Mar 13, 2026 19:00 IST
బండి సంజయ్ పాదయాత్ర
రేపు కొండగట్టు ఆలయానికి బండి సంజయ్ పాదయాత్ర
కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కి.మీ. పాదయాత్ర
Mar 13, 2026 18:59 IST
రిలయన్స్ హోం ఫైనాన్స్ సంస్థ మోసం కేసులో CBI దర్యాప్తు
Mar 13, 2026 18:59 IST
సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ హాస్టల్స్‌కు వంటగ్యాస్ సెగ
ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకులంలో గ్యాస్ కొరత
విద్యార్థులకు కట్టెలతో మధ్యాహ్న భోజనం వండిన సిబ్బంది
Mar 13, 2026 18:58 IST
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు
సమస్యల పరిష్కారం కోరుతూ TGSRTC JAC సమ్మె నోటీసు
సమ్మె తేదీపై రెండు వారాల తర్వాత నిర్ణయం: TGSRTC JAC
రెండు వారాల్లోపు ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదు: TGSRTC JAC
Mar 13, 2026 18:57 IST
నటి అనసూయపై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు
కడప జిల్లాకు చెందిన జనార్దన్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
సోషల్ మీడియాలో అనసూయపై జనార్దన్ అభ్యంతరకర పోస్టులు
అనసూయ ఫొటోలు, వీడియోలు మార్ఫ్ చేసి పోస్టులు
Mar 13, 2026 18:52 IST
తెలంగాణలో భారీ GST కుంభకోణం
రూ.84.15కోట్ల మోసం గుర్తించిన వాణిజ్య పన్నులశాఖ
SKG ట్రేడింగ్ కంపెనీ యజమాని సందీప్ అరెస్టు
Mar 13, 2026 18:52 IST
హైదరాబాద్: MRDCL ఆధ్వర్యంలో ‘MUSI INVITIES’ కార్యక్రమం
‘MUSI INVITIES’ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
హాజరైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు..
మేధావులు, పర్యావరణ నిపుణులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు
Mar 13, 2026 17:58 IST
సారా అంశంలో జడ్చర్ల MLA వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి స్పందన
ఇప్పసారా అంశంపై సాధ్యసాధ్యాలను అధ్యయనం చేస్తాం: జూపల్లి
రీసెర్చ్ నివేదికను MLA అనిరుధ్‌రెడ్డి అందించారు: మంత్రి జూపల్లి
సారా అంశంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం: మంత్రి జూపల్లి
Mar 13, 2026 17:21 IST
అమరావతి: ఉండవల్లిలో మంత్రి లోకేశ్‌తో బిట్స్ పిలానీ ప్రతినిధుల భేటీ
ఇక్కడ నిర్మిస్తున్న బిట్స్ పిలానీ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్: సంస్థ ప్రతినిధులు
బిట్స్ చేపట్టిన నిర్మాణ ప్లాన్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్
సాధ్యమైనంత త్వరగా ఈ క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని లోకేశ్ సూచన
Mar 13, 2026 17:01 IST
శ్రీకాకుళం: పలాసలో విజయవంతమైన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్
కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో పూర్తయిన తొలి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స
హేమశ్రీ అనే యువతికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్
Mar 13, 2026 16:36 IST
అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూస్తాం: మంత్రి ఉత్తమ్
గ్యాస్ కొరత ఉన్నట్లు కేంద్రమే ప్రకటించింది: మంత్రి ఉత్తమ్
LPG ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం తెలిపింది: మంత్రి ఉత్తమ్
అత్యవసర సేవలుగా గుర్తించి గ్యాస్ సరఫరా చేయాలన్న..
హోటల్స్, రెస్టారెంట్ల విజ్ఞప్తిని పరిశీలిస్తాం: మంత్రి ఉత్తమ్
Mar 13, 2026 16:35 IST
దేశంలో పెట్రోల్ కొరత లేదు: కేంద్రం
రాష్ట్రాలు బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి: కేంద్రం
ప్రజలకు 24/7 PNG సరఫరా చేస్తాం: కేంద్రం
ప్రజలు PNG కనెక్షన్లు తీసుకుంటే మంచిది: కేంద్రం
Mar 13, 2026 16:34 IST
హైదరాబాద్: గుర్రంగూడ అటవీప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటన
424.31 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
గుర్రంగూడలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
Mar 13, 2026 16:34 IST
వచ్చేవారం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలు
5 రాష్ట్రాల్లో పూర్తయిన ఓటర్ల జాబితా సవరణ
Mar 13, 2026 16:20 IST
ఇరాక్‌లో కుప్పకూలిన అమెరికా రీఫ్యూయలింగ్ విమానం
విమానంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి
సిబ్బంది మృతిని ధ్రువీకరించిన యూఎస్ సెంట్రల్ కమాండ్
విమానాన్ని తామే కూల్చేసినట్టు ప్రకటించిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్
Mar 13, 2026 16:00 IST
కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పెద్దపులి సంచారం
పులి కదలికలను గుర్తించిన అటవీశాఖ అధికారులు
పెద్దపులి మెడలో జీపీఎస్ రెడియో కాలర్ ఉన్నట్లు గుర్తింపు
పులి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నామన్న అధికారులు
Mar 13, 2026 15:59 IST
బేజారెత్తిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు!
అంతర్జాతీయ పరిణామాలతో అమ్మకాల ఒత్తిడి
ఈరోజు భారీ కుదుపునకు లోనైన భారత స్టాక్ మార్కెట్లు
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు దాదాపు 2శాతం పతనం
Mar 13, 2026 15:58 IST
ABN ఆంధ్రజ్యోతితో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి
మేము పోలీసులకు లొంగిపోలేదు: ABN ఆంధ్రజ్యోతితో మల్లా రాజిరెడ్డి
అరెస్ట్ చేసి లొంగుబాటు చూపించారు: మల్లా రాజిరెడ్డి
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అనుకూల పరిస్థితులు లేవు: రాజిరెడ్డి
Mar 13, 2026 15:38 IST
హెచ్.జె.దొర కన్నుమూత
ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ HJ దొర కన్నుమూత
అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్సపొందుతూ మృతి
Mar 13, 2026 15:29 IST
సినిమా నిర్మాతలకు సుప్రీంకోర్టులో ఊరట
టికెట్ ధరల పెంపు అంశంలో 90 రోజుల నిబంధనపై సుప్రీంకోర్టు స్టే
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే..
ప్రభుత్వం జీఓ జారీ చేయాలంటూ గతంలో హైకోర్టు నిబంధన
Mar 13, 2026 15:27 IST
మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో విచారణ
అలా చేస్తే అది వాళ్ల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న సుప్రీంకోర్టు
నెలసరి సెలవులు తప్పనిసరి చేస్తే మహిళలను ఎవరూ ఉద్యోగాల్లోకి తీసుకోరన్న సుప్రీంకోర్టు
Mar 13, 2026 15:27 IST
ఈ విజయం యావత్ భారత దేశానిది: సూర్య
ఇండియాలో క్రికెట్ అంటే ఆట కాదు.. ఓ ఎమోషన్: సూర్యకుమార్ యాదవ్
డియర్ టీమిండియా ఫ్యాన్స్.. మీకు కృతజ్ఞతలు: సూర్య
మీ మద్దతు, దీవెనల వల్లే టీ20 ప్రపంచ కప్ గెలిచాం: సూర్య
Mar 13, 2026 15:11 IST
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలో పేలుడు
యుద్ధంలో ఇప్పటివరకు 1300 మందికిపైగా ఇరానియన్లు మృతి
మృతుల్లో 200 మందికిపైగా చిన్నారులు
Mar 13, 2026 15:10 IST
స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్
భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
1300 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
400 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ
Mar 13, 2026 15:10 IST
మూసీ పునరుజ్జీవానికి మేం వ్యతిరేకం కాదు: రాంచందర్‌రావు
పేదల ఇళ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకమంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం
ఇళ్లు కూల్చకుండా మూసీని శుద్ధి చేయొచ్చు: రాంచందర్‌రావు
Mar 13, 2026 15:09 IST
సీఈసీపై అభిశంసన తీర్మానం
CEC జ్ఞానేశ్ కుమార్ తొలగింపు కోరుతూ పార్లమెంట్‌లో విపక్షాల నోటీస్
లోక్‌సభ, రాజ్యసభలో అభిశంసన తీర్మానం ఇచ్చిన విపక్షాలు
Mar 13, 2026 15:00 IST
రంగారెడ్డి: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్రిక్తత
స్టైఫండ్ పెంచాలని పీజీ, పీహెచ్‌డీ స్కాలర్లు నిరసన
ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపిన విద్యార్థులు
Mar 13, 2026 14:59 IST
భర్తను పకోడీ తీసుకురమ్మని పంపి పరారైన భార్య
యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Mar 13, 2026 14:43 IST
తృణమూల్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
బెంగాల్‌లో ఆదివాసీల సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి తెలియజేయాలనుకున్న టీఎంసీ టీమ్
ఈనెల 9న రాష్ట్రపతికి లేఖ రాసిన టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్
ఇటీవల బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై రాష్ట్రపతి అసంతృప్తి
Mar 13, 2026 14:42 IST
సన్‌రైజర్స్ లీడ్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
విదేశీ లీగ్‌లో పాక్ ప్లేయర్ అబ్రార్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ లీడ్ ఫ్రాంచైజీ
ఈ వివాదంపై స్పందించిన బీసీసీఐ
ఆ క్రికెటర్‌ను తీసుకోవడంపై మాకు ఎలాంటి సంబంధం లేదు: బీసీసీఐ
Mar 13, 2026 14:27 IST
మేం లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు: ABN ఆంధ్రజ్యోతితో దేవ్‌జీ
గణపతి ఎక్కడున్నాడో మాకు తెలియదు: దేవ్‌జీ
ప్రస్తుతం మావోయిస్టు పార్టీ క్షీణించింది: దేవ్‌జీ
ప్రభుత్వంతో పోరాటం సాధ్యం కాదు: దేవ్‌జీ
మావోయిస్టు పార్టీ నడపాలంటే డబ్బు అవసరం: దేవ్‌జీ
మా దగ్గర రూ.కోట్లు, బంగారం ఉందని దుష్ప్రచారం: దేవ్‌జీ
రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు: దేవ్‌జీ
Mar 13, 2026 13:38 IST
ప్రకృతి సాగు రైతు రోశయ్యకు సీఎం చంద్రబాబు ప్రశంస
52 రకాల పంటలు సాగు చేస్తున్న గుంటూరు జిల్లా అత్తోటకు చెందిన రైతు రోశయ్య..
80 ఏళ్ల వయసులో ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రోశయ్య..
రైతు రోశయ్యకు నా ప్రణామాలు: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు
Mar 13, 2026 13:36 IST
ఈరోజు, రేపు విశాఖ, అల్లూరి జిల్లాల్లో డిప్యూటీ సీఎం పర్యటన..
అమరావతి: ఈరోజు, రేపు.. విశాఖ, అల్లూరి జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
ఈరోజు సాయంత్రం విశాఖకు చేరుకోనున్న పవన్ కల్యాణ్..
రేపు అల్లూరి జిల్లా పాడేరు మండలం నందిగరువులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
ఇటీవల నిర్మించిన ‘అడవి తల్లి బాట’ రోడ్డును పరిశీలించనున్న పవన్ కల్యాణ్..
Mar 13, 2026 13:11 IST
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన పెను అగ్ని ప్రమాదం..
ఆగి ఉన్న అంబులెన్స్‌లో మంటలు..
పక్కనే ఉన్న పలు వాహనాలకు అంటుకున్న మంటలు.
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..
ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్న రోగులు, అధికారులు..
Mar 13, 2026 12:57 IST
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలం పెద్దాపూర్‌లో దారుణం..
భార్య తనకు మందు పెడుతోందనే అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డ భర్త..
భర్త దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన భార్య..
వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు సమ్మయ్య
Mar 13, 2026 12:46 IST
కామారెడ్డిలో మరోసారి బాలికల అదృశ్యం
బాలసదన్ నుంచి ఉదయం 6గంటలకు ఇద్దరు బాలికల మిస్సింగ్..
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలసదన్ అధికారి..
Mar 13, 2026 12:45 IST
హైదరాబాద్ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సంక్షోభం
గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటల్స్, రెస్టారెంట్లు..
ఇప్పటికే హైదరాబాద్‌లో 40శాతం హోటల్స్ మూసివేత..
కట్టెల పొయ్యిపై ఆధారపడుతున్న క్యాటరింగ్ వ్యాపారులు..
Mar 13, 2026 12:44 IST
సంగారెడ్డి: పటాన్‌చెరులో వంట గ్యాస్ కష్టాలు
గ్యాస్ గోదాం దగ్గర LPG సిలిండర్ల కోసం బారులు తీరిన ప్రజలు..
సిలిండర్ బుక్ చేసినా డెలివరీ చేయడం లేదంటూ ఆందోళన..
ఈనెల 6 వరకు బుక్ చేసిన వారికి సిలిండర్లు ఇస్తున్నామన్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు..
Mar 13, 2026 12:43 IST
ఏపీలో భారీగా డ్రగ్స్ పట్టివేత..
రూ.47కోట్ల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలం స్వాధీనం..
ఇద్దరి అరెస్ట్, 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల కెమికల్స్ సీజ్..
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో DRI తనిఖీలు..
కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా..
Mar 13, 2026 12:42 IST
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్ 1,180, నిఫ్టీ 400 పాయింట్లకుపైగా నష్టం..
డాలర్‌తో పోలిస్తే 92.47కి చేరిన రూపాయి మారకం విలువ ..
Mar 13, 2026 12:41 IST
ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
పిచ్చిగా ప్రవర్తిస్తే.. ఏం జరుగుతుందో మీరే చూస్తారు: ట్రంప్
ఇరాన్ నౌకాదళం ఆనవాళ్లు లేకుండా పోయింది: ట్రంప్
ఇరాన్ వైమానికదళం కూడా ఇక ఉండదు: ట్రంప్
Mar 13, 2026 12:24 IST
ఎన్టీఆర్: దేవునిచెరువు ప్రభుత్వ పాఠశాల ఘటనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం
ఆహార నాణ్యత తక్కువగా ఉందన్న సమాచారంతో చర్యలు: మంత్రి లోకేశ్
విచారణకు త్రిసభ్య కమిటీ..
కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు..
ఏజెన్సీని మార్చడంతో పాటూ హెడ్మాస్టర్‌పై వేటు..
Mar 13, 2026 12:22 IST
హైదరాబాద్: గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..
హాజరైన సీఎస్, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు..
గ్యాస్, ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రలాజీ అధికారులతో సమావేశం..
గ్యాస్ నిల్వలు, అంతర్జాతీయ పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష..
ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..
Mar 13, 2026 11:02 IST
ఫ్లైఓవర్ పైనుంచి కింద పడ్డ కాంక్రీట్ లోడ్ లారీ
విశాఖ: గాజువాకలోని వడ్లపూడి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ కాంక్రీట్ లోడ్ లారీ..
ప్రమాదంలో దెబ్బతిన్న లారీ ముందు భాగం..
లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు..
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
Mar 13, 2026 10:56 IST
కొమురంభీం జిల్లా: పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు
అందుబాటులో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల బారులు..
కిలోమీటర్ల మేర క్యూ కట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం..
పెట్రోల్, డీజిల్ కొరత లేదంటున్న అధికారులు..
Mar 13, 2026 10:50 IST
పసిడి ప్రియులకు శుభవార్త.. పతనమైన బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.980 పతనమై రూ.1,61,240కి చేరిన బంగారం
22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.900 తగ్గి రూ.1,47,800కి చేరిన పసిడి
కిలోకు రూ.100 తగ్గి రూ.2,79,900గా ట్రేడ్ అవుతున్న వెండి
Mar 13, 2026 10:22 IST
గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం: ABNతో మంత్రి పొన్నం
కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్యాస్ సమస్య..
గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బాధ్యత వహించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
Mar 13, 2026 10:21 IST
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం
జస్టిస్ లిసా గిల్‌తో ప్రమాణం చేయించిన CJ ధీరజ్‌సింగ్ ఠాకూర్..
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లిసా గిల్..
Mar 13, 2026 09:55 IST
శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితులకు మరో గుడ్ న్యూస్..
నేడు పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో మొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స..
హేమ శ్రీ అనే యువతికి శస్త్ర చికిత్స చేయనున్న నిపుణులు..
కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు ఇప్పటికే రూ.12 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం..
మొదటి శస్త్ర చికిత్స కోసం పలాసకు రానున్న వైద్య నిపుణులు..
Mar 13, 2026 09:38 IST
భక్తుల పైకి దూసుకెళ్లిన బొలెరో.. 15 మందికి గాయాలు..
నంద్యాల: శ్రీశైలం టోల్‌గేట్ దిగువన చోటుచేసుకున్న ఘటన..
అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లిన బొలెరో..
15 మంది కర్ణాటకకు చెందిన భక్తులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు..
Mar 13, 2026 08:53 IST
నేడు రాష్ట్ర పండుగగా కవయిత్రి మొల్లమాంబ జయంతి
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మొల్ల జయంతి ఉత్సవం..
మొల్ల జయంతి ఉత్సవంలో పాల్గొననున్న మంత్రి సవిత..
Mar 13, 2026 08:39 IST
బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
కారును ఢీకొన్న కర్ణాటక బస్సు..
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అనురాగ్, ఐశ్వర్య దంపతుల మృతి..
బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న దంపతులు..
కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఘటన..
Mar 13, 2026 08:10 IST
శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు..
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సినీ ప్రముఖులు..
శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న సంగీత దర్శకుడు తమన్, డైరెక్టర్ బాబీ, నిర్మాత లోహిత్ తదితరులు..
Mar 13, 2026 08:06 IST
నంద్యాల: నల్లమల అడవిలో కార్చిచ్చు
మహానంది క్షేత్రం వెనుక ఎగిసిపడుతున్న మంటలు..
వన్యప్రాణుల మనుగడకు పొంచి ఉన్న ముప్పు..
రక్షణ చర్యలు చేపట్టాలని అటవీ శాఖను కోరుతున్న స్థానికులు..
ఎండాకాలం ప్రారంభంతో అడవిలో వ్యాపిస్తున్న మంటలు..
Mar 13, 2026 07:34 IST
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
టూరిస్ట్ బస్సు బోల్తా, నలుగురి మృతి, పలువురికి గాయాలు..
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న బస్సు..
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు..
Mar 13, 2026 07:32 IST
స్వల్పంగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.10 పతనమై రూ.1,62,210కి చేరిన బంగారం
22 క్యారెట్ల 10 గ్రాములపైనా అదే స్థాయిలో తగ్గి రూ.1,48,690కి చేరిన పసిడి
కిలోకు రూ.100 తగ్గి రూ.2,79,900గా ట్రేడ్ అవుతున్న వెండి
Mar 13, 2026 06:58 IST
మళ్లీ 100 డాలర్లకు చేరుకున్న చమురు ధర
హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా ఆగిపోవడంతో..
మళ్లీ భారీగా పెరిగిన బ్యారెల్ క్రూడాయిల్ ధర
Mar 13, 2026 06:58 IST
దేశంలోనే తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం
వరుసగా రెండో నెలలోనూ అత్యధిక ద్రవ్యోల్బణం నమోదు..
ఫిబ్రవరిలో దేశంలో 3.21 శాతం ద్రవ్యోల్బణం..
తెలంగాణలో 5.2 శాతంగా ద్రవ్యోల్బణం నమోదు..
Mar 13, 2026 06:57 IST
నేటి నుంచి చర్లపల్లి-కామాఖ్య అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్
శ్రీకాకుళం రోడ్, విజయనగరం, రాజమండ్రి, భీమవరం..
విజయవాడ, గుంటూరు, నల్లగొండలో ఆగనున్న అమృత్‌భారత్..
Mar 13, 2026 06:56 IST
తెలంగాణ రవాణా శాఖలో నేటి నుంచి కొత్త విధానం
ఆన్‌లైన్‌లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లు..
ఇకపై డాక్యుమెంట్లు అన్నీ ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్..