కామారెడ్డిలో పొలిటికల్ హైటెన్షన్.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత


దిశ, డైనమిక్ బ్యూరో: కామారెడ్డి జిల్లా పొలిటికల్ హైటెన్షన్. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ మధ్య సవాలు ప్రతిసవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరోరా భూములపై ​​ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం శిశుమందిర్ వద్దకు చర్చకు రావాలని షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కాటిపల్లి సవాల్ విసిరారు. దీంతో కామారెడ్డిలో ఒక్కసారిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. ఈ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి తన అనుచరులతో రాగా.. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారును రోడ్డుపైనే తిరగేసి ధ్వంసం చేశారు.

ఎమ్మెల్యే హౌస్ అరెస్టు

ఈ చర్యతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది ఇరు పార్టీల నేతలు దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం. ఇరు పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు.

అసలేం జరిగింది?:

కాలేజీ భూముల వ్యవహారం ఈ వివాదానికి కారణంగా మారింది. ఈ నెల 16వ తేదీన షబ్బీర్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ కళాశాల భూములు ఓ ప్రైవేట్ పాఠశాల, కళాశాలకు అమ్ముకున్నది ఎవరు? రూ.6 కోట్లకు అరోరా కాలేజీకి అమ్ముకుంది మీరు కాదా? అసలు కర్షపన్ కింగ్ వెంకటరమణారెడ్డినేనని అనుకూలంగా. వెంకట రమణారెడ్డికి గతంలో నేనే మున్సిపల్ కౌన్సిలర్‌గా అవకాశం ఇస్తే ఓడిపోయారు. జడ్పీటీసీగా అవకాశం ఇస్తే గెలిచారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా చేసినప్పుడు నాకు జన్మనిచ్చింది నా తండ్రి అయితే రాజకీయంగా నాకు జన్మనిచ్చింది షబ్బీరన్న అన్నది నువ్వు కాదా? 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా చేతుల మీదుగా బీఫామ్ ఇస్తే చివరి నిమిషంలో టికెట్ అమ్ముకుని విత్ డ్రా చేసుకుని పారిపోయావ్.

చూస్కో షబ్బీర్..

ఈ వ్యాఖ్యలకు 17వ తేదీన స్పందించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి షబ్బీర్ అలీపై త్రీవ స్థాయిలో స్పందించారు. నాపై షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలు ఈద్గా వద్ద కూర్చుందామా ఎక్కడైనా కూర్చుందాం రా చర్చకు అని సవాల్ చేశారు. నేను నా కుటుంబాన్ని తీసుకుని వస్తాను షబ్బీర్ కు దమ్ము ధైర్యం ఉంటే తన కుటుంబాన్ని తీసుకుని చర్చకు రావాలన్నారు. ఎమ్మెల్సీగా నేను నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే ఏ ల*కొడుకు డబ్బులు ఇచ్చాడో తేల్చుదామన్నాడు. నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదని కానీ నా మంచితనాన్ని అమాయకత్వం, నా చేతగానితనంగా ఆదరించాను. రేపటి నుంచి అన్యాయంగా ఎవరు మాట్లాడినా వాళ్ల వీపులు పగలగొట్టండి. ఇక్కడి నుంచి ఏ పోలీస్ స్టేషన్ అయినా నేనే నేరుగా వస్తా. ఇక చూసుకుందాం అంటూ తన అభిమానులకు. ఇక చూస్కో షబ్బీర్.. నువ్వు బీరో.. షబ్బీరో నీ సంగతి చూడకపోతే నా పేరు వెంకటరమణారెడ్డినే కాదు. నేను రెడ్డినో బుడ్డినే చూపిస్తానన్నారు. నా సంగతి నీకు అర్థం కావడం లేదు. నీ సంగతి చూడకపోతే నేను మీసాలు తీస్తానంటూ సవాల్ విసిరారు.

సాక్ష్యాలతో రావాలని సవాల్:

కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలపై తేల్చుకునేందుకు రావాలంటూ నిన్న ఓ ప్రకటనలో ఎమ్మెల్యే కాటిపల్లి ప్రకటించారు. శనివారం ఉదయం 10 గంటలకు సాక్ష్యాలు తీసుకుని సరస్వతీ శిశుమందరి వద్దకు రావాలని ఇక్కడికి తాను వస్తానని చెప్పారు. ఎమ్మెల్యే చేసిన సవాలుకు స్పందించిన కాంగ్రెస్ నేతలు తాము కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ రోజు ఉదయం నుంచే కామారెడ్డి పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.



Source link

Spread the love