ఇండియన్ ఆర్మీ యూనిట్లు మంగళవారాల్లో నాన్ వెజ్ మానుకోండి,’ఇండియన్ ఆర్మీలో మంగళ, గురువారాల్లో నాన్వెజ్ తినరు.. ఎర్రటి పండ్లు తినొద్దని చెబుతారు’: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ అనంత నారాయణ్ – రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ అనంతనారాయణ భారతీయ సైన్యంలోని నమ్మకాల గురించి ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు.


భారతయంలో చాలా నమ్మకాలు ఉన్నాయని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ అనంత నారాయణ్ సైన్ చెప్పారు. 42 ఏళ్లపాటు సైన్యంలో వివిధ స్థాయిలు, విభాగాల్లో సేవలు అందించిన ఆయన ఆర్మీ గురించి కీలక విషయాలు. ఆర్మీలో మంగళ, గురువారాల్లో దాదాపుగా మాంసాహారం తినరని, మద్యం సేవించరని ఆయన చెప్పారు. ఆ రెండు రోజులు మందిర్ పరేడ్ నిర్వహించారని, సాయంత్రం వేళలో హారతి కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన చెప్పారు.

హైలైట్:

  • భారత సైన్యంలో ఆశ్చర్యం గొలిపే నమ్మకాలు
  • మంగళ, గురువారాల్లో నాన్వెజ్ దాదాపు తినరు
  • మంగళవారం ఆఫీసు మెస్‌లలో పార్టీలు కూడా ఉండవు
  • ఆసక్తికర విషయాలు వెల్లడించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి
భారత సైన్యం మంగళ, గురువారాల్లో నాన్‌వెజ్‌ లేదు1
భారతీయ సైన్యంలో విశ్వాసాలపై Rtd లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ అనంత నారాయణ్ (చిత్రం AI ద్వారా రూపొందించబడింది)(ఫోటోలు– సమయం తెలుగు)
ఇండియన్ ఆర్మీ.. ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ గల సైనిక దళాల్లో ఒకటి. కేవలం సరిహద్దుల రక్షణే కాకుండా విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడంలోనూ భారత సైన్యం ముందు ఉంటుంది. అయితే ఆర్మీలోనూ కొన్ని నమ్మకాలు ఉంటాయని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ అనంత నారాయణ్ చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సైన్యం గురించి ఆసక్తికర విషయాలు ఉన్నాయి.”ఆర్మీలో చాలా నమ్మకాలు ఉంటాయి. మంగళవారం, గురువారాల్లో ఆర్మీలో దాదాపుగా నాన్‌వెజ్ తినరు, మద్యం సేవించారు. ఆఫీసర్ మెస్‌లలోనూ మంగళవారాలు పార్టీలు ఉండవు. సరిహద్దుల్లో గురువారం పీర్ బాబా డే అని చెబుతారు. అన్ని సెంటిమెంట్, నమ్మకం. దాన్ని అందరూ పాటిస్తారు. మంగళ, గురువారాల్లో చిన్న మందిరంలో పూజలు చేస్తారు, సాయంత్రం సమయంలో హారతులు ఇస్తారు. అది మైనస్ 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండే పరిస్థితుల్లో ఉండవచ్చు లేదా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండే వేడి పరిస్థితులైనా కావచ్చు. దీన్ని మందిర్ పరేడ్ అంటారు. చెన్నై లాంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో సైనికులతోపాటు వారి భార్యాపిల్లలు కూడా ఈ హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ హారతి పాటను వింటే ఏదో తెలియని శక్తి వస్తుంది. సరిహద్దుల్లో మాత్రం సైనికులు మాత్రమే ఈ మందిర్ పరేడ్ చేస్తారు” అని అరుణ్ అనంత నారాయణ్ చెప్పారు.
”ఆర్మీలో వ్యక్తిగత మూఢనమ్మకాలు ఉండవు. కానీ యూనిట్ పరంగా నమ్మకాలు, సంప్రదాయాలు మాత్రం ఉంటాయి. ఆర్మీలోని 10-12 యూనిట్లకు హిమాలయన్ గోట్స్ మస్కట్‌లుగా ఉంటాయి. వాటికి ట్రైనింగ్ ఇస్తారు. వీఐపీలు వెళ్లినప్పుడు అవి సెల్యూట్ చేస్తున్నాయి. దానికి బెల్లం లాంటిది పెడతారు. యూనిట్ పరేడ్ అయినప్పుడు ఈ హిమాలయన్ గాట్ కమాండింగ్ ఆఫీసర్ పక్కన నిలబడుతుంది” అని ఆయన చెప్పారు.

”మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న బెలగావిలో కమాండో స్కూలు ఉంది. ఇన్ఫెంట్రీ రెజిమెంట్ ఆఫీసర్లు ఇక్కడ కచ్చితంగా 33 రోజులు కమాండో శిక్షణ పొందాలి. అది చాలా కోర్సు. ఆ కోర్సులో జంగల్ సర్వైవల్ ఒక భాగం. అందులో చాలా టాపిక్‌లు ఉంటాయి. దొరికింది తిని ప్రాణాలు నిలబెట్టుకోవాల్సిన అందులో ఒకటి. దానిలో భాగంగా నేను పామును తిన్నాను. వండుకొని తింటే అది కూడా చికెన్‌లాగే ఉంటుంది. పామును పట్టుకొని, కత్తిరించి, చర్మం తీసేసి వంట చేసుకొని తినడమే. అసోంలో జరిగిన ఓ ఆపరేషన్ సమయంలో మమ్మల్ని ఓ దీవిలో వదిలేశారు. కానీ వాతావరణ పరిస్థితులు బాగోలే మమ్మల్ని తిరిగి వెనక్కి తీసుకెళ్లడం ఆలస్యమైంది. అప్పుడు ఆకలి తీర్చుకోవడం కోసం నేను బాతును తినాల్సి వచ్చింది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేటిని తినాలి, వేటిని తినకూడదో శిక్షణ సమయంలో చెబుతారు. కొత్త ప్రదేశంలో, ఏమీ తెలియకపోతే ఎర్రటి ఫలాలు తినొద్దని చెబుతారు. ప్రాణాలను కాపాడుకోవడం దేన్నైనా చంపి తినవచ్చు” అని అరుణ్ చెప్పాడు.

”ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గ్లాసులో రమ్ము ఇస్తారు. కొన్ని యూనిట్లలో రమ్ము తాగిన తర్వాత ఆ గ్లాసును నమిలి మింగే సంప్రదాయం ఉంది. అలా నేను కూడా చేశాను. స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లలో ఇలా చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటివి తగ్గుతున్నాయి. స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ పొందిన వాళ్లంతా పారాషూట్‌ సాయంతో ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి దూకగలరు. వాళ్ల దగ్గరున్న ఆయుధాలు రాత్రి సమయంలోనూ ఉపయోగించగలిగే సామర్థ్యంతో ఉంటాయి. పేలుడు ట్రైనింగ్, లాంగ్వేజ్ స్కిల్స్, కోవర్టు ఆపరేషన్లు, సర్వైవల్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్ వారికి మెరుగ్గా ఉంటాయి. సాధారణ సైనికుల లెవల్ 60 శాతం అనుకుంటే.. దాన్ని 80 శాతం పెంచితే ఏమవుతుందో.. అలాంటి వారిని స్పెషల్ ఫోర్సెస్‌లోకి తీసుకుంటారు” అని లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ అనంత నారాయణ్ చెప్పారు.

రవి కుమార్

రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో చేరిన రవి కుమార్.. ఏపీ, తెలంగాణ వార్తలు, అంతర్జాతీయ కథనాలు, విశ్లేషణలతోపాటు స్పోర్ట్స్ న్యూస్ రాస్తున్నారు. సోషల్ మీడియా పట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం రవి కుమార్‌కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ ‘సజగ్’ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలో వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను రవి కుమార్ ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. రవి కుమార్ ఈనాడు జర్నలిజం స్కూల్లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, విద్యాలయం న్యూస్ రాశారు. 2014 ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. 2019, 2024 ఎన్నికలకు ముందు పొలిటికల్ పోల్స్ నిర్వహించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, క్రికెట్ చూడటం, ప్రకృతిలో గడపడాన్ని ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి