పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. కేవలం మార్కుల మెరిట్‌తోనే 28,740 ‘డాక్ సేవక్’ ఉద్యోగాలు


దేశంలో ఉన్న నిరుద్యోగులకు భారత ప్రభుత్వ శాఖ తీపి కబురు అందించింది. వివిధ పంపిణీ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి జనవరి-2026 షెడ్యూల్ కింద నోటిఫికేషన్ విడుదలైంది. ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం.

విద్యార్హతల వివరాలు..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించాలి. ముఖ్యంగా అభ్యర్థులు పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లీష్ మరియు స్థానిక భాష తప్పనిసరి సబ్జెక్టులుగా చదవాలి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు తెలుగు భాషపై పట్టు ఉండటం అవసరం. అకడమిక్ అర్హతలతో పాటు, అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వయస్సు వివరాలు..

వయస్సు విషయానికి వస్తే, 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. అయితే, నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

వేతన వివరాలు..

ఎంపికైన అభ్యర్థులు బాధ్యతలను బట్టి గౌరవ వేతనం అందుకుంటారు. బీపీఎం (BPM) పోస్టులకు నెలకు రూ. 12,000 నుంచి రూ. 29,380 వరకు, ఏబీపీఎం (ABPM) లేదా డాక్ సేవక్ పోస్టులకు రూ. 10,000 నుంచి రూ. 24,470 వరకు వేతనం ఉంటుంది. వీటితో పాటు ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ..

ఈ నియామకాలకు ఎటువంటి రాత పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు వివరాలు..

ఒక అభ్యర్థి కేవలం ఒకే ఒక సర్కిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ సర్కిళ్లకు దరఖాస్తు చేస్తే వారి దరఖాస్తులు రద్దు చేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఓసీ, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ. 100 రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రక్రియ జనవరి 31, 2026 నుంచి. వన్-టైమ్ ఒప్పందం మరియు ఫీజు చెల్లింపునకు ఫిబ్రవరి 14 నుండి 16 వరకు తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తులో అందుబాటులో ఉన్న తప్పులు దొర్లితే వాటిని సవరించడానికి ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అభ్యర్థులు గడువు ముగిసేలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సిందిగా కోరడమైనది.

అఫీషియల్ వెబ్ సైట్: https://indiapostgdsonline.gov.in/





Source link

Spread the love