ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తుతూనే.. రష్యా చమురు వ్యవహారంలో భారత్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయకపోతే.. భారత శాతంపై ప్రస్తుతం ఉన్న 50 భారీ టారిఫ్‌లను మరిన్ని రెట్లు పెంచుతామని ఆయన ప్రకటించారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. “మోదీ చాలా మంచి వ్యక్తి, నన్ను సంతోషంగా ఉంచడం వారికి అవసరమని ఆయనకు తెలుసు. కానీ రష్యా విషయంలో సహకరిస్తే మేం టారిఫ్‌లను చాలా వేగంగా పెంచడం” అని ట్రంప్ స్పష్టం చేశారు.

మోదీ మంచోడే.. కానీ నేను హ్యాపీగా లేను!
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “పీఎం మోదీ చాలా మంచి వ్యక్తి. ఆయన గొప్ప స్నేహితుడు. రష్యా చమురు విషయంలో నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషంగా ఉంచడం వారికి చాలా ముఖ్యం. వారు మాతో వాణిజ్యం కొనసాగిస్తున్నారు. కానీ రష్యా విషయంలో సహకరించకపోతే మేం చాలా వేగంగా పన్నులు పెంచాం” అని ట్రంప్ ప్రకటించారు. ప్రధానిపై వ్యక్తిగతంగా గౌరవం ఉందంటూనే.. వాణిజ్య ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.
50 శాతం టారిఫ్ వివాదం?
రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఆర్థిక వ్యవస్థకు భారత్ తోడ్పడుతుందని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఈ ప్రయోజనాలే ఆగస్టులో భారత ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 50 శాతం టారిఫ్ విధించింది. ఇందులో 25 శాతం రెసిప్రోకల్ టారిఫ్ కాగా.. మిగిలిన 25 శాతం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు జరిమానా విధించారు. ఇప్పటికే భారత్ ఈ భారాన్ని మోస్తుండగా.. ఇప్పుడు ఆ పన్నులను మరింత పెంచుతామని ట్రంప్ బెదిరిస్తున్న భారత్ ఎగుమతిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
యూటర్న్ తీసుకున్నారా?
కొన్ని రోజుల క్రితం.. మోదీ రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తామని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఒక బహిరంగ సభలో ప్రకటించారు. అయితే భారత విదేశాంగ శాఖ (MEA) దీనిని వెంటనే ఖండించింది. ఇద్దరు నేతల మధ్య అలాంటి సంభాషణ జరగలేదని, తమ దేశ ఇంధన అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనడం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ పరిణామం ట్రంప్‌కు ఆగ్రహం కలిగించినట్లు తాజా వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నానని చెబుతున్న ట్రంప్.. రష్యాపై ఆర్థిక ఆంక్షల విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
వీర జవాన్ కుతురికి సీఎం అండ.. 24 గంటల్లో సమస్య పరిష్కారం
భారత వాణిజ్యంపై పడే ప్రభావం
అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారత వస్త్రాలు, ఆభరణాలు, ఐటీ సేవలకు సంబంధించిన ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాకు జరిగే ఎగుమతులపై సుంకాలు పెరిగితే భారత్ మార్కెట్ ధరలు పోటీని తట్టుకోలేవు. ఇప్పటికే వెనిజులాపై దాడులు చేసి, ఆ దేశ చమురు నిల్వలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్.. ఇప్పుడు భారత్‌పై ఒత్తిడి పెంచి రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.
