ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్ | ABN AndhraJyothy Ap Telangana National International Breaking Live Updates of 7th April 2026 kjr


  • Apr 07, 2026 09:55 IST

    ‘వీకెండ్ కామెంట్‌ బై ఆర్కే’ కథనంపై వైసీపీ రాద్ధాంతం

    • ABN ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణుల ఆందోళన

    • ABN ఆంధ్రజ్యోతి లక్ష్యంగా వికృత క్రీడ

    • కార్యాలయం లోపలకు వెళ్లేందుకు వైసీపీ శ్రేణుల యత్నం

    • ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు, తోపులాట

    • ఆందోళన ముసుగులో దాడులతో భయపెట్టాలనుకుంటున్న వైసీపీ

    • మావిగన్ ఊబి నుంచి బయటపడేందుకు వైసీపీ కుయుక్తులు

  • Apr 07, 2026 09:29 IST

    అమరావతి: NTR వైద్య సేవ ట్రస్టు ఆస్పత్రుల సమ్మె విరమణ

    • ప్రభుత్వ హామీతో సమ్మె విరమించినట్టు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటన

    • 10 రోజుల్లో రూ.వెయ్యి కోట్లు చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ

  • Apr 07, 2026 09:25 IST

    ఢిల్లీ: వలస కార్మికులకు కేంద్రం గుడ్‌న్యూస్

  • Apr 07, 2026 08:34 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉదయం 11.30 గంటలకు SIPB సమావేశంలో పాల్గొననున్న సీఎం

    • మధ్యాహ్నం 2.30కి ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

    • మధ్యాహ్నం 3.50కి అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌కు సీఎం చంద్రబాబు

    • నూతన ఫైరింజన్లు, అగ్నిమాపక పరికరాలను ప్రారంభించనున్న సీఎం

  • Apr 07, 2026 08:33 IST

    హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు హౌస్ అరెస్ట్

    • పరిగి వెళ్లకుండా హరీష్‌రావు గృహ నిర్బంధం

    • హరీష్‌రావుతో పాటూ సబిత, పలువురు BRS నేతల హౌస్‌అరెస్ట్

    • హరీష్‌రావు నివాసం దగ్గర పోలీసుల మోహరింపు

    • ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను కలిసేందుకు పరిగి వెళ్తానన్న హరీష్‌రావు

  • Apr 07, 2026 07:43 IST

    అమరావతి: సమర్థ నీటి సరఫరాపై వర్క్‌షాప్‌

    • కానూరు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆఫీస్‌లో సమావేశం

    • హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

  • Apr 07, 2026 07:43 IST

    నేడు ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ

    • 20 లక్షల ఉద్యోగాల కల్పనపై సమీక్ష

    • మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో సమావేశం

    • ఉద్యోగాల కల్పన, భవిష్యత్‌ ప్రణాళికపై చర్చ

  • Apr 07, 2026 07:34 IST

    నేడు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

    • ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో సీఎం రేవంత్ రోడ్ షో

    • ఉదయం 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షో నిర్వహించనున్న సీఎం

    • మధ్యాహ్నం 2 గంటలకు పతానపురంలో సీఎం రోడ్ షో

    • కేరళలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..

  • Apr 07, 2026 07:28 IST

    నేడు విజయవాడలో పర్యటించనున్న మంత్రి నారాయణ

    • విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మూడు కీలక రోడ్ల విస్తరణకు శంకుస్థాపన

    • విజయవాడ ఈస్ట్, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో రోడ్ల విస్తరణ

  • Apr 07, 2026 07:18 IST

    నేడు హుజురాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దీక్ష

    • సిరసపల్లిలో డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా దీక్ష

    • 48 గంటల పాటు దీక్ష చేయనున్న కౌశిక్‌రెడ్డి

  • Apr 07, 2026 07:05 IST

    ఉత్తర సిక్కింలో భారీగా మంచు

    • లాచెన్‌లో మంచులో చిక్కుకున్న 1200 మంది పర్యాటకులు

    • యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు

    • లాచెన్‌-శివమందిర్‌ మార్గంలో భారీగా పేరుకున్న మంచు

    • ప్రతికూల వాతావరణంలో సహాయక చర్యలకు ఆటంకం

  • Apr 07, 2026 07:05 IST

    నంద్యాల: నేడు శ్రీశైలంలో కుంభోత్సవం

  • Apr 07, 2026 07:04 IST

    IPL: నేడు రాజస్థాన్‌ Vs ముంబై మ్యాచ్‌

  • Apr 07, 2026 07:04 IST

    ఢిల్లీ: నేటి నుంచి జీన్‌కింగ్‌ టెన్నిస్‌ టోర్నీ

    • ప్లేఆఫ్స్‌ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్‌

    • తొలిపోరులో థాయ్‌లాండ్‌తో తలపడనున్న భారత్‌

  • Apr 07, 2026 07:03 IST

    నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

    • బరిలో పీవీ సింధు, లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌

  • Apr 07, 2026 06:22 IST

    ఏపీలోని పలు జిల్లాలకు నేడు రెడ్‌ అలర్ట్‌

  • Apr 07, 2026 06:21 IST

    నేటితో ముగియనున్న ఇరాన్‌కు ట్రంప్‌ విధించిన గడువు

    • ఇరాన్‌కు విధించిన గడువు పొడిగించలేదు: డొనాల్డ్‌ ట్రంప్‌

    • ఇరాన్‌ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తాం..

    • ఇరాన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటాం..

    • ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: డొనాల్డ్‌ ట్రంప్‌

  • Apr 07, 2026 06:19 IST

    నేడు ములుగు జిల్లా కర్రెగుట్టల్లో DGP శివధర్ రెడ్డి పర్యటన

    • వెంకటాపురం మండలం కర్రెగుట్టల్లో పర్యటించనున్న డీజీపీ

    • చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణతో కలిసి పర్యటించనున్న డీజీపీ

    • కొత్తగా ఏర్పాటు చేసిన పామునూరు పోలీస్ బేస్ క్యాంప్‌ పరిశీలన

    • ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగిసిన తర్వాత డీజీపీ పర్యటన

  • Apr 07, 2026 06:18 IST

    ఏపీలో బస్సు ప్రమాదాలపై నేడు సమీక్ష

    • అమరావతి: ఏపీలో బస్సు ప్రమాదాలపై నేడు మంత్రుల సమీక్ష

    • సమీక్షించనున్న హోంమంత్రి అనిత, మంత్రి రాంప్రసాద్ రెడ్డి

  • Apr 07, 2026 06:16 IST

    రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

    • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం ధన్యవాదాలు

    • ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం..



  • Source link

    Spread the love