మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో హింసాత్మక ఘటనలు చిచ్చు రేపాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌లపై రాళ్ల దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.
కేటీఆర్ వార్నింగ్: “క్యాతనపల్లిని దౌర్జన్యంగా కైవసం చేసుకోవాలనే కుట్రతో ఈ అక్రమ అరెస్టులు చేశారు. బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా, రేవంత్ సర్కార్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది.
హరీశ్‌రావు ఆగ్రహం: “బాల్క సుమన్ అరెస్ట్ అప్రజాస్వామికం. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతోంది. హంగ్ వచ్చిన ప్రతిచోటా అడ్డదారుల్లో పీఠాలను కబ్జా చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ తీరును తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుంది” అని హరీశ్‌రావు ఆరోపించారు.