
ఇంటర్నెట్ డెస్క్: కార్తిక పౌర్ణమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర కాశీ నగరంలో దేవ్ దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన కాశీ దీపాల వెలుగులతో దేదీప్యమానమైంది. గంగానదీ ఘాట్‌లలో లక్షలాది భక్తులు దీపాలను వెలిగించారు. వేడుకలకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పంచుకున్నారు. ‘కాశీలో అద్భుతమైన దేవ్ దీపావళి’ అని పేర్కొన్నారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ వేడుకలకు మద్దతుగా నిలిచారు. వేడుకల్లో భాగంగా లేజర్, ఫైర్‌వర్క్ షో, సాంస్కృతిక కార్యక్రమాల భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. గంగా ఘాట్‌ల వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలతో ఆత్మికత వెల్లివిరిసింది.
