భారతదేశం: పాక్ తప్పిదం.. భారత అస్త్రం బలం


చైనా పరిజ్ఞానాన్ని మన చేతిలో పెట్టిన వైనం

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌ను దెబ్బతీయాలన్న హడావుడిలో పాకిస్థాన్‌ చేసిన తప్పిదం భారత్‌కు అయాచిత వరమైంది. నాడు పాక్‌ ప్రయోగించిన చైనా తయారీ క్షిపణి ఒకటి గురి తప్పి, దాదాపు చెక్కుచెదరని స్థితిలో మన భూభాగంపై పడింది. దాన్ని స్వాధీనం చేసుకున్న భారత రక్షణ శాస్త్రవేత్తలు.. అందులో కీలక పరిజ్ఞానాల గుట్టు విప్పారు. దాని బలాలు, బలహీనతలను గుర్తించారు. వాటి ఆధారంగా మన క్షిపణిని బలోపేతం చేస్తున్నారు.

పహల్గామ్‌లో 26 మంది పౌరుల ఊచకోతకు ప్రతిగా భారత్‌ ఈ ఏడాది మే నెలలో ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద, సైనికులపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. నాడు ఇరు దేశాల వైమానిక దళాలు ఘర్షణ పడ్డాయి. ఆ సందర్భంగా పాకిస్థాన్‌.. చైనా తయారీ పీఎల్‌-15ఈ దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. గగనతలం నుంచి గగనతలంలోని దృశ్యపరిధి అవతలి లక్ష్యాలను ఛేదించగల ఈ అధునాతన క్షిపణి 145 నిలువరిస్తుంది. దీన్ని చైనా జేఎఫ్‌-17 లేదా జె-10సి యుద్ధవిమానం నుంచి పాక్‌ ప్రయోగించి ఉండొచ్చని తయారీ.

స్వీయ నాశన వ్యవస్థ లేక..

లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఒక పీఎల్‌-15ఈ క్షిపణి పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఒక వ్యవసాయ క్షేత్రంలో పడిపోయింది. దీన్ని మే 9న భారత బలగాలు స్వాధీనం చేసుకొని, తదుపరి విశ్లేషణ కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలకు అందజేశాయి. సాధారణంగా ఆధునిక అస్త్రాల్లో స్వీయ నాశన ఉత్పత్తి ఉంటుంది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు భారత్‌ అన్ని రకాల క్షిపణుల్లోనూ ఈ ఏర్పాటు ఉంది. గురితప్పిన సందర్భాల్లో ప్రత్యర్థి చేతికి సాంకేతిక రహస్యాలు అందకుండా చేయడం దీని ఉద్దేశం. పీఎల్‌-15ఈలో ఇలాంటి ఏర్పాటు లేకపోవడం వల్ల అది భద్రంగా భారత్‌కు దొరికింది.


ఆధునిక వెసులుబాట్లు

పీఎల్‌-15ఈ సామర్థ్యాలపై డీఆర్‌డీవో.. రక్షణ శాఖకు ఒక నివేదికను సమర్పించారు. చైనా అస్త్రంలో పలు ఆధునాతన అంశాలను గుర్తించింది. ఇందులో ప్రధానమైనవి..

  • చిన్నపాటి యాక్టివ్‌ ఎలక్ట్రానికల్లీ స్కాండ్‌ అర్రే (ఏఈఎస్‌ఏ) రాడార్‌. క్షిపణుల కోసం ఇలాంటి వ్యవస్థను భారత్‌ ఇంకా అభివృద్ధి చేయలేదు.

  • డ్యూయల్‌ పల్స్‌ మోటారుతో పనిచేసే రాకెట్‌. ధ్వని కన్నా ఐదు రెట్లు వేగాన్ని అందుకోవడానికి ఇది దోహదపడుతోంది.

  • క్షిపణికి ఎలాంటి మార్గనిర్దేశ సంకేతాలు అందకుండా చూసేందుకు ప్రత్యర్థి ప్రయోగించే ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ విధానాలను అధిగమించే సామర్థ్యం కూడా ఉంది.

  • చైనా అస్త్రంలో అధునాతన డేటా లింక్‌ ఉంది. ఈ లక్షణాలను బట్టి రష్యన్ డిజైన్‌ల ఆధారంగా దీన్ని రూపొందించినట్లు.

ఒడిసిపట్టి..

గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు భారత్‌ అస్త్ర మార్క్‌-1 క్షిపణిని రూపొందించింది. దీని పరిధి 100 కి. దీన్ని మరింత ఆధునికీకరించి 200 అస్త్ర మార్క్‌-2ను డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తోంది. ఇందులో మెరుగైన చోదక, లక్ష్యాన్ని గుర్తించి, కచ్చితత్వంతో ఛేదించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. దీన్ని పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు పీఎల్‌-15ఈ నుంచి సేకరించిన వివరాలు భారత శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతున్నాయి.

  • చైనా క్షిపణిలోని ఏఈఎస్‌ఏ రాడార్‌.. మన శాస్త్రవేత్తల దృష్టిని ఎక్కువగా ఆకర్షించి ఉండొచ్చు. దీని సాయంతో రాడార్ సంకేత కోడింగ్‌ విధానాలను గుర్తించొచ్చు.
  • స్వీయ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అల్గోరిథమ్‌లను, దేశీయ ఆక్టివ్‌ రాడార్‌ సీకర్లను పొందవచ్చు.
  • క్షిపణి డేటా-లింక్‌ ఎన్‌క్రిప్షన్‌ను పతిష్ఠం చేయవచ్చు.
  • చైనా క్షిపణి డిజైన్‌ ఆధారంగా అస్త్ర మార్క్‌-2లో అనేక ‘కౌంటర్‌-కౌంటర్‌ మెజర్స్‌’ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అందుచేత అది ఎలక్ట్రానిక్ జామింగ్‌ను సమర్థంగా తట్టుకోగలదు.
  • చైనా అస్త్రంలోని సమర్థ ప్రజ్వలన ప్రక్రియ ఆధారంగా భారత్.. మెరుగైన డ్యుయల్‌ పల్స్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థను రూపొందించడానికి వీలులేదు
  • చైనా అస్త్రంలో డిజైన్‌పరమైన లోపాలూ బయటపడ్డాయి.

ప్రత్యామ్నాయాలపై యోచన

పీఎల్‌-15ఈ రహస్యాలు భారత్‌కు దొరికిన నేపథ్యంలో పాకిస్థాన్‌.. చైనా నుంచి దీర్ఘశ్రేణి పీఎల్‌-17 క్షిపణులను సమకూర్చుకునే యోచన. చైనా కూడా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. పీఎల్‌-15ఈ ఆధారంగా పీఎల్‌-16 అనే క్షిపణిని వేగంగా రూపొందించినట్లు చూపిస్తున్నాయి. మరోవైపు భారత్ వద్ద ఉన్న చైనా క్షిపణిని పరిశీలించేందుకు ఫ్రాన్స్, జపాన్‌లు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈనాడు ప్రత్యేక విభాగం



Source link

Spread the love