కాళేశ్వరం BRS రాజకీయాలు: తెలంగాణ గర్వకారణంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరం ప్రస్తావన తీసుకొచ్చారు. వారికి ఇదే సరైన ఛాన్స్ అనిపించింది. మూడు రోజుల కిందట కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ గట్టి కౌంటర్ ఇచ్చారు కాళేశ్వరం పేరుతో సుమారు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లపాలైందని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్లానింగ్, డిజైన్ లోపాల వల్లే బ్యారేజీలు కుంగిపోయాయని, ప్రజలకు అందాల్సిన నీరు అందకుండా పోయిందని కేంద్రం స్పష్టం చేయడం బీఆర్ఎస్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాంతో పార్లమెంట్‌లో అమరావతి అంశంపై చర్చలోతమ ఆక్రోశాన్ని వెలిబుచ్చారు.
కూలేశ్వరం విమర్శలకు పెరిగిన బలం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుండి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని పిలుస్తూ వస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు బయటపడడంతో ఆయన చేస్తున్న విమర్శలకు ఇప్పుడు కేంద్ర మంత్రి వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. లక్ష కోట్ల ఖర్చు చేసినా ఫలితం శూన్యమని కేంద్రం సాక్షాత్తూ పార్లమెంటులో ప్రకటించడం ద్వారా… ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్ హయాంలో అవినీతి జాతీయ స్థాయిలో ముద్ర పడింది. ఇది బీఆర్ఎస్ నాయకత్వానికి మింగుడుపడని పరిణామంగా మారింది.
కిషన్ రెడ్డి కౌంటర్
రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీల నిరసనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం ఒక ఏటీఎం లాగా వాడుకుందని ఆయన ఉంది. కేవలం కమీషన్ల కోసమే రీ-డిజైనింగ్ పేరుతో వేల కోట్లు అదనంగా ఖర్చు చేసినట్లు. అమరావతికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్న వేళ, బీఆర్ఎస్ సభ్యులు అనవసరంగా కాళేశ్వరం పార్టీ తెరపైకి తెచ్చి అబాసుపాలయ్యారని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో కూడా వైఫల్యంపై చర్చ జరగడం బీఆర్ఎస్ ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది.
విచారణ నీడలో ప్రాజెక్టు భవిష్యత్తు
బ్యారేజీల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే తీవ్రమైన లోపాలను ఎత్తిచూపింది. ఈ లోపాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, అది నెమ్మదిగా సాగుతోందని మంత్రి పాటిల్ చెప్పారు. అటు రాష్ట్రంలో విజిలెన్స్ విచారణ, ఇటు కేంద్ర సంస్థల నివేదికలు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మీద కాళేశ్వరం అంశం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద అడ్డంకిగా మారింది. అటు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో, ఇటు బీజేపీ జాతీయ స్థాయిలో ప్రాజెక్టు వైఫల్యాన్ని ఎండగడుతూ ఆ పార్టీ సమాధానం చెప్పలేక సతమతమవుతోంది. కేవలం ఒక బ్యారేజీ కుంగిపోవడమే కాకుండా, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. దీనిని కవర్ చేసుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంకా చదవండి