ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో సౌదీ యువరాజుపై ట్రంప్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు


  • సౌదీ యువరాజుపై ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యలు
  • నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు
  • ఇరాన్‌తో యుద్ధానికి గల్ఫ్ దేశాలు సహకరిస్తున్నాయని వ్యాఖ్య
'నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు'.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించారు. ”అతను నా కాళ్లకు నమస్కరిస్తాడని నేను అనుకోలేదు.” అని ట్రంప్.

247

ఫ్లోరిడాలో జరిగిన ‘ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్’ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాతో గల్ఫ్ దేశాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సౌదీ యువరాజుపై చురకలు అంటించారు. ”ఇలా జరుగుతుందని అతను అనుకోలేదు… అతను నా కాళ్ళకు నమస్కరించాల్సి వస్తుందని ఊహించలేదు… మరో సాధారణ అమెరికా అధ్యక్షుడిలా ఉంటానన్నాడు.” అంటూ ట్రంప్ చెప్పారు.

అలా సౌదీ యువరాజును విమర్శించిన వెంటనే ట్రంప్ తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్ ”అద్భుతమైన వ్యక్తి”, ”యోధుడు”గా అభివర్ణించారు.సౌదీ అరేబియా ప్రజలు అతన్ని చూసి గర్వపడాల్సిన పొగడ్తలతో ముంచెత్తారు.

ఇది కూడా చదవండి: ట్రంప్: ఓడిపోయినోళ్లతో తిరగడమే ఇష్టం.. ప్రశ్నోత్తరాల్లో ట్రంప్ కీలక సంభాషణ

ఇదిలా ఉంటే న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మహమ్మద్ బిన్ సల్మాన్ గోప్యంగా ట్రంప్‌తో సంప్రదింపులు జరుపుతూ ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగించాలని సూచించినట్లు నివేదికలో పేర్కొంది. దీనిని “చారిత్రాత్మక అవకాశం” గాట్లు తన కథనంలో ప్రదర్శించారు. అయితే ఈ ఆరోపణలను సౌదీ అరేబియా ఖండించింది. తాము శాంతియుత పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేసింది.





Source link

Spread the love