ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలంటూ తెరపైకి డిమాండ్..?


ఇటీవలే కేరళ రాష్ట్రం పేరును కేరళగా మార్చడానికి అటు కేరళ అసెంబ్లీ ,కేంద్ర క్యాబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు అదే బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు కూడా మార్చాలని డిమాండ్ తెరపైకి వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు కూడా ఈ డిమాండ్ ని తెరమీదకి తీసుకున్నారు. కేరళ వాళ్లకు ఉన్నటువంటి భాషాభిమానం, రాష్ట్ర అభిమానం మనకు లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరు ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా తెలుగునాడు అని మార్చాలని, అప్పుడే మనకు జాతీయ అభిమానం ఉంటుందని.

ఇంకా ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదని, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎంతో ఆంధ్రప్రదేశ్ కూడా అంతేనని, మన రాష్ట్రం పేరును తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలని, కేరళ వాళ్ళు ఒక సున్నా లేకపోతే ఇబ్బందయ్యింది.. మా రాష్ట్రం మా భాష మార్చాల్సిందే అనుకున్నారు. అందుకే కేరళంగా మార్చుకున్నారు. అటువంటి పట్టుదలే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా వస్తే పేరే కాదు మన బతుకులు కూడా మారుతాయి అంటూ గరికపాటి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల అమలాపురంలో నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలలో ఈ విషయాలు తెలియజేసినట్లు తెలుస్తోంది. తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చింది మొదలు చనిపోయే వరకు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారని, పిల్లలకు ఐదవ తరగతి వరకు అయినా కనీసం తెలుగు మాధ్యమం కచ్చితంగా చేసినప్పుడే తెలుగు భాష బ్రతుకుతుందని, తన ఇద్దరు పిల్లల్ని కూడా తాను తెలుగు మీడియంలో చదివించాను అంటూ తెలియజేశారు. తెలుగు మాధ్యమం వల్ల ఎవరూ నష్టపోరని గరికపాటి. ప్రతి ఒక్కరు సొంత దేశంలో ఇక్కడే పనిచేయాలనుకుంటే ఇండియా ఐదేళ్లలో విశ్వగురువుగా మారుతుందని తెలిపారు. ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్చడానికి ప్రయత్నించిన కొందరు వ్యక్తులు ఏకీభవించారు మరి కొంతమంది ఆంధ్ర అనే చారిత్రక పేరును మార్చుకోలేకపోయారని, అందుకే తెలుగు గంగ, తెలుగు గ్రామీణ పథకం పేర్లతో తెలుగు వారి కోసం తన మక్కువను చాటుకున్నారని చెప్పారు.





Source link

Spread the love