ఆ ప్రాంతాన్ని ఇండియాలో కలుపుతూ అమెరికా కొత్త మ్యాప్!


దిశ, వెబ్ డెస్: ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మధ్యంతర వాణిజ్య ఒప్పందం వర్క్ కూడా ఖరారు అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇండియాకు సంబంధించిన మ్యాప్ ను అమెరికా విడుదల చేసింది. ట్రేడ్ డీల్ పై ట్రంప్ రూపొందించిన భారతదేశ మ్యాప్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ మ్యాప్ అమెరికా విడుదల నేపథ్యంలో పాకిస్థాన్, అటు చైనా దేశాలు కంగుతిన్నాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా మొత్తం జమ్మూ కాశ్మీర్ ను ఇండియా భూభాగంగా తాజాగా అమెరికా తాజాగా కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. అదే సమయంలో చైనా తన భూభాగంగా వాదించే ఆక్సాయ్‌ చిన్ ప్రాంతం కూడా ఇండియాదే అన్నట్లుగా. ఇండియా ప్రాదేశిక సర్వభూమాత్వాన్ని ధ్రువీకరించడానికి అమెరికా ఆమోదం అసలు అవసరం లేదు. మొదటి నుంచి కాశ్మీర్ ఇండియాదే. ఇదే సమయంలో మోడీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అయితే ఇంతకుముందు అమెరికా విడుదల చేసిన ఇండియన్ మ్యాప్ మాత్రం, పాకిస్తాన్ వాదనకు అనుగుణంగా ఉంటుందని అంటున్నారు. కానీ ఇప్పుడు చైనాతో పాటు పాకిస్థాన్ కు షాక్ ఇచ్చేలా ఇండియా మ్యాప్ రిలీజ్ చేసింది ట్రంప్ సర్కార్.



Source link

Spread the love