- యూఎన్‌లో ఇమ్రాన్ ఖాన్ కుమారుడి ప్రసంగం..
- తన తండ్రిని విడిచిపెట్టేలా పాక్‌పై ఒత్తిడి పెట్టాలని విజ్ఞప్తి..
- దేశ వ్యతిరేక కుట్ర అంటూ పాక్ ప్రభుత్వం మండిపాటు..

పాకిస్తాన్: మాజీ ప్రధాని, అవినీతి ఆరోపణపై జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ చేసిన ఒక్క ప్రసంగం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఈ సమావేశంలో ఖాసిం ఖాన్.. తన తండ్రిని వెంటనే విడుదల చేస్తే పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన చెప్పారు. “ఇమ్రాన్ ఖాన్‌పై వేధింపులను తక్షణమే ఆపాలని పాకిస్తాన్‌ను కోరాలని మేము ఈ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిని అభ్యర్థిస్తున్నాము. ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ అభిప్రాయాన్ని అనుసరించి ఆయనను విడుదల చేయాలి” అని అన్నారు.
ఇది కూడా చదవండి: Iran Strikes Kuwait: కువైట్, దుబాయ్‌లపై ఇరాన్ భారీ దాడి.. అమెరికా సైనికులు మృతి..!
అయితే, ఖాసిం ఖాన్ ప్రసంగంపై పాక్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ప్రసంగం ద్వారా దేశానికి సంబంధించిన జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్లస్ (GSP ప్లస్) హోదాను బలహీనపరిచేందుకు ప్రయత్నించారని పాకిస్థాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ హోదా పాకిస్తాన్ ద్వారా ఎగుమతులపై తక్కువ ఈయూ తక్కువ సుంకాలు విధిస్తుంది. ఆ దేశ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ.. ఇది పాకిస్థాన్ జీఎస్పీ ప్లస్ హోదాను బలహీనపరిచే ”దేశ వ్యతిరేక కుట్ర”గా అభివర్ణించారు. పాకిస్తాన్ వ్యతిరేక బృందం యూనియన్‌లో ఇజ్రాయిల్ లాబీతో, నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)తో కలిసి పనిచేస్తున్నట్లు పాక్ మంత్రులు ఆరోపిస్తున్నారు.