మార్చి 21, 2026 07:55 IST
తిరుమల: అన్నదాన కాంప్లెక్స్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి ఒక్క రోజు వ్యయం అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని ఇప్పటికే టీటీడీకి విరాళంగా అందించిన సీఎం కుటుంబం
భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన చంద్రబాబు కుటుంబం
అన్నప్రసాద వితరణ అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించిన సీఎం కుటుంబం
ఇప్పటికి 12 సార్లు ఎస్వీ అన్నదాన ట్రస్ట్‌కు దేవాన్ష్ పేరిట విరాళం ఇచ్చిన సీఎం చంద్రబాబు కుటుంబం
మార్చి 21, 2026 07:37 IST
హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు
ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక పార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్న ముస్లిం సోదరులు
మీరాలం ట్యాంక్ వద్ద ఉన్న ఈద్గాకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న ముస్లిం సోదరులు
మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న సామూహిక ప్రార్థనలు
మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు
లా అండ్ ఆర్డర్, క్విక్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లతో భద్రతను ఏర్పాటు చేసిన అధికారులు
రద్దీ నేపథ్యంలో మీరాలం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మార్చి 21, 2026 07:25 IST
విజయనగరం: ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం
రామభద్రపురం మం. తారాపురం దగ్గర బస్సులో చెలరేగిన మంటలు
బస్సు వెనుక టైర్ పేలి చెలరేగిన మంటలు
టైర్ పేలడంతో బస్సు నుంచి ప్రయాణికులను దించేసిన డ్రైవర్
మంటల ధాటికి పూర్తిగా దగ్ధమైన బస్సు, తప్పిన ప్రాణనష్టం
భువనేశ్వర్ నుంచి మల్కాజిగిరికి వెళ్తున్న ఒడిశా ట్రావెల్స్ బస్సు
మార్చి 21, 2026 07:24 IST
అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి కన్నుమూత
మార్చి 21, 2026 07:24 IST
తెలంగాణలో పాఠశాలలు, తరగతుల కోసం నిధులు
PP-2 నుంచి ఇంటర్ వరకు 11 కొత్త స్కూళ్లు ఏర్పాటు
ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ అయిన మరో 17 స్కూళ్లు
164 పాఠశాలల్లో 501 తరగతి గదుల నిర్మాణం
రూ.1,011 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
మార్చి 21, 2026 07:23 IST
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం
మార్చి 21, 2026 07:23 IST
రేపు సిద్దిపేట జిల్లా నర్మెట్టకు సీఎం రేవంత్ రెడ్డి
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్
రూ.300 కోట్లతో 365 ఎకరాల విస్తీర్ణంలో రిఫైనరీ
మార్చి 21, 2026 07:23 IST
విశాఖలో త్వరలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ
రూ.2,387 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ASIP సంస్థ
30 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం
Mar 21, 2026 07:22 IST
ద్రోణి ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు
Mar 21, 2026 07:22 IST
బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు మరింత ఆర్థిక భారం
అన్ని కేటగిరీ వీసాలపై ఫీజులు పెంచిన బ్రిటన్
ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి UK వీసా ఫీజుల పెంపు
Mar 21, 2026 07:22 IST
పశ్చిమాసియాలో 22వ రోజుకు చేరిన యుద్ధం
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఆగని ఇరాన్ దాడులు
కువైట్‌లోని కీలక రిఫైనరీలో మంటలు
పర్యాటక ప్రాంతాలపై కూడా దాడులు చేస్తామన్న ఇరాన్
Mar 21, 2026 07:21 IST
ఏపీలో నేడు జరగాల్సిన టెన్త్ ఇంగ్లీష్ పరీక్ష వాయిదా
నేడు రంజాన్ సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఏప్రిల్ 2న జరగనున్న పదోతరగతి ఇంగ్లీష్ పరీక్ష
Mar 21, 2026 07:21 IST
నేడు ఈద్-ఉల్-ఫితర్
మార్చి 21, 2026 07:20 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
మనవడు దేవాన్ష్ బర్త్‌డే సందర్భంగా..
స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబసభ్యులు