Andhra Pradesh
oi-Kannaiah
తిరుపతి/శ్రీహరికోట: అంతరిక్ష రంగంలో మరో అరుదైన రికార్డు భారత్ పేరిట నమోదు అయ్యేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. చంద్రయాన్ -3 ప్రయోగం కోసం ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అంతకుముందు చంద్రయాన్-3 పోలిఉన్న నమూనాకు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక శుక్రవారం రోజున మధ్యాహ్నం 2గంటల35 నిమిషాలకు LVM3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది . ఇప్పటికే అన్ని పరీక్షలు, సమీక్షలు నిర్వహించిన బోర్డు ప్రయోగానికి అంతా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇక చంద్రయాన్ మిషన్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి జితేందర్ సింగ్.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. అమెరికన్లు భారత ప్రతిభను గుర్తించి.. ఇండియన్ ఆస్ట్రానాట్స్ ను స్పేస్‌లోకి పంపేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.
#WATCH | Andhra Pradesh | India has taken a lead in space technology… Today Americans also value Indian talent and astronauts.. Infact they are looking to send an Indian astronaut in space…I am so proud that we all witnessed the history in making… I also thank PM Modi and… pic.twitter.com/PRnE0PF8qH
— ANI (@ANI) July 14, 2023
చంద్రయాన్-3 భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యయాన్ని లిఖించిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
అన్నీ సాఫీగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై చంద్రయాన్-3 అడుగుపెడుతుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.
చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ రీతూ కరిధల్ నివాసంలో కుటుంబసభ్యులు స్వీట్లు పంచుకుంటున్న దృశ్యం.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటింంచింది.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కావడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
Union Home Minister Amit Shah tweets, “India today embarked on its historic space journey with the successful launch of Chandrayaan-3. My heartfelt congratulations to the ISRO scientists whose tireless pursuit has today propelled India on the path of scripting a remarkable space… pic.twitter.com/xWKrCVSjSG
— ANI (@ANI) July 14, 2023
చంద్రయాన్-3 ప్రయోగం తొలి దశ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలియజేశారు.
President Droupadi Murmu congratulates ISRO team and everyone behind #Chandrayaan3 mission, “India successfully launches Chandrayaan-3 marking another significant milestone in space exploration…It demonstrates the nation’s unwavering commitment to advancement in space science… pic.twitter.com/dEpxCT4Psl
— ANI (@ANI) July 14, 2023
చంద్రయాన్-3 ప్రయోగాన్ని తిలకించిన వేలాది మంది విద్యార్థులు.
#WATCH | School children who had arrived at the Satish Dhawan Space Centre in Sriharikota, Andhra Pradesh express their delight following the successful launch of #Chandrayaan3 into orbit.
“I feel very proud that our scientists & country are doing so good. It was a… pic.twitter.com/IkJpKlW6mg
— ANI (@ANI) July 14, 2023
చంద్రయాన్-3 తొలి దశ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్.
#WATCH | Kerala: “Congratulations to the ISRO team. The moral support you all gave and the enthusiasm you exhibited…Let us hope that we will have a very successful mission ahead of us,” Former ISRO scientist Nambi Narayanan on the successful launch of Chandrayaan 3 India’s 3rd… pic.twitter.com/rIlNL3Cqnd
— ANI (@ANI) July 14, 2023
చంద్రయాన్-3 ప్రయోగం తొలి దశ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
“Chandrayaan-3 scripts a new chapter in India’s space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists’ relentless dedication. I salute their spirit and ingenuity,” tweets Prime Minister… pic.twitter.com/OYMgj6dmJY
— ANI (@ANI) July 14, 2023
చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ కానున్న చంద్రయాన్-3 రోవర్.
#WATCH | Celebrations at the ISRO as LVM3 M4 vehicle successfully launched Chandrayaan-3 into orbit. Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon. Health of the Spacecraft is normal. pic.twitter.com/BmXKSBfh7l
— ANI (@ANI) July 14, 2023
చంద్రయాన్-3 తొలి దశ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభినందనలు తెలిపారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అనేది భారత్‌కు గేమ్ ఛేంజర్ లాంటిదన్నారు ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్.
ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై చంద్రయాన్-3 అడుగుపెట్టనుంది.
#WATCH | ISRO scientists announce the successful separation of the Satellite from the launch Vehicle. The Satellite has now been injected into the desired Orbit to begin its journey to the Moon. pic.twitter.com/ULPRKlzOgn
— ANI (@ANI) July 14, 2023
చంద్రయాన్-3 తొలి దశ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు.
#WATCH | Union Minister of State for Science and Technology Jitendra Singh congratulates ISRO Chairman S Somanath and his team for the successful launch of Chandrayaan 3 India’s 3rd Moon mission. pic.twitter.com/NJjvb3Q4Cg
— ANI (@ANI) July 14, 2023
విజయవంతంగా కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-3.
చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ మూడు సమన్వయంతో పనిచేస్తే ఇస్రో తాజా ప్రయోగం విజయవంతమైనట్లే.
చంద్రయాన్-3 ప్రయోగంలో మొత్తం మూడు దశలున్నాయి. 40 రోజులపాటు ప్రక్రియ కొనసాగనుంది.
చంద్రయాన్-3లో తొలి దశ విజయవంతమైంది.
శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది.
చంద్రయాన్-3 ప్రయోగం జరుగుతున్న క్రమంలో కేంద్రమంత్రులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 ప్రయోగం ప్రారంభం కానుంది.
చంద్రుడి దక్షిణ ధృవంపై ఈ ప్రయోగం ద్వారా పరిశోధనలు చేయనున్నారు. నీటి జాడలను తెలసుకునే అవకాశం కూడా ఉంది.
మరికొద్ది నిమిషాల్లో చంద్రయాన్-3 గగనతంలోకి దూసుకెళ్లనుంది. దీంతో దేశ ప్రజల్లోనే గాక, ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
చంద్రయాన్-3 ప్రయోగం మరికాసేపట్లో ప్రారంభం కానున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చూసేందుకు 200లకుపైగా పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుభాషిణి అనే విద్యార్థిని మాట్లాడుతూ.. కల్పనా చావ్లాలా ఒక ఆస్ట్రానాట్ అవుతానని తెలిపింది. చంద్రయాన్-3 ప్రయోగం చూసేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నామని విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఇస్రోకి ధన్యవాదాలు తెలిపారు.
#WATCH | Over 200 schools students arrive at Satish Dhawan Space Centre in Sriharikota, Andhra Pradesh to watch the launch of #Chandrayaan3
“…I feel very confident, I want to become an astronaut like Kalpana Chawla. I am excited..,” says a student, Subhashini.
A teacher,… pic.twitter.com/hbJmpgjKWn
— ANI (@ANI) July 14, 2023
భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023 ఎల్లప్పుడూ సువర్ణ అక్షరాలతో చెక్కబడి ఉంటుంది. చంద్రయాన్-3 మూన్ మిషన్, దాని ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశం ఆశలు, కలలను తీసుకువెళుతుంది అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
14th July 2023 will always be etched in golden letters as far as India’s space sector is concerned. Chandrayaan-3, our third lunar mission, will embark on its journey. This remarkable mission will carry the hopes and dreams of our nation. pic.twitter.com/EYTcDphaES
— Narendra Modi (@narendramodi) July 14, 2023
స్పేస్‌క్రాఫ్ట్ కోసం భూమి నుంచి చంద్రునికి ప్రయాణం దాదాపు ఒక నెల పడుతుందని అంచనా వేశారు. ఆగస్ట్ 23న ల్యాండింగ్ అవుతుందని అంచనా.
ఇక్కడ చంద్రయాన్-3 ప్రయోగం ప్రత్యక్ష ప్రాసరం ద్వారా చూడవచ్చు.
శ్రీహరికోటలోని SDSC-SHARలో కౌంట్‌డౌన్ పురోగతిలో ఉంది. L110 దశలో ప్రొపెల్లెంట్ ఫిల్లింగ్ పూర్తయింది. C25 దశలో ప్రొపెల్లెంట్ ఫిల్లింగ్ ప్రారంభమవుతుందని ఇస్రో వెల్లడించింది.
READ MORE