ఆంధ్ర ప్రదేశ్ ఇండియా టుడే CVoter సర్వే 2026: ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?. ఇండియా టుడే సీ ఓటర్ తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కూటమికి ఓటు శాతం పెరుగుతుందని.. వైఎస్సార్సీపీకి తగ్గుతుందని సర్వే చెబుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకోగా.. బీజేపీకి తగ్గింది.. బీఆర్ఎస్ కాస్త పుంజుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే.. బీజేపీకి మెజారిటీ వస్తుందని సర్వే చెబుతోంది.
హైలైట్:
- ఇండియా టుడే సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్
- ఏపీలో పరిస్థితులపై సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలా

తాజాగా ఇండియా టుడే ఓటర్ సర్వే ఫలితాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (NDA) ఓటు శాతం 53 శాతం నుంచి 55 శాతం పెరిగింది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే కూటమికి 22 నుంచి 24 సీట్లు వస్తాయని అంచనా వేశారు. వైఎస్సార్సీపీ ఓటు శాతం 40 నుంచి 39కు పడిపోయింది.. 1 నుంచి 3 ఎంపీ సీట్లు వస్తాయంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతరులు కలిపి 6 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సర్వే ఫలితాలను బట్టి ఏపీలో కూటమి ప్రభుత్వంపై సానుకూలంగానే ఉన్నారనే చర్చ. ఎందుకంటే బలంగా ఉండటంతో పాటుగా ప్రభుత్వ పథకాలతో ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే వైఎస్సార్సీపీకి మాత్రం ఒక్క శాతం ఓటు షేర్ పడిపోతుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ సర్వే ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్సీపీకి మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయనే చెప్పాలి.
ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. ఇకపై మూడు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!
తాజాగా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఫలితాల ప్రకారం.. తెలంగాణలో అంచనాలను కూడా కలిగి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 2024లో 40.1 శాతం ఓట్ షేర్ వచ్చింది.. ఇప్పుడు అది 41 శాతం పెరిగిందని సర్వే ద్వారా తెలుస్తోంది. బీజేపీకి 2024లో 35 శాతం ఉండగా.. ఇప్పుడు 33శాతానికి తగ్గిందంటున్నారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే.. 2024లో 16.6 శాతం రాగా.. 18శాతానికి పెరిగిందంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం పెరిగింది.. బీజేపీకి తగ్గింది, బీఆర్ఎస్‌కు 1.5 శాతం పెరిగింది.
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెబుతోంది. ఎన్డీయే ఏకంగా 352 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు.. ఇందులో బీజేపీకి సొంతంగా 287 సీట్లు వస్తాయని.. ఇండీ కూటమికి 182 స్థానాలు పరిమితం అవుతాయని.. కాంగ్రెస్ పార్టీకి 80 స్థానాలు దక్కుతాయని సర్వేలో తేలిందంటున్నారు.
