LIVE FEED
సామర్లకోట ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించిన సీఎం
- సామర్లకోట ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించిన సీఎం
- మృతుల కుటుంబసభ్యులకు ఓదార్చి, ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు
- అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు బయలుదేరిన సీఎం చంద్రబాబు
- కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు మృతి
- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు మృతి
- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణమంత్రి అమీర్ నాసిర్జాదే మృతి
- ఇజ్రాయెల్ దాడుల్లో రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ మృతి
- ఇద్దరూ ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు రాయిటర్స్ కథనం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన
- పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన
- సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు నివారించాలని భారత్ సూచన
- పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన భారత్
- దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కోరిన భారత్
- దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి: భారత్
- పశ్చిమాసియాలో ఉన్న భారతీయులతో సంప్రదింపులు: భారత్
- పశ్చిమాసియాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలి: భారత్
వేట్లపాలెం ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
- వేట్లపాలెం ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
- మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రేవంత్‌రెడ్డి
పేలుడు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు
- వేట్లపాలెం ప్రమాద స్థలంలో ఏపీ సీఎం చంద్రబాబు
- పేలుడు జరిగిన స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు
- ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ఏపీ సీఎం
- ఘటనాస్థలంలో చేపట్టిన సహాయ చర్యల గురించి వివరించిన అధికారులు
- ఘటన గురించి సీఎంకు వివరించిన ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు
- బాణసంచా తయారీ పరిశ్రమ గురించి ఆరా తీసిన ఏపీ సీఎం చంద్రబాబు
- క్షతగాత్రుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న చంద్రబాబు
కాకినాడ జిల్లాలో పేలుడు ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ
- కాకినాడ జిల్లాలో పేలుడు ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ
- మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: ప్రధాని మోదీ
- గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: ప్రధాని మోదీ
- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం: మోదీ
మక్కా యాత్రలో గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం పంపిణీ
- మక్కా యాత్ర మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ
- మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
- 44 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం పంపిణీ
- మక్కా యాత్రలో గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం పంపిణీ
- గతేడాది నవంబర్ 17న మక్కా యాత్రలో బస్సు అగ్నిప్రమాదం
- అగ్నిప్రమాదం జరిగి హైదరాబాద్ వాసులు 44 మంది సజీవదహనం
ఘటనాస్థలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి: హోంమంత్రి అనిత
- వేట్లపాలెం ప్రమాదంలో 21 మంది చనిపోయారు: హోంమంత్రి అనిత
- అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలు అదుపు చేశారు: అనిత
- ఘటనాస్థలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి: హోంమంత్రి అనిత
- ఫోరెన్సిక్ బృందాలు వెళ్లి విచారణ వేగవంతం చేశాయి: హోంమంత్రి అనిత
అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలు అదుపు చేశారు: అనిత
- వేట్లపాలెం ప్రమాదంలో 21 మంది చనిపోయారు: హోంమంత్రి అనిత (Kakinada Fire Incident)
- ఆస్పత్రిలో ఉన్నవారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: అనిత
- అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలు అదుపు చేశారు: అనిత
- ఘటనాస్థలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి: హోంమంత్రి అనిత
34 మంది కూలీలలో 21 మంది మృతి, 13 మందికి గాయాలు
- ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 34 మంది కూలీలు
- బాణసంచా పేలుడు ధాటికి ఘటనాస్థలంలో 21 మంది మృతి
- ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు
- మధ్యాహ్నం 2 గంటల సమయంలో పేలుడు జరిగినట్లు గుర్తింపు
పేలుడు ఘటనాస్థలానికి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు
- విజయనగరం నుంచి కాకినాడ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు
- వేట్లపాలెం పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించనున్న ఏపీ సీఎం
- బాధితుల కుటుంబసభ్యులను పరామర్శించనున్న చంద్రబాబు
పేలుడు శబ్దాలకు వేట్లపాలెం గ్రామంలో పగిలిన ఇళ్ల అద్దాలు
- బాణసంచా పేలుడు ధాటికి భీతిల్లిన వేట్లపాలెం గ్రామం
- వేట్లపాలెం పరిసరాల్లో బాధిత కుటుంబాల హాహాకారాలు
- పొలాల్లోకి కిలోమీటరు మేర ఎగిరిపడిన మృతుల శరీర భాగాలు
- గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన పలువురి మృతదేహాలు
- హృదయ విదారకంగా మారిన వేట్లపాలెం గ్రామ పరిసరాలు
- పేలుడు శబ్దాలకు వేట్లపాలెం గ్రామంలో పగిలిన ఇళ్ల అద్దాలు
పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉంది: ఆర్‌డీవో
- పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉంది: ఆర్‌డీవో
- బాణసంచా పరిశ్రమ యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో
- ఆస్పత్రుల్లో ఉన్న 9 మంది పరిస్థితి విషమంగా ఉంది: ఆర్‌డీవో
- కాకినాడలో ఆరుగురు, సామర్లకోటలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు: ఆర్‌డీవో
- కాకినాడలో మోర్తా శ్రీను, సత్యవేణి పరిస్థితి విషమం
- కాకినాడలో చికిత్స పొందుతున్న కె.శ్రీను, చిటికెల లక్ష్మి, డి.రాజు, లోవరాజు
- అడబాల వీరబాబు పరిశ్రమలో గతంలోనూ పేలుడు జరిగిందన్న స్థానికులు
ఘటనపై దర్యాప్తు చేస్తాం.. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి : ఎంపీ ఉదయ్
- ఇంకా పలువురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది : ఎంపీ ఉదయ్
- అనుమతులు, భద్రతలో లోపాలుంటే చర్యలు ఉంటాయి
- ఘటనపై దర్యాప్తు చేస్తాం.. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి..
- నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం : ఎంపీ ఉదయ్
- ఇంకా పలువురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది
- అనుమతులు, భద్రతలో లోపాలుంటే చర్యలు ఉంటాయి
- ఘటనపై దర్యాప్తు చేస్తాం.. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి..
- నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
కాకినాడ జిల్లాలో భారీ పేలుడు, 21కి చేరిన మృతుల సంఖ్య
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు, 21 మంది మృతి
- వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
- ప్రమాదంలో 15 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
- పేలుడు ధాటికి పంటపొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాలు
- పేలుడు శబ్దాలకు వేట్లపాలెం గ్రామంలో పగిలిన ఇళ్ల అద్దాలు
మృతుల్లో ఇప్పటివరకు 11 మందిని గుర్తించిన పోలీసులు
- మృతుల్లో ఇప్పటివరకు 11 మందిని గుర్తించిన పోలీసులు
- మృతులు: అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు
- మృతులు: సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ
- మృతులు: గంపల మంగ, గొడతా మహేశ్, గొడతా రాము, గొడతా నాని
- ప్రమాదంలో పరిశ్రమ యజమాని వీరబాబు తండ్రి అడబాల శ్రీను మృతి
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్
- ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
భోజనానికి బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్న కొందరు కార్మికులు
- పొలాల్లో 6 షెడ్లు వేసి బాణసంచా తయారుచేస్తున్నట్లు గుర్తింపు
- పేలుడుకు ముందు భోజనం కోసం బయటకు వెళ్లిన కొందరు కార్మికులు
- భోజనానికి బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్న కొందరు కార్మికులు
కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆరుగురు వ్యక్తులు
- ఘటనాస్థలంలో పరిస్థితి పర్యవేక్షిస్తున్న కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ బిందుమాధవ్
- కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆరుగురు వ్యక్తులు
- బాధితుల్లో వేట్లపాలెం వాసి కప్పా వెంకటలక్ష్మి, పెద్దాపురం వాసి మోర్తా శ్రీను
- కాకినాడ జీజీహెచ్‌లో సామర్లకోటకు చెందిన కె.శ్రీను, చిటికెల లక్ష్మి
పేలుడు ఘటనలో తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం
- కాకినాడ జిల్లాలో పేలుడు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు
- తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం
- ఏపీ: ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితను ఆదేశించిన సీఎం
- ఏపీ: ఘటనాస్థలానికి బయలుదేరిన హోంమంత్రి వంగలపూడి అనిత
- ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు
- బాణసంచా కేంద్రంలో పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి
- ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం: సీఎం
- పేలుడు ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడా: సీఎం చంద్రబాబు
- బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలి: సీఎం చంద్రబాబు
- ఘటనాస్థలంలో అధికారులు సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు: సీఎం
- పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
బాణసంచా పేలుడు ఘటనలో 18 మంది మృతి – చనిపోయినవారిలో ఎక్కువ మంది మహిళలు!
- మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం
- కాకినాడ: వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య పంటపొలాల్లో ప్రమాదం
- ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
- బాణసంచా పరిశ్రమలో ఇంకా కొనసాగుతున్న పేలుళ్లు
- పేలుడు ధాటికి చుట్టుపక్కల గ్రామాల్లో అలముకున్న దట్టమైన పొగ
కాకినాడ జిల్లా బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 18 మంది మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు, 18 మంది మృతి
- బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
- పేలుడు ధాటికి పంటపొలాల్లో ఎగిరిపడిన మృతదేహాలు
- కాకినాడ జిల్లా వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య భారీ పేలుడు
- చుట్టుపక్కల ఐదు గ్రామాల్లో అలముకున్న దట్టమైన పొగ
- పేలుడు శబ్దాలు విని భయాందోళనకు గురైన స్థానికులు
- పేలుడు జరిగిన ఘటనాస్థలానికి బయలుదేరిన అధికారులు
- బాణసంచా పరిశ్రమ నిర్వహిస్తున్న అడపా నాని కుటుంబసభ్యులు
- పెదపూడి రోడ్డులోని పొలాల్లో బాణసంచా తయారీ కేంద్రం
- గతంలోనూ ఇదే గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
రంజీట్రోఫీ 2025-26 సీజన్ విజేత జమ్ముకశ్మీర్
- రంజీట్రోఫీ 2025-26 సీజన్ విజేత జమ్ముకశ్మీర్
- తొలిసారి రంజీట్రోఫీని కైవసం చేసుకున్న జమ్ముకశ్మీర్ జట్టు
- ఫైనల్‌లో కర్ణాటకపై ఘనవిజయం సాధించిన జమ్ముకశ్మీర్
- ఫైనల్ చేరిన తొలిసారే రంజీట్రోఫీ దక్కించుకున్న జమ్ముకశ్మీర్
కాకినాడ జిల్లా వేట్లపాలెం-జి.మేడపాడు మధ్య భారీ పేలుడు
- కాకినాడ: బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం
- కాకినాడ జిల్లా వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య భారీ పేలుడు
- ప్రమాదంలో పలువురు మృతి, కొందరికి తీవ్ర గాయాలు, అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు
- బాణసంచా పరిశ్రమలో 15 మంది చిక్కుకున్నట్లు సమాచారం
- బాణసంచా పరిశ్రమలో ఇంకా కొనసాగుతున్న పేలుళ్లు
- చుట్టుపక్కల ఐదు గ్రామాల్లో అలముకున్న దట్టమైన పొగ
- బాణసంచా పరిశ్రమ నిర్వహిస్తున్న అడబాల వీరబాబు కుటుంబసభ్యులు
- పెదపూడి రోడ్డులోని పొలాల్లో బాణసంచా తయారీ కేంద్రం
- గతంలోనూ ఇదే గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
నగర ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్టును కూడా తప్పుపడుతున్నారు: అద్దంకి దయాకర్
- నగర ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్టును కూడా తప్పుపడుతున్నారు: అద్దంకి దయాకర్
- ప్రజలకు మంచి జరిగే పనులను కూడా తప్పుపడుతున్నారు
- ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వమే చేపట్టింది: అద్దంకి దయాకర్
- ప్రాజెక్టు నిరాశ్రయులు 8 వేల మంది ఉన్నట్లుగా గత ప్రభుత్వమే గుర్తించింది
- నిరాశ్రయుల సంఖ్య 8 వేల నుంచి ఇవాళ 11 వేలకు పెరిగింది: అద్దంకి దయాకర్
- సెంటిమెంట్ రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని విపక్షాలు చూస్తున్నాయి
- బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీశ్‌రావు మధ్య చాలా పంచాయతీలు నడుస్తున్నాయి
- వ్యక్తిగత ఈర్షలు పక్కనపెట్టి ప్రజల కోణంలో రాజకీయాలు చేయాలి
- కక్ష సాధించాలనుకుంటే రెండేళ్లపాటు మీపై దర్యాప్తులు జరిగేవి కావు
రాజధాని ప్రాంత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్
- రాజధాని ప్రాంత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల సమావేశం బంజారాహిల్స్‌లో నేతలతో సమావేశమైన కేటీఆర్
- మూడు కార్పొరేషన్ల పరిధి నేతలతో సమావేశమైన కేటీఆర్
- సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌ఛార్జిలు
- మూడు కార్పొరేషన్లలో పరిస్థితులు, సమస్యలపై కేటీఆర్
- పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చ
కోకాపేట శారదాపీఠం భూమికి బదులు శంషాబాద్‌లో భూమి కేటాయిస్తాం: తహశీల్దార్
- కోకాపేట శారదాపీఠం భూమిపై రెవెన్యూ అధికారుల వివరణ
- శారదాపీఠం భూమిని ప్రభుత్వం వాటర్‌వర్క్స్‌కు ఇవ్వాలనుకుంది: తహశీల్దార్
- శారదాపీఠానికి ప్రభుత్వమే గతంలో భూమి కేటాయించింది: శంషాబాద్ తహశీల్దార్
- ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది: శంషాబాద్ తహశీల్దార్
- కోకాపేట భూమికి బదులు శంషాబాద్‌లో భూమి కేటాయిస్తాం: తహశీల్దార్
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: బండి సంజయ్
- విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: బండి సంజయ్
- రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: బండి సంజయ్
- విద్యారంగంపై మురళి ఇచ్చిన నివేదిక అసంబద్ధంగా ఉంది: బండి సంజయ్
- ఎవరితోనూ చర్చించకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నివేదిక ఇచ్చారు
- ఉపాధ్యాయులకు జీతాలు తగ్గించాలని నివేదిక ఏమిటీ?: బండి సంజయ్
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు
- ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు
- ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం వద్ద తొలి దాడి
- ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
- అమెరికాతో కలిసి ఇరాన్‌పై పట్టపగలే బాంబులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్
- ఇరాన్ మిలిటరీ, ప్రభుత‌్వ, ఇంటెలిజెన్స్ లక్ష్యంగా దాడులు చేసినట్లు సమాచారం
- దాడుల సమయంలో ఖమేనీ తన కార్యాలయంలో లేరన్న సంబంధిత వర్గాలు
- అయతొల్లా ఖమేనీని సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు సమాచారం
- గగనతలం మూసివేతతో పాటు మొబైల్ సేవలను నిలిపివేసిన ఇరాన్
- టెహ్రాన్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో పైలట్లకు హెచ్చరికలు జారీ
ప్రతీకారచర్యగా ఇరాన్ కూడా క్షిపణులతో దాడులు జరిపే ప్రమాదం ఉందన్న ఇజ్రాయెల్
- ఇరాన్‌పై దాడులు చేసిన వెంటనే ఇజ్రాయెల్ వ్యాప్తంగా మోగిన సైరన్లు
- బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని ప్రజలకు ఇజ్రాయెల్ సూచనలు
- సమీపంలోని సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని ఇజ్రాయెల్ సూచనలు
- ప్రతీకారచర్యగా ఇరాన్ కూడా క్షిపణులతో దాడులు జరిపే ప్రమాదం ఉందన్న ఇజ్రాయెల్
- ప్రజలను అప్రమత్తం చేయటానికి సైరన్లు మోగించినట్లు వెల్లడించిన ఐడీఎఫ్
దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయులను అప్రమత్తం చేసిన కేంద్రం
- దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయులను అప్రమత్తం చేసిన కేంద్రం
- సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దన్న కేంద్రం
- ఇజ్రాయెల్ అధికారుల సూచనలు పాటించాలని భారతీయులకు సూచించిన కేంద్రం
- తాజా పరిణామాలతో ఈ మార్గంలో వారం పాటు విమాన సేవలు నిలిపివేసిన ఎయిరిండియా
మా మాట వినకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తాం: ట్రంప్
- మా మాట వినకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తాం: ట్రంప్
- ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తోంది: ట్రంప్
- ఇరాన్‌పై అమెరికా పెద్దఎత్తున యుద్ధ కార్యకలాపాలకు దిగింది: ట్రంప్
- ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా భారీ సైనిక చర్యను ప్రారంభించింది: ట్రంప్
- ప్రపంచంలో ఉగ్రవాదానికి ఇరాన్.. అతిపెద్ద మద్దతుదారు: ట్రంప్
- ఇటీవల నిరసనలు చేస్తున్న తన సొంత పౌరులనే వీధుల్లో చంపేసింది: ట్రంప్
- ఉగ్రవాద పాలనలో ఉన్న దేశానికి ఎప్పటికీ అణు ఆయుధాలు ఉండకూడదు: ట్రంప్
- అణు ఆయుధాల కోసం వారు చేసే దుర్మార్గపు ప్రయత్నాలు మానుకోవాలి: ట్రంప్
వరంగల్: కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
- వరంగల్: కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
- ‘కొలువుల కోసం కొట్లాట’ పేరిట కాజీపేటలో బీఆర్‌ఎస్ ధర్నా
- కాజీపేటలో కొలువుల కోసం కొట్లాట ధర్నాలో పాల్గొన్న హరీశ్‌రావు
- కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్
- కోచ్ ఫ్యాక్టరీలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్
గుజరాత్ గాంధీనగర్‌లో ఎన్ని ఇళ్లు కూల్చారో బీజేపీ నేతలు మర్చిపోయారా?: ఎంపీ చామల
- గుజరాత్ గాంధీనగర్‌లో ఎన్ని ఇళ్లు కూల్చారో బీజేపీ నేతలు మర్చిపోయారా?: ఎంపీ చామల
- గతేడాది గాంధీనగర్‌లో భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ఇళ్లు కూల్చారు
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలి.. ఇతర రాష్ట్రాల్లో వద్దా?
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పనుల కోసం భూసేకరణ జరగటం లేదా?
- పేదలకు మంచినీళ్లు వద్దని.. శారదపీఠం భూముల వద్దకు హరీశ్‌రావు వెళ్లారు
- పార్క్ భూములు, చెరువుల భూములను కొందరు కబ్జా చేశారు
- కబ్జాకు గురైన భూములను హైడ్రా కాపాడింది: చామల కిరణ్‌కుమార్
ఇరాన్‌పై దాడులు చేసిన ఇజ్రాయెల్
- ఇరాన్‌పై దాడులు చేసిన ఇజ్రాయెల్
- ఇరాన్‌పై క్షిపణి దాడులు చేసిన ఇజ్రాయెల్
- ఇరాన్‌పై దాడులు చేసినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణమంత్రి
- తమ దేశంలోని పౌరులను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్ సైన్యం
- ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశముందని హెచ్చరిక
- యుద్ధ సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం
రాజస్థాన్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
- రాజస్థాన్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
- బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం
- గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమం
- 14ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా అందిస్తామని వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ
- కోటీ 15 లక్షల మంది బాలికలకు టీకా అందించనున్నట్లు పేర్కొన్న కేంద్ర ఆరోగ్యశాఖ
- కాసేపట్లో రాజస్థాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు, శంకుస్థాపనలు చేయనున్న మోదీ
సదాశివపేటలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
- సంగారెడ్డి: సదాశివపేటలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
- లారీ- ఆర్టీసీ బస్సు ఢీకొని 15 మంది ప్రయాణికులకు గాయాలు
ఇందల్వాయి పీఏసీఎస్ ఎదుట రైతుల ధర్నా
- నిజామాబాద్: ఇందల్వాయి పీఏసీఎస్ ఎదుట రైతుల ధర్నా
- యూరియా సమస్య పరిష్కరించాలని రైతుల ఆందోళన
- యూరియా యాప్ రద్దు చేసి నేరుగా విక్రయించాలని డిమాండ్
- 15 రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామన్న రైతులు
- సొసైటీలు, ప్రైవేటు దుకాణాల్లో యూరియా దొరకట్లేదని రైతుల ఆవేదన
- యాప్‌లో చూపించిన సెకన్లలోనే యూరియా అయిపోవడంపై రైతుల ఆగ్రహం
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ
- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ
- స్పీకర్ విచారణకు హాజరైన స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- కడియంపై కేపీ వివేకానంద వేసిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ
- కడియం శ్రీహరి తరపు సాక్ష్యాలు నమోదు చేయనున్న స్పీకర్
నిజామాబాద్: కన్నతల్లిని సజీవ దహనం చేసిన కుమారుడు
- నిజామాబాద్: కన్నతల్లిని సజీవ దహనం చేసిన కుమారుడు
- నిజామాబాద్: కోటగిరిలో వృద్ధురాలైన తల్లిని చంపిన కుమారుడు
- మద్యానికి బానిసై తల్లి భూమవ్వపై దాడి చేసిన కుమారుడు
- తల్లిపై పాతబట్టలు వేసి నిప్పుపెట్టి కాల్చిచంపిన కుమారుడు
కన్నతల్లిని సజీవ దహనం చేసిన కసాయి కుమారుడు
- నిజామాబాద్: కన్నతల్లిని సజీవ దహనం చేసిన కసాయి కుమారుడు
- నిజామాబాద్: కోటగిరిలో వృద్ధురాలైన తల్లిని చంపిన కుమారుడు
- మద్యానికి బానిసై తల్లి భూమవ్వపై దాడి చేసిన కుమారుడు
- తల్లిపై పాతబట్టలు వేసి నిప్పుపెట్టి కాల్చిచంపిన కుమారుడు
బిచ్కుంద పట్టణానికి చెందిన సాయిలు దారుణ హత్య
- కామారెడ్డి : బిచ్కుంద పట్టణానికి చెందిన సాయిలు(53) దారుణ హత్య
- బిచ్కుంద శివారులో పాలగుండం ప్రాంతంలో పడి ఉన్న మృతదేహం
- రాళ్లతో కొట్టి చంపి పడేసినట్లు ఉన్న సాయిలు మృతదేహం
- బిచ్కుందలో వ్యక్తి హత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- సాయిలు హత్యకు ఆస్తి తగదాలే కారణమని భావిస్తున్న పోలీసులు
గాదె ఇన్నయ్య తండ్రి గాదె సాల్మోన్‌రెడ్డి కన్నుమూత
- గాదె ఇన్నయ్య తండ్రి గాదె సాల్మోన్‌రెడ్డి (98) కన్నుమూత
- జనగామ: జఫర్‌గఢ్ మండలం సాగరం గ్రామంలో సాల్మోన్‌రెడ్డి కన్నుమూత
- ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న గాదె ఇన్నయ్య
- మావోయస్టులతో సంబంధాల కేసులో జైలులో ఉన్న గాదె ఇన్నయ్య
- ‘మాఇల్లు ప్రజాదరణ-అనాథాశ్రమం’ నడుపుతున్న గాదె ఇన్నయ్య
వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య
- వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య
- వికారాబాద్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకున్న కానిస్టేబుల్ దివ్య
- వికారాబాద్: కోటపల్లి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న దివ్య
మధ్యాహ్నం వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశం
- మధ్యాహ్నం వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశం
- సచివాలయంలో కార్యదర్శులతో సమావేశంకానున్న సీఎం
- 99 రోజుల యాక్షన్‌ప్లాన్‌పై అధికారులకు సీఎం దిశానిర్దేశం
- మార్చి నుంచి జూన్ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు ప్రభుత్వం సిద్ధం
- ఇప్పటికే 99 రోజుల యాక్షన్‌ప్లాన్ రూపొందించిన అధికారులు
- విభాగాలవారీగా 99 రోజుల యాక్షన్‌ప్లాన్‌ను ఆమోదించనున్న సీఎం
మఠాన్ని కూల్చడమంటే.. భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే: హరీశ్‌రావు
- మఠాన్ని కూల్చడమంటే.. భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే: హరీశ్‌రావు
- కేసీఆర్ అద్భుతమైన ఆలయాలు నిర్మిస్తే ఈ ప్రభుత్వం అన్నీ కూల్చుతోంది: హరీశ్‌రావు
- ఖమ్మంలో పేదలు ఉంటున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారు: హరీశ్‌రావు
- మూసీ ఒడ్డున పేదల ఇళ్లు కూల్చుతున్నారు: హరీశ్‌రావు
- అన్నీ వదిలేసి శారదపీఠం భూములనే ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారు
- నేను ఇక్కడికి రాగానే పోలీసులు, రెవెన్యూ అధికారులు పారిపోయారు
కోకాపేటలోని రాజశ్యామల ఆలయానికి చేరుకున్న హరీశ్‌రావు
- హైదరాబాద్: కోకాపేటలోని రాజశ్యామల ఆలయానికి చేరుకున్న హరీశ్‌రావు
- విశాఖ శారద పీఠం భూమి ఖాళీ చేయించేందుకు సర్కార్ ప్రయత్నం
- విశాఖ శారద పీఠానికి గతంలో 2 ఎకరాలు కేటాయించిన బీఆర్‌ఎస్ సర్కార్
- ఆలయానికి ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టిన ప్రభుత్వం
- రాజశ్యామల ఆలయం వద్దకు చేరుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు
భద్రాచలం వద్ద గోదావరిలో దూకి యువకుడు ఆత్మహత్య
- భద్రాచలం వద్ద గోదావరిలో దూకి యువకుడు ఆత్మహత్య
- రాత్రి భద్రాచలంలో బ్రిడ్జిపై నుంచి దూకిన కంభంపాటి జస్వంత్
- ఉదయం గోదావరిలో గాలించి మృతదేహం వెలికితీసిన అధికారులు
మెదక్ : కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లిలో విషాదం
- మెదక్: కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లిలో విషాదం
- పోతిరెడ్డిపల్లి చెరువులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
- నిన్న మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయిన బాలుడు
- ఇవాళ పోతిరెడ్డిపల్లి పెద్దచెరువులో బాలుడి మృతదేహం లభ్యం
- బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో విషాదం
- నాగర్‌కర్నూల్: బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో విషాదం
- 3 నెలల బాలుడు నీటి తొట్టిలో అనుమానాస్పద మృతి
- భార్యాభర్తల మధ్య విభేదాలతో బాలుడి మృతిపై అనుమానాలు
నకిలీ గోల్డ్ బిస్కెట్లు ఇచ్చి కిలో బంగారు నగలతో వ్యక్తి పరారీ
- నకిలీ గోల్డ్ బిస్కెట్లు ఇచ్చి కిలో బంగారు నగలతో వ్యక్తి పరారీ
- ఓ ప్రముఖురాలి పీఏనంటూ బంజారాహిల్స్ నగల వ్యాపారితో పరిచయం
- హైదరాబాద్: బంగారు బిస్కెట్లు ఇచ్చి నగల మార్పిడికి ఒప్పందం
- మూడుసార్లు అసలైన బంగారం ఇచ్చి చివరికి ఇత్తడివి పుత్తడిగా నమ్మించిన వ్యక్తి
- నిందితుడు శ్రీనాథ్ రాటిపై గతంలో కూడా సీసీఎస్‌లో కేసులు నమోదు
శంషాబాద్‌లో యువకుడి జేబులో పేలిన సెల్‌ఫోన్
- రంగారెడ్డి: శంషాబాద్‌లో యువకుడి జేబులో పేలిన సెల్‌ఫోన్
- ప్యాంటు జేబులో నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన యువకుడు
- జేబులో మొబైల్ తీసి రోడ్డుపై పడేయడంతో తప్పిన ప్రమాదం
నేటితో ముగియనున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- నేటితో ముగియనున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- ఉదయం లక్ష్మీ నరసింహుడి అష్టోత్తర శత ఘటాభిషేకం
- రాత్రి డోలోత్సవం నిర్వహించి ఉత్సవాలకు పరిసమాప్తి పలకనున్న అర్చకులు
- రేపటి నుంచి యథావిధిగా పునఃప్రారంభం కానున్న సేవలు
బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం – 15 మంది మృతి, 30 మందికి గాయాలు
- బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం
- 15 మంది మృతి, 30 మందికి గాయాలు
- ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారిన విమానం
- రన్‌వే నుంచి జారి రోడ్డుపైకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొన్న విమానం
- కొత్తగా ముద్రించిన నోట్లను తీసుకెళ్తున్న బొలీవియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం
- బొలీవియా రాజధాని లా పాజ్‌కు సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో ఘటన
నేడు రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా పంపిణీ ప్రారంభం
- నేడు రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా పంపిణీ ప్రారంభం
- కింగ్ కోఠి ఆసుపత్రిలో హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం ప్రారంభం
- గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు హెచ్‌పీవీ టీకాలు
- 14 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు పంపిణీ
- హెచ్‌పీవీ టీకాల పంపిణీ ప్రారంభించనున్న ఆరోగ్యశాఖమంత్రి రాజనర్సింహ
- హెచ్‌పీవీ టీకాల పంపిణీ ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- రాష్ట్రంలో సుమారు 4లక్షల మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలు పంపిణీ
టీ-20 ప్రపంచకప్ సూపర్-8లో ఇంగ్లండ్ విజయం
- టీ-20 ప్రపంచకప్(T20 World Cup) సూపర్-8లో ఇంగ్లండ్ విజయం
- కొలంబో: న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు
- ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌ను గెలిపించిన విల్ జాక్స్, రెహాన్ అహ్మద్
- స్కోర్లు: న్యూజిలాండ్ 159/7, ఇంగ్లండ్ 161/6
- టీ-20 ప్రపంచకప్: ఇప్పటికే సెమీస్ చేరుకున్న ఇంగ్లండ్
- సెమీస్ రెండో బెర్త్ కోసం పోటీపడుతున్న న్యూజిలాండ్, పాకిస్థాన్
- ప్రస్తుతం న్యూజిలాండ్ ఖాతాలో 3 పాయింట్లు
సూపర్-8లో నేడు శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్
- టీ20ప్రపంచకప్(T20 World Cup) సూపర్-8లో నేడు పాక్‌కు కీలక పోరు
- సూపర్-8లో నేడు శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్
- పల్లెకెలెలో ఇవాళ రాత్రి 7 నుంచి పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్
- నేడు శ్రీలంకపై భారీ ఆధిక్యంతో గెలిస్తే పాక్ కూడా సెమీస్ చేరుకునే అవకాశం
- నేటి పాక్-శ్రీలంక మ్యాచ్‌పై ఆధారపడిన న్యూజిలాండ్ భవితవ్యం
ఇరాన్‌తో చర్చల పట్ల సంతృప్తిగా లేనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఇరాన్‌తో చర్చల పట్ల సంతృప్తిగాలేనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- తమ మాటల్ని ఇరాన్ పట్టించుకోవడం లేదని పేర్కొన్న ట్రంప్
- తదుపరి దఫా చర్చలో ఏం జరుగుతుందో వేచిచుద్దామని ట్రంప్ వెల్లడి
- యుద్ధం జరిగే మంచీ, చెడూ రెండు ఉంటాయని ట్రంప్ వ్యాఖ్య
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ స్పష్టం
దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకాల పంపిణీకి రంగం సిద్ధం
- దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకాల(HPV vaccination drive) పంపిణీకి రంగం సిద్ధం
- నేడు రాజస్థాన్‌లో హెచ్‌పీవీ టీకాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్‌పీవీ టీకా కార్యక్రమం
- మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమం
- 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా అందిస్తామని వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ
- కోటీ 15 లక్షల మంది బాలికలకు టీకా అందించనున్నట్లు పేర్కొన్న కేంద్ర ఆరోగ్యశాఖ
- ఉదయం 11.30 గంటలకు రాజస్థాన్‌లోని అజ్మేర్ చేరుకోనున్న ప్రధాని మోదీ
- రాజస్థాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని మోదీ
నేడు కామారెడ్డిలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
- నేడు కామారెడ్డిలో బీజేపీ(BJP) శాసనసభాపక్ష సమావేశం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అనుమతితో బీజేఎల్పీ సమావేశం
- ఇటీవల జరిగిన సంఘటనలపై సమీక్షించనున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు
నేడు జీహెచ్‌ఎంసీ పరిధి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల సమావేశం
- నేడు జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల సమావేశం
- గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ మల్కాజ్ గిరి కార్పొరేషన్లలోని నేతలతో భేటీకానున్న కేటీఆర్
- సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లు
- మూడు కార్పొరేషన్లలోని పరిస్థితులు, సమస్యలపై సమావేశంలో చర్చ