సాక్షి ఎడ్యుకేషన్: బుల్లెట్ రైళ్లలో చైనా మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించింది. చైనా తయారు చేసిన తాజా హై-స్పీడ్ రైలు CR450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందింది.
ఈ ట్రైన్ వేగం ఎంతో తెలుసా…?
- ట్రయల్ రన్ రికార్డు: CR450 ట్రయల్ రన్‌లో గంటకు 453 కి.మీ. క్రమంగా వేగాన్ని అందుకుంది.
- వాణిజ్య వేగం: ఈ రైలును వాణిజ్యపరంగా గంటకు 400 కి.మీ. వేగంతో నడిచేలా రూపొందించారు.
- పాత మోడల్ కంటే వేగం: ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న CR400 ఫక్సింగ్ రైళ్ల కంటే గంటకు 50 కి.మీ. వేగవంతమైనది. CR400 రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో నడుస్తాయి.
- రెండు రైళ్ల రికార్డు: ట్రయల్స్ సమయంలో, రెండు CR450 రైళ్లు (ఎదురుగా ప్రయాణిస్తూ) కలిపి గంటకు 896 కి.మీ. పరుగులు తీసి, ప్రయాణ వేగంతో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
- త్వరగా వేగం అందుకోవడం: ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో 0 నుండి 350 కి.మీ./గం. వరకు వేగవంతం అవుతుంది.
సాంకేతికత మరియు డిజైన్
- స్మార్ట్ డిజైన్: CR450ను స్మార్ట్ డిజైన్‌తో రూపొందించారు. దీని నోస్ కోన్ 15 మీటర్లు ఉంటుంది.
- ఏరోడైనమిక్ మెరుగుదల: ఈ నూతన మోడల్‌లో ఏరోడైనమిక్ స్థాయిని 22 శాతం తగ్గించారు. దీని వేగం, ఇంధన సామర్థ్యం మరింత మెరుగుపడింది.
- ఈ రైలును రూపొందించిన ఇంజనీర్లు స్పోర్ట్స్ కార్ల డిజైన్ ప్రేరణతో ఏరోడైనమిక్ మెరుగుదలపై ఐదేళ్లు పనిచేశారు.
ప్రస్తుతం CR450ను షాంఘై-చెంగ్డు మధ్య ఉన్న హై-స్పీడ్ రైలు మార్గంలో టెస్ట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి…
భారతదేశంలో కృత్రిమ మేధ అభివృద్ధితో ఎదురయ్యే సవాళ్లు, అసమానతలు…
పోటీపరీక్షలకు ఉపయోగపడే MCQలు
1. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన చైనా తాజా హై-స్పీడ్ రైలు పేరు ఏమిటి?
ఎ) CR400
బి) CR450
సి) CR500
d) ఫక్సింగ్
జవాబు: బి) CR450
2. CR450 బుల్లెట్ రైలు ట్రయల్ రన్‌లో గంటకు వేగం ఎంత?
ఎ) 400 కి.మీ.
బి) 350 కి.మీ.
సి) 896 కి.మీ.
డి) 453 కి.మీ.
జవాబు: డి) 453 కి.మీ.
3. చైనా అభివృద్ధి చేసిన CR450 రైలు యొక్క నోస్ కోన్ పొడవు ఎంత?
a) 10 మీటర్లు
బి) 12 మీటర్లు
c) 15 మీటర్లు
d) 20 మీటర్లు
జవాబు: సి) 15 మీటర్లు
4. చైనా అభివృద్ధి చేసిన CR450 రైలును ప్రస్తుతం ఏ మార్గంలో టెస్ట్ చేస్తున్నారు?
ఎ) బీజింగ్ – షాంఘై
బి) బీజింగ్ – హాంకాంగ్
c) షాంఘై – చెంగ్డు
d) వుహాన్ – గ్వాంగ్జౌ
జవాబు: సి) షాంఘై – చెంగ్డు