
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఆదివారం వెల్లడించనున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య శుక్రవారం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమయం ఇస్తే ఆయన నివాసంలోనే ఫలితాల సీడీని విడుదల చేయనున్నారు. లేనిపక్షంలో నాంపల్లి ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉన్నతాధికారులే విడుదల చేస్తారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను www.tgbie.cgg.gov.in ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌తోపాటు www.eenadu. నెట్, www.eenadupratibha.net ద్వారా తెలుసుకోవచ్చు.