సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన కేంద్ర ప్రభుత్వం షరుతులు లేకుండా వడ్డీతో పాటు మొత్తం చెలించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేసింది.

సిరిసిల్ల టౌన్ మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : సహారా ఇండియా కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన కేంద్ర ప్రభుత్వం షరుతులు లేకుండా గ్రూప్ వడ్డీతో పాటు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సీపీఐ ఆధ్వర్యంలో సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన బాధితులు, పట్టణ ప్రధాన గుండా ఆర్డీవో కార్యాలయం వరకు ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సీఐటీయూ కార్యదర్శి కోడం రమేష్ మాట్లాడారు. సహారా ఇండియా గ్రూప్ కంపనీలో అవసరాలకు ఉపయోగపడతాయని అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో కోట్లాది మంది పేద ప్రజలు వివిధ సాంకేతికతల్లో పొదుపు చేసుకున్నారు. 2023 నవంబర్‌లో సహారా గ్రూప్ కంపనీ అధినేత సుబ్రతారాయ్ మరణించిన తర్వాత కంపెనీ మూతపడడంతో గడువు ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించారు. వీరితో బాధితులు కోర్టులో కేసు వేయగా సుప్రీం కోర్టు 2023 మార్చి 29న కంపెనీని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆస్తులను జప్తు చేసి ఒక సంస్థ ద్వారా డబ్బులు జమ చేసిన బాధితులకు సంవత్సరపు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. బాధి తులు సహారా ఇండియా గ్రూప్ కంపెనీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయాలంటే సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జవ్వాజి విమల, ఆడెపు రజిత, సందు పట్ల పోచమల్లు, గోవర్ధన్, సహారా ఇండి యా గ్రూప్ కంపెనీ బాధితులు ఉన్నారు.
నవీకరించబడిన తేదీ – మార్చి 24, 2026 | 11:46 PM