ఓటర్ల జాబితా స్తంభనపై 13న సుప్రీం విచారణ


ABN
ప్రచురణ తేదీ – ఏప్రిల్ 11, 2026 | 06:14 AM

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఈ నెల 13న విచారణ జరపనున్నట్టు…

ఓటర్ల జాబితా స్తంభనపై 13న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఈ నెల 13న విచారణ జరపనున్నట్టు శుక్రవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఓటర్ల జాబితాలో కొత్త పేర్లు చేర్చు, తొలగింపులకు అవకాశం లేకుండా స్తంభింపజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 9వ తేదీనే జాబితాను స్తంభింపజేస్తూ ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఇచ్చింది. అయితే జాబితాల నుంచి పేర్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో జాబితా స్తంభన తగదంటూ పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్లు సోమవారం చేపడుతామని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం ప్రదర్శించారు. రష్యాలో నిర్బంధంలో ఉన్న భారతీయులను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపైనా విచారణ జరిపేందుకు ఇదే ధర్మాసనం అంగీకరించింది.

ఈ వార్తలు కూడా చదవండి

మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..

బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్

నవీకరించబడిన తేదీ – ఏప్రిల్ 11, 2026 | 06:14 AM



Source link

Spread the love