LIVE FEED
టీ20 ప్రపంచకప్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే
- టీ20 ప్రపంచకప్: కాసేపట్లో భారత్-జింబాబ్వే మ్యాచ్
- టీ20 ప్రపంచకప్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే
- కాసేపట్లో చెన్నై వేదికగా భారత్-జింబాబ్వే మ్యాచ్
- వెస్టిండీస్ ఓటమితో భారత్‌కు మెరుగైన సెమీస్ అవకాశాలు
- భారత్ సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకం
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా
- టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా
- వెస్టిండీస్‌పై విజయంతో సెమీస్ చేరిన దక్షిణాఫ్రికా
- సూపర్-8లో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం
- స్కోర్లు: వెస్టిండీస్ 176/8, దక్షిణాఫ్రికా 177/1 (16.1 ఓవర్లలో)
అక్రిడిటేషన్ కార్డులపై ప్రభుత్వ జీవో 252పై హైకోర్టులో విచారణ
- అక్రిడిటేషన్ కార్డులపై ప్రభుత్వ జీవో 252పై హైకోర్టులో విచారణ
- ప్రస్తుత కార్డులను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఏజీ
- జీవో 252పై జర్నలిస్టుల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
సీఎం రేవంత్‌రెడ్డికి సమగ్ర నివేదికను అందించిన రాష్ట్ర విద్యా కమిషన్
- సీఎం రేవంత్‌రెడ్డికి సమగ్ర నివేదికను అందించిన రాష్ట్ర విద్యా కమిషన్ (CM Revanth Reddy)
- 305 స్కూళ్లను సందర్శించాం: ఆకునూరి మురళి
- విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో 46 సమావేశాలు జరిపాం: ఆకునూరి మురళి
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలని సిఫార్సు చేశాం
- విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నివేదికను రూపొందించాం
- ప్రైవేటు స్కూళ్లలో ఫీజులపై కొన్ని సిఫార్సులు చేశాం
- స్కూల్ డిస్ట్రిక్ ఉండాలని కొన్ని సిఫార్సులు చేశాం: ఆకునూరి మురళి
- ఒకటో తరగతి నుంచి మూడు భాషల విధానం ఉండాలని సిఫార్సు చేశాం: ఆకునూరి మురళి
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేయాలి: సీఎం
- హైదరాబాద్: విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష
- సమీక్షలో పాల్గొన్న వేం నరేందర్‌రెడ్డి, కె.కేశవరావు
- సమీక్షలో పాల్గొన్న శేషాద్రి, అజిత్‌రెడ్డి, ఆకునూరి మురళి
- కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి: సీఎం
- ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేయాలి: సీఎం
- బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లో తప్పని సరిగా పాలు ఆందించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- విజయాడైయిరీ నుంచి పాలు సేకరించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీ వినియోగించాలి: సీఎం
- ఆరుట్ల స్కూల్ తరహాలో రవాణా సహా అన్ని సౌకర్యాలు కల్పించాలి: సీఎం
- ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల రవాణాకు ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటుపై అధ్యయనం చేయాలి: సీఎం
- ప్రైవేట్ స్కూళ్లలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు, రికవరీ చేసేలా నిబంధన విధించాలి: సీఎం
ప్రాజెక్టులపై హరీశ్‌రావు, కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు : పొంగులేటి
- ప్రాజెక్టులపై హరీశ్‌రావు, కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు : పొంగులేటి
- ప్రాజెక్టులపై హరీశ్, కేటీఆర్ అబ్ధదాలు మాట్లాడుతున్నారు
- గత పదేళ్లు దొరల పాలన జరిగింది : పొంగులేటి
- కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా జేబులు నింపుకున్నారు
- రూ.1.08 లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు : పొంగులేటి
- లక్ష కోట్లు ఖర్చు చేసి నాలుగేళ్లలో కేవలం 110 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు
- ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ హయాంలోనే బ్యారేజీలు లీకవడం మొదలైంది
- బీఆర్ఎస్ హయాంలోనే బ్యారేజీలు కుంగాయి
- బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధం మనకు కనిపిస్తోంది
- సీబీఐ విచారణకు ఇచ్చినా కేంద్రప్రభుత్వం ఇంకా ఏమీ చేయట్లేదు : పొంగులేటి
సంక్షేమం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ
- సంక్షేమం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ
- వంద రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీఎస్ వెల్లడి
- అన్ని శాఖలు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలి: సీఎస్
- వంద రోజుల కార్యక్రమాల్లో సీఎం, మంత్రులు పాల్గొంటారు: సీఎస్
- వంద రోజుల కార్యక్రమాలపై ఈనెల 28న ఆయా శాఖల కార్యదర్శుల భేటీ
- ఈనెల 28 న జరిగే భేటీకి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
- మార్చి 2 నుంచి జూన్ 9 వరకు అభివృద్ధి పనులపై ప్రణాళిక సిద్ధం చేయాలి: సీఎస్
- వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు
- ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, వైద్య, విద్యా శాఖల ప్రణాళిక రూపొందించాలి: సీఎస్
ముంబయి: అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు
- ముంబయి: అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు
- ముంబయి: రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆఫీసుల్లో సీబీఐ సోదాలు
- ముంబయి: రూ.2,220 కోట్ల రుణ మోసం కేసులో సీబీఐ సోదాలు
జనగామ: స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు
- జనగామ: స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు
- రిజర్వాయర్‌లో గల్లంతైన కారు డ్రైవర్ పవన్ మృతదేహం లభ్యం
- జనగామ: కారు నుంచి స్వల్పగాయాలతో బయటపడిన ధారావత్ చరణ్
- జనగామ: చిల్పూరు మండలం దేశాయితండా వద్ద ఘటన
త్వరలో ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం: ప్రధాని మోదీ
ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగం గౌరవంగా భావిస్తున్నా: మోదీ
- ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగం గౌరవంగా భావిస్తున్నా: మోదీ
- స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్‌తో నన్ను సత్కరించారు: మోదీ
- మెడల్ ప్రదానం చేసిన స్పీకర్, ప్రధానికి ధన్యవాదాలు: మోదీ
- ఇరుదేశాల స్నేహానికి గుర్తుగా భారత ప్రజలకు మెడల్ అంకితం చేస్తున్నా: మోదీ
- వ్యూహాత్మక భాగస్వామ్యంపై చరిత్రాత్మక నిర్ణయాలు: మోదీ
- ఈ నిర్ణయాలు ఇరుదేశాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి: మోదీ
- కొత్త దిశ, వేగవంతమైన అభివృద్ధిపై ఇరుదేశాలు చర్చించాయి: మోదీ
భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు
- పరస్పరం అవగాహన ఒప్పందాలు మార్చుకున్న ఇరుదేశాల ప్రతినిధులు
- విద్య, వ్యవసాయ రంగంపై ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందం
- సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో అవగాహన ఒప్పందం
- వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ సెక్టార్ రంగాల్లో అవగాహన ఒప్పందం
- సాంస్కృతిక, హెరిటేజ్ రంగాల్లో అవగాహన ఒప్పందాలు
- ఫైనాన్స్, యూపీఐ రంగాల్లో అవగాహన ఒప్పందాలు
- ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమక్షంలో ఒప్పందాలు
జనగామ: స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు
- జనగామ: స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు
- జనగామ: కారు డ్రైవర్ భూక్యా పవన్ గల్లంతు
- కారు నుంచి స్వల్పగాయాలతో బయటపడిన ధారావత్ చరణ్
- జనగామ: చిల్పూరు మండలం దేశాయితండా సమీపంలో ఘటన
భారత్-ఇజ్రాయెల్ మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు
- చర్చల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, జైశంకర్, అజిత్ ఢోబాల్
- ఇజ్రాయెల్ తరఫున చర్చల్లో పాల్గొన్న ప్రధాని నెతన్యాహు, ఇతర నేతలు
- సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు
- వ్యవసాయం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాణిజ్య అంశాల్లో ఒప్పందాలపై చర్చలు
- పలు కీలక అంశాలపై ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందాలు
- అవగాహన ఒప్పందాల తర్వాత ఇరువురు ప్రధానుల మీడియా సమావేశం
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల తరపున సుప్రీంకోర్టుకు వెళ్తాం: కేటీఆర్
- ఖమ్మం పరిధిలోని వెలుగుమట్లలో కూల్చివేతలు పరిశీలన
- భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలించిన కేటీఆర్
- ఖమ్మం జిల్లా: బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్న కేటీఆర్
- పోలీసు బందోబస్తుతో తమను ఖాళీ చేయించారని బాధితుల ఆవేదన
- ప్రభుత్వం దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చేసింది: కేటీఆర్
- బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం: కేటీఆర్
- ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు భరోసా ఇచ్చిన కేటీఆర్
- బాధితుల తరపున సుప్రీంకోర్టుకు వెళ్తాం: కేటీఆర్
- బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇదే స్థలంలో ఇళ్లు కట్టిస్తాం: కేటీఆర్
- బాధితులకు ఇళ్లు కట్టించి.. గృహప్రవేశాలు చేయిస్తాం: కేటీఆర్
- అక్రమ కూల్చివేతలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం: కేటీఆర్
నల్గొండ జిల్లా: మిర్యాలగూడలో ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్
- నల్గొండ జిల్లా: మిర్యాలగూడలో ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్
- మిర్యాలగూడ: పన్ను బకాయి ఉన్న దుకాణాలను సీజ్ చేసిన అధికారులు
- పన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరిక
ఖమ్మం పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ భూములను పరిశీలిస్తున్న కేటీఆర్
- ఖమ్మం పరిధిలోని వెలుగుమట్లకు చేరుకున్న కేటీఆర్(KTR Tour)
- వెలుగుమట్ల భూదాన్ భూములను పరిశీలిస్తున్న కేటీఆర్
- భూదాన్ భూముల్లో ఉన్న వారిని నిన్న ఖాళీ చేయించిన అధికారులు
- వెలుగుమట్లలో గుడిసెలు తొలగించి పేదలను తరలించిన అధికారులు
కేరళ స్టోరీ 2 సినిమాపై స్టే విధించిన కేరళ హైకోర్టు
- కేరళ స్టోరీ 2 సినిమాపై స్టే విధించిన కేరళ హైకోర్టు
- రేపు విడుదల కావాల్సి ఉన్న కేరళ స్టోరీ 2 చిత్రం నిలిపివేత
- ఫిర్యాదులను సెన్సార్ బోర్డు పరిగణనలోకి తీసుకోవాలన్న కేరళ హైకోర్టు
టీ20 ప్రపంచకప్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- టీ20 ప్రపంచకప్(T20 World Cup): టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మధ్య సూపర్-8 మ్యాచ్
- భారత్‌కు కీలకంగా మారిన దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్ ఫలితం
- భారత్ సెమీస్ చేరే అవకాశాలను ప్రభావితం చేయనున్న మ్యాచ్ ఫలితం
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఖర్గేతో చర్చించినట్లు వెల్లడించిన జగ్గారెడ్డి
- రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించానన్న జగ్గారెడ్డి
- వీహెచ్, కుసుమకుమార్‌కు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరానన్న జగ్గారెడ్డి
కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్‌లో కేసీ క్యాంపు వద్ద రోడ్డు ప్రమాదం
- కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్‌లో కేసీ క్యాంపు వద్ద రోడ్డు ప్రమాదం
- డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో అదుపుతప్పి ఫర్నిచర్ దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ
- ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు, ఫర్నిచర్ ధ్వంసం
రైతుల ధర్నాతో పసుపు కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు
- నిజామాబాద్: రైతుల ధర్నాతో పసుపు కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు
- లాట్ నంబర్ కేటాయించకుండా నేరుగా కొనుగోలు ప్రారంభం
- నిజామాబాద్: క్రయవిక్రయాలు జరుగుతుండడంతో శాంతించిన కర్షకులు
నిజామాబాద్ మార్కెట్లో నిలిచిన పసుపు క్రయవిక్రయాలు
- నిజామాబాద్: మార్కెట్లో నిలిచిన పసుపు క్రయవిక్రయాలు
- నిజామాబాద్ మార్కెట్లో 3 రోజులుగా జరగని కొనుగోళ్లు
- నిజామాబాద్: మార్కెట్ ఆఫీస్ ఎదుట రైతుల ధర్నా
- నిజామాబాద్: పసుపు రాసుల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు
- మార్కెట్ యార్డుకు అమ్మకానికి వచ్చిన పసుపు రాసులు
- నిజామాబాద్: కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆగ్రహం
- ఈ-నామ్ సర్వర్ సమస్యలతో పసుపు కొనుగోళ్లకు ఆటంకాలు
- సర్వర్ సమస్యలతో లాట్ నంబర్ కేటాయించని అధికారులు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,66,280
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Today Gold Rate) రూ.1,66,280
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,79,000
ట్రైబ్యునళ్ల పనితీరు, కొత్త ట్రైబ్యునళ్ల ఏర్పాటుపై సుప్రీంకోర్టు విచారణ
- ట్రైబ్యునళ్ల పనితీరు, కొత్త ట్రైబ్యునళ్ల ఏర్పాటుపై సుప్రీంకోర్టు విచారణ
- ట్రైబ్యునల్స్లోని సాంకేతిక సభ్యుల పనితీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
- సాంకేతిక సభ్యులు ఉత్తర్వులు రాయడం లేదని వ్యాఖ్యానించిన సీజేఐ
- సాంకేతిక సభ్యులకు ఐబీసీ, కంపెనీ చట్టం తెలియకపోవచ్చన్న సీజేఐ
- ట్రైబ్యునళ్ల విషయంలో కొత్త యంత్రాంగం అవసరం కావొచ్చన్న సీజేఐ
- అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కోరిన అటార్నీ జనరల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా
- పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా
- నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో లకిడీకపూల్లో ఆందోళన
- డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ నిరుద్యోగుల ధర్నా
- నిరుద్యోగులకు మద్దతు తెలిపిన రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకం సీజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
- ఎన్సీఈఆర్టీ (NCERT) 8వ తరగతి పాఠ్యపుస్తకం సీజ్ చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశం
- ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టులో విచారణ
- పాఠ్యాంశం ప్రచురించిన అన్ని పుస్తకాలపై నిషేధం విధించిన త్రిసభ్య ధర్మాసనం
- న్యాయవాదుల ప్రస్తావనతో సుమోటోగా సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ
- పాఠ్యాంశం తొలగించి డిజిటల్ రూపంలోనే పాఠ్యపుస్తకాలకు ధర్మాసనం అనుమతి
జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
- జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Jubileehills fire accident)
- వస్త్ర దుకాణంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు
- జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం
- దుకాణంపై ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్‌కు అంటుకున్న మంటలు
- గోపురం నుంచి దుకాణం ముందు భాగమంతా వ్యాపించిన మంటలు
- రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- కొన్ని రోజులుగా వస్త్రదుకాణం స్టోర్ ఖాళీగా ఉన్నట్లు సమాచారం
వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
- వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
- వరంగల్ జిల్లా కోర్టులో తనిఖీలు చేపట్టిన పోలీసులు
- కోర్టులో బాంబుస్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్న పోలీసులు
పేదల ఇళ్లు, జవాన్ల ఫ్లాట్లను కూలగొడుతున్నారు: రామచందర్‌రావు
- పేదల ఇళ్లు, జవాన్ల ఫ్లాట్లను కూలగొడుతున్నారు: రామచందర్‌రావు
- గుజరాత్లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కోసం పేదల ఇళ్లను కూల్చలేదు
- పేదల ఇళ్లను కూల్చి బఫర్‌జోన్‌ను పెంచాల్సిన అవసరం లేదు
- పేదలు కూరగాయలు సాగు చేసుకుంటున్న భూములు లాక్కోవద్దు
- భూమి సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు: రామచందర్‌రావు
- పేదల భూములను బలవంతంగా లాక్కోవడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నాం
- రాష్ట్రం చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తోందనేది అవాస్తవం
- గాంధీ సరోవర్ ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే చేపట్టింది: రామచందర్‌రావు
- అన్ని అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లు, అపార్ట్మెంట్లను కూల్చుతున్నారు
- రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పేదల ఇళ్లను కూల్చుతున్నారు
వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వివరణ
- వెలుగుమట్ల భూదాన్ భూముల (Velugumatla Bhoodan lands)పై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వివరణ
- హైకోర్టు ఆదేశానుసారమే ప్రభుత్వ భూమిని కాపాడాం: కలెక్టర్ అనుదీప్
- లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది: కలెక్టర్ అనుదీప్
- స్థానికులతో పాటు స్థానికేతరులూ భూదాన్ భూములను ఆక్రమించారు: కలెక్టర్
- పేదల పేరుతో కొందరు భూదాన్ భూములు ఆక్రమించారు: కలెక్టర్
- డబ్బులు తీసుకొని, భూమాఫియా ఆక్రమణకు సహకరించింది: కలెక్టర్
- రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాం: ఖమ్మం కలెక్టర్
- ప్రజాఅవసరాల కోసమే భూదాన్ భూమిని వినియోగిస్తాం: ఖమ్మం కలెక్టర్
- అర్హులైన పేదలను గుర్తించి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం: ఖమ్మం కలెక్టర్
పోలీసుల ఎదుట లొంగిపోయిన బస్తర్ కమిటీ మావోయిస్టు కీలక నేత
- పోలీసుల ఎదుట లొంగిపోయిన బస్తర్ కమిటీ మావోయిస్టు కీలక నేత
- కాంకేర్ ఎస్పీ ఎదుట లొంగిపోయిన బస్తర్ కమిటీ డీవీసీఎం మల్లేశ్
- పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు రాను పొడియమ్, మాసీ
- ఛత్తీస్‌గఢ్: కాంకేర్ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
‘మూసీ గోస-బీజేపీ భరోసా పరామర్శ యాత్ర ప్రారంభం
- హైదరాబాద్: ‘మూసీ గోస-బీజేపీ భరోసా పరామర్శ యాత్ర ప్రారంభం
- లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ నుంచి బీజేపీ యాత్ర ప్రారంభం
- గాంధీజీ విగ్రహానికి నివాళి అర్పించి యాత్ర ప్రారంభించిన రామచందర్‌రావు
- మూసీ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు బీజేపీ నేతల పరామర్శ
- మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడిన బీజేపీ నేతలు
నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతుల ధర్నా
- నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతుల ధర్నా
- నిజామాబాద్: గాంధీనగర్ వద్ద రహదారిపై రైతుల రాస్తారోకో
- నిజామాబాద్- బాన్సువాడ రహదారిపై బైఠాయించిన రైతులు
- యూరియా యాప్ రద్దు చేసి నేరుగా విక్రయించాలని రైతుల డిమాండ్
కెంపేగౌడ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత
- బెంగళూరు: కెంపేగౌడ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత
- రూ.2 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపుపై ఏర్పాటు చేసిన కమిటీ పునర్నియామకం
- జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపుపై ఏర్పాటు చేసిన కమిటీ పునర్నియామకం
- త్రిసభ్య కమిటీని పునర్నియామకం చేసిన లోక్‌సభ స్పీకర్
- కమిటీ సభ్యులు: జస్టిస్ అరవింద్‌కుమార్(సుప్రీంకోర్టు న్యాయమూర్తి)
- కమిటీ సభ్యులు: జస్టిస్ చంద్రశేఖర్(బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి)
- కమిటీ సభ్యులు: బీవీ ఆచార్య (కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది)
- గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి యశ్వంత్‌వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభ్యం
- జస్టిస్ యశ్వంత్‌వర్మను తొలగించాలంటూ లోక్‌సభలో అభిశంసన తీర్మానం
- లోక్‌సభలో అభిశంసన తీర్మాన నోటీసు తర్వాత కమిటీ వేసిన స్పీకర్
కొత్తగూడెంలో గంజాయి పట్టివేత
- భద్రాద్రి జిల్లా : కొత్తగూడెంలో గంజాయి పట్టివేత
- కంటైనర్‌లో కొబ్బరిపొట్టు మధ్యలో పెట్టి తరలిస్తున్న గంజాయి పట్టివేత
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
- రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ (IAS TRANSFERS)
- రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నేటితో ముగియనున్న నూతన గ్రూప్ 1, 2 ఉద్యోగుల శిక్షణ
- ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నేటితో ముగియనున్న నూతన గ్రూప్ 1, 2 ఉద్యోగుల శిక్షణ
- సాయంత్రం 5.30గంటలకు గ్రూప్ 1, 2 ఉద్యోగుల శిక్షణ ముగింపు కార్యక్రమం
- హైదరాబాద్: కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
- నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
- మార్చి 2 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
- రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల దర్శనం
- తెప్పోత్సవాల కారణంగా నేడు, రేపు సహస్రదీపాలంకార సేవ
- ఈనెల 28, మార్చి 1, 2న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు
కనుల పండువగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ ఘట్టం
- కనుల పండువగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ ఘట్టం
- సింహ లగ్నంలో అమ్మవారికి మాంగళ్యధారణ చేసిన స్వామివారు
- చతుర్వేద పఠనం, మంత్రోచ్ఛారణ, జయ జయద్వానాల మధ్య తిరుకల్యాణం
- అమ్మవారి మెడలో మాంగళ్యధారణతో లక్ష్మీ సమేతుడైన యాదగిరీశుడు
- ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ సతీమణి సుధా దేవ్ వర్మ
- ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ, పొన్నం
- స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఆలయ నిర్వాహకులు
నేడు మూసీ గోస-బీజేపీ భరోసా పరామర్శ యాత్ర
- నేడు మూసీ గోస-బీజేపీ భరోసా పరామర్శ యాత్ర
- మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు బీజేపీ పరామర్శ
- మూసీ బాధితులను పరామర్శించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
- ఉదయం 9 గం.కు బాపూఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి
- మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో రామచందర్‌రావు ముఖాముఖి
- గంధంగూడ, విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ బాధితులకు పరామర్శ
- గండి మైసమ్మ ఆలయ సమీపంలో మూసీ క్షేత్రస్థాయి పరిశీలన
ఇజ్రాయెల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
- ఇజ్రాయెల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
- నేడు భారత్-ఇజ్రాయెల్ మధ్య అవగాహన ఒప్పందాలు
- నేడు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో ప్రధాని మోదీ చర్చలు
- అవగాహన ఒప్పందాల తర్వాత ఇద్దరు ప్రధానుల మీడియా సమావేశం
- ఇవాళ సాయంత్రం 4 గం.కు నెతన్యాహుతో ప్రతినిధి స్థాయి చర్చలు
- నేడు భారతీయ యూదు సమాజ ప్రముఖులతో చర్చించనున్న మోదీ
- ఇవాళ సాయంత్రం 6 గం.కు దిల్లీ బయలుదేరనున్న ప్రధాని మోదీ
టీ20 ప్రపంచకప్: సూపర్-8లో నేడు రెండు మ్యాచ్‌లు
- టీ20 ప్రపంచకప్: సూపర్-8లో నేడు రెండు మ్యాచ్‌లు
- టీ20 ప్రపంచకప్‌లో నేడు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్
- అహ్మదాబాద్‌లో మధ్యాహ్నం 3 గం.కు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్
- టీ20 ప్రపంచకప్: నేడు జింబాబ్వేతో భారత్ సూపర్-8 మ్యాచ్
- చెన్నైలో రాత్రి 7 గంటలకు భారత్-జింబాబ్వే మ్యాచ్
టీ-20 ప్రపంచకప్: సూపర్-8లో న్యూజిలాండ్ ఘన విజయం
- టీ-20 ప్రపంచకప్: సూపర్-8లో న్యూజిలాండ్ ఘన విజయం
- కొలంబో: శ్రీలంకపై 61 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
- స్కోర్లు: న్యూజిలాండ్ 168/7, శ్రీలంక 107/8
- తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసిన శ్రీలంక
- సూపర్-8లో రెండో ఓటమితో టీ-20 ప్రపంచకప్ నుంచి శ్రీలంక ఔట్
- న్యూజిలాండ్ బ్యాటింగ్: మిచెల్ శాంట్నర్ 47, రచిన్ 32, ఫిన్ అలెన్ 23
- శ్రీలంక బౌలింగ్: చెరో మూడు వికెట్లు తీసిన తీక్షణ, చమీరా
- శ్రీలంక బ్యాటింగ్: కమిందు మెండిస్ 31, దునిత్ వెల్లలాగే 29
- న్యూజిలాండ్ బౌలింగ్: రచిన్ రవీంద్రకు 4, మ్యాట్ హెన్రీకి 2 వికెట్లు