లైవ్ ఫీడ్
విషాదానికి దారి తీసిన మిత్రుల సరదా
- రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌లో మిత్రుల సరదా విషాదానికి దారి తీసింది. స్థానిక పరిశ్రమలో యూపీ యువకులు పవన్, సాయి పనిచేస్తున్నారు. ఇవాళ డ్యూటీలో ఉన్నప్పుడు సరదా కోసం పరిశ్రమలో వాడే గాలిపంపును సాయి.. పవన్ మలద్వారంలో పెట్టాడు. గాలి ఉద్ధృతంగా వెళ్లడంతో పేగులు దెబ్బతిని పవన్(20) మృతి చెందాడు. పవన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేలకొండపల్లి మైనారిటీ గురుకుల విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
- ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం వద్ద నేలకొండపల్లి మైనారిటీ గురుకుల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పదో తరగతి పరీక్ష రాసి వస్తుండగా విద్యార్థుల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు, ఇద్దరు టీచర్లకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. గాయపడ్డ విద్యార్థులు, టీచర్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?: హరీశ్‌రావు
- “మళ్లీ గెలుస్తామని రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌కు వచ్చేది సింగిల్ డిజిట్ మాత్రమే. రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ప్రతిపక్షాలు కనీసం ప్రశ్నించవద్దని, ధర్నాలకు పోవద్దని అంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు, విచారణలు, విజిలెన్స్ కేసులు అంటున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?.” అని హరీశ్ రావు తెలిపారు.
శంషాబాద్ పీఎస్ నుంచి హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతల విడుదల
- పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూములను పరశీలించేందుకు వెళ్తున్న సమయంలో అరెస్టైన హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుని రేవంత్ రెడ్డి తన స్నేహితులకు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ది రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. రేవంత్ చేతిలో మోసపోని వర్గం అంటూ లేదని, కాంగ్రెస్ అధికారంలోకి మళ్లీ వస్తుంది అనేది పగటి కలగా అభివర్ణించారు. అంతకుముందు తన నేతలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు శంషాబాద్ పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు.
రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల
- రైతునేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. యూరియా యాప్ అమలు, పనితీరుపై అభిప్రాయాలు సేకరించారు. యూరియా యాప్ పనితీరుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల చాలా సులభంగా యూరియా పొందుతున్నామని, భవిష్యత్తులో కూడా యాప్ ద్వారా అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. రైతులు యూరియా శాస్త్రీయంగా వాడాలని, అధికంగా వినియోగించవద్దని తుమ్మల వారికి సూచించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 500 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
- ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలో పాత రైస్ మిల్లులో పోలీసులు సోదాలు నిర్వహించారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 500 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేశారు. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని సేకరించి తిరిగి పాతబియ్యంగా ఎగుమతి చేస్తున్నారని అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
- జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. అవినీతి ఆరోపణల దృష్ట్యా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. 14 మంది అధికారులతో బృందం అన్ని విభాగాల్లో సోదాలు చేస్తోంది. జగిత్యాలలో 2019 నుంచి ఇప్పటి వరకు 16 మంది కమిషనర్లు బదిలీ అయ్యారు. వీరిలో అవినీతి ఆరోపణలపై 8 మంది అధికారులు జైలుకు కూడా వెళ్లారు. గతంలో రెండు సార్లు ఏసీబీ, రెండు సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు జరిగాయి.
ఇంటలిజెన్స్ కో ఆర్డినేషన్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన డీజీపీ శివధర్‌రెడ్డి
- ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరులో పోలీస్ ఔట్ పోస్టుకు, ఇంటలిజెన్స్ కో ఆర్డినేషన్ సెంటర్‌కు న డీజీపీ శివధర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పామునూరు గ్రామస్థులకు నిత్యావసర వస్తువులు, సోలార్ లాంతర్లు పంపిణీ చేశారు.
హరీశ్‌రావును తరలిస్తున్న పోలీసు వాహనాన్ని వెంబడిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
- శంషాబాద్ మీదుగా షాద్‌నగర్ వైపు హరీశ్‌రావు, సబిత, ఎర్రబెల్లి తరలిస్తున్నారు. హరీశ్‌రావును తరలిస్తున్న పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వెంబడిస్తున్నారు. హరీశ్‌రావు, సబిత, ఎర్రబెల్లిని శంషాబాద్ పీఎస్‌కు తరలించారు.
తెలంగాణ క్యాన్సర్ రిజిస్ట్రీ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి రాజనరసింహ
- తెలంగాణ క్యాన్సర్ రిజిస్ట్రీ పోర్టల్, ట్రామా కేర్ పాలసీని మంత్రి రాజనరసింహ ప్రారంభించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించేందుకు పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఏఆర్‌టీ, పీసీపీఎన్‌డీటీ, సరోగసీ పోర్టల్ ప్రారంభించారు. క్యాన్సర్‌ను నోటిఫయబుల్ డిసీజ్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మాజీ మంత్రి హరీశ్‌రావును అరెస్టు చేసిన పోలీసులు
- పరిగి వెళ్తుండగా బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ వాహనానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుపడుతున్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైఎస్సార్సీపీ దాడి
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైఎస్సార్సీపీ దాడిని ఏపీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. “అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించారని మీడియాపై దాడికి దిగారు. మీడియా సంస్థలపైకి వెళ్లడం ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనం. దాడులు, నిరసనలతో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు” అని చంద్రబాబు మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్ ఆగ్రహం
బీఆర్‌ఎస్ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు, సబిత, మహేశ్‌రెడ్డి గృహనిర్బంధాలపై కేటీఆర్ మండిపడ్డారు. “రైతులకు మద్దతుగా వెళ్తున్న నేతలను గృహనిర్బంధం చేయడం సరికాదు. పోలీసుల బలంతో గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి భూమిని లాక్కుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు గాలికొదిలేసి పేదల భూములపై పడింది. కాంగ్రెస్ నేతలు భూములను కబ్జా చేస్తున్నారు. అక్రమ కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నేతలకు కొత్త కాదు. భూసేకరణ తక్షణమే నిలిపివేయాలి.” అని కేటీఆర్ తెలిపారు.
వర్సిటీల భూములను రేవంత్‌రెడ్డి లాక్కుంటున్నారు : హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడిచేతిలో రాయిలా మారిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. “వర్సిటీల భూములను రేవంత్‌రెడ్డి లాక్కుంటున్నారు. లగచర్ల లాంటిదే పరిగిలో చేస్తున్నారు. అక్కడ జరిగేది భూసేకరణ కాదు. పేద వర్గాల భూములే లక్ష్యంగా లాక్కుంటున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ అంటూ పేదలను మోసం చేస్తున్నారు. పేద వర్గాల భూములపై ఎందుకు దండయాత్ర చేస్తున్నారు. పరిగిలో మరో దమనకాండ జరుగుతోంది. మమ్మల్ని అడ్డుకున్నా.. రైతుల పక్షాన పోరాడుతాం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భూములను లాక్కుంటున్నారు. నాటి ఇందిరమ్మ రాజ్యంలో భూములు ఇచ్చారు.. ఇప్పుడు భూములు లాక్కుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో పండ్ల మార్కెట్‌కు రూ.350 కోట్లు నిధులు కేటాయించాం.” అని తెలిపారు.
బుద్వేల్ టీచర్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ చర్యలు
బుద్వేల్ టీచర్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు అంతస్తుల కూల్చివేసింది. ముందస్తు నోటీసులు ఇచ్చినా భవన యజమానులు స్పందించలేదు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.
యువకుడిపై కత్తితో దాడి చేసి చంపిన దుండగులు
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడులో దారుణం చోటు చేసుకుంది. దుండగులు యువకుడిపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. పాత కక్ష్యలతో నర్సింహులు, అతని కుమారులు రిషిక్‌పై దాడి చేశారు. తీవ్రగాయాలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రిషిక్ మృతి చెందారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీపై ఇవాళ తీర్పు
నేడు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీపై ఉప్పరపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ముగ్గురు నిందితులను మరో 5 రోజుల కస్టడీకి కోరారు పోలీసులు. పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి నమిత్‌శర్మను కస్టడీకి కోరారు. ఇప్పటికి రెండుసార్లు కస్టడీకి తీసుకుని విచారించారు. న్యాయవాది ముగ్గురికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.
రాజేంద్రనగర్ పరిధిలో కాళీమందిర్ ఆలయం వద్ద అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధిలో కాళీమందిర్ ఆలయం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భువనగిరిలో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
భువనగిరిలో కుటుంబకలహాలతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు విశాఖకు చెందిన మహిళగా గుర్తించారు.
పరిగి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు
హైదరాబాద్‌లోని మంత్రి హరీశ్‌రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన్ని పరిగి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలు ఆంక్షలు విధించారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు హరీశ్‌రావు పరిగి పర్యటన రద్దు చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో డీజీపీ శివధర్‌రెడ్డి పర్యటన
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ సువర్ణతో కలిసి డీజీపీ శివధర్‌రెడ్డి పర్యటించనున్నారు. కర్రెగుట్టల్లోని పామునూరు సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంప్ పరిశీలిస్తారు. పోలీస్ ఔట్‌పోస్ట్‌కు భూమిపూజ చేయనున్నారు. మారుమూల గ్రామాలకు నిర్మిస్తున్న రోడ్లు పరిశీలించనున్నారు. నక్సల్స్ నుంచి కర్రెగుట్టలు స్వాధీనం చేసుకున్నాక డీజీపీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
నేడు కేరళంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన
నేడు కేరళంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. కేరళం ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో రోడ్ షో, ఉదయం 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షో, మధ్యాహ్నం 2 గంటలకు పతానపురంలో రోడ్ షోలో పాల్గొననున్నారు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి – రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ని సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఈ నెల 1, 2 తేదీల్లో ఆమోదించాయి. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం సంతకం చేశారు. ఆ వెంటనే గెజిట్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం-2026గా దానికి చట్టరూపం ఇచ్చారు…..
పౌర అణుకార్యక్రమంలో కొత్త శకానికి నాంది
పౌర అణుకార్యక్రమంలో కొత్త శకానికి నాంది పలికింది. కల్పాకంలో చేపట్టిన పౌర అణుకార్యక్రమం విజయవంతమైంది. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నిర్మాణంలో విజయం పట్ల అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. భాగస్వాములైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను అమిత్ షా అభినందించారు. విద్యుత్ ఉత్పాదనలో ప్రపంచ ఆధిపత్యం దిశగా అమిత్ షా ముందడుగు వేశారు. భారత్‌లో విస్తృతంగా ఉన్న థోరియం నిల్వల శక్తిని చాటి చెప్పిందని, భారత్‌ను ప్రపంచ శక్తి కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.