ప్రపంచ రాజకీయాల్లో అగ్రస్థానానికి భారత్- ఎన్నడూ లేనంత బలంగా ఈయూతో సంబంధాలు : ఉర్సులా


భారతదేశ EU సంబంధాలపై ఉర్సులా

యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (ANI)

భారతదేశ EU సంబంధాలపై ఉర్సులా: భారత్-ఈయూ మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని యూరోపియన్ కమీషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అన్నారు. చారిత్రాత్మక భారత్-ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ముగింపు, అలాగే రక్షణ, భద్రత భాగస్వామ్యం ప్రారంభం తర్వాత ఇరు పక్షాల మధ్య వ్యూహాత్మక సాన్నిహిత్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్య నేతల గౌరవార్థం మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందులో ఈ మేరకు మాట్లాడారు.

‘భారత్ -ఈయూ రాజకీయ సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. వాణిజ్య, భద్రత, అంతర్జాతీయ స్థాయిలో మా భాగస్వామ్యం ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ప్రపంచ భారత్ రాజకీయాల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ పరిణామాన్ని ఈయూ స్వాగతిస్తోంది. భారత్ -ఈయూ వనరులను కలిపితే ఏమి సాధించగలమో ఊహించండి. అందుకే ఈ రోజు ఇక్కడ ఉన్నాం. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మా భాగస్వామ్యంలో కీలకమైన మలుపు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్-ఈయూ ఒప్పందాలు స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి’ అని ఉర్సులా తెలిపారు.

‘వాణిజ్యానికి మించి వ్యూహాత్మక భాగస్వామ్యం’
భారత్ – ఈయూ భాగస్వామ్య కేవలం వాణిజ్యానికి పరిమితం కాదని ఉర్సులా స్పష్టం చేశారు. ‘భారత్- ఈయూ వ్యూహాత్మకంగా కూడా ముందడుగు వేస్తున్నాయి. అందుకే ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడుకోవడానికి, అస్థిర సమయాల్లో స్థిరత్వం, భరోసాను తీసుకురావడానికి సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ భాగస్వామ్యాన్ని ప్రారంభించాం. దీనితో ప్రజలు భద్రంగా ఉండగలరు. మా వ్యాపారాలు విశ్వాసంతో ముందుకు సాగగలవు. ఈ ఒప్పందాలతో మేం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. రెండు ఖండాల మధ్య కొత్త సువర్ణ మార్గాన్ని నిర్మించడం. దీంతో భారత్-ఈయూకు మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేయగలం’ అని ఉర్సులా పేర్కొన్నారు.





Source link

Spread the love