భారతదేశంలో చైనా జనాభా ప్రభావం: చైనాలో జనాభా తగ్గుదల.. ఆ దేశాన్ని ఇబ్బందులు పెడుతుంది. మరోవైపు మొన్నటి వరకు జనాభా నియంత్రణపై ఆంక్షలు పెట్టిన ప్రభుత్వాలు.. ఇపుడు జనాభా పెరుగుదల దేశానికి శ్రీరామరక్ష అంటున్నాయి. భారత్ జనాభా పెరుగుదల.. ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకుంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాలక్రమంలో జనాభా పెరుగుదల దేశ స్థితిగతులను మారుస్తోందని నిపుణులు అంటున్నారు.ప్రపంచ దేశాల్లో భారత దేశం మూడేళ్ల క్రితమే చైనాను అధిగమించింది. ఇపుడు ప్రపంచంలోనే ప్రథమ భారత కైవసం చేసుకుంది. రోజులు మారుతున్నకొద్దీ ప్రపంచ దేశాల జనాభా పెరుగుదల విషయంలో వెనుకడుగు వేస్తోంది. దీనికంతా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన సంతానలేమి సమస్య ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. భారత దేశం కూడా సంతాన లేమి సమస్యతో సతమతమవుతోంది. అయినప్పటికీ.. జనాభా పెరుగుదల విషయంలో దూసుకు పోయింది. నూట నలభై ఏడు కోట్ల లక్షల 26 వేల 634 మంది జనాభాతో భారత్ రికార్డు సృష్టించింది. 143 కోట్లతో చైనా రెండోస్థానంలో నిలిచింది.
ప్రపంచ జనాభాలో పెరిగిన వృద్ధాప్యం, తగ్గిపోతున్న శ్రామిక శక్తి, సంతానలేమి సమస్యతో చైనా విలవిల్లాడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనాతో పోల్చితే భారతదేశంలో యువశక్తి ప్రపంచంలోనే చురుకైన పాత్ర పోషిస్తుందని, ఇది దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పారిశ్రామిక ప్రగతికి దోహదపడే యువశక్తి సామర్థ్యాలు భారతదేశానికి పుష్కళంగా పెరుగుతున్న అక్షరాస్యత వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు భారత దేశంనుంచి యువమేథస్సు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది.. అన్ని దేశాల్లోనూ భారత యువజనులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల్లోనూ భారతీయులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
పరిశ్రమల్లో పనిచేసే నడి వయస్కులతో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఉత్పాదక సంస్థలు, పరిశ్రమలు, టెక్నాలజీ రంగంలో పనిచేసే శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంపొందిస్తే ప్రపంచ వ్యాప్తంగా భారత్ సేవలు అందించగలిగే శక్తిసామర్థ్యాలు సమృద్ధిగా ఉన్నాయని మానవవనరుల నిపుణులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వాల నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్నాయి. పరిశ్రమల్లో పనిచేసే నైపుణ్యం పెంపుదలకు అవసరమైన అవగాహన కల్పన, ఇంజినీరింగ్ కోర్సుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రపంచంలోని ఆర్థిక శక్తుల్లో ఒకటైన చైనా ప్రస్తుతం తీవ్రమైన జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. చైనా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకారం.. 2025 సంవత్సరం చివరికి చైనా మొత్తం జనాభా 140 కోట్లకు చేరుకుంది. ఇది 2024తో పోలిస్తే సుమారుగా 30 లక్షలు తగ్గినట్లు గుర్తించబడింది. వరుసగా నాలుగో సంవత్సరం కూడా చైనాలో జనాభా తగ్గుదల నమోదు కావడం లేదు.
2025లో చైనాలో జననాల సంఖ్య కేవలం 79లక్షల 20వేలుగా నమోదైంది. ఇది గత ఏడాదితో దాదాపు 17 శాతం తక్కువగా ఉందని జనాభా గణాంక నిపుణులు లెక్కగట్టారు. ప్రతి వెయ్యి మందికి జనన రేటు 5.63కి పడిపోయింది. ఇది 1949 తర్వాత చైనాలో నమోదైన అతి తక్కువ స్థాయికి చేరింది. చైనాలో జననాల కంటే మరణాలు ఎక్కువగా ఉండటం వల్లే జనాభా తగ్గుతోంది. చైనా జనాభా క్రమేణ తగ్గుముఖం పడుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. 2100 నాటికి వందకోట్లకు తగ్గుదల అంచనాలు ఉన్నాయి. శ్రామికశక్తి తగ్గిపోతుండటం, పెరుగుతున్న వృద్ధాప్యం చైనాకు భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంచనాలు ఉన్నాయి.
భారతదేశ జనాభా దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2060 నాటికి 170 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆ తరువాత క్రమంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. పెరిగిన జనాభాతో యువజన శక్తి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చురుకుగా ఉందని ప్రపంచ జనాభా గణన నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు పెరుగుతున్న అక్షరాస్యత, విద్యావంతులు, సాంకేతిక నిపుణులతో భారతదేశ సర్వసంపన్న దేశంగా విరాజిల్లుతుందనే భావన వ్యక్తమవుతోంది.
భారతదేశంలో జననాల రేటు తగ్గుతున్నప్పటికీ యువత జనాభా ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక. కీలకమైన భారతదేశం యొక్క కీలకమైన శక్తి ప్రపంచదేశాల్లో పాత్ర పోషించబోతోందని నిపుణులు దీనితో యువజన. శ్రామిక శక్తిగల యువజనుల శాతం ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. మొత్తం భారతదేశ జనాభాలో 0-14 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు 24 శాతం మంది ఉన్నారు. 10-19 ఏళ్ల వయస్సులో ఉన్నవారు 17 శాతం మంది, 10-24 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నవారు 26 శాతం మంది ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక సారాంశం. 15 నుంచి 64 ఏళ్ల వయసున్నవారు పరిశ్రమల్లో పనిచేయగలిగే సామర్థ్యం ఉన్నవారు 68 శాతం మంది ఉన్నారు. 65 ఏళ్లకు పైబడిన వృద్ధుల జనాభా కేవలం 7 శాతం మాత్రమే ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దేశంలో ఆయుర్దాయం పెరగడంతో భవిష్యత్‌లో ఈ జనాభా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేశారు.
జనాభా కూర్పు, సంతానోత్పత్తి, ఆయుర్దాయం వంటి కీలక మార్పులను కూడా ఈ నివేదిక అందించింది. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు స్త్రీకి 1.9 జననాలకు తగ్గినట్లు నివేదిక చెబుతోంది. ఇది జనాభా పరిమాణాన్ని ఒక తరం నుండి మరో తరాన్ని సృష్టించడానికి అవసరమైన రీప్లేస్‌మెంట్ రేటు 2.1 గా ఉంది. ఈ స్థానంలో భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉంది. అంటే భారతదేశంలోని ప్రజలు ప్రస్తుత తరం జనాభాను స్థిరంగా ఉంచడానికి అవసరమైన దాని తక్కువ మంది పిల్లలకు జన్మనిస్తున్నారని జనాభా ఉన్నట్లు చెబుతున్నారు.
చైనా ప్రభుత్వం పన్ను రాయితీలు, పిల్లల సంరక్షణకు సబ్సిడీలు, ఉచిత కిండర్ గార్టెన్ విద్య వంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అయినా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు సరిపోవు. జీవన ఖర్చులు తగ్గించడం, మహిళలకు కుటుంబం–ఉద్యోగం మధ్య మార్పులు కల్పించడం, దీర్ఘకాలిక సామాజిక సంస్కరణలు తీసుకురావడం అవసరం అని ప్రజలు ఆశిస్తున్నారు.
మరింత చదవండి: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి జాబితా ఇదే..!
మరింత చదవండి: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
చైనా ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య వృద్ధుల జనాభా పెరుగుదల. 2025 ఏళ్లనాటికి చైనాలో 60కి పైబడిన వారి సంఖ్య 323 మిలియన్లకు చేరింది. ఇది మొత్తం జనాభాలో సుమారు 23 శాతం. దీనివల్ల పని చేసే యువ జనాభా తగ్గిపోతుంది. కార్మికుల కొరత ఏర్పడి, పరిశ్రమలు, ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ రంగం దెబ్బతింటుంది. పెన్షన్ వ్యవస్థలపై కూడా తీవ్ర భారం పడనుంది.ఇది పారిశ్రామిక ప్రగతిపై తీవ్రప్రభావం చూపనుంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం గతంలో అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ. 1979 నుంచి 2015 వరకు ఒకే సంతానం విధానం అమల్లో ఉండటంతో ఇప్పుడు దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. 2016లో టూ చైల్డ్ పాలసీ, 2021లో త్రీ చైల్డ్ పాలసీ తీసుకొచ్చినా జననాలు పెరగలేదు. దీనికి తోడు జీవన ఖర్చులు పెరగడం, ఉద్యోగ ఒత్తిడి, యువత పెళ్లిళ్లు ఆలస్యం కావడం, మహిళలు ఉద్యోగాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వంటి సామాజిక మార్పులు కూడా జనన రేటు తగ్గడానికి కారణమవుతున్నాయి. 2025లో వివాహాల సంఖ్య కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.
చైనా జనాభా తగ్గుదల దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ వంటి దేశాలు ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద జనాభాను కలిగి ఉన్నాయి.. ప్రపంచ కొత్త ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఈ చైనా తన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలంటే కొత్త వ్యూహాలతో ముందుకు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే చైనా ఈ డెమోగ్రాఫిక్‌ని అధిగమించగలదని నిపుణులు తెలుసుకుంటారు.
(రచయత.. జీన్యూస్ డెస్క్ సౌజన్యంతో )
ఇది కూడా చదవండి: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
ఇది కూడా చదవండి: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U
లింక్ – https://apple.co/3loQYe
.ట్విట్టర్, ఫేస్బుక్సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి.