అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
కాశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాశ్మీర్ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగం అవుతుందని కీలక ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి 5 కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) ను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం పరిష్కరించే వరకు దక్షిణాసియాలో శాంతి నెలకొనదని తెలిపారు. మరో కాశ్మీర్ వివాదం నెపంతో భారత్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.
ఫిబ్రవరి 5.. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్బంగా పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం పరిష్కరించే వరకు దక్షిణాసియాలో శాంతి నెలకునే అవకాశం ఉంది. కాశ్మీర్ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వివాదాన్ని భారత్ పరిష్కరించని పక్షంలో ప్రాంతీయ అస్థిరత కొనసాగుతుందని షెహబాజ్ షరీఫ్ సూచించింది. అదనంగా.. కాశ్మీర్ ను పాకిస్థాన్ జీవనాడిగా జిన్నా ప్రకటించారని.. అది ఇప్పటికీ మా విదేశాంగ విధానానికి ఆధారంగా ఉందని షరీఫ్‌ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం చేతిలో హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీ, సయ్యద్ అలీ గిలానీల పేర్లను పాక్ ప్రధాని ప్రస్తావించారు.

మరోవైపు సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ.. కాశ్మీరీలకు తమ దేశ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. భారత సైన్యం చేస్తున్న అణచివేత కాశ్మీరీల సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది.. అని పేర్కొన్నారు. కాశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం మౌనం వీడాలని, భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.