- జేడీ వాన్స్-నెతన్యాహు మధ్య తీవ్ర ఘర్షణ
- ఫోన్ సంభాషణలో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్‌పై దాడులు చేయాలన్న అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ చాలా హాట్ హాట్ గా సాగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్‌పై యుద్ధం విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్లుగా ఆక్సియోస్ తన నివేదికలో పేర్కొన్నది.
సోమవారం నెతన్యాహు-జేడీ వాన్స్‌ల మధ్య జరిగిన తీవ్ర సంభాషణ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని కొందరు జేడీ వాన్స్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించారని వైట్‌హౌస్ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇజ్రాయెల్-అమెరికన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో నెతన్యాహు చేసిన అనేక అంచనాలు.. ముఖ్యంగా ఇరాన్ ప్రభుత్వ యుద్ధం గురించి కూలదోయడానికి ప్రజలు తిరుగుబాటు చేసే విషయంలో మితిమీరిన ఆశావాదంతో కూడుకున్నవని పేర్కొన్నారు. యుద్ధానికి ముందు పాలన మార్పు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పి నెతన్యాహు.. అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రలోభపెట్టారని.. ఇప్పుడు ఆ వ్యాఖ్యల గురించి నెతన్యాహును జేడీ వాన్స్ ప్రశ్నిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: యోగి ఆదిత్యనాథ్: సీఎం యోగికి ఐదేళ్ల బాలిక గిఫ్ట్.. ఏంచ్చిందంటే..!
ఇదిలా ఉండగా ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం భూతల దాడులకు దిగడంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. ”ఈ ప్రాంతంలోని తమ స్థావరాల్లో సొంత సైనికులను కాపాడలేక.. వారిని హోటళ్లు, పార్కుల్లో దాచిపెడుతున్న అమెరికా.. ఇరాన్ గడ్డపై వారిని ఎలా కాపాడుతుందా?.” అని ప్రశ్నించారు.
రష్యా హెచ్చరిక
ఇరాన్లో అమెరికా జరిపిన భూతల సైనిక చర్య వియత్నాం యుద్ధం వంటి పరిణామాలనే కలిగిస్తుంది.. దాని నుంచి అమెరికా గౌరవప్రదంగా బయటపడలేదని రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు మెద్వెదేవ్ హెచ్చరిక. అటువంటి పరిణామాలు ఈ వినాశకరంగా ఉంటాయని చెప్పారు. గతంలో ఇరాన్ కూడా అమెరికాకు వియత్నాం యుద్ధాన్ని గుర్తు చేసిందని.. వియత్నాం యుద్ధంలో అమెరికా ఘోర పరాజయాన్ని చవిచూసిందని.. అమెరికా ప్రజలు దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరని గమనించాలని రష్యా సూచించింది.
ఇది కూడా చదవండి: PM Modi: అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ