Mar 02, 2026 21:15 IST
దుబాయ్ ఎయిర్‌పోర్టు అధికారుల కీలక ప్రకటన..
పాక్షికంగా విమాన సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటన..
ఎయిర్‌లైన్స్‌తో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే..
ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లాలని ఆదేశం
Mar 02, 2026 21:13 IST
ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు..
ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తాం..
మా జోలికి వచ్చినవారిని వదిలిపెట్టం..
మేం యుద్ధాన్ని ఇంకా ఉధృతం చేయలేదు..
ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Mar 02, 2026 20:59 IST
ప్రకాశం: మాజీ మంత్రి బాలినేనిపై ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి ఫైర్
గత వైసీపీ ప్రభుత్వంలో బాలినేని ఎన్నో అక్రమాలు చేశారు..
ఒంగోలులో బాలినేని కుమారుడు ఇష్టానుసారం వ్యవహరించాడు..
గంజాయి సరఫరాతో ఎన్నో కుటుంబాలను నాశనం చేశారు: జనార్దన్‌రెడ్డి
కూటమి పాలనలోనే భూకబ్జాలు ఆగాయి: ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి
Mar 02, 2026 20:32 IST
యుద్ధంపై అమెరికా రక్షణశాఖ కీలక ప్రకటన..
యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు కానీ.. ముగింపు పలికేది మేమే: అమెరికా
ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ అణ్వాయుధాల తయారీ ఆపలేదు: అమెరికా
Mar 02, 2026 20:30 IST
బాణసంచా కేంద్రాలను సీజ్ చేసిన అధికారులు..
రాజమండ్రి: బిక్కవోలు మండలంలోని బాణసంచా కేంద్రాల్లో అధికారుల తనిఖీలు..
6 బాణసంచా తయారీ కేంద్రాలకు నోటీసులు జారీ..
బాణసంచా కేంద్రాలను సీజ్ చేసిన అధికారులు..
తయారీ నిలిపివేయాలని వ్యాపారులకు అధికారుల ఆదేశాలు..
Mar 02, 2026 19:49 IST
ఇది ముగింపు లేని యుద్ధం కాదు: యూఎస్ మంత్రి
ఇరాక్ యుద్ధంతో పోల్చకూడదన్న యుద్ధ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్..
ఇరాక్ తరహా ఊబిలోకి పడదలుచుకోలేదని కామెంట్..
ఇరాన్ సైనిక శక్తిని ధ్వంసం చేసేందుకు నిర్ణయాత్మక దాడి అని వ్యాఖ్య..
Mar 02, 2026 19:48 IST
ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఖమేనీ భార్య మన్సూరే మృతి
టెహ్రాన్‌లోని ఖమేనీ నివాసంపై జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన మన్సూరే..
ఖమేనీ మరణించిన రెండ్రోజుల తర్వాత మృతి..
ఇదే దాడుల్లో మరణించిన ఖమేనీ, ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు..
Mar 02, 2026 19:17 IST
అమరావతి: యుద్ధం కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వ సహాయం..
ఏపీ NRT, RTGSకు బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు..
కేంద్రంతో సమన్వయం చేసుకుని..
పౌరులు సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలి: సీఎం చంద్రబాబు
Mar 02, 2026 18:42 IST
ఏపీలో రైతులకు ఊరట
46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
ఈ నెలాఖరులోగా అనుమతులు జారీ చేయాలని ఆదేశాలు..
రెండు నెలల్లో పెండింగ్ కనెక్షన్లు పూర్తిచేయాలని డిస్కంలకు ఆదేశాలు..
Mar 02, 2026 18:37 IST
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, బహ్రెయిన్ కింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ
పశ్చిమాసియాలో పరిస్థితి, భారతీయల భద్రతను అడిగి తెలుసుకున్న ప్రధాని..
సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లపై ఇరాన్ దాడులకు ఖండన..
Mar 02, 2026 18:36 IST
ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి
ఒమాన్‌లోని కబూస్ పోర్టు సమీపంలోని సముద్ర జలాల్లో దాడి..
మార్చి 1న దాడి జరిగిందన్న ఒమాన్ మారీటైమ్ సెక్యూరిటీ కేంద్రం..
ఘటన సమయంలో నౌకలో 16 మంది భారతీయ సిబ్బంది..
Mar 02, 2026 18:07 IST
బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం
ఇరాన్‌పై యుద్ధంలో బ్రిటన్ సహకరించడం లేదు: ట్రంప్
డీగో గార్షియా ఎయిర్‌బేస్ వాడుకోవడానికి బ్రిటన్ అనుమతి ఇవ్వలేదు..
బ్రిటన్ మాకు సహకరించకపోవడం చరిత్రలోనే ఇది తొలిసారి: ట్రంప్
Mar 02, 2026 17:55 IST
తమిళనాడు: శివగంగై జల్లికట్టులో విషాదం
ఎద్దు పొడవడంతో ముగ్గురి మృతి, 50 మందికి పైగా గాయాలు..
గాయపడిన వారిలో 14 మంది పరిస్థితి విషమం..
Mar 02, 2026 17:48 IST
ఇరాన్ దాడులపై 6 గల్ఫ్ దేశాల సంయుక్త ప్రకటన
తక్షణమే ఇరాన్ దాడులు ఆపాలి: గల్ఫ్ దేశాలు
దాడులు ఆపకపోతే ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు: గల్ఫ్ దేశాలు
ఇరాన్ దాడులు ప్రాంతీయ భద్రతకు ముప్పు: గల్ఫ్ దేశాలు
Mar 02, 2026 17:43 IST
గుంటూరు: నగరపాలక సంస్థ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష
రూ.400 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు, కాలువల అభివృద్ధి..
2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి..
నార్ల ఆడిటోరియం కోసం టెండర్లు పిలిచాం..
మానస సరోవరం పార్క్‌ను ఆధునికీకరిస్తాం: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Mar 02, 2026 17:36 IST
నాటాంజ్ అణుక్షేత్రంపై యూఎస్, ఇజ్రాయెల్ దాడి.. ఐఏఈఏ ఇరాన్ రాయబారి వెల్లడి
అలాంటి సాక్ష్యం ఏమీ లేదని చెప్పిన ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ..
నాటాంజ్‌పై దాడులను ధ్రువీకరించని ఇజ్రాయెల్, అమెరికా..
Mar 02, 2026 17:36 IST
హెజ్‌బొల్లాకు బిగ్ షాక్..
హెజ్‌బొల్లా గ్రూప్ అధిపతి మహమ్మద్ రాడ్ మృతి..
ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన మహమ్మద్ రాడ్..
మరికొందరు నేతలు కూడా మరణించినట్లు ప్రకటించి ఐడీఎప్..
Mar 02, 2026 17:34 IST
తిరుమల: చంద్రగ్రహణం కారణంగా రేపు శ్రీవారి ఆలయం మూసివేత..
రేపు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేత..
రేపు మ.3.32 నుంచి సా.6.47 గంటల వరకు చంద్ర గ్రహణం..
రేపు అన్ని ఆర్జిత సేవలు సహా బ్రేక్, శ్రీవాణి ట్రస్టు దర్శనాల రద్దు..
Mar 02, 2026 17:32 IST
పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
కేసీఆర్‌తో పాటు SK జోషి, IAs అధికారిని స్మిత సబర్వాల్ తరపున వాదనలు..
పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసీఆర్ తరుపున వాదనలు..
తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 2.15 కి వాయిదా..
Mar 02, 2026 17:31 IST
ఇరాన్ తన వ్యూహాన్ని మార్చిందా? లక్ష్యం ఇదేనా?
స్పల్ప స్థాయి మిసైల్స్‌తో ప్రత్యర్థులపై దాడులు..
ఖరీదైన ఆయుధాలతో ఇజ్రాయెల్, అమెరికా ప్రతిదాడులు..
ప్రత్యర్థుల ఆయుధ నిల్వలు త్వరగా తరిగిపోవాలన్నదే ఇరాన్ లక్ష్యం..
రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ..
Mar 02, 2026 17:22 IST
వీధి కుక్క స్వైరవిహారం.. 15 మందికి గాయాలు..
పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో వీధి కుక్క స్వైరవిహారం..
15 మందిపై దాడి.. గాయపడ్డ వారిని చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలింపు..
Mar 02, 2026 16:55 IST
ఆకాసా ఎయిర్‌లైన్స్ విమానాల రద్దు
ఢిల్లీ: అబుదాబి, దోహా, జెడ్డా, కువైట్, రియాద్‌లకు వెళ్లే అన్ని ఆకాసా ఎయిర్‌లైన్స్ విమానాల రద్దు
రేపటి వరకు అకాసా విమానాలను రద్దు చేస్తూ ప్రకటన..
ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారికి తిరిగి రిఫండ్..
రీ షెడ్యూల్ చేసుకునేందుకు సదుపాయం కల్పించిన ఆకాసా ఎయిర్‌లైన్స్..
Mar 02, 2026 16:38 IST
తిరుపతిలో దారుణం..
బంగారు నగల కోసం వృద్ధురాలి హత్య..
100 గ్రాములకు పైగా బంగారు నగలను కాజేసిన దుండగులు..
సొంత మనవడే హత్య చేసి ఉంటాడని పోలీసుల అనుమానం..
Mar 02, 2026 16:37 IST
తెలంగాణలో ముగిసిన DCC అధ్యక్షుల శిక్షణ తరగతులు
వికారాబాద్: ముగిసిన DCC అధ్యక్షుల శిక్షణ తరగతులు
కాసేపట్లో శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న రాహుల్‌గాంధీ
Mar 02, 2026 16:16 IST
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై క్షిపణి దాడి..
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటన..
ఖైబర్ షెకాన్ బాలిస్టిక్ క్షిపణతో దాడి జరిపామని వెల్లడి..
దాడిని ధ్రువీకరించని ఇజ్రాయెల్..
Mar 02, 2026 15:32 IST
గంజాయి స్మగ్లర్ల అరెస్ట్..
పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం లాడ్జిలో పట్టుబడిన గంజాయి స్మగ్లర్లు
ఐదుగురు అరెస్ట్, ఒకరు పరారీ..
నిందితులు బీహార్, పశ్చిమబెంగాల్, విశాఖపట్నానికి చెందిన వారిగా గుర్తింపు..
90 కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్, బైక్‌ను సీజ్ చేసిన పోలీసులు..
Mar 02, 2026 15:26 IST
ఇరాన్‌లో 550 మందికి పైగా మృతి..
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లో 550 మందికి పైగా మృతి..
ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి..
బాలిస్టిక్ మిసైల్ కేంద్రాలు లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడి..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతిదాడులు..
Mar 02, 2026 15:14 IST
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం: అమెరికాకు బిగ్ షాక్
కువైట్‌లో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం F-15E..
సురక్షితంగా బయటప్డ ఇద్దరు పైలట్లు ..
ఈ ఘటనపై కువైట్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం..
Mar 02, 2026 15:13 IST
వేధింపుల వల్లే అంబర్‌పేట కుటుంబం ఆత్మహత్య:
హైదరాబాద్: అంబర్‌పేటలో ఫిబ్రవరి 24న రామ్‌రాజ్, అతడి భార్య, కుమారుడి ఆత్మహత్య..
లోన్ తీసుకుని తిరిగి ఇచ్చే వ్యవహారంలో వేధింపులు..
ఈ ఘటనలో నలుగురు నిందితుల అరెస్ట్: సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మూర్తి
Mar 02, 2026 14:59 IST
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య.. బంధువుల ఆందోళన..
మహబూబాబాద్: సిరోల్ మండలం సీత్లా తండాలో ఉద్రిక్తత..
ఉరి వేసుకుని యువకుడు సురేష్ ఆత్మహత్య..
సురేష్ ఆత్మహత్యకు మరో యువకుడు కారణమంటూ ఆరోపణలు..
మృతదేహంతో బంధువుల ఆందోళన, పోలీసుల మోహరింపు..
Mar 02, 2026 14:58 IST
రూ 4.29 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన..
ప. గో: పాలకొల్లులో రూ 4.29 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన..
రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తోంది..
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వైసీపీ అధికారం కోరుకోవడం లేదు..
హత్యలు, మారణహోమం చేసేందుకు.. అధికారం కోసం ప్రయత్నం: మంత్రి నిమ్మల రామానాయుడు
Mar 02, 2026 14:56 IST
నిల్వ ఉంచిన మాంసం వడ్డింపు.. అధికారుల చర్యలు..
కాకినాడ: కాకినాడలో సీజన్ 5 రెస్టారెంట్‌లో దారుణం..
వినియోగదారులకు నిల్వ ఉంచిన మాంసం వడ్డింపు..
చికెన్, ఫ్రై శాంపిల్స్‌ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..
Mar 02, 2026 14:46 IST
భారత్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారాన్నే కోరుకుంటుంది: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని ఆందోళన..
దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి..
కెనడా ప్రధాని మార్క్ కార్నీతో మోదీ సంయుక్త ప్రకటన..
Mar 02, 2026 14:34 IST
భారత పర్యటనకు అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు..
జూన్ 2026లో భారత పర్యటనకు రానున్న అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు..
భారత్‌తో టెస్ట్, 3 వన్డేలు ఆడనున్న అఫ్గానిస్తాన్..
Mar 02, 2026 13:57 IST
ఢిల్లీ: కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ భేటీ
విద్యుత్, టెక్నాలజీ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయం
భారత్-కెనడా మధ్య రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగంపై MoU
యురేనియం ఒప్పందంపై భారత్-కెనడా సంతకాలు
అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరాలని కెనడా నిర్ణయం
కెనడా నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ
త్వరలో తుదిదశకు సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం: మోదీ
Mar 02, 2026 13:55 IST
సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ
సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో అక్రమాలు జరిగాయి: కేటీఆర్
స్వతంత్ర దర్యాప్తు జరిపి టెండర్లు రద్దు చేయాలి: కేటీఆర్
Mar 02, 2026 13:51 IST
గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్పందన
ఆంధ్రా అనే పదం అనకూడదు అనేలా కొందరు మాట్లాడుతున్నారు: భారతి
గరికపాటి తెలంగాణలో స్థిరపడ్డారు.. ఆంధ్రాకు రారు: కమలానంద భారతి
మా ప్రాంతం, మా బతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు: కమలానంద
ఎక్కడో ఉండే మీరు ఇక్కడికి వచ్చి సలహాలు ఇవ్వొద్దు: కమలానంద
Mar 02, 2026 13:42 IST
వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కౌంటర్
పాపాలు, తప్పులు చేసిన వారెవరైనా జైలుకే వెళతారు: ఎమ్మెల్యే రాము
తప్పు చేసిన వారు తప్పించుకోలేరు: ఎమ్మెల్యే రాము
అన్యాయంగా అరెస్ట్ చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు: ఎమ్మెల్యే రాము
Mar 02, 2026 13:39 IST
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్ర పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
Mar 02, 2026 13:33 IST
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది: మోదీ
భారత్ శాంతి కోసం కృషి చేస్తుంది: మోదీ
చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి: మోదీ
గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం చర్యలు: మోదీ
Mar 02, 2026 13:27 IST
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌తో యుద్ధం మరో నాలుగు, ఐదు వారాలు జరగొచ్చు: ట్రంప్
ఆ యుద్ధం ముగిసేలోపు మరింత మంది ఎక్కువ అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం: ట్రంప్
ఇరాన్‌పై విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నాం: ట్రంప్
Mar 02, 2026 12:53 IST
ఇరాన్ సుప్రీం తాత్కాలిక లీడర్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు
Mar 02, 2026 12:41 IST
శత్రు దేశానికి చెందిన ఓ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటన
కువైట్ గగనతలంలో ఎగురుతున్న ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు వెల్లడి
సంబంధిత వీడియోను విడుదల చేసిన ఇరాన్
Mar 02, 2026 12:30 IST
దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దుబాయ్‌లో చిక్కుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఐదు రోజుల క్రితం దుబాయ్ వెళ్లిన మంత్రి తుమ్మల
Mar 02, 2026 12:17 IST
శంషాబాద్ నుంచి విదేశాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దు
శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 22 విమానాలు, విదేశాల నుంచి రావాల్సిన మరో 22 విమానాలు రద్దు
ప్రయాణికులకు డీజీసీఏ కీలక సూచన
మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలి: డీజీసీఏ
Mar 02, 2026 11:49 IST
పాకిస్థాన్ నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఆఫ్ఘానిస్థాన్ డ్రోన్ దాడి
Mar 02, 2026 11:27 IST
దేశీయ స్టాక్‌మార్కెట్లపై యుద్ధ ప్రభావం
చమురు ధరల పెరుగుదలతో దారుణంగా పతనమైన సూచీలు
24 పైసలు తగ్గి 93.32గా ట్రేడ్ అవుతున్న రూపాయి
80 డాలర్లపైనే ట్రేడ్ అవుతున్న ముడి చమురు ధరలు
Mar 02, 2026 11:19 IST
శ్రీకాకుళం టీచర్ అరుణ కుమారిపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు
బొమ్మలు, షార్ట్ ఫిల్మ్స్‌తో వినూత్న బోధన చేస్తున్నారు: లోకేశ్
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌కు స్ఫూర్తిగా నిలిచారు: లోకేశ్
విద్యలో సృజనాత్మకతతో మెప్పించారు: లోకేశ్
వర్కింగ్ మోడల్స్‌తో పాఠాలు చెప్పి ప్రశంసలందుకున్నారు: లోకేశ్
Mar 02, 2026 11:12 IST
పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
యుద్ధానికి సిద్ధం కావాలన్న రాహుల్
మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయ్: రాహుల్
ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలి: రాహుల్
Mar 02, 2026 11:03 IST
ఢిల్లీలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
మయూర్ విహార్‌లోని సాల్వాన్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్
ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది
ఎలాంటి బాంబు పరికరాలు లభించలేదని తేల్చిన పోలీసులు
Mar 02, 2026 10:55 IST
రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన
పనులు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రాక్ట్ సంస్థలపై ఆగ్రహం
పని చేయలేకపోతే వెళ్లిపోవాలని నిర్మాణ సంస్థలపై అసహనం
పనుల ఆలస్యంపై సీఎంకు సంస్థ సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం
Mar 02, 2026 10:51 IST
ట్రంప్ చర్చల వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్
అమెరికాతో చర్చలు జరిపేది లేదు: ఇరాన్ సెక్యూరిటీ చీఫ్
చర్చల కోసం మేం ఎవరినీ సంప్రదించలేదు: ఇరాన్
చర్చలపై ట్రంప్ చెప్పినవన్నీ అబద్ధం: ఇరాన్
Mar 02, 2026 10:28 IST
ఇరాన్లోని గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ బాంబు దాడి
Mar 02, 2026 10:02 IST
పాకిస్థాన్ నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఆఫ్ఘానిస్థాన్ డ్రోన్ దాడి
Mar 02, 2026 09:56 IST
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష
Mar 02, 2026 09:42 IST
బీసీసీఐపై పాక్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ తీవ్ర విమర్శలు
ఐసీసీ ‘ఇండియన్ క్రికెట్ కౌన్సిల్’గా మారిందని వ్యాఖ్య
బీసీసీఐ చెప్పిందే ఐసీసీ చేస్తుందనడంలో సందేహం లేదని ఆరోపణ
ఐసీసీ పక్షపాత ధోరణి వల్లే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరిందని కామెంట్స్
Mar 02, 2026 09:37 IST
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
యుద్ధం కారణంగా భారీగా పతనమైన సూచీలు
సెన్సెక్స్ 1,050, నిఫ్టీ 300 పాయింట్లకుపైగా నష్టం
ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా భారీగా పతనమైన సూచీలు
Mar 02, 2026 09:34 IST
హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ
రాహుల్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్‌లో డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమానికి హాజరు
నేడు తెలంగాణకు రానున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
Mar 02, 2026 09:18 IST
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం
బైక్, స్కూల్ బస్సు ఢీ.. ఇద్దరి మృతి
మృతులు బావబామ్మర్దులు వంశీ, రమేష్‌గా గుర్తింపు
Mar 02, 2026 09:11 IST
కాకినాడ: వేట్లపాలెం ఘటనలో పెరిగిన మృతులు
జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ మరో వ్యక్తి మృతి
మృతుడు సామర్లకోట కుమ్మరివీధికి చెందిన రాజుగా గుర్తింపు
రాజు మృతితో 23కు చేరిన మృతుల సంఖ్య
Mar 02, 2026 08:45 IST
కృష్ణా: ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం గాలిలో చక్కర్లు
గన్నవరం ఎయిర్‌పోర్ట్ దగ్గర అరగంట పాటు విమానం చక్కర్లు
పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు అంతరాయం
Mar 02, 2026 08:36 IST
రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం దృష్ట్యా 10:30 గంటలపాటు ఆలయం మూసివేత
రేపు ఉదయం 9:00 గంటలకు ఆలయ తలుపుల మూసివేత
రేపు మ.3:20 నుంచి సా.6:47 వరకు చంద్రగ్రహణ కాలం
Mar 02, 2026 08:08 IST
45 ఏళ్ల క్రితమే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు కుట్ర
నాడు తీవ్రగాయాలతో ప్రాణాలతో బయటపడిన ఖమేనీ
బాంబ్‌బ్లాస్ట్ కారణంగా కుడి చెయ్యి పారలైజ్
Mar 02, 2026 07:53 IST
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో ప్రకటన
9 ఇరాన్ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయి: ట్రంప్
ఇరాన్ నౌకాదళం మొత్తం నాశనమైంది: ట్రంప్
దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారు: ట్రంప్
చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వద్దు: ట్రంప్
ఇరాన్‌తో చర్చలకు సిద్ధం: ట్రంప్
Mar 02, 2026 07:51 IST
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు భారత ప్రధాని మోదీ ఫోన్
ఇరాన్‌తో యుద్ధం, తాజా పరిణామాలపై భారత్ ఆందోళన
పౌరుల భద్రతే ప్రాధాన్యమన్న ప్రధాని మోదీ
శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని కోరిన మోదీ
Mar 02, 2026 07:41 IST
ఇరాన్ దాడులపై గల్ఫ్ దేశాల సమావేశం
పాల్గొన్న యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు
ఇరాన్ దాడులను చూస్తూ ఊరుకోం: గల్ఫ్ దేశాలు
మమ్మల్ని మేం రక్షించుకుంటాం: గల్ఫ్ దేశాలు
ఇరాన్‌పై తిరిగి దాడి చేసే హక్కు మాకుంది: గల్ఫ్ దేశాలు
Mar 02, 2026 07:29 IST
తిరుపతి: కపిలతీర్థం-అలిపిరి మార్గంలో వాకర్స్ రాస్తారోకో
వాకర్స్ రాస్తారోకోతో కాసేపు స్తంభించిన భక్తుల కార్లు, ఇతర వాహనాలు
డీఎఫ్ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వాకర్స్.. నాయకత్వం వహించిన సీపీఎం నేతలు
అలిపిరి సీఐ రామకిశోర్ చర్చించడంతో రాస్తారోకో విరమించిన వాకర్స్
Mar 02, 2026 07:11 IST
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
వీరులపాడు మండలం జుజ్జూరు సమీపం ట్రాక్టర్ బోల్తా
కూలీలను దించి తిరిగి వస్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్
ప్రమాదంలో గోకరాజుపల్లికి చెందిన మహేశ్ అనే రైతు మృతి
Mar 02, 2026 07:00 IST
నేడు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
వికారాబాద్ అనంత పద్మనాభస్వామి డిగ్రీ కాలేజీ ఆవరణలో పీఏసీ సమావేశం
పీఏసీ సమావేశానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ
పీఏసీ చైర్మన్ మీనాక్షీ నటరాజన్ అధ్యక్షతన సమావేశం
ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చ
రాజ్యసభ సభ్యులను ఖరారు చేయనున్న పీఏసీ
Mar 02, 2026 06:53 IST
కాసేపట్లో వికారాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు హాజరుకానున్న రాహుల్
ఉ.9:20 గంటలకు శంషాబాద్‌కు రాహుల్ గాంధీ
శంషాబాద్ నుంచి ఉ.10:20కి వికారాబాద్‌కు రాహుల్ గాంధీ
Mar 02, 2026 06:50 IST
అమెరికాలోని ఆస్టిన్‌లో కాల్పుల కలకలం
Mar 02, 2026 06:48 IST
మళ్లీ పెరిగిన బంగారం, వెండి రేట్లు
ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలే పెరుగుదలకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం
నేడు ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,73,090
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,660గా ట్రేడింగ్
మరోసారి రూ.3 లక్షల మార్క్‌ను దాటిన సిల్వర్ ధరలు
Mar 02, 2026 06:45 IST
నేడు కెనడా ప్రధాని కార్నీ, భారత ప్రధాని మోదీ భేటీ
Mar 02, 2026 06:41 IST
నేడు వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి పర్యటన
అనంతగిరి హిల్స్‌లో తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల శిక్షణ ముగింపు..
కార్యక్రమానికి హాజరుకానున్న రాహుల్, రేవంత్