తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ‘టీఆర్ఎస్’ తండ్రి వదులుకున్న పేరుతో కవిత ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?


దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. రాబోయే శాసనసభ ఎన్నికల ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. దశలవారీగా ప్రజల వద్దకు వెళ్తూ తమ ఆలోచనలు ప్రజలకు వివరించేలా ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈ విధంగా మాజీ సీఎం కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (కల్వకుంట్ల కవిత) కొత్త పార్టీ అంశం (కొత్త రాజకీయ పార్టీ) హాట్ టాపిక్ అవుతోంది. ఈ నెల 25వ తేదీన కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నట్లు కవిత ఇప్పటికే ప్రకటించగా ఆమె పెట్టబోయే పార్టీ పేరుపై కొత్త చర్చ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

పాత ఉద్యమ పార్టీ కొత్త ఎజెండాతో..

బీఆర్ఎస్‌తో తెగతెంపులు జరగక కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతోంది అంటే సర్వత్ర ఉత్కంఠ దానిపై. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కావడంతో ఆమె తీసుకోబోయే నిర్ణయంపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కావాలనే తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పిన కవిత ఆ మేరకు కసరత్తును వేగవంతం చేసింది. అయితే నిన్న మొన్నటి వరకు కవిత కొత్త పార్టీ పేరుతెలంగాణ ప్రజా జాగృతి అనే ప్రచారం జరుగుతుందని తాజాగా బిగ్ ట్విస్ట్ వినిపిస్తోంది. కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ (TRS) పేరు కలిసి వచ్చేలా కవిత తన నూతన రాజకీయ మార్గానికి బాటలు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనితో పాత ఉద్యమ పార్టీ పేరుతో కొత్త రాజకీయ అజెండాతో కవిత చేయబోతో పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు దారి తీస్తుందో అనే ఉత్కంఠ.

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్?:

ప్రచారం ప్రకారం టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీని స్థాపిస్తే ఇది బీఆర్ఎస్‌ను భారీగా దెబ్బ తీసే అవకాశం ఉండనుందని రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలంతా కవిత టీమ్‌లోకి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో అవకాశాలు దక్కని వారంతా కవిత వెంట నడిస్తే అది గులాబీ పార్టీ ఓటు బ్యాంకుపై భారీగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఇక కవితకు ఉద్యమ కాలం నాటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ సాగిస్తున్న కవిత రాబోయో రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో రాబోతున్నారు? ఆమె రాకతో ఎవరికి డ్యామేజ్? మరెవరికి మైలేజ్ రాబోతోంది అనేది కాలమే సమాధానం చెప్పనుంది.



Source link

Spread the love