జీవన్ రెడ్డి | బీఆర్ఎస్ పాలన బావుంది..


  • జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
  • కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న నేత..

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుడుపు జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళుతున్నారు. కాసేపట్లో వీరిద్దరూ భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆయన భేటీ కానుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జీవన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో బాగున్నా, కేసీఆర్ ని పదేళ్ల బీఆర్ పాలనే చాలా ఉందని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని, ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

– ప్రకటన –



Source link

Spread the love