ఎమ్మెల్యేలు దానం, కడియం అనర్హత పిటిషన్లపై రేపు స్పీకర్ తీర్పు


LIVE FEED

10:49 PM, 10 Mar 2026 (IST)

వెలుగుమట్ల బాధితుల తరఫున జాగృతి పోరాటం చేస్తోంది: కవిత

  • వెలుగుమట్ల బాధితుల తరఫున జాగృతి పోరాటం చేస్తోంది: కవిత
  • రేపు 311 మందికి ఇళ్ల పట్టా టోకెన్లు ఇస్తామని చెప్పారట: కవిత
  • అదే స్థలంలో 311 మందికి టోకెన్లు ఇస్తామని చెప్పడం మన విజయం: కవిత
  • వెలుగుమట్లలో 311 మందికి ఇళ్లు ఉన్నాయని నమ్మారా?: కవిత
  • అంత మందికి ఇళ్లు ఉంటే ఎంత ధైర్యంతో వెళ్లి వాటిని కూల్చారు?: కవిత
  • జూబ్లీహిల్స్‌లో ఎవరైనా ఇళ్లు కట్టుకుంటే అలాగే కూలగొడతారా?: కవిత
  • ఎంత మందికి ఇస్తారో చూసి, బాధితులు సమ్మతం అనుకుంటేనే దీక్షను విరమిద్దాం: కవిత
  • మంత్రుల నుంచి తగిన స్పందన లేకుంటే ఎల్లుండి వరకు దీక్ష కొనసాగిద్దాం: కవిత

10:32 PM, 10 Mar 2026 (IST)

ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు ఉదయం స్పీకర్ తీర్పు

  • ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు ఉదయం స్పీకర్ తీర్పు
  • ఎమ్మెల్యేలు దానం, కడియం అనర్హత పిటిషన్లపై రేపు వెలువడనున్న నిర్ణయం
  • రేపు ఉదయం 10 గం.కు తీర్పు ప్రకటించనున్న స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్లపై తీర్పు ప్రకటించనున్న స్పీకర్‌
  • ఈనెల 12న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
  • సుప్రీంకోర్టు విచారణకు ముందే నిర్ణయం వెల్లడించనున్న స్పీకర్‌

10:31 PM, 10 Mar 2026 (IST)

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీలో యువతి ఆత్మహత్య

  • హైదరాబాద్‌: కేపీహెచ్‌బీలో యువతి ఆత్మహత్య
  • ఇంట్లో ఉరి వేసుకుని సుష్మ(27) ఆత్మహత్య
  • ఉద్యోగం రాలేదనే బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం
  • మూడేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం చేసి తర్వాత ఖాళీగా ఉన్నట్లు సమాచారం

9:58 PM, 10 Mar 2026 (IST)

ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 పేరుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్‌ డ్రైవ్

  • ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 పేరుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్‌ డ్రైవ్
  • సైబర్ మోసాలకు వాడే మ్యూల్ బ్యాంక్ అకౌంట్లపై ప్రత్యేక డ్రైవ్‌
  • మ్యూల్‌ ఖాతాలు సమకూర్చుతున్నట్లు బ్యాంకులను గుర్తించిన పోలీసులు
  • మ్యూల్‌ ఖాతాలు నడుస్తున్న 137 బ్యాంక్ బ్రాంచ్‌లలో సోదాలు
  • 1,888 మ్యూల్ ఖాతాలకు దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలతో లింకులు
  • దేశవ్యాప్తంగా 9,451 సైబర్‌ నేరాలతో లింకులున్న ఖాతాలు గుర్తింపు
  • నిందితులు సుమారు రూ.100 కోట్లుపైగా కొల్లగొట్టనట్లు గుర్తింపు
  • ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌తో 549 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన టీజీసీఎస్‌బీ
  • 626 మంది అనుమానితులను గుర్తించి 208 మంది అరెస్టు
  • ఖాతాలు అద్దెకిచ్చి లావాదేవీలపై 5శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు గుర్తింపు
  • నిందితుల నుంచి 63 ఫోన్లు, 208 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం

9:40 PM, 10 Mar 2026 (IST)

సికింద్రాబాద్‌ రైల్వేలో ఎస్‌ఐజీపై లైంగిక ఆరోపణల కేసు నమోదు

  • సికింద్రాబాద్‌ రైల్వేలో ఎస్‌ఐజీపై లైంగిక ఆరోపణల కేసు నమోదు
  • ఎస్‌ఐజీ వెంకటసుబ్రహ్మణ్యంపై ఫిర్యాదు చేసిన ట్రైనీ ఉద్యోగిని
  • సెక్షన్ సూపర్‌వైజర్ వెంకటసుబ్రహ్మణ్యం వేధిస్తున్నాడని ఆరోపణ
  • సికింద్రాబాద్ రైల్వే జీఆర్‌పీలో ఫిర్యాదు చేసిన ట్రైనీ ఉద్యోగిని
  • విధుల్లో తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ట్రైనీ ఉద్యోగిని ఫిర్యాదు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీసులు

9:40 PM, 10 Mar 2026 (IST)

హైదరాబాద్‌: బాచుపల్లిలో ఉద్యోగాల పేరిట భారీ మోసం

  • హైదరాబాద్‌: బాచుపల్లిలో ఉద్యోగాల పేరిట భారీ మోసం
  • ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసిన జక్కుల అజయ్ అరెస్టు
  • ఎంఎన్‌సీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన అజయ్‌
  • 137 మంది నుంచి సుమారు రూ.50 లక్షల వసూలు చేసినట్లు ఫిర్యాదులు
  • ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.20 వేలు నుంచి రూ.90 వేల వరకు వసూలు
  • హాక్సెన్స్‌ కంపెనీ పేరిట నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చిన జక్కుల అజయ్‌
  • నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు
  • పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

9:06 PM, 10 Mar 2026 (IST)

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

  • కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
  • హబీబ్‌నగర్‌ పరిధి షెహజాదా ఫుడ్ సెంటర్‌లో పోలీసుల సోదాలు దాడులు
  • కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారుచేస్తున్న మహమ్మద్‌ ఫారుక్‌(50) అరెస్టు
  • 1,090 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమం స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • 875 కిలోల పాచిపోయిన ముడి అల్లం, వెల్లుల్లి నిల్వలు స్వాధీనం
  • ఎసిటిక్‌ యాసిడ్, గమ్‌పౌడర్‌, సింథటిక్‌ ఫుడ్‌కలర్స్‌తో అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ
  • కల్తీ అల్లంవెల్లుల్లిని కిరాణాషాపులు, క్యాటరింగ్ సర్వీసులకు అమ్ముతున్నట్లు గుర్తింపు

8:44 PM, 10 Mar 2026 (IST)

వెలుగుమట్ల నిరాశ్రయులకు ఇంటిపట్టా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

  • ఖమ్మం: వెలుగుమట్ల నిరాశ్రయులకు ప్రభుత్వం తీపికబురు
  • పేదలకు ఇంటిపట్టా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
  • రేపు 311 మందికి ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ
  • మరో 101 మందికి ఇంటి నిర్మాణ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
  • బాధితులకు రేపు పట్టాలు పంపిణీ చేయనున్న భట్టి, తుమ్మల, పొంగులేటి
  • గడువుకు 4రోజులు ముందే వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ

8:02 PM, 10 Mar 2026 (IST)

వరంగల్ జిల్లా అభివృద్ధిపై మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ సమీక్ష

  • వరంగల్ జిల్లా అభివృద్ధిపై మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ సమీక్ష
  • సమీక్షకు హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు: మంత్రి పొంగులేటి
  • వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని జూన్‌లోపు తేవాలి: పొంగులేటి
  • అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వచ్చే నెలలో ప్రారంభించాలి: మంత్రి పొంగులేటి
  • డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఈనెలాఖరులోగా లబ్దిదారులను ఎంపిక చేయాలి: మంత్రి పొంగులేటి

8:02 PM, 10 Mar 2026 (IST)

ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి

  • ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి
  • పీఎం ఆవాస్ యోజన కింద పట్టణాల్లో 18,213 ఇళ్లకు కేంద్రం అనుమతి
  • రూ.273 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకారం: హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్

7:36 PM, 10 Mar 2026 (IST)

గోపాలపురం పీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు

  • గోపాలపురం పీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు
  • సరోగసీ పేరుతో పిల్లలు లేని వారిని డాక్టర్‌ నమ్రత మోసం చేసినట్లు గుర్తింపు
  • ఏజెంట్ల ద్వారా పలు రాష్ట్రాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న డాక్టర్ నమ్రత
  • ఏజెంట్ల ద్వారా పేద దంపతుల నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లు గుర్తింపు
  • రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షలకే పిల్లలను కొనుగోలు చేసినట్లు గుర్తింపు
  • సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డ అంటూ దంపతులను మోసం చేసినట్లు గుర్తింపు

7:35 PM, 10 Mar 2026 (IST)

తాగుడుకు బానిసై నెలరోజుల కుమారుడిని అమ్మకానికి పెట్టిన తండ్రి

  • మెదక్: హవేలీఘనపూర్‌ మం. లింగసానిపల్లి శిశువు విక్రయం
  • తాగుడుకు బానిసై నెలరోజుల కుమారుడిని అమ్మకానికి పెట్టిన తండ్రి
  • నెల రోజుల కుమారుడిని రూ.5 లక్షలకు బేరం పెట్టిన తండ్రి
  • అగ్రిమెంట్ రాసుకుని రూ.1.70 లక్షలు తీసుకుని బాలుడిని ఇచ్చేసిన తండ్రి
  • కామారెడ్డి జిల్లాకు చెందిన పిల్లలు లేని దంపతులకు బాలుడి విక్రయం
  • ఐసీడీఎస్ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు
  • బాలుడిని, తల్లిని మెదక్ పట్టణంలో సఖి కేంద్రానికి తరలింపు
  • శిశువు విక్రయం ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

7:35 PM, 10 Mar 2026 (IST)

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సీఈవో రాజీనామా

  • దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సీఈవో రాజీనామా
  • ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా
  • పీటర్‌ ఎల్బర్స్ వెంటనే పదవి నుంచి తొలుగుతారన్న ఇండిగో ఎయిర్‌లైన్

7:35 PM, 10 Mar 2026 (IST)

సికింద్రాబాద్‌: సృష్టి సరోగసీ సెంటర్‌ కేసులో వేగం పెంచిన ఈడీ

  • సికింద్రాబాద్‌: సృష్టి సరోగసీ సెంటర్‌ కేసులో వేగం పెంచిన ఈడీ
  • డాక్టర్ నమ్రత కుటుంబానికి చెందిన ఆస్తులను సీజ్‌ చేసిన ఈడీ అధికారులు
  • డాక్టర్ నమ్రతకు చెందిన రూ.29.76 కోట్ల విలువైన స్థిర,చర ఆస్తులు సీజ్‌
  • బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్లకుపైగా విలువచేసే ఆస్తులు సీజ్‌ చేసిన ఈడీ
  • డాక్టర్‌ నమ్రత 2014 నుంచి అక్రమ సరోగసీలు చేస్తున్నట్లు ఆరోపణలు

6:14 PM, 10 Mar 2026 (IST)

హైదరాబాద్‌ మధురానగర్‌లో కత్తిపోట్ల కలకలం

  • హైదరాబాద్‌ మధురానగర్‌లో కత్తిపోట్ల కలకలం
  • కన్సల్టెన్సీ మేనేజర్, ట్రైనర్‌ లయపై వ్యక్తి కత్తి దాడి
  • రూ.500 విషయంలో ఘర్షణపడి ఇద్దరిపై కత్తి దాడి
  • ట్రైనర్ లయకు ప్రైవేట్‌ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
  • తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శశికిరణ్‌రెడ్డి మృతి
  • ట్రైనర్ లయకు ప్రైవేట్‌ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
  • రూ.500 ఇవ్వాల్సిన విషయంలో శశికిరణ్‌రెడ్డిని హత్య చేసిన ప్రభు
  • అక్కడే కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న లయపై ప్రభు కత్తితో దాడి
  • ప్రభును ఒక హోటల్లో ఉద్యోగంలో పెట్టించిన శశికిరణ్‌రెడ్డి
  • ఉద్యోగం నచ్చక తాను ఇచ్చిన రూ.2 వేలు తిరిగి ఇవ్వాలని శశికిరణ్‌తో ప్రభు గొడవ
  • ప్రభుకి రూ.1,500 తిరిగి చెల్లించిన శశికిరణ్‌రెడ్డి
  • మరో రూ.500 ఇవ్వాలని గొడవపడి కత్తితో దాడి చేసిన ప్రభు
  • హైదరాబాద్‌: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

6:14 PM, 10 Mar 2026 (IST)

రాష్ట్రంలో ఇప్పుడే గ్యాస్‌ కొరత వచ్చే అవకాశం లేదు: డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి

  • గ్యాస్‌ కొరతపై స్పందించిన డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి
  • రాష్ట్రంలో ఇప్పుడే గ్యాస్‌ కొరత వచ్చే అవకాశం లేదు: డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు
  • ఇరాన్‌ యుద్ధం కొనసాగితే ఇబ్బందులు రావొచ్చు: డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు
  • గ్యాస్‌ ఇబ్బందులు పెరగకుండా కేంద్రం అప్రమత్తమైంది: జగన్మోహన్‌రెడ్డి
  • గృహవినియోగదారులకు కొరత రాకుండా కేంద్రం ముందస్తు చర్యలు: జగన్మోహన్‌రెడ్డి
  • ఇప్పటికే వ్యాపార, హోటల్స్‌కు నిలిపివేస్తూ చమురు సంస్థలు నిర్ణయం: జగన్మోహన్‌రెడ్డి
  • హాస్టళ్లు, ఆస్పత్రులు వంటి అత్యవసర విభాగాలకు మినహాయింపు: జగన్మోహన్‌రెడ్డి
  • కమిటీ సిఫారసుల మేరకు అయిల్‌ కంపెనీలు కొనసాగించనున్న గ్యాస్‌ సరఫరా
  • గృహవినియోగదారులు గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలి: డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు

6:14 PM, 10 Mar 2026 (IST)

కేంద్రమంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం

  • కేంద్రమంత్రివర్గ సమావేశం(Cabinet Meeting)లో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం
  • మదురైకి అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం
  • జల్‌ జీవన్‌ మిషన్‌ను 2028 డిసెంబర్‌ వరకు పొడిగిస్తూ నిర్ణయం

6:14 PM, 10 Mar 2026 (IST)

శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దు

  • శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దు
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 13 విమానాలు రద్దు
  • శంషాబాద్‌ నుంచి బయలుదేరాల్సిన 12 విమానాలు

4:47 PM, 10 Mar 2026 (IST)

హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు

  • కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్లపై పెట్రోలియం కంపెనీల నియంత్రణ
  • హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు
  • ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే కమర్షియల్‌ సిలిండర్లు సరఫరా చేయాలని ఆదేశం
  • గ్యాస్‌ వినియోగదారులు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని సూచన
  • ఈకేవైసీ చేసుకోని వినియోగదారులకు బుకింగ్‌ నిలిపివేత
  • ఇప్పటికే సిలిండర్‌ బుకింగ్‌ వ్యవధిని 25 రోజులకు పెంచిన కేంద్రం

4:26 PM, 10 Mar 2026 (IST)

ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో రసాభాస

  • ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో రసాభాస
  • మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కాంగ్రెస్‌-బీజేపీ కౌన్సిలర్ల బాహాబాహీ
  • ఆదిలాబాద్‌: పరస్పరం చొక్కాలు పట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు
  • అజెండా పాస్ అంటూ తన ఛాంబర్‌కు వెళ్లిపోయిన ఛైర్‌పర్సన్ అనూష
  • చర్చించకుండానే ఎలా పాస్‌ చేస్తారంటూ బీజేపీ కౌన్సిలర్ల ఆగ్రహం
  • ఆదిలాబాద్‌ ఛైర్‌పర్సన్‌ ఛాంబర్‌ ఎదుట బైఠాయించిన బీజేపీ కౌన్సిలర్లు

4:26 PM, 10 Mar 2026 (IST)

హైదరాబాద్‌: అత్యవసరంగా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సమావేశం

  • హైదరాబాద్‌: అత్యవసరంగా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సమావేశం
  • రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించే యోచనలో హోటల్స్ అసోసియేషన్‌
  • కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా(LPG Problems) నిలిపివేతతో బంద్‌ నిర్వహించే యోచన

4:25 PM, 10 Mar 2026 (IST)

ఈనెల 13న పీఎం కిసాన్‌ నిధులు విడుదల

  • ఈనెల 13న పీఎం కిసాన్‌ నిధులు విడుదల
  • 22వ విడత పీఎం కిసాన్ నిధులు(PM Kishan Scheme) విడుదల చేయనున్న ప్రధాని
  • రూ.19 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయనున్న కేంద్రం
  • ఈనెల 13న గువాహటిలో నిధులు విడుదల చేయనున్న ప్రధాని
  • దేశవ్యాప్తంగా 9.32 కోట్ల రైతుల ఖాతాల్లో జమకానున్న పీఎం కిసాన్ నిధులు

4:25 PM, 10 Mar 2026 (IST)

భారత ఫాస్ట్‌ బౌలర్‌ అర్షదీప్‌సింగ్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు

  • భారత ఫాస్ట్‌ బౌలర్‌ అర్షదీప్‌సింగ్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు
  • అర్షదీప్‌సింగ్‌ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం జరిమానా విధించిన ఐసీసీ
  • టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో జరిగిన ఘటనపై ఐసీసీ చర్యలు
  • కివీస్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ పైకి బాల్‌ విసిరిన ఘటనలో ఐసీసీ చర్యలు
  • మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత, 1 డీమెరిట్ పాయింట్‌ విధిస్తూ చర్యలు

4:25 PM, 10 Mar 2026 (IST)

ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ సంఖ్యలో వైద్యుల భర్తీ

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ సంఖ్యలో వైద్యుల భర్తీ
  • 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెరిట్ లిస్ట్ విడుదల‌
  • ఈనెల 12 నుంచి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్
  • ఈనెలాఖరుకు పోస్టింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న ఆరోగ్యశాఖ

4:25 PM, 10 Mar 2026 (IST)

గచ్చిబౌలిలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు

  • గచ్చిబౌలిలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
  • ఫామ్‌హౌస్‌పై పెంచుకుంటున్న గంజాయి మొక్క స్వాధీనం
  • గంజాయి సాగు చేస్తున్న వాచ్‌మెన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
  • నిందితుడు యూపీకి చెందిన మాతా బాదల్‌గా గుర్తింపు

3:21 PM, 10 Mar 2026 (IST)

కరూర్‌ తొక్కిసలాట కేసులో విజయ్‌కు మరోసారి సీబీఐ సమన్లు

  • కరూర్‌ తొక్కిసలాట కేసులో విజయ్‌కు మరోసారి సీబీఐ(CBI) సమన్లు
  • ఈనెల 15న విజయ్‌ విచారణకు హాజరుకావాలని పేర్కొన్న సీబీఐ
  • 2025 సెప్టెంబర్‌ 27న విజయ్‌ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి

3:21 PM, 10 Mar 2026 (IST)

వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వరకు గోదావరి పుష్కరాలు

  • గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కేబినేట్ సబ్‌కమిటీ సమావేశం
  • సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, కొండా సురేఖ
  • సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల, అడ్లూరి లక్ష్మణ్
  • బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీర ఆలయాల అభివృద్ధికి నిర్ణయం
  • ప్రధాన ఆలయాలను అనుసంధానిస్తూ రోడ్లు అభివృద్ధి చేయాలని నిర్ణయం
  • అత్యంత వైభవంగా పుష్కరాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలన్న మంత్రులు
  • తదుపరి భేటీకి అన్నిశాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న మంత్రులు
  • వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వరకు గోదావరి పుష్కరాలు

3:20 PM, 10 Mar 2026 (IST)

ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు

  • ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు
  • ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు
  • ప్రభాకర్‌రావు దర్యాప్తునకు సహకరించాల్సిందేనన్న జస్టిస్ నాగరత్న ధర్మాసనం
  • సాక్ష్యాలు, ఆధారాలు ట్యాంపర్ చేస్తే ముందస్తు బెయిల్ రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు
  • సాక్షులను ప్రభావితం చేస్తే.. ముందస్తు బెయిల్ రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు
  • ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని పేర్కొన్న ధర్మాసనం

3:20 PM, 10 Mar 2026 (IST)

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం

  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం
  • భారత్‌తో భూసరిహద్దు ఉన్న దేశాలకు ఎఫ్‌డీఐ(New FDI Rules) నిబంధనలు సడలింపు
  • చైనా సహా భారత్‌తో సరిహద్దు ఉన్న దేశాలకు ఎఫ్‌డీఐ నిబంధనలు సడలింపు

2:36 PM, 10 Mar 2026 (IST)

మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు రూ.172కోట్ల హడ్కో రుణం

  • మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు రూ.172కోట్ల హడ్కో రుణం
  • హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు టీయూఎఫ్‌ఐడీసీకి ప్రభుత్వం అనుమతి

2:35 PM, 10 Mar 2026 (IST)

బహ్రెయిన్‌లో చిక్కుకున్న 600 మంది తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ ప్రారంభం

  • బహ్రెయిన్‌లో చిక్కుకున్న 600 మంది తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ ప్రారంభం
  • ఇవాళ్టి నుంచి రోజూ ఒక విమానంలో స్వదేశానికి చేరుకునేలా ఏర్పాట్లు
  • ఏపీ ప్రభుత్వ నిర్దేశంతో గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారుల సంప్రదింపులు
  • డీజీసీఏ, పౌర విమానయాన శాఖ అధికారులతో చర్చించిన తర్వాత విమాన సేవలు
  • అధికారులతో చర్చించాక విమాన సేవలు ప్రారంభించిన గల్ఫ్ ఎయిర్ సంస్థ
  • ఇవాళ 58 మందిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురానున్న గల్ఫ్ ఎయిర్ విమానం
  • రేపు 138 మందితో ముంబయి చేరుకోనున్న మరో విమానం
  • బహ్రెయిన్‌లో తెలుగు సంఘం, భారత రాయబార కార్యాలయం ద్వారా టికెట్ల కొనుగోలు ఏర్పాట్లు

2:19 PM, 10 Mar 2026 (IST)

హైదరాబాద్​ చేరుకున్న నూతన గవర్నర్ శివ ప్రతాప్‌ శుక్లా

2:19 PM, 10 Mar 2026 (IST)

ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఘట్టం మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు: హరీశ్‌రావు

  • ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఘట్టం మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు: హరీశ్‌రావు
  • ట్యాంక్‌బండ్ మీద తెలంగాణ ఆత్మగౌరవం ఉప్పొంగిన రోజు: హరీశ్‌రావు
  • ఆనాటి పోరాట స్ఫూర్తి ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఇప్పటికీ సజీవం: హరీశ్‌రావు
  • ఉమ్మడి రాష్ట్రంలో మన హక్కుల కోసం, మన అస్తిత్వం కోసం
  • కొట్లాడాం: హరీశ్‌రావు
  • నేడు మన వనరులను మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారు: హరీశ్‌రావు
  • రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: హరీశ్‌రావు

2:01 PM, 10 Mar 2026 (IST)

కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి పొన్నం బహిరంగ లేఖ

  • కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి పొన్నం బహిరంగ లేఖ(Ponnam Letter)
  • రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది: పొన్నం
  • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: పొన్నం ప్రభాకర్‌
  • కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు: పొన్నం
  • పనులు చెల్లిస్తున్నప్పుడు ప్రజల అభివృద్ధికి ఎందుకు చర్యలు చేపట్టట్లేదు: పొన్నం
  • పెండింగ్ ప్రాజెక్టులపై బండి సంజయ్, కిషన్‌రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలి: పొన్నం
  • తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లు విస్మరించడం తగదు: పొన్నం
  • కేంద్ర ప్రయోజత పథకాల్లో కేంద్ర వాటా 90శాతం ఉండే విధంగా పునరుద్ధరించాలి: పొన్నం

2:00 PM, 10 Mar 2026 (IST)

వెలుగుమట్ల విషయంలో సీపీఐ పాత్ర లేదనడం నిరాధార ఆరోపణలు: కూనంనేని

  • వెలుగుమట్ల విషయంలో సీపీఐ పాత్ర లేదనడం నిరాధార ఆరోపణలు: కూనంనేని
  • పేదల పేరుతో ఎవరైనా వ్యాపారం చేస్తే చర్యలు తీసుకోవచ్చు: కూనంనేని సాంబశివరావు
  • కూల్చిన వాళ్లకు ఖమ్మంలోనే ఇళ్లు ఇవ్వాలని మంత్రితో మాట్లాడాను: కూనంనేని
  • లొంగిపోయిన మావోయిస్టులకు సీపీఐలోకి ఆహ్వానిస్తున్నాం: కూనంనేని
  • కలిసి పనిచేద్దాం.. ఒకే పార్టీగా ఎదిగి.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుదాం: కూనంనేని

2:00 PM, 10 Mar 2026 (IST)

సచివాలయంలో గోదావరి పుష్కరాలపై కేబినేట్ సబ్ కమిటీ సమావేశం

  • సచివాలయంలో గోదావరి పుష్కరాలపై కేబినేట్ సబ్ కమిటీ సమావేశం
  • సమావేశానికి హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్డూరి లక్ష్మణ్‌, కొండా సురేఖ
  • సమావేశానికి హాజరైన పొంగులేటి, తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

1:29 PM, 10 Mar 2026 (IST)

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

  • లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

1:29 PM, 10 Mar 2026 (IST)

గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వర్క్‌షాప్

  • గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వర్క్‌షాప్
  • కార్యశాలలో పాల్గొన్న కేటీఆర్, తలసాని, వివేకానంద, సబిత
  • అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం

12:59 PM, 10 Mar 2026 (IST)

ఇప్పటివరకు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ లేరు : గౌరవ్ గొగొయ్

  • ఇప్పటివరకు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ లేరు: గౌరవ్ గొగొయ్
  • డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే లోక్‌సభ నడుస్తోంది: గౌరవ్ గొగొయ్‌
  • ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు.. స్పీకర్‌ ఓం బిర్లా తరచూ అంతరాయం కలిగించేవారు: గౌరవ్
  • స్పీకర్‌ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి: గౌరవ్ గొగొయ్
  • రాహుల్‌గాంధీ ప్రసంగానికి స్పీకర్‌ అనుమతించలేదు: గౌరవ్ గొగొయ్
  • 8 మంది విపక్ష సభ్యులను సరైన కారణంలేకుండానే స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్‌ చేశారు: గౌరవ్ గొగొయ్
  • ప్రధానిపై కాంగ్రెస్‌ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉందని స్పీకర్‌ తప్పుడు ఆరోపణలు చేశారు: గౌరవ్ గొగొయ్

12:41 PM, 10 Mar 2026 (IST)

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,67,580

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,67,580
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,850
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,85,000

12:41 PM, 10 Mar 2026 (IST)

లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం

  • లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం
  • స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటలు కేటాయింపు
  • అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 278 మంది సభ్యుల మద్దతు అవసరం
  • ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు
  • ప్రస్తుతం లోక్‌సభలో ఇండి కూటమికి 234 మంది సభ్యుల మద్దతు

11:49 AM, 10 Mar 2026 (IST)

శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

  • శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  • గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాకు స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు
  • గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాకు స్వాగతం పలికిన సీఎస్, డీజీపీ

11:48 AM, 10 Mar 2026 (IST)

చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర వస్తువుల చట్టం ప్రయోగించిన కేంద్రం

  • చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర వస్తువుల చట్టం ప్రయోగించిన కేంద్రం
  • పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌కు కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్రం నిర్ణయం
  • ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా పెట్రోలియం శాఖ చర్యలు

10:59 AM, 10 Mar 2026 (IST)

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో వరసిద్ధి వినాయక ఆలయంలో చోరీ

  • సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో వరసిద్ధి వినాయక ఆలయంలో చోరీ
  • ఆలయంలో 6 తులాల బంగారం, 8 కిలోల వెండి, రూ.90 వేల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రామచంద్రాపురం పోలీసులు

10:58 AM, 10 Mar 2026 (IST)

భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములు: కవిత

  • భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములు: కవిత
  • వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా మేము దీక్ష చేస్తున్నాం: కవిత
  • నిన్న మధ్యాహ్నం నుంచి మా దీక్ష కొనసాగుతూనే ఉంది: కవిత
  • ప్రభుత్వం.. 31 ఎకరాల పేదల భూమిని పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది: కవిత
  • బాధితులకు భూదాన్‌ భూమిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: కవిత
  • బాధితులకు ఇళ్లు ఇచ్చి.. న్యాయం జరిగేదాక నిరాహార దీక్ష కొనసాగిస్తా: కవిత
  • ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. బాధితుల పరిస్థితి దారుణంగా ఉంది: కవిత
  • వెలుగుమట్లలో ఏం జరిగిందో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలి: కవిత
  • బాధితులకు న్యాయం చేయాలని రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాస్తున్నాం: కవిత

10:11 AM, 10 Mar 2026 (IST)

కామారెడ్డి: దోమకొండలో ఐదుగురిపై పిచ్చి కుక్కల దాడి

  • కామారెడ్డి: దోమకొండలో ఐదుగురిపై పిచ్చి కుక్కల దాడి
  • ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రి తరలింపు

9:52 AM, 10 Mar 2026 (IST)

హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవిత

  • హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవిత
  • ఖమ్మం వెలుగుమట్ల నుంచి హైదరాబాద్‌కు కల్వకుంట్ల కవిత
  • వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించనున్న కవిత

9:37 AM, 10 Mar 2026 (IST)

భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

  • భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
  • 800 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌
  • 200 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ

9:37 AM, 10 Mar 2026 (IST)

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం
  • శాసనసభ కార్యకలాపాలు, బడ్జెట్, రాజకీయ అంశాలపై అవగాహన సదస్సు
  • హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో బీఆర్‌ఎస్‌ నేతల వర్క్ షాప్

9:19 AM, 10 Mar 2026 (IST)

మెదక్ ఏడుపాయలలో చెల్మకుంట వద్ద మహిళ మృతదేహం లభ్యం

  • మెదక్ ఏడుపాయలలో చెల్మకుంట వద్ద మహిళ మృతదేహం లభ్యం
  • గుర్తుతెలియని వ్యక్తులు మహిళను హత్య చేసినట్లు పోలీసుల గుర్తింపు
  • మెదక్: ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు

8:14 AM, 10 Mar 2026 (IST)

నేడు హైదరాబాద్ రానున్న కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

  • నేడు హైదరాబాద్ రానున్న కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  • ఉ.11 గం.కు శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా
  • విమానాశ్రయంలో కొత్త గవర్నర్‌కు స్వాగతం పలకనున్న సీఎం రేవంత్‌రెడ్డి

8:14 AM, 10 Mar 2026 (IST)

నార్కట్‌పల్లి సమీపంలో ప్రమాదం, ఇద్దరు మృతి

  • నల్గొండ: నార్కట్‌పల్లి సమీపంలో ప్రమాదం, ఇద్దరు మృతి
  • నల్గొండ జిల్లా: ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు
  • లారీని ఓవర్ టేక్‌ చేస్తూ తాకుతూ ముందుకెళ్లిన ట్రావెల్స్ బస్సు
  • లారీ, ట్రావెల్స్‌ బస్సును రహదారి పక్కన ఆపి ఘర్షణకు దిగిన డ్రైవర్లు
  • లారీ వెనకాల ఉండి ఘర్షణ పడుతుండగా వెనుక నుంచి ఢీకొట్టిన మరో లారీ
  • రెండు లారీల మధ్యలో ఇరుక్కుపోయి ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
  • మృతులు శ్రీనివాస్, బంగారయ్యగా గుర్తింపు

8:13 AM, 10 Mar 2026 (IST)

టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం

  • తిరుమల: టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
  • శ్రీవారి సర్వదర్శనానికి 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,526 మంది భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.41 కోట్లు
  • నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 26,664 మంది భక్తులు

6:57 AM, 10 Mar 2026 (IST)

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
  • ఖమ్మం: వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా రాత్రి నుంచి కవిత నిరాహరదీక్ష
  • డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి నిరాహార దీక్ష చేపట్టిన కవిత
  • కవితతో పాటు నిరాహారదీక్ష చేపట్టిన వారిని అరెస్టు చేసిన పోలీసులు
  • అరెస్టు చేసిన వారిని హైదరాబాద్ తరలిస్తున్న ఖమ్మం పోలీసులు

6:44 AM, 10 Mar 2026 (IST)

నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం

  • నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం
  • శాసనసభ కార్యకలాపాలు, బడ్జెట్, రాజకీయ అంశాలపై అవగాహనా సదస్సు
  • హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో బీఆర్‌ఎస్‌ నేతల వర్క్ షాప్

6:43 AM, 10 Mar 2026 (IST)

తుదిదశకు చేరుకున్న రాష్ట్ర బడ్జెట్ కసరత్తు

  • తుదిదశకు చేరుకున్న రాష్ట్ర బడ్జెట్ కసరత్తు
  • ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపై నేటి నుంచి మళ్లీ సమీక్షలు
  • మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం భట్టి
  • ఆయా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష

6:42 AM, 10 Mar 2026 (IST)

ఇవాళ, రేపు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు

  • ఇవాళ, రేపు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు
  • సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన సమావేశాలు
  • తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించనున్న నేతలు
  • ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్న నేతలు

6:41 AM, 10 Mar 2026 (IST)

వంటగ్యాస్‌ బుకింగ్‌ వ్యవధి 25 రోజులకు పెంచిన కేంద్ర ప్రభుత్వం

  • దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు కేంద్రం చర్యలు
  • వంటగ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్రం
  • వంటగ్యాస్‌ బుకింగ్‌ వ్యవధి 25 రోజులకు పెంచిన కేంద్ర ప్రభుత్వం
  • రెండు గ్యాస్ బుకింగ్ మధ్య కనీస గడువు 21 నుంచి 25 రోజులకు పెంపు
  • బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరకట్టడమే లక్ష్యమన్న కేంద్రం
  • ఎల్‌పీజీ ఉత్పత్తి పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం
  • వాణిజ్య అవసరాల కంటే, గృహాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచన



Source link

Spread the love