ఫారిన్ ఇన్వెస్టర్స్ లీవింగ్ ఇండియా,ట్రంప్ ‘వార్’ విధ్వంసం.. ప్రతి గంటకూ రూ. 1000 కోట్లకుపైగా అమ్మకాలు.. 16 సెషన్లలోనే లక్ష కోట్లు ప్లస్! – భారతీయ స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాలు ఇరాన్ యుద్ధం తర్వాత విదేశీ పెట్టుబడిదారులు రూ. 1 లక్ష కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు


ఎఫ్‌ఐఐ విక్రయాలు: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు.. భారత స్టాక్ మార్కెట్లను ముంచేస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం.. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే కొత్త ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ప్రతి రోజూ సగటున రూ. 1000 కోట్లకుపైగా పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ వంటినే రూ. 1 లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు భారత మార్కెట్ల నుంచి బయటికి వెళ్లాయి.

స్టాక్ మార్కెట్లు పతనం
స్టాక్ మార్కెట్లు పతనం(ఫోటోలు– ఎకనామిక్ టైమ్స్)
విదేశీ పెట్టుబడిదారుల ప్రవాహాలు: యుద్ధం కారణంగా పశ్చిమాసియా సహా అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా కూడా ఇజ్రాయెల్‌తో కలిసింది. ఇదే విధంగా ఇరాన్ ఈ దేశాలతో పాటుగా సమీప గల్ఫ్ దేశాలపైనా దాడులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్నవంటి హార్ముజ్ జలసంధి దగ్గర చమురు, గ్యాస్ నౌకలు, ట్యాంకర్లను ఇరాన్ అడ్డుకుంటోంది.. ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు కొరత ఏర్పడింది. ఇది ధరల్ని పెంచింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర యుద్ధానికి బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువన ఉండేది ఇప్పుడు అది 110 డాలర్లకు చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా.. స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి భారీ స్థాయిలో పతనం అవుతూనే ఉంది. గత గురువారం రోజు మార్కెట్లలో రక్తపాతమే కనిపించింది.

>> మార్చి 23 సెషన్‌లో కూడా వార్త రాసే సమయంలో సెన్సెక్స్ 180 పాయింట్లకుపైగా నష్టంలో ట్రేడవుతుండగా.. నిఫ్టీ దాదాపు 600 పాయింట్ల పతనంతో 22,500 కదలాడుతోంది. ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీఎస్‌ఈ సహా పలు హెవీ వెయిట్ స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. ఫార్మా స్టాక్స్‌లోనూ తీవ్ర అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

16 రోజుల్లో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఉపసంహరణ..

ప్రధానంగా విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్లపై నమ్మకం ఉంచలేదు. దీంతో రోజురోజుకూ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆర్థిక అనిశ్చితి సహా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్లు.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూ. 1 కోట్లకుపైగా విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం లక్ష. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20 వరకు సరిగ్గా రూ. 1,00,040 కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఈ సమయంలో.. శని, ఆదివారాలు సహా ఇతర పబ్లిక్ హాలిడేస్ మినహాయిస్తే 16 ట్రేడింగ్ సెషన్లు జరిగాయి.

రోజూ రూ. 1000 కోట్లు..

ఇక్కడ లెక్కల్ని గమనిస్తే.. రోజుకు 16 సెషన్లలో ట్రేడింగ్ 6 గంటల చొప్పున ఉంటుందని చూసుకుంటే.. ప్రతి గంటకూ సగటున రికార్డు స్థాయిలో రూ. 1000 కోట్లకుపైగా పెట్టుబడులను భారత మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఉపసంహరించుకున్నారు. 2026లో మొత్తంగా చూసుకుంటే కూడా ఇప్పటివరకు 50 ట్రేడింగ్ సెషన్లలో.. విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి విక్రయాలు నమోదయ్యాయి.

అంతా ట్రంప్‌తోనే మొదలైంది..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి (2025 జనవరి) భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఒత్తిడిలోనే ఉన్న సంగతి తెలిసిందే. దిగుమతులపై భారీగా టారిఫ్‌లు పెరగడం మొదలైంది. తర్వాత చైనాతో ట్రేడ్ వార్ కూడా ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడు ట్రంప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇరాన్- ఇజ్రాయెల్ వార్ మరింత ప్రభావితం చేస్తోంది. ఈక్రమంలో.. విదేశీ సంస్థాగత మదుపరులు (FII) కన్సిస్టెంట్ సెల్లర్స్‌గా ఉన్నారు. పెద్దగా కొనుగోళ్లు చేపట్టకుండా.. షేర్లను అమ్ముతూ ఉండటం. 2025లోనే రూ. 2.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పుడు మొత్తంగా ఇలా ఉండగా.. 16 ట్రేడింగ్ సెషన్లలోనే ఇది రూ. 1 లక్ష కోట్ల మార్కు దాటడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2024లో కేవలం విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ రూ. 1.29 లక్షల కోట్లుగానే ఉంది.

పూర్ణచందర్ తూనం

రచయిత గురించిపూర్ణచందర్ తూనంపూర్ణచందర్ తూనం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన బిజినెస్‌ రంగానికి సంబంధించిన తాజా వార్తలతోపాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ న్యూస్, బంగారం వెండి ధరలపై తాజా అప్‌డేట్లు అందజేస్తున్నాయి. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తోపాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ భారత్ సంస్థలో బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్ న్యూస్ రాశారు. పూర్ణచందర్ ఈనాడు జర్నలిజం స్కూల్‌లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. పూర్ణచందర్ 2025 ఏప్రిల్‌లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఏబీసీడీ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి