 1,100ల ఫైళ్లు దగ్ధమైనట్లు అనుమానం
కేసుల డేటా రిట్రీవ్‌కు ప్రయత్నం చేసిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్
Feb 21, 2026 07:57 IST
నేటి నుంచి వికారాబాద్‌లో కాంగ్రెస్ శిక్షణ తరగతులు
అనంతగిరిలో ఏపీ, తెలంగాణ DCC అధ్యక్షులకు శిక్షణ
10 రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
పాల్గొననున్న మహేష్ గౌడ్, షర్మిల, మంత్రులు, కీలక నేతలు
మార్చి 1న ముగింపు సమావేశానికి హాజరుకానున్న రాహుల్ గాంధీ
Feb 21, 2026 07:33 IST
టీ20 వరల్డ్ కప్ అప్డేట్
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో పాకిస్థాన్ Vs న్యూజిలాండ్
కొలంబోలో ఇవాళ రాత్రి 7గంటలకు మ్యాచ్
Feb 21, 2026 07:29 IST
భివాండి కోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత
మహారాష్ట్ర: నేడు భివాండి కోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
RSSకు సంబంధించిన పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరుకానున్న రాహుల్ గాంధీ