- ఎన్నికల మున్సిపల్ ఫలితాలు మీకు సంతోషాన్ని ఇచ్చాయన్న కవిత
- ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామన్న జాగృతి అధ్యక్షురాలు
- తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించామని వ్యాఖ్య
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత మద్దతుదారులు పలు ప్రాంతాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ… భవిష్యత్తులో తాము ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. తమ పార్టీని అధికారికంగా ప్రకటించక ముందే చివరి… మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేద్దామని నిమిషంలో తమ కార్యకర్తలు కోరారని… వారి కోరిక మేరకు తాము ఆల్ ఇండియా బ్లాక్ గుర్తు ఎన్నికలపై బరిలోకి దిగామని. సొంత పార్టీ తరపున పోటీ చేయకపోయినప్పటికీ… తెలంగాణ ప్రజలు తమను మంచి ఫలితాలతో ఆదరించారని అన్నారు.
ఎన్నికల్లో తాము ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని, మరో మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోబోతున్నామని కవిత చెప్పారు. మరో 40 చోట్ల తమ కార్యకర్తలు దాదాపుగా గెలుపు అంచుల వరకు వచ్చారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ భవిష్యత్తుపై భరోసా కల్పించాయని చెప్పారు. అహంకారం లేని, అత్యంత పారదర్శకమైన రాజకీయాలను అందిస్తామని తాము పదేపదే చెబుతున్నామని… ప్రజలు తమను విశ్వసించారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజల మద్దతు ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తాము ప్రధాన భూమికను పోషించామని చెప్పారు.