
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం యథేచ్ఛగా ఫేక్ న్యూస్ ప్రసారమవుతోంది. వీటి వల్ల సెలెబ్రిటీలు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. టీమ్ఇండియా (టీమ్ ఇండియా) మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తాజాగా ఇలాంటి ఓ ఫేక్ న్యూస్ వల్ల ఇబ్బందికి గురయ్యాడు. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (గౌతమ్ గంభీర్), బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను ఉద్దేశించి అతడు అన్నట్లుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అది ఫేక్ న్యూస్’ అని, తాను అలా అనలేదని సిద్ధు క్లారిటీ ఇచ్చాడు.
‘ఒక వేళ టీమ్‌ఇండియా 2027 వన్డే వరల్డ్‌కప్ నెగ్గాలనుకుంటే.. బీసీసీఐ.. అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్‌ను తొలగించాలి. ఎంత తొందర వీలైతే అంత తొందరగా.. తిరిగి కెప్టెన్సీని రోహిత్ శర్మకు (రోహిత్ శర్మ) అప్పగించాలి’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు కోసం ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది సిద్ధు దృష్టికి వెళ్లడంతో దాన్ని అతడు తీవ్రంగా ఖండించాడు. ‘నేను అలా ఎప్పుడూ అనలేదు. ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయకండి. అలా చేసిన వారు సిగ్గుపడాలి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి నిజమేంటో తేల్చి చెప్పాడు.