ఉత్సాహభరితంగా సెమీ ఫైనల్స్

కడప క్రీడలు, న్యూస్‌టుడే: సీనియర్, జూనియర్ పురుషులు, మహిళల విభాగంలో డిసెంబరు 22 నుంచి ప్రారంభమైన ‘ఈనాడు’ క్రికెట్ పోటీలు నేటితో(మంగళవారం) ముగిశాయి. కడప నగరం శివార్లలోని కేఎస్‌ఆర్‌ఎం, కేవోఆర్‌ఎం క్రికెట్ మైదానాల్లో మూడు విభాగాల్లో ఫైనల్స్ పోటీలు జరుగుతున్నాయి. సోమవారం సీనియర్ మెన్స్ విభాగం సెమీఫైనల్స్ పోటీలు జరగగా.. అందులో సీకాం డిగ్రీ కళాశాల(కలికిరి), శ్రీసాయి ఇన్ ఆప్షన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(రాయచోటి) జట్లు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరాయి. ఇన్నాళ్ల పాటు ఆకాశమే హద్దుగా చెలరేగిన యువ క్రికెటర్లు ఫైనల్స్‌లోనూ సత్తాచాటి విజేతలుగా నిలవాలని కోరారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రెజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్-2025 ఆధ్వర్యంలో కడప నగర శివారులో కేఎస్‌ఆర్, కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానాల్లో జరుగుతున్న క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ రోజు జరిగిన క్రికెట్ పోటీల్లో స్టార్ ఆఫ్ ది క్రికెటర్‌లుగా ముదిస్సిర్, భవాని నిలిచారు.

ఉత్కంఠ పోరులో సీకం గెలుపు
సీకాం డిగ్రీ కళాశాల(కలికిరి) – కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల (కడప) జట్ల మధ్య సీనియర్ మెన్స్ విభాగంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరుజట్ల మధ్య చివరి బంతి వరకు విజయం దోబూచులాడింది. సీకాం జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ.. కేఎస్‌ఆర్‌ఎం బ్యాట్స్‌మెన్లు చక్కటి ప్రదర్శన కనబరిచారు. ఈ పోరు ఆఖరి బంతి వరకు సాగింది. చివరి ఓవర్‌లో కేఎస్‌ఆర్‌ఎం జట్టుకు విజయానికి 13 పరుగులు చేయాల్సి ఉండగా.. 11 పరుగులే లభించాయి. మొత్తం మీద ఒక పరుగు తేడాతో సీకాం జట్టు గెలుపొందింది ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్ వివరాలు… టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సీకాం డిగ్రీ కళాశాల జట్టు పది ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. జట్టులో భవానీ 29 (2-ఫోర్లు, 3-సిక్స్‌లు), నికిత్ అజేయంగా 23 (3-ఫోర్లు), భరత్ 21 పరుగులు (3-ఫోర్లు) చేశారు. కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల బౌలర్లలో డి.గణేష్, మహమ్మద్, జగదీష్ చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కేఎస్‌ఆర్‌ఎం జట్టు పది ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయింది 101 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో మహమ్మద్ 30(2-ఫోర్లు, 1-సిక్స్), చైతన్య 23 (3-ఫోర్లు, 1-సిక్స్), అనిల్ 19 పరుగులు (2-ఫోర్లు, 1-సిక్స్) చేశారు.

జయభేరి మోగించిన శ్రీసాయి ఇని డిగ్రీ
సీనియర్ మెన్స్ పార్టీనే జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీసాయి ఇన్‌ఔట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (రాయచోటి) జట్టు తిరుగులేని ప్రదర్శన కనబరచి 35 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు చేరింది. టాస్ మొదట బ్యాటింగ్ చేసిన శ్రీసాయి ఇన్‌స్టిట్యూట్ జట్టు పది ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగుల భారీ స్కోరును సాధించింది. జట్టులో ముదస్సిర్ 42 (5-సిక్స్‌లు), సొసైల్ 25 (1-ఫోర్ 3-సిక్స్‌లు), ఫుమైద్ ఖాన్ అజేయంగా 16 పరుగులు (2-ఫోర్లు, 1-సిక్స్) చేశారు. పి.రామిరెడ్డి మెమోరియల్ ఫార్మసీ కళాశాల (కడప) జట్టులో పవన్, నిఖిల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. అఖిల్‌రాజ్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పి.రామిరెడ్డి ఫార్మసీ కళాశాల జట్టు పది ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో తౌఫిక్ 26(3-ఫోర్లు, 1-సిక్స్), అఖిల్‌రాజ్ 24 (2-ఫోర్లు, 1-సిక్స్), వెంకటసాయి అజేయంగా 14 పరుగులు (2-సిక్స్‌లు) చేశారు. శ్రీసాయి ఇన్‌టెక్ కళాశాల బౌలర్లలో ఫుమైద్‌ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా.. సొహైల్, బాబాఫకృద్దీన్, ఇబ్రహీం, అబ్దుల్ తలో వికెట్‌లు తీసుకున్నారు.
‘ధనిక్ భారత్’ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే

ముదస్సిర్ (42 పరుగులు)
‘ధనిక్ భారత్’ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే

భవానీ (29 పరుగులు, 1 వికెట్)

నేటి మ్యాచ్‌లు (06-01-2026)
కేఎస్ఆర్ఎం గ్రౌండ్
ఉదయం 9.00 గంటలకు : సీకాం డిగ్రీ కాలేజ్ (కలికిరి) – శ్రీసాయిఇన్ డిగ్రీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (రాయచోటి) (సీనియర్ మెన్స్ ఫైనల్స్)
కేవోఆర్ ఎం గ్రౌండ్
- ఉదయం 8.00 గంటలకు : కేఓఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజి (కడప) – ఎస్‌ఆర్‌ఐటీ డిప్లొమా కాలేజి (ప్రొద్దుటూరు) (ఉమెన్స్ ఫైనల్స్)
- ఉదయం 10.00 గంటలకు : ఆర్జీయూకేటీ, ఆర్కే వ్యాలీ – శ్రీ విద్యా జూనియర్ కాలేజి (ప్రొద్దుటూరు) (జూనియర్ మెన్స్ ఫైనల్స్)