బడ్జెట్ ముందు శుభవార్త.. భారత్ ఫారెక్స్ నిల్వల్లో రికార్డు పెరుగుదల..రూపాయికి బలం | బడ్జెట్ 2026 కంటే ముందు ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $709.413 బిలియన్లను తాకింది


23తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. ఆ వారం నిల్వలు 8.053 బిలియన్ డాలర్లు పెరగడంతో.. మొత్తం విదేశీ మారక నిల్వలు 709.413 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం విడుదల చేసిన తాజా డేటా జాబితా. ఇది భారత్ ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన మైలురాయిగా ఉంది. గతంలో నమోదైన ప్రస్తుత స్థాయి 704.89 బిలియన్ డాలర్లను ఇది క్రాస్ చేసింది. ఈ స్థాయి గత సెప్టెంబర్ 2024లో నమోదైంది.తాజాగా ఈ జనవరి మాసం ఆ రికార్డును బ్రేక్ చేసింది.

ఆర్‌బిఐ ప్రకారం.. దేశ విదేశీ మారక నిల్వల్లో అతిపెద్ద వాటాను కలిగి ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు (FCA) 23తో ముగిసిన వారంలో 2.367 బిలియన్ డాలర్లు పెరిగి 562.885 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. డాలర్, యూరో, యెన్ వంటి కరెన్సీల్లో పెట్టుబడుల విలువ పెరగడం దీనికి ప్రధాన కారణంగా చూపబడింది.

భారతదేశం ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ ఆల్ టైమ్ హై ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ ఈరోజు 709 413 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియా ఎకానమీ న్యూస్ యూనియన్ బడ్జెట్ 2026 బడ్జెట్ 2026 ఇండియా ఆర్బిఐ ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియా డాలర్ రిజర్వ్స్ ఇండియా రూపాయి ఔట్‌లుక్ ఇండియా ఎకనామిక్ ఇండికేటర్స్ ఇన్వెస్ట్ ఇండియా స్థూల వార్తా మార్కెట్ల స్థూల వార్తా మార్కెట్ల ప్రభావం భారతదేశ ఆర్థిక మార్కెట్ల తాజా వార్తా కథనాల భారత ఆర్థిక స్థూల స్టోరీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థల స్థూల నివేదికల ప్రభావం భారత ఆర్థిక మార్కెట్ల తాజా వార్తా కథనాలు చెల్లింపులు విదేశీ మారక నిల్వలు వార్తలు 709 413 2026 2026 RBI

ఇదే సమయంలో, దేశ విదేశీ మారక నిల్వల్లో భాగమైన బంగారం విలువ భారీగా పెరిగింది. ఆ వారం బంగారం నిల్వల విలువ 5.635 బిలియన్ డాలర్లు పెరిగి 123.088 బిలియన్ డాలర్లు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. బంగారం నిల్వలు పెరగడం దేశానికి దీర్ఘకాలిక భద్రతా కవచంలా పనిచేస్తుంది.

ఇక ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (SDRs) విలువ 33 మిలియన్ డాలర్లు పెరిగి 18.737 బిలియన్ డాలర్లు చేరింది. అలాగే ఐఎంఎఫ్ (IMF) వద్ద భారత రిజర్వ్ పొజిషన్ కూడా 18 మిలియన్ డాలర్లు పెరిగి 4.703 బిలియన్ డాలర్లకు చేరినట్లు కేంద్ర బ్యాంక్.

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. బడ్జెట్ 2026లో రైల్వే టికెట్‌పై రాయితీలు ఉండే అవకాశం..

గత వారం భారత విదేశీ మారక నిల్వలు కూడా పెరిగిన విషయం. ఆ సమయంలో నిల్వలు 14.167 బిలియన్ డాలర్లు పెరిగి 701.360 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. వరుసగా రెండు వారాల్లో భారీ పెరుగుదల నమోదు కావడం దేశ బయట ఖాతాల బలాన్ని స్పష్టంగా చూపుతోంది. ఇదిలా ఉండగా భారత్ ప్రపంచంలోనే రెమిటెన్స్‌లను స్వీకరించే దేశంగా కొనసాగుతోంది. ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం, FY25లో రెమిటెన్స్ ఇన్‌ఫ్లోలు 135.4 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. ఇది బయట ఖాతాలో స్థిరత్వాన్ని మరింత బలపరిచింది.

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉంటాయి.. భారత్‌కు భారీ స్థాయిలో స్థూల పెట్టుబడి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. FY25లో ఈ ప్రవాహాలు GDPలో 18.5 శాతంగా నమోదయ్యాయి. UNCTAD డేటా ప్రకారం.. దక్షిణాసియాలో భారత్ అత్యధికంగా స్థూల FDI ప్రవాహాలను ఆకర్షించిన దేశంగా నిలిచింది. ఇండోనేషియా, వియత్నాం వంటి ప్రధాన ఆసియా దేశాల కంటే ముందంజలో ఉంది.

2024లో గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడి ప్రకటనల్లో భారత్ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో నిలిచింది. 1,000కు పైగా ప్రాజెక్టులు నమోదు కాగా.. 2020-24 మధ్య గ్రీన్‌ఫీల్డ్ డిజిటల్ పెట్టుబడులలో భారత్ 114 బిలియన్ డాలర్లను ఆకర్షించి ప్రపంచంలోనే అతిపెద్ద గమ్యస్థానంగా అవతరించింది.

2025 ఏప్రిల్-నవంబర్ మధ్య స్థూల FDI ప్రవాహాలు 64.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో ఉన్న 55.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే స్పష్టమైన వృద్ధిని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న విదేశీ మారక నిల్వలు దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉండటంతో పాటు.. బాహ్య రుణంలో సుమారు 94 శాతం కవర్ చేయగల సామర్థ్యం ఉందని ఆర్థిక సర్వే అంచనా. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన లిక్విడిటీ బఫర్‌గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Source link

Spread the love