ఊసరవెల్లే సిగ్గు పడేలా ప్రవర్తిస్తున్న వాడివి.. కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. News in Telugu


Brs kcr పై కడియం శ్రీహరి వ్యాఖ్యలను పల్లా రెజేశ్వర్ రెడ్డి ఖండించారు. తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇంకా ఎన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు చేస్తారని కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. తెలంగాణ జాతిపిత అంశంపై కూడా కేసీఆర్ పై సెటైరిక్ వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు తెలంగాణ రాక ముందు ఎంత ఉన్నాయ్.. ఇప్పుడు ఏకంగా అంతగా ఎలా పెరిగాయ్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల్నిమభ్యపెట్టడం మానుకోవాలని దేశానికి మహాత్మ గాంధీ ఒక్కరే జాతిపిత అని స్పష్టం చేశారు.

జీ న్యూస్‌ని ప్రాధాన్య మూలంగా జోడించండి

ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరిపై తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ గారి మీద చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కడియం శ్రీహరి అంటే మోసానికి పర్యాయపదమని అన్నారు. ఊసరవెల్లే కూడా సిగ్గు పడేలా నమ్ముకున్నవారిని అందరిని మోసం చేస్తూ వస్తున్న వాడివంటూ ఏకిపారేశారు.

గతంలో.. ఎన్టీఆర్ ని, చంద్రబాబు నాయుడును సైతం మోసం చేసిన చరిత్ర అనిగుర్తు చేశారు. కేసీఆర్ గారిని మోసం చేసి ఇవ్వాళ రేవంత్ రెడ్డి పంచన చేరావని ఫైర్ అయ్యారు. కేసీఆర్ గారు నిన్ను ఎంపీను చేసి, ఎమ్మెల్సీ ని చేసి, మినిస్టర్ ని చేసి, ఎమ్మెల్యేని చేసి, నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిన కూడా విశ్వాసం లేకుండా మారావని పేర్కొన్నారు.

మరింత చదవండి: బండి సంజయ్: మీ అవినీతి చిట్టా అంతా మా దగ్గరుంది.!. కాంగ్రెస్ మంత్రులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

రాజకీయ పునర్జీవనం ప్రసాదించిన కేసీఆర్ గారిని , ఈరోజు రేవంత్ పంచన చేరి నీకు ఇష్టం వచ్చిన విధంగా తిడుతున్నవ్ అంటూ తూర్పారబట్టారు. నీ లాంటి నీచమైన నికృష్టమైన రాజకీయ నాయకుడు ఈ భూమ్మీద లేడని, కేసీఆర్ ని ఈ విధంగా తిడుతున్న నీవు ఒక రాజకీయ వ్యభిచారివి అంటూ ధ్వజమెత్తారు. నీ రాజకీయ జీవితానికి ప్రజలే త్వరలో చరమగీతం పాడతారని కడియం వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U

లింక్ – https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ క్లిక్ చేయండిట్విట్టర్, ఫేస్బుక్



Source link

Spread the love